Read more!
Next Page 
ఖాండవదహనం  పేజి 1

 

                                 ఖాండవదహనం
   
                                                                            ___: కొమ్మనపల్లి గణపతిరావు.
   
    గర్జించిన ప్రభంజనమై పడమటి కొండలు ప్రతిధ్వనించాయి .
   
    దుర్గ రాన్యం దద్దరిల్లెట్టు వినిపించింది. పులి గాండ్రింపు మరో మారు....
   
    నడుస్తున్న ఆమె ఠక్కున ఆగిపోయింది.
   
    ఉగ్ర భీకర ఖడ్గాక్షరమైన పులి పడ ఘట్టనకి
   
    ఈ సారి అడవి స్తబ్ధత చెదిరిపోయింది. 
   
    మినీమాపు వేళ మద్దిచెట్ల గూళ్ళలో ఒదిగిన పక్షులు భయంతో పైకెగిరాయి. టేకు చెట్లపై కోతులు కంగారుతో కిచకిచమన్నాయి.
   
    అంతలోనే హాఠాత్తుగా నిశ్శబ్దం.... రగిలే యజ్ఞానికి సమకూర్చి హావిస్సులా ....
   
    సంనాను గుర్రు వినిపించిండిప్పుడు... దూరంగా కాదు  చాలా సమీపంలో .......
   
    రెండు పదుల దాటని ఆ యువతి కట్టుకున్న షిఫాన్ చీర స్వేదంతో తడిసిపోతుంటే  నిర్ణయంగా వున్న అరణ్య గర్భంలోకి రొప్పుతూ చూస్తూం......
   
    నేల అదురుతున్న  చిరుసవ్వడి .......
   
    ఉలికిపడుతున్న ఉల్కలా నింగినుంచినేల జారిన నగ్న నక్షిత్రంలా కంపించిపోతూ......
   
    అప్పుడు చూసిందామె..... తను నిలబడ్డ సన్నని కాలిబాతకి అనుకుని వున్న వెదురు పొదలు పాము పడగల్లా తలలూపుతున్నాయి.
   
    కెవ్వుమనబోయిన ఆమె కేక గొంతులోనే సమాధి అయ్యింది.
   
    చీలిన పొదల మధ్య ఆగిన పులి నిశ్సబ్దంగా ఆమెనే చూస్తుంది. మండుతున్న మునుగురుల్లాంటినేత్రాలతో అగ్ని పంజరంలా వుంది..... మరణోత్సావం కాదు... సమిగ్డ భుజంగా సదృశ జలపాతపు చరమగీతం.
   
    అక్కడ గాలి స్తంభించిపోయింది.
   
    మృత్యువు నగ్న బాహువుల్లా వున్న పాదాల్ని ఉగ్రతాండవ ముద్రకి సిద్దం చేస్తూ కొద్దిగా జరిపింది....
   
    అయిపోయింది ..... మనుషుల మధ్య మరణయాతనకి తాళలేక కోరుకున్న మనిషి కోసం అడవిలో అడుగు పెడితే అతడి చేరకముందే బ్రతుకు కడతేరి పోతూంది.
   
    కళ్ళలో నీళ్ళుసుడులుతిరుగుతున్నాయి. అయినా చచ్చుబడిపోతున్నా కర్మేంద్రియాలలో జీవాన్ని నింపుతుంది......
   
    చార్జి చేసిన పులి నోట చిక్కడే.......
   
    బ్రీఫ్ కేస్ పైకి ఆక్రందన చేస్తూ ముందుకు పరుగెత్తింది.
   
    దబ్ మన్న చప్పుడు...... చేజారిన ప్రత్యర్ధిని చూస్తుంటే రోషం మరింత ఉద్దేపితమైందేమో గాండ్రిస్తూ వెంటపడింది.
   
    ఒకరిది బ్రతుకు తీపి....మరొకరిది క్షుదోన్మాదం.
   
    కనిపించని ఏ దేవుడుకో మొర పెట్టుకుంటున్నట్టు ఆర్తనాదాలు నివేదనతావు కేక పడుతూ సింధూర చెట్ల వరసల్లో నుంచి గోతుల్ని గతుకుల్ని దాటుతూ ఆమె చూసుకుపోతూంది.
   
    నేలపై వున్న ముళ్ళ కంచెలు ఆమె మోకాళ్ళని చీరేస్తున్నాయి.

     కలబంద, బొమ్మజేముళ్ళ రాపిడితో చీర పీలిక లౌతుంది. అయినా  ఆమెలో అలసట ఎరుగని ప్రయాస......
   
    ఏ క్షణంలో వెన్ను చీలిపోతుందో, ఏ లిప్తలో పులి పంజా వెతుకి మెడ విరిగిపోతుందో తెలీనట్టు మరణభీతితో పరిగెడుతూనే డేగిశ చెట్ల మలుపు తిరుగుతూ దబ్బున పడిపోయింది.
   
    "కట్"
   
    కేక వినిపించగానే ఎవరావుపత్తి ఆపినట్టు నిలబడిపోయిందిటైగర్....
   
    "ఇట్స్ మార్వలస్ " అంతదాకా చిత్రించిన షాట్ అద్భుతంగా వచ్చిన సంతృప్తితో డైరెక్టరు సురేంద్ర."టేకఫ్" అన్నాడు. ముండుకు నడుస్తూ..
   
    క్షణం క్రితం దాకా నిశ్సబ్దంగా వున్న సినిమాయూనిట్ లో అప్పుడు చలనం మొదలైంది. ఉదయం నుంచీ నిర్విరామంగా సాగిన తొలిరోజు ఘంటిగ్ ముగిసిన అవుట్ డోర్ ఎక్విస్ మెంటునివెం లోకి తరలిస్తుంటే సురేంద్ర ఉత్సాహంగా అన్నాడుకేమేరా మెన్ తో "సింగల్ టేక్ లోవిజయతోపాటు టైగర్ కూడా చాలా అద్భుతంగా నటించేసింది."
   
    ఒక్క కాల్ షిటుకి మూడువేళ రూపాయల దాకా ఆర్జించే టైగర్ 'షీబా' ఆ రోజు అల్లరి చేయకుండా ప్రతి షాటునీ 'సింగిల్' టేక్ లోఓ.కే చేయించుకునందుకు షిబానీ పాట్ చేయటం మరచిపోలేదు సినిమాలకి పులుల్ని సరఫరా చేసే పులురాజు. 

Next Page