Previous Page Next Page 
విరాజి పేజి 20

 

      "అవ్వా!" తినటానికి ఏమయినా వుందా?" అన్నాడు గౌతం ఆమె దగ్గరకు వెళ్ళి.

    "వేయించి ఉప్పూ కారం కలిపిన వేరుసెనగపప్పు వుంది బాబూ."

    గౌతం జేబులోంచి రూపాయి తీసి ఆమె చేతిలో పెడుతూ _ " యిది తీసుకుని యిద్దరికీ చేరి సగం పొట్లాలు కట్టియివ్వు" అన్నాడు.

    అవ్వ యిద్దరికీ చెరో పొట్లం కట్టి యిచ్చింది.

    యిద్దరూ పొట్లాలు విప్పుకుని తింటూ ముందుకు సాగారు.

    "ఫిఫ్టీ ఫిఫ్టీ " అంది విరాజి.

    "అవ్వ బాగా చేసింది" అన్నాడు గౌతం.

    "గౌతం ! సన్మానం రోజున ఉపవాసం అని ఓ కథ రాయ కూడదూ?"

    గౌతం నవ్వాడు.

    ఆ సమయానికి సన్మాన సభకు అధ్యక్షత వహించిన మిగతా వ్యక్తులు హాయిగా యింట్లో పడుకుని విశ్రాంతి తీసుకుంటూ వుండి వుంటారు. కానీ సన్మనించబడిన వ్యక్తి _ ఓ స్త్రీ తో కలసి యించుమించు ఏడెనిమిది మైళ్ళ దూరం నడుస్తున్నాడు.

    కొంతసేపటికి చినుకులు  పెద్దవైనాయి.

    చూస్తూ చూస్తుండగానే వర్షం పెద్దదైపోయింది.

    గౌతం అంతవరకు భుజాలమీద _ మెడచుట్టూ వేసుకున్న శాలువా విప్పి యిద్దరి తలలను కవర్ చేస్తూ కప్పాడు. శాలువా,  జారిపోకుండా ఓ కొస గౌతం, ఓ కొస విరాజి పట్టుకున్నారు. ఇద్దరికీ సరిపోయేందుకు వీలుగా విరాజి అతనికి దగ్గరగా జరిగింది.

    "పాపం ! వాళ్ళు కప్పిన శాలువా యిలా పనికి వొచ్చింది"  అంది విరాజి.

    బాగా చీకటిగా వుండటం వల్ల దారి సరిగ్గా కనబడటంలేదు.  దానికి తోడు వర్షం.

    కాలికి రాయి తగిలి విరాజి తూలీ క్రిందపడబోయింది. గౌతమ్ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకూ లాక్కుని క్రిందపడకుండా ఆపాడు.           

    "ఇంతకూ మనం ఎటుపోతున్నాం?" అనడిగింది విరాజి.

    "ఇక్కడ్నుంచి మీ యిల్లయితే చాలా దూరం. నాగది కొంచెం దగ్గర."

    "అయిడే నీ గదికే పోదాం. ఎక్కువ దూరం  నడిచే ఓపిక లేదు."

    గౌతమ్ కి కూడా అదే సబనిపించింది. వాళ్ళిద్దరూ అతని గాడికి చేరుకునే సరికి ఓ గంటకు పైగా పట్టింది. అంతసేపూ వర్షం కురుస్తూనే వుంది.

    ఒకచేతితో శాలువా అంచుపట్టుకుని రెండోచేతిని ఆమె భుజంచుట్టూ వేసి నడిపిస్తూన్నట్లుగా తీసుకు వెళ్ళాడు.

    గదికి చేరుకునేసరికి యిద్దరూ యించు మించు పూర్తిగా తడిసి పోయారు. శాలువ గుండెల దగ్గర్నుంచీ పైభాగాలను కాపాడిన మాట నిజం.

    లోపలకు అడుగుపేట్టి లైటు వేశాడు. చేతిలోని శాలువను ఓ ప్రక్కన పెడుతూ. "ఫిఫ్టీ ఫిఫ్టీ " అంది విరాజి.

    గౌతం ప్రశ్నార్ధకంగా చూశాడు.

    "మనమిద్దరం పాపం దీన్ని సమానంగా పంచుకున్నంగా ."

    గౌతం నవ్వి _ నీ బట్టలు తడిసి పోయాయిగా ఎలాగా?" అన్నాడు.

    "అదే నేనూ సీరియల్ గా అలోచిస్తున్నాను."

    "చలిగా వుందా?"

    "వుండదా మరి?"

    అతను తన పెట్టె తెరచి తన బట్టలన్నీ చూశాడు, ఒక పైజమా, లాల్చీ కొంచెం కుదురుగా వున్నట్టు కనిపించాయి.

    "వీటిని వేసుకునేందుకు నీకే మన్నా అభ్యంతరమా?" అనడిగాడు

    ఆమె తల ఆడించి _ "అభ్యంతర మేమీ లేదు _ అంది.

    అతను వాటిని అందించాడు.

    "ఎలా కట్టుకుంటావు?"

    "ఏం?"

    "నేను బయటకు వెళ్ళి నిలబడాలంటే వర్షము మరీ పెద్దదయ్యింది" అన్నాడు.

    "ఆ వర్షంలోంచే గంటన్నర వరకు పైగా యిద్దరం నడిచి వోచ్చాం" అంది విరాజి వెక్కిరింపుగా,

    అతనికి రోషమొచ్చి , "అయితే మళ్ళీ తడుస్తాను" అంటూ తలుపులు తెరుచుకుని బయటకు నడవబోయాడు.

    "ఓయ్! ఓయ్" అని అతని చెయ్యి పట్టుకుని ఆపి అంత యిబ్బంది పడక్కర్లేదులే కొంచెం ప్రక్కకి తిరిగి నిలబడు చాలు" అంటూ అయిదు నిమిషాల్లో బట్టలు మార్చేసుకుంది.

    తర్వాత గౌతం కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు.

    "ఇప్పుడు చెప్పు" అంది విరాజి

    ఇహా చెప్పటానిచేముంది? ఈ అలసిపోయిన శరీరాలను నేలమీద పడవేసి విశ్రాంతి తీసుకోవటమే."

    విరాజికి కూడా అలసిపోయి వుండటం చేత నిద్ర వొస్తుంది.

    "అవును ఒకే చపా, ఒకే దిండూ వున్నాయి.

    ప్రపంచ చరిత్రలో ఎందరో ప్రఖ్యాత రచయితలూ తమ తొలి దశలో ఇలాంటి దుర్దినాలు అనుభవించి వుంటారు.

    వాటిని నేలమీద పరచి, "నువ్వు దీనిమీద పడుకో విరాజీ నేనలా పడుకుంటాను" అన్నాడు.

    "అలా అంటే!"

    "నేలమీద."

    "అసలే వాన ముమ్మరంగా పడుతోంది. కటికనేల మీద పడుకుమ్తవా గౌతం" అంది విరజీ . ఆమె గొంతులో బాధ ధ్వనించింది.

    "మరి!"

    "ఇద్దరం చపమీదే పడుకుందాం. ఫిఫ్టీ ఫిఫ్టీ " అంది.

    ఒక్కక్షణం అతను మెదలకుండా ఊరుకుని "సరే!" అన్నాడు.

    ఇద్దరూ చాపమీద కొంచెం ఎడం ఎడంగా ప్రక్క ప్రక్కన పడుకున్నారు. ఇద్దరికీ ఒకేదిండు లైటు వెలుగుతూనే వుంది.                
    "నేనిలా పైజమా , లాల్చీ వేసుకుని నువ్వూ అదే డ్రెస్సులో యిలా పడుకుని వుంటే యిద్దరు మొగ స్నేహితులు చెట్టాపట్టాలు వేసుకున్నట్లు లేదూ" అంది విరాజి.

    "చూడ్డానికి అలాగే వుంది."

    "చూడ్డానికి అంటే?"

    "లోపల శరీరాలు వేరుగా."

    విరాజి కిలకిలమని నవ్వింది. "లైటు అర్పెద్దాం., గౌతమ్ , వెలుగు కళ్ళలోకి పడుతూంటే నాకు నిద్రపట్టదు."

    "నీ యిష్టం " అని అతను లేచి లైటార్పేసి మళ్ళీ యథాస్థానంలో పడుకున్నాడు.

    కొన్ని క్షణాలు నిశ్సబ్దంగా గడిచాయి.

    "గౌతమ్ అని పిలిచింది విరాజి."

    "ఊ"

    "పడుకున్నావా?"

    "నిద్ర రావటంలేదు."

    "నాకూ అంతే. ఇందాక నిద్ర కళ్ళలోకి కూరుకు వచ్చి నట్లనిపించింది. ఇప్పుడేమో దయతలచటం లేదు."

    "విరాజీ నివ్వెల్లకాలం ఇలాగే వుండిపోతావా!"

    "ఇలాగే అంటే?"

    "అలాంటి యింట్లో ... అలా వంటరిగా ...."

    "బహుశా అంతే"

    ఈ స్త్రీ తన జీవితంలోకి దూసుకు వచ్చింది. నిద్రావస్థలో పోనీ సందిగ్ధావస్థలో వున్న తనను, తన మనస్సును ప్రభావితము చేసి, కొత్త విలువల్ని నేర్పి  మధుర శ్రుతుల్ని పలికించి, వింత అనుభూతులు చిలికించి తనలో సంపూర్నత్వాన్ని తీర్చి దిద్దుతున్న .... యీ స్త్రీ యిఇమే తోడు .... యీమె వెదజల్లే నీడ తనకు నిరతంతరం కావాలి.

    తాను ప్రేమ గురించి కొన్ని రచనల్లో రాశాడు. ప్రేమ గురించి తెలీకుండా రాసిందాంట్లో నిండుతనం వుంటుంది.

    చిత్రమేమిటంటే ప్రేమ గురించి ఎన్ని సంవంత్సరాలు గడిపినా ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. ఆ తెలసీ తెలియని అస్పష్టతతో నుండే రాసానందాని జుర్రుకుని మధుర విషాదాను భూతుల్లో మునిగి తెలుతాంటారు.

    కొంచెం ఆమెవైపు జరిగి, చీకట్లో తడిమి అమెచేతిని తనచేతిలోకి తీసుకున్నాడు.

    ఆమె ఏమీ మాట్లాడలేదు.

    "విరజీ" అతని గుండె దడదడమని కొట్టుకుంటున్నది గొంతులో చిన్న వణుకు .

    "ఊ"

    "నిన్ను నేను ...."

    .... .... ....

 Previous Page Next Page