Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 11

 

    బుస మరింత  ఉద్రుక్తమైంది.
   
    తానెదుర్కోంటున్న ప్రత్యర్ధిని తూటాలతో నేలకూడలడంతోసామాన్య ప్రాణి కాదని తెలుసుకున్న తొలి క్షణమదే....
   
    మరింత రోషంతో పైకిరాబోయిన కొబ్రాను గురిచూసి మరోసారి ట్రిగ్గర్ నొక్కాడు.....

     పడగపై గాయపు పరిమాణం పెరిగింది. తప్ప, కోబ్రా కదలిక ఆగలేదు... ఎదురుగా వున్న టార్గెట్ లోని 'బుల్' ని చూసి కాల్చినట్టు యింకోతూటాని వేనువెంటనే పప్పుగలిగాడు.
   
    వెన్నె ముకపై బలంగా హంటర్ తో కొట్టినట్టు ఛేళ్ మంది.....
   
    తూలీపోతూ గమనించాడు. తన శరీరాన్ని కూడగట్టుకున్న కోబ్రాతోకతో శ్వాసదాకా ఝూడించి కొట్టిందని.....
   
    మామూలు వ్యక్తి అయితే ఆ షాక్ కి ప్రాణాలు వదలాలి. కానీ చివరి శ్వాసదాకా పోరాటమే ధ్యేయంగల వ్యక్తి చైతన్య .....
   
     దొప్పలా రివ్వుమంటూ పైకి వస్తున్న పడగని చూస్తూ వేగంగా పక్కకి దొర్లి మరోసారి కాల్చాడు.... కాతెయ్యలనుకున్న కోబ్రా చివరి ప్రయత్నాన్ని ఆపగలిగింది. ఆ తూటాయే....
   
    విష గ్రంధుల నుంచి విషాన్ని పప్పుగలిగే. హాండిబయులారిన్  కన్ స్తికార్డ్స్  (దౌడ కండరాలు) చీలిన కోబ్రా దబ్ మంటూ నేలపడిపోయింది. మొదలు నరికిన తరుపులా .....
   
    గుండెలార్చే విరామం .......
   
    అంతదాకా సంచలనంతో రేగిన అరణ్యాంతర్భాగంలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.
       
    ఒకవేళఆ పడగ  తనపై బడినా ఆ బరువుకి చైతన్య ఎముకలు నుగ్గయిపోయేవి......
   
    పీలికలైన పడగ పగిలిన గాలిపటంలాఏ మూలో జారిలోగా ఇంకా రోషం చావని దాని శరీరం చీలిన భూమిలో నుంచి ఉవ్వెత్తున లేచే నీటి తరంగంల్లా ఉద్రేకంగా కదులుతూంది.
   
    కొన్నిక్షణాల క్రితం దాక్లా కుదిపెసిన అలజడి ఉద్విగ్నత పడి హేడు రోజుల నిస్రాణ కరిగిపోతూంటే శక్తిని కూడగట్టుకుంటూ పైకి లేపాడు ఒళ్ళంతా బురద.....
   
    కింగ్ కొబ్రాలో చలనం ఆగిపోయింది.
   
    నెలల తరబడి తన స్వైర్య విహారంతో ఎంచరి ప్రాణాలను బలిగౌని వేటాడాలని వచ్చిన ఎందరినో తనే వేటాడి ప్రభుత్వానికి, ప్రజలకీ తీరని సమస్యగా మారిన విషసర్పపు కధ  ముగిసిపోయింది.
   
    అప్పుడు చూశాడు చైతన్య దూరంగా స్పృహా తప్పి పడివున్న లూజాన్ ని.
   
                     *    *    *    *   
   
    థాంక్యూ మిస్టర్ చైతన్యా..... ఈ దేశ ప్రజలు మీకు చాల రుణాపడి వున్నారు ఆశ ఆధారణమైన ప్రజ్ఞాభవాలకి ప్రాణాలకు తెగింది మీరు చూపిన సాహాసానికి  నా ప్రజల తరుపున,పిలీఫ్సీ న్స్  ప్రభుత్వ తరపున నా హృదయపూర్వకమైనా అభినందనలు" ఆ దేశ నేత కోరిజన అక్వినో కృతఙ్ఞతలు తెలియజేస్తుంటే ఇబ్బందిగా కూర్చున్నాడు ఆమెకి అభిముకంగా.
   
    తెల్లవారుజామున ప్రేసిటెండ్ అక్వినో అతడ్ని కలుసుకోవలనుకుంటూ౦దని మెసేజ్ వచ్చినప్పుడు లాంచనప్రాయమైన కలయికగానే ఆలోచించాడు తప్ప యింత హడావుడిని వూహించలేకపోయాడు.
   
    అతడ్నిరీసీవ్  చేసుకోవడానికి విదేశాంగ మంత్రి అతడి సెక్రెటరీ ఫారెస్టు గెస్ట్ హౌస్ కి వస్తే ప్రెసిడెంట్ మౌస్ కు చేరగానే రక్షణశాకా మంత్రి  సాదారణంగా ఆహ్వానించారు....
   
    అందరూ బయట వెయిట్ చేస్తుంటే 'అక్వినో' తన ఛాంబర్ లో నలభై అయిదు నిముషాలుగా అతడితో మాట్లాడుతూంది......
   
    "మిస్టర్ చైతన్య ! ఈ దేశపు అధ్యక్షురాలిగా కాదు మీ కర్తవ్యదీక్షకి పులకించిన వ్యక్తిగా అడుగుతున్నాను. బహుమతిగా ఏం కావాలో కోరుకోండి...."
   
    నిజాయితీగా బాధ్యతని   నిర్విర్తించడంలో తప్ప అడ్మిషన్స్ సైతం ఆశించని  చైతన్య ఏం జవాబు చెప్పగలడు?
   
    "మాట వరసగా అనడంలో చైతన్య....నా ప్రభుత్వానికి ఇంత సహకరించిన మీరు మా గుర్తుగా ఒక జ్ఞాపకను మీతోపాటు తీసుకెళ్ళాలి"
   
    "మేడమ్  .... నేను మీ ప్రభుత్వానికి సహకరించానని  అనుకోవడం లేదు. ఇలాంటి సమస్య నా దేశంలో ఏర్పడినా  ఓక్ మనిషిగా నా చుట్టూ వున్న మనుషుల కోసం ఈ మాత్రం సాహసం వేసేవాడ్నేమో."
   
    నిర్లిప్తంగా నవ్వింది. ఒక సుదీర్ఘ పోరాటంతో ఆ స్థానాన్ని చేరిన బడలిక ఇంకా కొనసాగిస్తున్న కృషి ఆమె చెంపలపై ముడతల్లో స్పష్టంగా కనిపిస్తుంటే "యు సీ మిస్టర్ చైతన్య....ప్రభుత్వానికే అని నేను ప్రత్యేకించి ఎందుకు అనాల్సి వచ్చిందీ అంటే...." క్షణం ఆగింది సాలోచనగా. "1965 లో  జరిగిన ఎన్నికల్లో గెలిచినా ఫెర్డినాండ్ మార్కోస్ రెండు దశాబ్దాలుగా ఈ దేశంలో తిరుగులేని రాజకీయ నాయుకుడిగా వెలిగాడు. తన స్థానాన్ని సుస్థిరం  చేసుకోవాలని 1972 నుంచి ఎనభై ఒకటిదాకా మార్షల్ లా ఇంపోజ్ చేసి ఆ ఏడాదిలోనే మళ్ళీ ఎలక్టయ్యాడు. అతడికి అసలైన రాజకీయ ప్రత్యర్ధినా భర్త బెనిగ్నో అక్వినో.కాబట్టి అసాసి నెట్ చేయబడ్డాడు.అక్కడే నేను సైతం మార్కోస్ కి ప్రత్యర్ధిగామారింది కూడా... ప్రజల్ని కూడా అడ్డుకున్నాను. ఆడదానిగానే పోరాటాన్ని ప్రారంభించి 1986 లో గెలిచాను.
   
    అయినా ఫలితాలను తనకనుకూలంగా మార్చుకోవాలని మార్కోస్ విశ్వప్రయత్నం చేశాడు. ప్రజలు ఆర్మ్ డ్ ఫోర్స్ స్ చాలావరకు విదేశాలనీ, ముఖ్యంగా మా ప్రభుత్వం అండగా నా మీద సానుభూతి వర్షింపచేసి ఈ స్థానాన్ని పొందడానికి చాలా సహకరించారు అలాంటి నెను ఈ రోజు నిశ్చింతగా వుండలేకపోతున్నాను.".

 Previous Page Next Page