జే.కే ప్రశక్తి తెలిసిన విదేశాంగ శాఖ కార్యదర్శి ఒక ప్రముఖ అధ్యక్షుడు ఖయ్యాంతో అపాయింట్ మెంట్ కోరినప్పుడు సునాయాసంగా అంగీకరించాడాయన.
నిజానికి జే.కే.కి కేటాయించబడిన వ్యవధి అరగంట మాత్రమేకాని గంటన్నర కావస్తూన్న ఇంకా అతడి మాటలు వింటూ వుండిపోయాడు ఖయ్యాం. అది ఖయ్యాం ఔదారం అనే కన్నా జే.కే మాటల్లోనిప్రత్యేకత అంటే సమాజంసంగా వుంటుందేమో.
"రియల్లీ ఇట్స్ ఫెంటాస్టిక్ .... ఇన్ క్రిడిబుల్." భవంతి పై భాగాన వున్న గది అద్దాల తలుపుల్లోంచి నీలాకాశపు అంచుల్నీ తాకుతున్న సముద్ర తలాన్ని చూస్తూ అన్నాడు. "ఇది దేశం కాదు దీనిఅంతకన్నా కాదు ఓ ప్రకాశవంతమైన పర్ణశాల ఇక్కడ కక్షలు లేవు. కర్పాణాలులేవు. ఇక్కడ ఋతువులు లేవు. ఉన్నదొకటేఅది వసంతం. ఇక్కడ అపశ్రుతులుండవు. శృతి తప్పనివాయులీనంలా పలకరించే గాలి తప్ప. ఇక్కడ రగిల్చే రాజకీయాలులేవు. రగిలే సూర్యుడంతకన్నాలేడు.ఉదయిస్తాడు. ఉదయించిన చోటనేవుండిపోతాడు."
"ఇట్స్ సర్ ప్రైజ్ మిస్టర్ జే.కే "మందహాసం చేస్తూ అన్నారు ఖయ్యాం "మీ వయిసెంత"
"ముప్ఫై."
"కాని రెండు పదులు దాటని బావుకతని ప్రదర్శిస్తున్నారు."
"అది నా ప్రత్యేకత కాదు. ఈ దీవి, ఇక్కడ ప్రశాంతత అందించిన ప్రేరణ...."
"ఆఫ్ కోర్స్ మిస్టర్ జే.కే" మాల్దీవ్స్ కి చెందిన మాతృబాష 'దివేహి' కాక స్వచ్చమైన ఇంగ్లీషులో చెప్పుకుపోతున్నాడు." కేవలం రెండు లక్షల జనాభా, నూట పదిహేను చదరపు మైళ్ళ వైశాల్యంగల ఈ దివిలో రాజకీయ పార్టీలు లేవు కాబట్టి ఇక్కడ నేరాలు జరగవు. దీదీ సుల్తానుల పరిపాలనలో నిన్న మొన్నటిదాకా వున్న ఈ దీవిలో ఒకనాడు బౌద్దమత వ్యాప్తి జరిగినా క్రీ.శ 1158 మోరాకోకి చెందిన సెయింట్ ద్వారా పూర్తిగా ముస్లీం దేశంగా మారిపోయింది. భిన్న మతాల ప్రాబల్యం, నిర్మలమైన పరిసరాలు. కాలుష్యం లేని వాతావరణం. ఇదే ఈ దివీని కాసింత ఓ పర్ణశాలగా మార్చాయేమో."
"యూ..." జే.కే దృష్టిని ఆకర్షించిందిసముద్రంలో ప్రయాణిస్తున్న ఓషివ్ "దట్స్ రైట్ .... అందుకే మీరొక మహర్షి అమ్తానునేను... అలాంటప్పుడు లేదుగా......"
హఠాత్తుగా ప్రశక్తి ఇలా ఎందుకు మళ్ళీ౦ది ఖయ్యాంకి అర్ధం కాలేదు.
"ఈ మధ్య మాల్దీవుల పరిసరాలలోని సముద్రజలాలు విదేశీ విద్రోహ శక్తుల మూలంగా కలుషితమవుతున్నాయి."
"ఈజిట్" ఆశ్చర్యం ప్రకటిస్తూనే దృష్టి మరల్చకుండా చూస్తూన్నాడు. జే.కే అప్పటికే షిఫ్ లోని కిరాయి సైనికులు ఒడ్డుకు చేరుకుంటున్నారు.
"నమ్మశక్యం కావడంలేదు."
"ఏస్ మిస్టర్ జే.కే ఏదేశానికి చెందిన వర్గమో తెలీదు. ఇక్కడ కొచ్చే టూరిస్టులకు డ్రగ్స్ సరఫరా చేయాలని ప్రయత్నిస్తూ నిన్న పట్టుబడింది. వివరాలు సేకరించిన ముందే సైనేడ్ టాబ్ లెట్స్ మింగి చచ్చిపోయారు నలుగురు వ్యక్తులూ."
"ఆశ్చర్యంగా వుంది ఏమాత్రం సరుకు వుంటుంది."
"మీదేశం కరెన్సీలో అయితే రెండువందల కోట్లరూపాయలు"
"మైగాడ్..... అంటే ఆ డ్రగ్ మొత్తం ప్రస్తుతం మీ దగ్గరే వుందన్నమాట"
"ఏస్ ... జాతీయ భద్రతా మండలి కంట్రోల్లో వుంది."
"సరిగ్గా ఈ చర్చ జరుగుతున్నా సమయంలో 'మాలే' లోని జాతీయ భద్రతా మండలిని స్వాదేనం చేసుకున్నారు. కొందరు కిరాయి సైనికులు.....
మరో అరనిమిషం గడిసేసరికి తూటాల మోత అధ్యక్షుడి భవనం దగ్గరా వినబడింది.
భవంతి పైనుంచి చూస్తున్నాడు జే.కే
అనుకున్న పధకం ఆపరేషన్ గా అమలు జరుగుతున్న సూచనగా రోడ్లపై విశృ౦ఖులవిహారం చేస్తున్నా సైనికుల తూటాలకు మాల్దీవుల పౌరులు నేల గోరుగుతున్నారు. అస్తమిస్తున్న సూర్యకాంతిలో మాల్దీవుల దారులు రక్తంతో తడిసిపోతున్నాయి.
ఏదో కలవరం.
అధ్యక్షుడు ఖయ్యాం.చూడాలని గ్లాస్ డోర్స్ వైపు నడిచాడు.
"హాండ్సఫ్ "
అప్పుడు వినిపించింది ఓ కంఠం.
ఉద్విగ్నంగా ద్వారందగ్గర పదిమంది టెర్రరిస్టులు నుమ్చిను ఉన్నారు.
పాణిపెదవులపై చిరునవ్వు మెరిసినా భయాన్ని నటిస్తూ ఖయ్యాం పకక్కు వచ్చి నిలబడ్డాడు.
ఆ గదిలో క్షణాలు టెన్షన్ గా నడుస్తున్నాయి.
"ఎవరు మీరు.... ఇదంతా ఏమిటి?" నిలదీశాడు పాణి సాయుధులయిన అగంతుకుల్నీ చూస్తూ.
రెండడుగుల ముందుకు నడిచిన ఓ వ్యక్తి చేతిలోని ఏ.కే. 47 ఎస్సాల్ట్ రైఫీల్ కొద్దిగా పైకెత్తి అన్నాడు.
"మేమొ చర్చించాలనుకుంటున్నది ప్రెసిడెంట్ ఖయ్యాంతో."
"చెప్పండి." ఖయ్యాం జోక్యం చేసుకున్నాడు.
సుమారు పదిసంవత్సరాలుగా మాల్దీవుల అధ్యక్షాస్థానంలోకూర్చున్న ఖయ్యాం మరో ఐదు సంవత్సరాలుపాటు అదేస్థానంలో కొనసాగాడానికి ఎంపికయింది. ఈ మధ్యనే చాలా ప్రశాంతమైన పరిపాలన తప్ప ఇలంటి సంఘటన ఇంతవరకు ఎదురుకాకాపోవడంతోఇప్పుడు తన గురించి మాల్దీవుల ప్రజల రక్షణ గురించి ఆలోచిస్తున్నాడు.
"ఏం కావలి మీకు,.?"
ఇందాకటి అగంతుకుడే అన్నాడు__
"సరిగ్గా నలభైఎనిమిది గంటలక్రితం మాకుచెందినబోటుహిందూ మహాసముద్ర జిలాల్లో ప్రయాణం చేస్తుండగా మీజాతీయ భద్రతా మండలికి చెందిన అధికారి ఒకరు అదుపుచేసిఅమ్దిలోని హీరాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని ఖరీదుసుమారు ఐదువందల కోట్లరూపాయిలు..."