" నోట్లో చెయ్యితియ్యి." రఘుపతి అనగానే చటుక్కున గోరుకొరకటం ఆపేసి చేతులుముడుచుకు కూర్చున్నాడు రాజు.
"పోని పట్నం వెళదామా రాజేశ్వరీ?" కాసేపు ఆలోచించి ఆడిగాడు రఘుపతి.
"మునసబుగారి కోడలు, వర్ధనంచెల్లెలు సుందరి,పట్నంవెళ్ళి ఎన్నో నెలలు అక్కడేవుండి డాక్టరుకు చూపించుకుని వైద్యం చేయించుకున్నారు. మృత్యువుని తప్పించుకోగలిగారా? గీత మార్చలేమండీ, పై వారం డాక్టరు వస్తాడుగా అప్పుడు చూడొచ్చు. దేముడు దిగొచ్చినా మృత్యుదేవతను జయించలేడు." రాజేశ్వరమ్మ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో నిర్లిప్తంగా అంది.
"అలా అనకు రాజేశ్వరీ!" రఘుపతి బాధగా అన్నాడు.
"మామయ్యకు అత్చయ్యంటే ప్రేమ. అందరిమీదా అరుస్తాడు అత్తయ్యతోమాత్రం శాంతంగ మట్లాడుతాడు." ఇద్దరిమొహాలు మార్చి మార్చి చూస్తూ అనుకున్నాడు రాజు.
రాజు ముఖకవళికలు కనిపెట్టింది రాజేశ్వరమ్మ.
"ప్రవేటుమాష్టారు రాజుకి బాగా చదువుచెప్పటంలేదండీ, మీరు" రాజేశ్వరమ్మ మాట పూర్తిచేయక ముందే రఘుపతి అందుకున్నాడు.
"ఏం రా రాజూ! చదువు బాగాచెప్పటంలేదా? నీకు బాగా చదువుకోవాలని లేదా?" గర్జిస్తున్నట్లన్నాడు రఘుపతి.
"ఇప్పుడే గాచిన్నగామాట్లాడాడు అత్తయ్యతో మామయ్య. నన్నయితే అరుస్తాడు ఊరికే," రఘుపతి మరోసారి గర్జించేటప్పటికి ఉలిక్కిపడ్డాడు రాజు.
"ఏంరా! పలకవు నేనడిగింది వినపడిందా?"
"ఊ!" నూతిలోంచి వచ్చినట్లుంది రాజు 'ఊ' అనటం.
" వాడు మిమ్మల్ని చూచి భయపడుతున్నాడు. మెల్లగా అడగకూడదూ?" సన్నసన్నగా మందలించింది రాజేశ్వరమ్మ.
"బాగా చదువుచెప్పటం అంటే ఏమిటి? మాష్టరుగారు చెప్పింది. అర్థం కావటంలేదా?" కాస్త స్వరంతగ్గించి అడిగాడు రఘుపతి.
అత్తయ్య పక్కనుండేటప్పటికి ధైర్యం వచ్చింది రాజుకి.
"అదికాదు మామయ్యా! ఒకటోతరగతి వాళ్ళకు రెండోతరగతి వాళ్ళకు చెప్పినట్లు పుస్తకంలోవున్న పాఠాలు తను చదువుతారు. నన్ను కాసేపు చదువుతూ మరికాసేపు చూచిరాస్తూ కూర్చోమంటాడు. నేను కాసేపు చదువుతూ మరికాసేపు చూచిరాస్తూ కూర్చోమంటాడు. నేను కాసేపు చదువుతూ మరికాసేపు చూచిరాస్తూ కూర్చోమంటాడు. నేను చదువుతుంటే పడక్కుర్చీలో పడుకుని మధ్యమధ్య నిద్రపోతుంటాడు."
రాజు చెప్పిందాంట్లో అబద్ధం లేదనిపించింది రాఘుపతికి. "నీ పుస్తకాలు నోట్స్ తీసుకురా చూద్దాం."అన్నాడు.
రాజు ఫోర్తుఫారం పుస్తకాలు నోట్స్ తీసుకొచ్చాడు. వెంటనే.
రఘుపతి పుస్తకాలు, నోట్స్ తరగేశాడు. తలపంకించాడు . పుస్తకాలు శుభ్రంగా అట్టలేసివున్నాయి. మోటుబుక్సులో రాసినంతవరకూ అందంగా పొందికగా తీర్చిదిద్దినట్లు ఇంగ్లీషు , తెలుగు, హిందీ అక్షరాలు ఉన్నాయి ప్రెవేటుకి తీసుకెళ్ళే పుస్తకాలలోమటుకు పాఠాలు చూచిరాసి నట్లు తెలుస్తూనేవుంది.
పుస్తకంలోంచి తలపైకెత్తి రాజుని చూస్తూ "మాస్టరుగారి అడుగుతాను చదువు సరీగాచెప్పనిసంగతి" అన్నాడు రఘుపతి.
"నీయిష్టం మామయ్యా !" అన్నాడు రాజు అయిష్టంగానే . మాష్టరు గారి నడిగితే నిజంచెపుతారేమిటీ? మీమామయ్యకు చెప్పానా అని రేపు నన్నేతిడతారు మాష్టరుగారు. యీ మామయ్యకేం తెలియదు" అనుకున్నాడు రాజు.
"మాష్టరుగారి నడిగేదేమిటి? ప్రవేటు మాన్పించండి రాజుబాగానే చదువుకుంటాడుకదా?"అంది రాజేశ్వరమ్మ.
"రాజు చదవడనికాదు రాజేశ్వరీ! రాజు పెద్దచదువులు చదవాలంటే పునాది గట్టిగావుండాలి. ఓ రాజు వీదిలో మాష్టరుగారు కనపడితే పలకరించాను.రాజు నిపెద్దపెద్దచదువులు చదివించాలని ఉందని మాటలమధ్యలో అన్నాను. నావద్దకు పంపండి ప్రైవేటుచెపుతాను. చాకులా తయరవుతాడు క్లాస్ ఫస్డువస్తాడు అని గట్టిగా చెప్పాడు. నెలకు పదిహేను రూపాయలు కూరలు, పాలు, పెరుగు ఎన్నిఅందించాను. డబ్బు సంపాదించటానికి యిదో ఎత్తు.
"పోనీలెండి. ఎవరిపాట్లు వారివి. ప్రేవేటు మాన్పించితేపోలా?" రాజేశ్వరమ్మ అంది.
"ఊహూ! అలా మాన్పించకూడదు. రేపు రాజు ప్రైవేటుకి వెళ్ళి నప్పుడు నేను మధ్యలో వెళతాను.సమయంచూచి అంటే మాష్టరుగారు కునికిపాట్లు పడుతుండగా పలకరిస్తాను.నాముఖంచూచి జరగబోయేది గ్రహిస్తాడు.ఆ మర్నాటి నుంచి రాజుని ప్రైవేటుకి పంపేదిలేదు."
"బాగుంది" అంది రాజేశ్వరమ్మ.
ప్రవేటు లేకపోతే రోజూ అనుపమతో ఆడుకోవచ్చు.అనుకు న్నాడు రాజు.ఆదివారం కావటం ఉదయంనుంచీ మామయ్యఇంట్లోవుండటంతో ఆడుకోటానికి వీధీలో కాలుపెట్టలేదు.ఆదివారం అయితే అనుపమ తప్పకవస్తుంది. డాక్టరుగారికోసం ఓసారి బైటికివెళ్ళినా అప్పుడు అనుపమ ఆడుకోటానివచ్చే సమయంకాదు. ఇంకాసేపటికి అనుపమ వచ్చేస్తుంది. ఇంట్లోంచి వెళ్ళాలి. ఎలాఅయినాసరే, అనూతోచెప్పాలి ఇహ నుంచీ రోజూ సాయంత్రం వస్తానని.
రాజు ఆలోచనలకు అంతరాయం కలిగింది.
"రాజూ!" ప్రేమగా పిలిచాడు రఘుపతి.
"మామయ్య మంచివాడు. గట్టిగా మాట్లాడినా నేనంటే ప్రేమ." అనుకున్నాడు రాజు. ఉన్నటుండి మామయ్యమీద ప్రేమకలిగింది రాజుకి.