మ్యూజిక్ కంపోజింగ్ లో కూడా ఆమె ప్రతిభకు గౌతమ్ ఆశ్చర్యపడుతూ వుండేవాడు.
ఆమె శరీరంలో కదిలికలు, ఆమె ముఖంలో కార్యదీక్ష అణువూసోలువూలేని ఆమె పట్టుదల అతనికో అద్స్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నట్లుగా వుండేవి.
ఎంత శ్రమించిన ఆమెలో నీరసమనేది కనిపించేదికాదు. అటువంటిది ఒకరోజు అభినయించి చూపిస్తున్నప్పుడు _ వున్నట్లుండి ఏదో మార్పు కనిపించింది. ఆమెలో. శరీరంతా చెమటలు పడుతున్నట్లు , ఎంతోబాధను ఓర్చుకుంటున్నట్లు గౌతమ్ గమనించాడు. "విరాజీ" అంటూ వారించబోయాడు. ఆమె వినిపించుకోలేదు. ఒక తపస్సులో వున్నట్లు, ఎన్ని ప్రతిబంధకా లేర్పడుతున్నా ఆ తపస్సునుంచి బయటకు రాయిచ్చగించనట్లు, సర్వశక్తులూ కూడదీసుకుచి, ఆ రసమయ అనుభూతిలో వుండిపోయింది.
ఆర్టిస్టులంతా వెళ్ళిపోయాక నీరసం గౌతమ్ ఆమె ప్రక్కనే కూర్చుంటూ _ "ఏం జరిగింది?"
"ఏమీలేదు " అన్నదామె నవ్వటానికి ప్రయత్నిస్తూ. కాని ఆమె ముఖంలో నవ్వే, పెదవుల్లో బలహీనత కొట్టుకొచ్చినట్లు కనబడుతోంది.
"కాదు ఏదో వుంది" అంటూ ఆమె నుదుటిమీద చెయ్యివేశాడు. కొంచెం వెచ్చగా తగిలింది.
"అబ్బా!" అంది అప్రయత్నంగా విరాజీ కడుపుమీద చెయ్యివేసి "నొక్కుకుంటూ."
ఏమిటి విరాజీ!"
"ఇక్కడ చాలా నొప్పిగావుంది."
అతను కడుపుమీద చేయివేశాడు. అతనికేమి తెలుస్తుంది? ముఖంలోకి చూశాడు. ఎంతో బాధను ద్రిగమింగుతూనట్లు పంటితో పెదవిని నొక్కుకుంటోంది.
ఆమె బయటకు కనిపించేదానికన్నా పదిరెట్లు బాధ అనుభవిస్తోందని అతని కర్ధమయింది అదేయింకొకరయితే బాధను తట్టుకోలేక మెలికలు తిరిగిపోతూ వుండవచ్చు.
బహుశా టైము పదకొండు దాటిపోయి వుండవచ్చు. ఏం చెయ్యాలి? దగ్గరలో రిక్షాలు కూడా దోరికే సదుపాయంకూడాలేదు.
"దగ్గరలో ఎవరయినా డాక్టరున్నాడా?" అనడిగాడు గౌతమ్ ఆదుర్దాగా.
"కాసేపట్లో తగ్గిపోతుందిలే గౌతమ్, భయమేమిలేదు" అంది విరాజి.
కాని తగ్గలేదు.
అతని అందోళన, ఆత్రుతచూసి, "ఈ ప్రక్కనే ఓ ఆర్.ఎమ్, పి. డాక్టర్ వుండాలి గౌతమ్" అంది విరాజి.
గౌతమ్ బయటకువెళ్ళి ఆమె చెప్పిన ప్రకారం యిల్లు కనుక్కుని __ ఆ. ఆర్. ఎమ్. పి. డాక్టరుని విరాజి దగ్గరకు తీసుకొచ్చాడు. అతను తనకు చేతనైనట్లుగా పరీక్ష చేసికొన్ని ప్రశ్నలడిగి ఓ ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయాడు.
పది నిమిషాల్లో ఆమె నొప్పి తగ్గిపోయింది మరో రెండు నిమిషాల్లో ఆదమరచి నిద్రపోయింది.
మరునాడామే నిద్రలేచేసరికి అసలు నొప్పి లేదు. చాలా మామోలుగా వుంది.
డాక్టరు దగ్గరకు వేదదామంటే అఖ్కలేదని నాదమునిగారింటికి వెళ్ళిపోయింది.
అప్పటికి త్రిపుర ఆరంగేట్రం నాలుగు రోజుల్లో వుంది.
* * * *
రవీంద్ర భారతిలో ఆ రోజు సాయంత్రమే త్రిపుర నాట్యప్రదర్శన . నాదముని ఆ ప్రదర్శనకు ముఖ్యఅతిధిగా ఓ మంత్రిగారిని ఆహ్వానించాడు.
అంతకు ముందు రెండు రోజులబట్టీ విరాజి తమ బ్యాలేసి గురించి పట్టించుకోలేదు. రాత్రింబవళ్ళు త్రిపురను గురించిన ధ్యాసలోనే వుంది.
అరు గంటలకు పోగ్రాం!
ఇంటికివెళ్ళి మూడుగంటలకల్లా వొచ్చే స్తానని చెప్పి తుదిమెరుగుదిద్ది వెళ్ళిపోయింది.
గౌతమ్ ఆమెరూపకానికి కావాల్సిన హంగులు గురించి ఆలోచించుకుంటూ, తనకొచ్చిన ప్లాష్స్ నోట్ చేసుకుంటూ , యింట్లోనే వున్నాడు.
"గౌతమ్ నాతో వస్తావా!" అనడిగింది ఆమె. మూడు గంటల కాబోతుండగా బయల్దేరుతూ.
"నేను ఆరింటికి సరాసరి రవీంద్ర భారతికి వస్తాను" అన్నాడు గౌతమ్.
"తప్పకుండా ఏం ? నాదమునిగారు నీకు మరీ మరీ చెప్పామన్నారు" అని విరాజి అతని బుగ్గమీద చితికవేసి వెళ్ళిపోయింది.
రోజూ నాదముని కారు పంపిస్తానన్నా నిరాకరించి ఆమె బస్సులోనే వావుస్తూ వెడుతూవుంది.
ఓ అరగంట లోపున నాదముని యింటి సమీపంలో బస్సుదిగింది.
అటువైపు అడుగులవేస్తూ, తలెత్తి చూసేసరికి అయన యింటి ముందు చాలా మంది మనుషులు గుమికూడివుండటం కనిపించింది. ఆమె గుండె గబగబా కొట్టుకుంది.
కళ్ళలో చిన్న వణుకు. అలాగే త్వరత్వరగా యింటికి చేరుకొని గుంపుగావున్న మనుషుల్ని తొలగించుకుంటూ లోపలకు వెడుతోంది.
"రోడ్డుకు అటువైపు వున్న షాపులో ఏదో కొనటానికని కాబోలు __ రోడ్డు క్రాస్ చెయ్యబోతూంటే కారువచ్చి గ్రుద్దుకుంది పాపం బంగారం లాంటిపిల్ల " _ ఎవరో అంటున్నారు సానుభూతిగా .
విరాజి అందరిని తొలగించమని లోపలకు వెళ్ళింది. హాల్లోచాపమీద __ తలపగిలి నెత్తురుముద్దలా త్రిపుర పడుకోబెట్టబడివుంది __ నిర్జీవంగా .
ప్రక్కనే నాదముని అచేతనుడై కూర్చుని వున్నాడు.
10
అయిదారు రోజులదాకా విరాజి యీ ప్రపంచంలో పడలేకపోయింది.
త్రిపుర !
ఎంత అద్భుతమయినా బాలిక! తాను సాధించాలని కలలుకనీ, సాదించలేనని భయపడే కలా ప్రపంచాన్ని ఆ చిన్నారిలో చల్లార్చు కోవాలని ఉవ్విళ్ళూది.
కాని ..... విధి క్రూరంగా కాటువేసింది.
గౌతమ్ కూడ మానసికంగా చాలా గాయపడ్డాడు. కాని విరాజి భవిష్యత్ దృష్టిలో వుంచుకుని, తాను సమారధాన పరచుకుని ఆమెను షాక్ లోంచి బయటకి తీసుకురావటానికి అహర్నిశలూ కృషి చేశాడు.
* * * *
విరాజి చాలా ధైర్యం గల య్తువతి . ఈ లోకాన్ని అర్ధంచేసుకోగల తెలివితేటలామెకు వున్నాయి.
లోపలి బాధను లోలోనే ఇముడ్చుకుని రోజు దగ్గర పడిపోతోంది. ఈ నాలుగయిదు రోజుల విరామంతో తన మనసులో వున్న పథకమంతా మరచి పోయినట్లయిండి మళ్ళీ అంతా కొత్తగా తడుముకున్నట్లుగా అనిపించింది. మూడ్స్ అన్నీ చెదిరి పోయినట్లుగా అయిపోయినాయి. వాటి నన్నింటినీ సమీకరించి తిరిగి రూప కల్పన చెయ్యటానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది.
ఆ రోజంతా విశ్రాంతి లేదు. చాలా ప్రయాస పడింది. తనకి తాను ప్రోత్సాహాన్నిచ్చుకుంటూ ఆర్టిస్టులందరిలో దిగజారిపోతున్న ఉత్సాహాన్ని మళ్ళీ ఎగదోసింది.
గౌతమ్ డబ్బులెక్క చూసుకున్నాడు. ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ప్రింటయిరావటంతో యించుమించు డబ్బంతా ఖర్చయిపోయింది. చేతిలో ముప్పయినలభయి రూపాయల కన్నా ఎక్కువ లేవు.
ఆ రాత్రి ..... ఎనిమిది గంటలకల్లా విరాజి ప్రాక్టీస్ ఆపు చేసింది. ఈ నాలుగయిదు రోజులుగా మానసికంగా అనేకమైన వత్తిడులకు లోను కావటముతో ఆ రోజు శరీరం ఎక్కువ శ్రమకు తట్టుకోలేకపోయింది.
ఆర్టిస్టులంతా వెళ్ళిపోయారు.
ఓ పావుగంట గడిచాక గౌతమ్ కూడా వెళ్ళడానికి ఉద్భుక్తుడయ్యాడు.
"వేడుతున్నావా?" అంది విరాజి. ఆమె గొంతులో ఏదో డుగులు ధ్వనించింది.
గౌతమ్ ఉలికిపాటుతో ఆమె ముఖంలోకి చూశాడు. అంత దుగులుగా పోగొట్టుకున్నట్లు , వంటరి తనానికి భయపడుతున్నట్లు యిది వరకేప్పుడూ కనబడలేదు.
ఆగి ప్రశార్దాకంగా చూశాడు.
లేచి గుమ్మం దగ్గర నిలబడివున్న గౌతమ్ దగ్గరకు వచ్చింది. అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ గౌతమ్!" అంది ఆమె గొందు ఓ విధమైన ఆర్ద్రతతో వోణికింది.
"నాకోసం ఎందుకిలా అహర్నిశలూ శ్రమ పడుతున్నావు?"
గౌతమ్ తడిగా ఆమె కళ్ళలోకి చూస్తూ నవ్వాడు. జవాబేమీ చెప్పాలేదు.
"బాకీ తీర్చుకుంటున్నావా?"