"కాదు వడ్డీ తీరుస్తున్నాను. నీ బాకీ ఎన్నాళ్ళు తీర్చినా చెల్లుబడి కాదు!"
కొన్ని బాకీలు తీరకపోతేనే సుఖంగా వుంటాయి గౌతం."
"పూర్తిగా తీర్చి ఆ సుఖాన్ని చెరిపెసుకోవటం యిష్టంలేదు. విరాజీ. అందుకని ......."
"అప్పు అప్పుగానే వుంచుదా౦" విరాజి నవ్వింది.
"వస్తాను" అంటూ గౌతమ్ ఆమె చేతినుంచి తన చేతిని మృదువుగా విడదీసుకుని అక్కడనుంచి కదిలాడు. పదిఅడుగులన్నా వేసి వుండడు. వెనుకనుంచి "గౌతమ్" అని బలహీనంగా ఆమె గొంతు వినిపించింది. తల త్రిప్పిచూసేసరికి గుమ్మంలో కనబడలేదు. వెనక్కీ తిరిగి గబగబా లోపలకు వెళ్ళాడు. విరాజి మంచంమీద పడుకుని మెలికలు తిరిగిగబగబ లోపలకు వెళ్ళాడు. విరాజి మంచంమీద పడుకుని మెలికలు తిరిగిపోతోంది.
కంగారుగా దగ్గరకు వెళ్ళి "విరాజీ!" అన్నాడు.
పెదిమలు బిగబెట్టి కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా దీనంగా అతని వంక చూసింది.
"నొప్పి" అంది.
ఆమెకు తిరిగి కడుపులో నొప్పి "వచ్చిందని అర్ధం చేసుకున్నాడు, ఆమె ఎంతబాధ పడుతున్నదో , బయటకు కనిపించే దానికన్నా ఎంత ఏడ్చుకుంటున్నదో తెలుస్తుంది.
ఒక్కక్షణం అపతిభుడై నిలబడిపోయి ఏదో ఆలోచన వచ్చి అక్కడనుంచి కదలబోయాడు.
అంత బాధలోనూ ఆమె చప్పున అతని చేయిపట్టుకుని "నువ్వు యిక్కడనుంచి కదలోద్దు" అంది.
"విరాజీ ! డాక్టర్ని తీసుకోస్తాను" అనునయంగా" అని ఆమె చేతిని విడిపించుకుని యిదివరకు వచ్చిన ఆర్. ఎం. పి. డాక్టరు దగ్గరకు వెళ్ళాడు.
అయిదు నిముషాల్లో ఆర్. ఎం. పి. డాక్టరు అతన్తోపాటు విరాజి ఇంటికి వచ్చాడు. ఆమెను పరేక్షచేసి పల్స్ అదీచూసి కంగారు పడ్డాడు. ఈమెను వెంటనే హాస్పిటల్లో ఎడ్మిట్ చేస్తే మంచిది. కేసుట్రీట్ చెయ్యటానికి నాకు శక్తి చాలదు" అన్నాడు.
అతన్ని పంపించేశాక గౌతం ఆతృతగా బయటకు వచ్చాడు. రోడ్డు మీదకు చేరుకొని ఎక్కడయినా రిక్షా కనిపిస్తుందేమోనని అంటూ __ యిటూ చూశాడు మంచంమీద మెలికలు తిరిగిపోతోన్న విరాజి రూపమే కళ్ళ ముందు కనబడుతూ చాలా టెన్షన్ గా వుంది. ఒక్కో నిముషం ఒక్కో యుగంలా గడుస్తుంది. పది నిముషాల్లో అదృష్టశక్తులూ ఎవరినో దింపఖాళీగా అటుకేసి వస్తున్న రిక్షా ఒకటి కనిపించి ఊపిరి పీల్చుకున్నాడు.
మరో పదినిముషాల్లో గౌతం విరాజితోబాటు రిక్షాలో వున్నాడు.
అతనికి ఏ డాక్టరు తోనూ పరిచయము లేదు. ఎవరి దగ్గరకూ వెళ్ళేంతటి అవసరమెప్పుడూ రాలేదు. విరాజి అతని వొళ్ళో తల పెట్టుకుని నడుము చుట్టూ చెయ్యివేసి పట్టుకుని, వుంది. బాధతో మేలుకలు తిరిగినప్పుడల్లా నడుం చుట్టూవున్న ఆమె చెయ్యి బిగుసుకుంటో౦ది.
వొళ్ళు చల్లగా తగిల్తో౦ది.
దార్లో కనిపించిన బిర్దల్లా చూస్తున్నాడు. రెండు మూడు చోట్ల హాస్పిటల్ కనిపించాయిగాని _ తలుపులు వేసేసి వున్నాయి.
ఇంచుమించు రెండుమైళ్ళు పోయాక రోడ్డుకు ప్రక్కగా పద్మినీ నర్సింగ్ హొం అని లైటు వెలుగులో వున్న బోర్డు కనిపించింది.
"డాక్టర్ శశిభూషణరావు ఎం. ఎస్" అన్న పేరు వుంది క్రింద.
ఆశా కిరణం మెరిసినట్లయి రిక్షా ఆపించాడు. మరీ అంత పెద్దది కాకపోయినా పదిపదిహేను బెడ్స్ వున్నా హాస్పిటల్ లా కనిపించింది. బయట వరండాలో కొంతమంది మనుషులు కూడా అటూ యిటూ తిరుగుతూ కనిపించారు.
విరాజిని రిక్షాదింపి ఏ భుజాలు చుట్టూ చెయ్యివేసి నడిపించుకుంటూ లోపలకు తీసుకెళ్ళాడు. వరండాలోవున్న బెంచీ మీద కూర్చోబెట్టి __ డాక్టరు గారున్నారా అనడిగాడు ఎదురుగా కనిపించిన మనిషిని.
అతనా ప్రశ్న అడుగుతూండగానే స్ప్రింగ్ డోర్ తెరుచుకుని ఎవరినో పిలవటానికన్నట్లు డాక్టర్ బయటకు వచ్చాడు. తెల్లటి ఫ్యాంట్ , ఏప్రాన్, మెళ్ళో స్టేతస్కోఫ్ .....
గౌతం ఏదో చెప్పెలోపలే అయన కళ్ళు విరాజి మీద పడ్డాయి. "అరె ఎమర్జన్సీ లా వుందే" అంటూ వెంటనే సిస్టర్ని కేకేశాడు.
* * * *
విరాజిని ఎగ్జామిన్ చేసి డాక్టరు బయటకు వచ్చాడు. గౌతమ్ యివతలి గదిలో కూర్చుని వున్నాడు డాక్టర్ అతనికేడురుగా తన సీటులో కూర్చుంటూ , "ఎపైండిసిటిస్ " మొదటి రిలీఫ్ కోసం యింజక్షన్ చేశాను అన్నాడు.
గౌతమ్ ఉలికిపడి అయన వంక చూశాడు.
"ఇంతకు ముందు నొప్పి ఒకసారి వచ్చిందట కదూ! ఆమెను ఎడ్మిట్ చేయాలి. బహుశా ఆపరేషన్ చెయ్యాల్సి రావచ్చు" అన్నాడు.
గౌతమ్ ఆమె డాన్సర్ అనీ మరో పన్నెండు రోజుల్లో పోగ్రాం ఏర్పాటు చెయ్యబడి వుందనీ చెప్పాడు.
డాక్టర్ సానుభూతిగా విన్నాడు. "ఈ ఎటాక్ ఆపరేషన్ అవసరం లేకుండా బయట పడుతుందేమో చూస్తాను. తప్పనిసరి అయితే చేసేది లేదు కాని వీక్ గా వుంది . సెలైన్ అదీ వెంటనే స్టార్ట్ చెయ్యాలి. ఈ మందులూ, యింజక్షన్లు అవీ తీసుకురండి అంటూ ప్రిస్కిప్షన్ పేపరుమీద నాలుగయిదు రకాల మేడిసేన్స్ , సైలెన్స్ బాటిల్స్ రాసిచ్చాడు.
ప్రిష్క్రిఫక్షన్ తీసుకుని హాస్పిటల్ కు ఎదురుగా వున్న మెడికల్ షాఫ్ కు వెళ్ళాడు గౌతమ్.
చీటీ చూసి "నూటయాభయి రూపాయలదాకా అవుతాయి" అన్నాడు షాపులో వున్న వ్యక్తి.
గౌతమ్ గుండె గుభేలుమంది .
"షాపు ఎంతవరకూ తెరచి వుంటుంది అనడిగాడు" అతనిగొంతులో చిన్న వొణుకు.
"ఇంకో గంట, గంటన్నరదాకా తీసి వుంచుతా౦ ఇల్లుకూడా వెనకాలే అవసరమైతే తలుపులు తీసి యిస్తానులెండి" అన్నాడతను .
అతని యిల్లెక్కడో కనుక్కుని గౌతమ్ రోడ్డుమీదకు వచ్చాడు. ఏం చెయ్యాలో, ఎటు పోవాలో తెలీలేదు. ఒకవైపు నీరసంగా వుంది మరోవైపు ఏడుపు వస్తోంది.
డబ్బు వులువ ఆకలిగా వున్నప్పుడే కాదు ఇలాంటి విపరీతమైన పరిస్థితిలో కూడా ఎంత ప్రాముఖ్యత పొంది వుంటుందో గుర్తించాడు.
అతనికాసమయంలో ఆ సమర్ధత పేదరికమంటే అసహ్యమేసింది.
డబ్బు సపాదించలేని ఆ సమర్ధత అంటే అసహ్యమేసింది.
మనిషి విలువలకూ, సంపదకూ సబంధం లేని యీ వ్యవస్థ అంటే అసహ్యమేసింది.
అతనికి తెలీకుండా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆ నిస్సాహయస్థితిలో అతనికి వున్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది, వెంటనే ప్రక్క నుండి పోతోన్న ఓ రిక్షా వాసి అందులో ఎక్కాడు.
ఇరవై నిముషాల తర్వాత రిక్షా వరదరాజు టీ కొట్టు ముందాగింది అప్పటికింకా పదికాకపోవటం చేత టీ కొట్టు యింకా సందడిగానే వుంది.
వరదరాజు గౌతంని చూశాడు "బాబుగారూ టీ ఇవ్వనా?" అనడిగాడు.
"వరదరాజు ! నీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు.
"చెప్పండి బాబుగారూ !"
గౌతమ్ అటూ ఇటూ చూశాడు. వరదరాజు క్యాష్ దగ్గర వుండబట్టి , మిగతా సర్వర్ లూ కష్టమర్లు కు టీ వగైరా అందచేస్తూ వుండబట్టి తమ చెప్పేది వాళ్ళకు వినిపించదు.కాని సిగ్గు, సంకోచం , భయం అతన్ని వెంటనీ మాట్లాడనివ్వకుండా చేశాయి.
గౌతమ్ ముఖంలో అలసట, వ్యాకులపాటు వరదరాజు గమనించాడు.
"చెప్పండి బాబుగారూ " అన్నాడు.
"కొంచెం ..... కొంచెం .... డబ్బు కావాలి వరదరాజూ " గౌతమ్ గొంతు పెగుల్చుకుని అన్నాడు.
"ఎంత అవసరముటు౦ది బాబు గారూ ?"
"ఎందుకంటే ..... ఎందుకంటే ....."
"ఎంతో అవసరము౦టేకాని, ఈ వేళగాని వేళ వచ్చి నన్నడగరని తెలుసు బాబుగారూ! చెప్పండి, ఎంత అవసరముంటుంది?" వరదరాజు ముఖంలో వ్యతిరేఖ భావము, కనీసం రెండో ఆలోచనలో ఉన్న సూచనా కనబడలేదు.
పైపెచ్చు అతని గొంతులో ఆప్యాయత: అనురాగం పుట్టిపడుతున్నాయి.
"రెండు, మూడొందలు ...... కావాల్సి వొస్తుందేమో!" క్యాష్ కౌంటర్ ప్రక్కనే టేబుల్ కు ఫిక్స్ చేయ్యబడిన చిన్న రేకు పెట్టె తెరచి అందులో వున్న రూపాయి కాగితాలు చిల్లరనాణాలు, అర్ధరూపాయి బిళ్ళలు అన్నీ కలిపి లేక్కపెట్టాడు. అన్నీ కలిసి మూడొందల యాభయి రూపాయల దాకా లెక్కతేలింది.
అవన్నే కలిపి కర్చీఫ్ తో కట్టి మూట గట్టి గౌతమ్ కందిస్తూ " బాబు గారూ! ఈ డబ్బూ మీరు తిరిగి యివాల్సిన పనిలేదు. ఈ డబ్బు మీదే" అన్నాడు.