Previous Page Next Page 
విరాజి పేజి 21

 

     "నువ్వు నాకు ....."

    ..... .... ....

    " నీతోడు నా కేప్పటికి కావాలనిపిస్తుంది విరాజీ? మనమిద్దరమూ ..... పెళ్ళిచేసుకుందాం.

    మళ్ళీ కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి.

    "మాట్లాడవేం విరాజీ?"

    "గౌతమ్ నేనో విషయం చెప్పనా అంది చివరకు" నువ్వు కోపం తెచ్చుకోవద్దు కళాకారుడిగా శ్రమిస్తూ ఆ కళతో పరాకాష్ట చేరుకోవాలని పోరాగామిస్తూ జీవితాన్ని ఒక తపస్సుగా ఎంచే వ్యక్తికి వివాహబంధం వుండకూడదని  నా ఉద్దేశ్యం ఈ బంధం . అనుకున్నంత తియ్యగా ఉండకపోగా , ఓ పంజరమై, బందిఖానా అయి అడుగడుక్కి అతని ఎదుగుదలను అడ్డువస్తూ వుంటుంది.

    గౌతమ్ ముఖ్యంగా రచయితా నీలాంటి సెన్సిటివ్ రచయిత, జీతంలో చాలా సాధిద్దామనుకున్న రచయితా పెళ్ళి చేసుకోకూడదు.

    అసలు పెళ్ళి అనేది అందరికి పనికిరాదు గౌతమ్.

    పరిస్థితులు బట్టి, అభిరుచుల్ని బట్టి, చేరదలుచుకున్న గమ్యం కోసం కొందరు పెళ్ళిచేసుకోకుండా వుండి పోతేనేం ?

    తిరిగి కొన్ని క్షణాలు బరువైన నిశ్శబ్దం గౌతమ్ ఒక స్నేహితురాలిగా , అప్తురాలిగా నీచుట్టూ మధుర స్పందనలు రేపుతూ పరిశుభ్రమించిన యీ విరాజియే భార్యగా నీ యింట్లో కాలు పెట్టినపుడు ఆ స్వరూపమే ఆ మనస్తత్వమే ఆ మనస్త త్వమే మారిపోతుంది. నాలోని స్త్రీతత్వంలోని బలహీనతలు, వికటత్వం అన్ని విజ్రుభిస్తాయి.

    నీమీద నాకు కొన్ని హక్కులోస్తాయి. , రావు నేను తీసుకుంటాను. నా జీవితపు వ్యామోహలతో, సాంఘీక భావాలతో, కుటుంబ బద్దమైన నియ మావళితో నీ ఏకాంతాన్ని , ఏకాగ్రతనూ, దీక్షనూ , నిర్దాక్షిణ్యంగా చెదరగొట్టి నిన్ను ఊపరడకుండా చేస్తాను. క్షణం క్షణం నిన్ను సమస్యలతో ముంచెత్తి నీ బంగారు స్వప్నాలను చెరిపివేసి, నీ ఊహ స్వప్నాలను అప్పుడు నీవంటూ వుండవు గౌతమ్ . నీలోని సామాన్యమానవుడు బయటకు వస్తాడు. ఇహా నువ్వు సామాన్యుదిగానే మిగిలిపోతావు గౌతమ్.

    మళ్ళీ నిశ్శబ్దం.

    "నీ కోసం నిన్ను ఒక రచయితగా తీర్చదిద్దడంకోసం మన మిద్దరం యిలా నిరంతరం స్నేహితుల్లాగానే మిగిలిపోదాము గౌతమ్."

    ..... ...... .....

    "గౌతమ్ కోపమొచ్చింది కదూ?"

    .... ..... ....

    "ఏం?"

    "లేదు."

    అమె అతని చేతినించి తన చేతిని మృదువుగా విడిపించుకుని, అతని తలమీద చెయ్యివేసి, జుట్టులోకి వ్రేళ్ళు పోనిచ్చి రాస్తూ అంది.

    "గౌతమ్ : ప్రపంచంలో నాకు నీకంటే ఆప్తుడు లేడు నువ్వు నా ప్రాణస్నేహితుడివి, రచయితగా నీలోని గొప్పతనం నశించిపొతే నేను భరించలేను. నీకు తెలుసో తెలీదో నీ రచనలో గొప్ప జీనియస్ వుంది. ఒక రచయితలో ఎలాంటి జీనియస్ వుండాలని కలలు కన్నానో అలాంటి జీనియస్ వుంది. సమాజానికి నీలాంటి రచయితలు కలిషతం కాని రచయితలు కావాలి గౌతమ్ ప్రలోభాలకు గురిచేసి, మాలిన్యాన్ని అంటగట్టి ఓ గోప్పరచయిత కావాల్సిన వ్యక్తిని పతనం కాకుండా కాపాడటము నా ధర్మమని భావిస్తున్నాను గౌతం. ఏం?"

    ఆమె మాటలు అతని అంతరంగ౦లోకి నిర్మలమైన కెరటాలై, తుషారబిందుతుల్యమైన జాహ్నవి తరంగాలై ప్రవహిస్తూన్నాయి.

    అతని జుట్టులో ఆమె ప్రశ్న వ్రేళ్ళ కదుల్తూనే వున్నాయి. జోకొట్టినట్లు, సేదతీర్చినట్లు కొంతసేపటికి తను పసిపిల్లాడిలా నిద్రపోయాడు.

                             *    *    *

  ఉదయం అతను నిద్రలేచేసరికి విరాజి గదిలో లేడు. తాడుపై అరెసిన చీర వగైరాల బదులు రాత్రివేసుకున్న, పైజమా, లాల్చీ వ్రేలాడుటున్నాయి.

    అప్పటికి చాలా పొద్దుబోయింది.

    టేబుల్ మీద పేపర్ వెయిట్ క్రింద పెట్టబడివున్న మడిచి  చిన్న కాగితం అతని దృష్టి నాకర్షించి౦ది,

    "గౌతం!"

    ప్రశాంతంగా నిద్రపోతున్న నిన్ను డిస్టర్బ్ చెయ్యట మిష్టంలేక, బ్రతుకు తెరువుకోసం మళ్ళీ ఈ రిటీన్ లో పడాలి కాబట్టి నిన్ను లేపకుండానే యింటికి వెడుతున్నాను, ఏమీ అనుకోకు.

    రాత్రినేను చెప్పిన విషయాలు అర్ధమయి నాయికదూ!

    మరోసారి చెబుతున్నాను, నీలోని రచయిత అంటే, నేను ఊహిస్తున్న స్థాయికి ఎదుగుతొన్న రచయిత అంటే,  నాకు చాలా ఆరాధన. ఆ రచయిత నశించేపొతే బహుశా నీకు దూరమైపోతాను.

    నీకు దూరం కాకుండా వుండటానికే యిలా దగ్గరగా వుంటూ దూరంగా వుండటమే శ్రేయష్కరం .

    "అందుకే ... అలా .....

    ఏం?

      "విరాజి"

                          *    *    *    *
   
    తలుపు తట్టాడు.

    ఆమె తలుపు తెరిచింది.

    అప్పటిలా జుట్టు విరబోసుకుని , విశాల వినీల నేత్రాలతో మధురవిషా ధరస్రవంతులు చిప్పిలుతుండగా ఆమె అపూర్వ౦గా  గోచరించింది.

    "ఒక్కక్షణం ..... నిశ్శబ్దం.

    రెండోక్షణం ...... నిశ్శబ్దం.

    మూడోక్షణం ..... అతను నవ్వాడు, పసితనం, అమాయకత్వం , అనురాగ మయమైన స్నేహభావం ఆ నవ్వులోంచి ఒకరికి మెత్తగా గ్రుచ్చుకున్నట్లు తడిగా, తరళితమైనాయి.

    రా అంటూ అతని చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకెళ్ళింది.

    "ఆక్రందన " నవల పాఠకుల్లో మేధావి వర్గాన్ని ఆకర్షించింది. వారిలో కొంతమంది గౌతంకు అభినందన లేఖలు రాశారు కూడా! సగటు పాఠకుడిని కానీ, లేడీ రీడర్స్ ని కానీ నవల ఆకట్టుకోలేక పోయింది.

    రచయిత అయినవాడు తాను ఉత్తమ రచన చెయ్యగల గటమేకాదు, ఆ రచన అందర్నీ అలగించాలని కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేరనప్పుడు నిరుత్సాహనికి లోనవుతాడు.

    గౌతమ్ కూడా అలాంటి నిరాశా నిస్పృహలకే లోనయ్యాడు.

    కాని క్రమంగా తనకుతాను సర్ది చెప్పుకున్నాడు, కావాలని తను ఓ గమ్యాన్ని ఎన్నుకున్నాడు.ఇది బంగారు బాటకాదు. నడక సుఖంగా ఉండదు. కాని గమ్యం చేరుకున్నాక ఆ అనుభవం తన చరిత్రనే మార్చి వేయవచ్చు.

    అంతలోనే నాదముగారి దగ్గరనుంచి ఓ ఉత్తరం వచ్చింది.

       "గౌతమ్!"

    నీ ఆక్రనందన చదువుకున్నాను ఎన్నో సంవత్సరాల తర్వాతగా గొప్ప రిలీఫ్. తెలుగు నవలా సాహిత్యం చచ్చిపోయిందనీ, తిరిగి చిగురించదనీ అనుకుంటూన్న తరుణంలో తిరిగి ఓ ఆశాకిరణం తళుక్కుమంది. మేమెవ్వరమూ చెయ్యలేని పనీ, చేదామని కలలునేదీ _ నువ్వు చెయ్యగలుగుతున్నావు.

    గౌతమ్! విపరీతంగా డబ్బు సంపాదించాను. కీర్తిపతాకం మరే రచయితా ఊహించనంత ఎత్తుకు ఎగరేశాను. నాకు జరిగినవన్ని సన్మానలేవరికీ జరగలేదు. నాకున్నంత ఫ్యాన్ మెయిలేవరికీ లేదు. నన్నారాధించినట్ట్లుగా స్త్రీలు ఇంతవరకూ ఏ రచయితనూ అరాధించలేదు. వాళ్ళందర్నీ ఒకమత్తుతో మైకంలో ముంచి పారేశాను.

    పత్రికల వాళ్ళు, పభ్లిషర్స్ నాకోసం పిచ్చేత్తినట్టు ఎగబడుతున్నారు. నేను పబ్లిసిటీ ఎలాచెయ్యమంటే అలా చేస్తున్నారు. చెబితే నమ్మలేనంత రాయస్టీల్ ఇస్తున్నారు.

    అయినా నాలో తీవ్రమైన అసంతృప్తి , ఒక గొప్ప రచన మేధావుల చేత సెభాష్ అనిపించుకునే ఉత్తమ రచన చెయ్యలేక పోయానన్న అరని తపన నన్నెప్పుడూ కాల్చివేస్తూవుంటాయి. ఎప్పటికైనా నా కోరిక తీరుతుందా? నా కలలో అనుకునేది సాధించగలనా?

    గౌతమ్! నువ్వే మాత్రం ఎప్పుడూ దారి మార్చుకోకు. ఆకర్షణలకు గురికాబోకు. ప్రలోభాలకు గురికాకు.

    ఈ సమాజం  మహ వికృతమయినది. మనల్ని మనలుగా బ్రతక నివ్వదు.

    ఈ విచ్చిన్న నరకశక్తుల బారినుండి నిన్ను నీవు రక్షించుకుంటూ నువ్వు నువ్వుగా నిలబడాలని కాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ __

                                                                                                                                   __ నాదముని

    ఆ ఉత్తరం రాకముందు కొన్నిరోజులపాటు పడ్డ యమయాతన తర్వాత గొప్ప శాంతి లభించినట్లయింది.

 Previous Page Next Page