Previous Page Next Page 
కదానాయికి పేజి 11

    " ఈ ఏటితో ఇక్కడ నీచదువయిపోతుందిరా రాజూ పైఏడునుంచి పట్నంలో చదవాలి. ఎంతడబ్బయినాసరే పట్నములో వుంచి పెద్దచదువులు చదివిస్తాను . శ్రద్ధలేక నేను చదువుకోలేకపోయాను. చుక్కకు ఎంత చెప్పినా  చదువులు చదివిస్తాను. శ్రద్ధలేక నేను చదువుకోలేకపోయాను. చుక్కకుఎంత చెప్పినా చదువురావటం లేదు. పెద్దచదువులు చదివివుండాలనే కోరిక నీద్వారా తీర్చుకుంటాను. బాగా చదువుకుంటావుగా?" రఘుపతి వాత్సల్యంతో అన్నాడు.

     రాజు అయోమయంగ తలఊపాడు. మామయ్య నోట్లోంచి " పట్నం వెళ్ళి చేదువుకోవాలి"-"వినంగానే మనసు అల్లకల్లోలం అయింది.

    "అమ్మకు దూరంగా-అనూకి దూరంగా -యీ ఊరునుంచే దూరంగా వెళ్ళి పోవాలి- చదువుకోవాలి"- మాటిమాటికీ అనుకున్నాడు.

     " సుమతీ శతకంలో   పద్యాలు సరీగా రావటం లేదు నాన్నా!" అంటూ పుస్తకం పుచ్చుకుని వచ్చింది చుక్క.

    "ఎందుకు రావటంలేదు చుక్కతల్లీ?  చదివితే బాగా వస్తాయి." రఘుపతి  నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు.

    "నీకు తెలియదు నాన్న, చదివినా రావు.  పద్యాలు అర్థంకావు.అందుకేగా నాకు  రాంది. పాఠాలు చూడు  ఎంత  బాగా వస్తాయో?పాఠాలయితే మార్చిమార్చి చూచాడు.

    "రాజూ!"

    "ఏంటి మామయ్యా?"

    "రోజు సాయంత్రం స్కూలునుంచి రాగానే చుక్కని దగ్గర కుర్చోపెట్టుకుని పద్యాలు కంఠతా వచ్చేటట్లు చెప్పి చదివించు."

     రెండు గుటకలువేసి "అలాగే మామయ్యా!" అన్నాడు రాజు.

    "బావ చక్కగా చెపుతాడు. రోజు బావదగ్గర కూర్చుని చదువుకో చుక్కతల్లీ!" అన్నాడు రఘుపతి.

    "బావ చెపితే నేనెందుకు చదువుకోనూ?" దీర్ఘం తీస్తూ అంది చుక్క.

    "వెళ్లు !ఇప్పుడే మొదలుపెట్టు. బావ పెప్పినట్లు విను. అర్థం కాకపోతే అడుగు చుక్కతల్లీ! ఊ- ఇంకా నుంచున్నారేం? వెళ్లురాజూ, చుక్కకి అర్థమయ్యేటట్లు చెప్పు."

    " అలాగే మామయ్య!" అని చుక్కని పిలవకుండానే గదిలోంచి బయటకు వచ్చాడు రాజు.

    రాజు వెనుకనే లోపలి నుంచి రాకుండా  మూతి  బిగించుకుని నుంచుంది చుక్క.

    "వెళ్లు చుక్కతల్లీ! బావ దగ్గర కూర్చుని చదువుకో." రఘుపతి. చుక్కతల నిమురుతూ చెప్పాడు.

    "బావ రమ్మనలేదుగా?"

    "గది బయట నుంచుని వీళ్ళమాటలు  విన్నరాజు ఒకగంటలో గుమ్మం దగ్గరకొచ్చాడు. " రావేచుక్కా! ఇంకా అక్కడే వున్నావేం?చదువుకోమని మామయ్య చెప్పలా?" అన్నాడు చుక్కకు చదువుచెప్పే విషయంలో మహా శ్రద్ద తనకున్నట్లు మొహం పెట్టి.

    చుక్క గదిలోంచి కాలు బయటపెట్టింది.

     'ఖర్మరోజూ యి మొద్దుకు పాఠాలు చెప్పాలి కాబోలు చుక్కని పక్కనే కూర్చోపెట్టుకుని సుమతీ శతకం తెరుస్తూ అనుకున్నాడు రాజు.

    "అక్కరకు చుట్టమంటే ఏంటి బావా?"

    "అక్కరకు చుట్టము కాదు అక్కరకు రాని చుట్టము." రాజు చెప్పాడు.

    "ఏం కాదు. అక్కరకు చుట్టమే. కావాలంటే పుస్తకంలో చూడు. నీకూ పద్యాలు రావా బావా?"

    రాజు,సుమతి శతకంలో పత్యం తీసి "అక్కరకురాని చుట్టము "దగ్గర వేలుపెట్టి చూపిస్తూ " చూచి చదువు ఏం రాసుందో? ఉత్త మొద్దువి. వాదించటం తప్పనీకేం తెలియదు."అన్నాడు.

     "నాన్నా- బావచూడు నన్ను మొద్దంటున్నాడు." పుస్తకం విసిరి కొట్టి ఎడమచేత్తో అలవాటు ప్రకారం నులుముకుంటూ గదిలోకి పరుగెత్తింది చుక్క.

     తెల్లబోయి చూస్తూండిపోయాడు రాజు.

                               6

    ఆదివారం వచ్చింది.

    సాయంత్రం నాలుగు గంటలకే రాజు వచ్చేశాడు. ఆడుకోవటానికి ఎప్పటిలా పిల్లలంతా ఆదివారం అయినా తొందరగా ఆటలకు రాలేదు. రాజు ఒంటరిగా కూర్చుని గడ్డపరకలు పీకి నేల చదును చేస్తున్నాడు. పనిలేని మంగలిలా.

    ముందుగా రావటం వల్ల విసుగ్గా వుంది. ఎంత హుషారుగా వచ్చాడో అంత నిరుత్సాహం పొందాడు. అనుపమ కోసం తొందరగా వచ్చినా మిగతా పిల్లలయినా వస్తే బాగుండును అనుకున్నాడు రాజు.

 Previous Page Next Page