Next Page 
ది రైటర్  పేజి 1

                               ది రైటర్
   
                                                                                                       __కొమ్మనాపల్లి గణపతిరావు
   
    ఓ కవి పిడికిట బిగుసుకున్న కలం మూగవోయిన తన గాళానికి మాటలు కూర్చుకుని వ్యాధితవ్యాకుల హృదయంతో అంటోందీ......    
   
    "నా గుండెల్లో లోతుల్లో నిక్షిప్తమైన రుధిరాన్ని నానోట కక్కించిన ఓ నేస్తం ! నీ చేతివ్రేళ్ళు స్పర్శతో నన్నో రాగానిపంచినా మార్చి విశ్వజనీన సంగీతానికి రససృష్టినిచేయక కవోష్ణ రక్తదారాల్ని నా గొంతునుంచి ఎందుకు కక్కిస్తావయ్యా!
   
    నాకంఠసీమను కసిగా నొక్కి నేను రాల్చిన అక్షరాల తోరణాలను సవ్యచరితకు నాందిగామార్చక నీవు సృష్టించాలని తలపోసే మరణహొమ౦లోనన్ను సమిధను చేయడం న్యాయమా?
   
    అయ్యో! నీ సాహిత్య సుక్షేత్రంలో నన్ను హలంగా మార్చక నీ గుండెను మండించే గరళానికి నన్ను ఆయుధంగా వాడుకోవడం నీకు పాడియౌనా?
   
    అక్కటా..... ఎంతటి దయలేని వారయ్యా మీ జాతివాళ్ళు"
   
                                                       *    *    *    *
   
    అర్దరాత్రి......
   
    ఊరికి ఉత్తరాన వున్న ఓ శ్మశానపు నడిబొడ్డులో నిర్విరామంగా ఓ వ్యక్తి సమాధిని తవ్వుతున్నాడు.
   
    ఆ నిబిడాంధకారంలో విస్థబ్దకని అతడి నిట్టూర్పులు చెదరగోడుతున్నాయి. అభిలము అమనస్యమై అమీషార్దము పోరాడే ఓ క్రూరమృగపుఆయోధము అతడి మండుతున్న గుండెల్లో __సప్త జిస్వువుని శతనాల్కలు ఉరస్ప్రూత్రికగా మనసుపై మోదుతుంటే కక్కరము కగ్గమైకత్తివాతయమ్ముకసిగా అ మట్టిలో గుచ్చుతూ కైటబారి భీకర సంగ్రామంలో వైర నిర్యాతనాశక్తి కదం దొక్కుతున్నట్టు ఉగ్రుడై వ్యగ్రుడైఉద్దీపిత వ్యాకుల నిర్భిన్న వాంచ్చాగ్డుడై శ్రమిస్తున్నాడు.
   
    ఆ నిశబ్ద నీరవ వాతావరణంలో అతడి పాలభాగాన అలుముకున్న స్వేదబిందువులు ఒక్కొక్కటి జారి సమాధిపైపడి ఇంకిపోతున్నాయి.
   
    సాక్ష్యం చెప్పలేని సమీపంలోని సమాధులు నిర్వికల్ప సమాధిలోకి జారిన జ్ఞానుల్లా మిగిలిపోయాయి.
   
    ప్రేతాత్మలు ఘోష పెడుతున్నట్టు గాలి బుసలు గాలి బుసలు కొడుతూంది.
   
    నేలపైకి వెన్నెల జార్చలేని ఆకాశంలోని నక్షత్రాలు పొంచివున్న కాలసర్పపు నేత్రాల్లా క్రిందకి చూస్తున్నాయి.
   
    స్మశానం చుట్టూవున్న దెయ్యాల్లాంటి చెట్లు ఏ క్షణంలోనైనా మీద విరిచుకుపడేటట్టుగా నిలబడి వున్నాయి....
   
    అలసటగా ఒక్క క్షణం అగేడా వ్యక్తి..... ఏవో నీడలుకడులుతున్న అనుభూతి___ 
   
    ఎందర్నో తన గుండెల్లో దాచుకున్న ఆ మరుభూమి కొద్దిగా కదులుతున్నట్ట్లుగా ఏదో మెడపై ప్రాకుతున్నట్టుగా అనిపించడంతో గిరుక్కున వెనక్కీ తిరిగాడు ___
   
    పైకి ఒరిగిన ఓ గుడ్డి మొక్క అతడిపైకి వాలివుంది అతడు చేసిన పాపాన్ని ప్రశ్నింస్తున్నట్ట్లుగా.......
   
    అదురుతున్న గుండెలతో చుట్టూ చూసాడు.....
   
    కపాలాలు కాళంకాలుఎముకుల పోగులు అక్కడక్కడా విసిరేసి నట్లుగా వున్నాయి.
   
    వాచీ చూసుకున్నారు....... రాత్రి ఒంటి గంటన్నర......
   
    వ్యవదీ లేదు.
   
    వెంటనే సమాధిని పూర్తిగా తవ్వేయాలి. శవాన్ని బయటకి లాగి. మాయం చేయాలి. మళ్ళీ బలాన్ని కూడగట్టుకుని  మళ్ళీ గోతుని తవ్వడం మొదలు పెట్టాడు.
   
    ఆ వ్యక్తి అంత ఆర్తిగా తవ్వుతుంది మూడురోజుల క్రితం అతడు సమాధానం భార్య శవాన్ని పైకితీయాలని......
   
    విషాహారాన్ని నమ్మకంగా పేట్టి ఆమెను అడ్డం తొలగించుకుని నలుగురికీ అది సాధారమైన చావుగా నమ్మించగలిగెడు.....చివరికి అత్తామామల్ని కూడా.....
   
    కాని హాఠాత్తుగా ఆ రోజు సాయంకాలం పోలీసులు అది హత్యగా అనుమానిస్తున్నామంటూ ఇంటరాగేషనుప్రారంభిచారు.
   
    సరిగ్గా అదే ఆత్మ భయపెట్టింది. ఇక్కడ ఇప్పుడతడు చేస్తున్నది సమాధిని  తవ్వి భార్య శవంపైపడి తను చేసిన తప్పుకి క్షమార్పణలు చెప్పుకునే ప్రయత్నం కాదు.... ఒక వేళ ఆశవం మాటాడగలిగినా గుడ్డిగా తనను నమ్మిన ఆడది కాబట్టి తన గురించి పల్లెత్తుమాట కూడా అన్ని ఆడదని అతడికి తెలుసు.....
   
    అప్పటికే సగానికిపైగా గోతుని తవ్వేడు.....
   
    ఎందుకో ఏ గుండె అట్టడుగుపొరల్లో ఏ పశ్చాత్తాప దావాగ్ని అతడ్ని స్ప్రిశించి మేలిపెట్టిందో క్షణంలో వెయ్యోవంతు అతడి గుండెలు బాధగా మూలిగాయి.
   
    ఈనాడు ఇంతటి శ్రమను ఖర్చు చేస్తున్నా తను కనీసం ఒక్క క్షణం ఆమె గుండెలోతుల్ని తరచి చూసి వుంటే......

Next Page