Previous Page Next Page 
అసురవేదం పేజి 7

   

   "బెట్టీ" ఇలాంటి ప్రపోజల్ ఆమె పెట్టడం అతనికి కొత్తకాదు. "నీకు తెలుసు నేను హనితకి మేనబావనని?'

    "అదే నా భయం కూడా" కాంక్షగా అతని కళ్ళలోకి చూస్తూ అంది. "ఎప్పటికన్నా నువ్వు హనితకి భర్తవవుతావనీ, ఆ తర్వాత నన్ను పట్టించుకావనీ భయంగా వుంది."

    "రిడిక్యూలస్!" నవ్వేశాడు శివరావు. "బెట్టీ నెంబర్ వన్. హానిత అభిమానవంతురాలయిన ఆడపిల్ల. నాకు తెలసి నన్ను భర్తగా కోరుకునే అవకాశం లేదు. నెంబర్ టూ నువ్వనుకుంటున్నట్ట్లుగా హఠాత్తుగా నాకలాంటి అవకాశం వచ్చినా ఆమె నాకు భార్యవుతుందేమో తప్ప నీకయినట్టు మొగుణ్ణి కాలేను."

    "యూ మీన్!" విస్మయంగా అరిచింది.

    "ఆస్తికోసం హనితని నేను అంగీకరించొచ్చు. ఆ తర్వాత ఆమెను బిజినెస్ లో కొనసాగానివ్వను భార్యగా యింటిపట్టున ఉండమంటాను ఆ షేర్స్ నీకే చెందేట్టు చేసి నీతో ఈ' బిజినెస్' ని ఇలాగే కొనసాగిస్తాను. హౌ దూ యు లైకిట్ ."

    "లవ్ లీ?"

    ఇప్పుడు ఎలిజిబెత్ శరీరం క్రమంగా కొలిమిగా మారుతూంది. "కాని ...."

    "ఏంటి అనుమానం?' ఆమెను ఆక్రమించుకోబోతూ అడిగాడు.-

    "ఈలోగా మన విషయం హనితకి తెలిస్తే .....?"

    "ఏమౌతుంది? నన్ను పెళ్ళి చేసుకొదు. అంతేగా?

    "నాకు ఉద్యాసన చెప్పావుగా?"

    "అలా ఎందుకానుకుంటున్నావు?"

    "ఈ రోజు ఆమె ప్రవర్తన చూసి అలా అనిపించింది శివా! హానిత సామన్యురాలిలా లేదు. ఆవులించకుండానే పేగులు లెక్కపెట్టగల సమర్దురాలిగా ఉంది."

    "ఫకాలున నవ్వాడు. "అప్పుడు నేనూ ప్రత్యర్ధినవుతాను. అంటే అప్పుడు బోర్డు మెంబర్స్ లో ఆమెకు సపోర్టుమావయ్య ఒక్కడే ఔతాడు. ప్రత్యర్ధులు మనిద్దరితో కలసి అర్ధం కాలేదు.

    "అవును బెట్టీ! ప్రభంజనం రావూ, సత్యానంద్ అప్పుడే హానిత మీద కారాలు, మిరియాలూ నూరేస్తూన్నారు. అంటే ప్రత్యర్ధులుగా మారుతున్నా రన్నమాట మనిద్దరం ఇటు కలిస్తే 4;2 అవుతుంది. అంటే బలం ఇటు పెరుగుతుంది. ఆ తర్వాత నేను ఎం.డి.ని అవుతాను. ఎలా ఉంది?"

    అప్పటికి అర్ధమయింది అతని విశ్లేషణ . వెంటనే ఒళ్ళు పెనంలా కాలిపోతుంటే చల్లారిపోవాలని ఇప్పుడు శివరవుని వెనక్కీ నెట్టింది మరో అరనిముశం గడిస్తే సన్నివేశం తారాస్థాయిని చేరుకునేదే.

    అంతలో ఫోన్ రింగయింది.

    ఊహించని ఆ అవా౦తరానికి కాస్త అసహనానికి గురైన ఎలిజిబెత్ రిస్వీవర్ని అందుకోబోతూ ఆగిపోయింది. ఇది తన యిల్లు కాదు __ ఒకవేళ అది అఫిషియల్ కాల అయితే ఈ వేళలో టానిక్కడెందుకుందని అనుమానం మొదలవుతుంది. అందుకే శివరావువైపు చూసింది.

    "డేమిట్!"  ఒక అద్భుత శ్రుంగారకాండ రాసాభాసమైనట్టు గొణుగుతూ రిసీవర్ని అందుకున్నాడు.

    "హు యీజిట్ !"

    "నేను బావా హనిత. యువర్ హనీ!"

    పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు అవతలివైపు హనిత కంఠం వినిపించగానే.

    "ఎస్ హానీ ఇంత రాత్రివేళ ....."

    "ఎందుకు ఫోన్ చేశానా అని అశ్చర్యపోతున్నావా? ఎలిజిబెత్ తో  పనిబడి అరుసార్లూ ట్రై చేసి నీ దగ్గరుందేమో అని ఫోన్ చేశాను."

    "నా దగ్గరా?" శివరావు గొంతు తడారిపోయింది. "ఎందుకుంటుంది.?'

    "వయసడిగిన ఘాటుప్రేమ కదూ దానిది? రాత్రి భోజనం కన్నా ముందు బెడ్ సుఖం లేకపోతే బతకలేదటగా? అందుకే మీ కార్యక్రమానికి మధ్యలో ఇలా ఇంటర్రష్షన్ కి సిద్దపడ్డాను."

    "హనీ ఆర్యూ మాడ్!" శివరావు గొంతులో కోపం ధ్వనించింది "నిన్నెవరో మిస్ లీడ్ చేశారు."

    "నో మిస్టర్ శివా! నిన్ను లీడ్ చేసే మిస్ గురించి కరెక్ట్ గా ఇన్ ఫర్మేషనిచ్చారు. కావాలంటే నీ ఇంటి కిటికీలోంచి సందు చివరవేపు చూడు. ఓ వ్యక్తి నిలబడి ఉమ్తదు. అదే ఆ మలుపుదగ్గర ఎలక్ట్రకల్ పొల ఉంది అక్కడ!"

    శివరావు ఆలస్యం చేయలేదు. రిసీవర్ ని బెడ్ పైన ఉంచి వేగంగా కుడిపక్క విండో దగ్గరకు నడిచాడు.

    నిజమే. దూరంగా పొల క్రింద ఓ వ్యక్తి నిలబడి సిగరెట కాలుస్తున్నాడు.

    ఏది కాకూడదు కదూ అని కొన్ని క్షణాలకృత ధైర్యం మాట్లాడాడో అది స్వల్ప వ్యవ్ద్జిలోనే నిరూపోతమైపోయింది.

    "హనీ?" శివరావు కంఠం ఉక్రోషంగా పలికింది. "నువ్వు చాలా దిగనిఫైడ్ గళ్ అనుకున్నాను. ఇంట దిగాజారేలా......"

    "తప్పదు మిస్టర్ శివరావ్! మీ అసలు రంగు తెలుసుకోవడానికి ఏమాత్రం విజిలెన్స్ తప్పనిసరైంది. వ్యంగ్యంగా పలికిమ్డా కంఠం "సో .... గెట్ రెడీనా? నీకూ, ఎలిజినేట్ కీ త్వరలోనే ఉద్యాసన జరుగుతుంది. నువ్వు సమర్దుదివీ, నైతికంగా పటానం కానివాదివీ అయితే నేను నీకు భార్యని కావాలనుకున్నను. నౌ యు మిస్ డిట్ సురేష్ ఈజ్ లక్కీ యు నో. ఈ రాతరికే సురేష్ తో నేను ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను."
     
      శివరావు రెండు నిముషాల్లో డ్రెస్ చేవ్సుకున్నాడు.

    సంబాషణలో కొంత భాగమే అర్ధమైంది ఎలిజిబెత్ కి. అదే బోలెడంత అందోళనలోకి నెట్టింది. ఇప్పుడేదో ప్రమాదం జరగబోతుంది అదీ ఆమెకు స్థూలంగా బోధపడిన విషయం!

    ఆమె అలోచనలనుంచి ఇంకా తెరుకోనేలేదు. అప్పటికే శివరావు బయటికెళ్ళిపోయాడు.

                                                          *    *    *    *   

    "వ్వాట్?"

    హనిత విస్మయంగా చూసింది హాల్లో కూర్చున్న ముగ్గురివేపు _ "నేను మీతో ఫోన్ లో మాట్లాడానా?'

    ఇంచుమించు అయిదు నిముషాల తేడాలో ప్రభంజనరావు, సత్యానంద్, శివరావులు హనిత దగ్గరకు వచ్చారు.

    "ఏం మాటాడా నంకుల్?" హనిత ప్రభంజనరావుకి అభిముఖాన కూర్చుందిప్పుడు. "ఓ నిజం చెప్పనా? డాడీని ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకువచ్చాక ఇప్పుడు పది నిముషాల క్రితం అయన నిద్రపోయేదాకా అసలు ఒక్క ఫోన్ కాల్ చేయలేదు నేను. అంతా చిత్రంగా వుంది."

    హనిత మృదుమధురమయిన నవ్వులో అదే గాంభీరత్యం , అదే లాలిత్యం.

    "పైగా ముగ్గురూ ఒకసారి ఫోన్ చేశానంటూ రావడం ఇంకా విచిత్రంగా వుంది."

    ఆమె మాటలు వింటూంటే సత్యానంద్ కి చాయా ప్రశాంతంగా వుంది, తన సీటుకె మోప్పూ రాదనీ తెలిసిపోవడంతో.

    ఎలిజిబెత్ తో తనకున్న అక్రమ సంబంధం హనితకు తెలీదన్న ఆలోచన రాగానే శివరావు మనసు టెలికపడింది.

    కాకపోతే ప్రభంజనరావు చాలా దిగులు పడిపోయాడు. సురేష్ విషయంలో ఇందాక విన్న వాక్యాలు అతన్ని చాలా ఉత్సాహపరిచాయి. అప్పటికీ లోలోన అనుకుంటూనే ఉన్నాడు. ఇలా ఫోన్ చేయడం హనిత స్వభావం కాదని. అదిప్పుడు నిజమై సురేష్ పైన ఆమెకున్న ప్రేమ అబద్దమైపోయింది.

    "ఇంతదాకా వచ్చాక ఒక నిజం చెప్పడం నా ధర్మంకూడా" అంటూ లోపలి వెళ్ళిన హానిత రెండు నిముషాల్లో వెనక్కీ వచ్చి సాయంకాలం కారులో దొరికిన ఉత్తరాన్ని వాళ్ళ చేతి కందించి౦ది.

    "ఈరోజు నేను ఓ నిర్ణయం తీసుకోవడం, దానికి అడులుగా ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ లెటర్ ఉంచడం నాకూ అనుమానస్పదమైనా విషయంగా తోచినా తేలిగ్గా తీసిపారేశాను. కనీసం డాడీకి చూపించలేదు.

    "పోలీసులకి కంప్లయింట్ ఇవ్వాల్సింది " శివరావు అన్నాడు.

    "లేదు బావా!" అయిష్టంగా తల పకించింది. "పోలీసులకి తెలియసంభందించిన వ్యవహారాలు అంతవరకూ వెళ్ళడం నాకు యిష్టంలేదు. సో ..... నాకు నేనుగా ఓ నిర్ణయ తీసుకున్నాను."

    ముగ్గురూ ఒకేసారి చూశారు నిశ్చేష్ట౦గా .

    "మిస్టర్ చతుర్వేది ప్రస్తుతం మన ప్యాక్టరీ విజిలెన్స్ సెల్ ఇన్ చార్జి అయినా ఒకప్పుడు ప్రైవైట్ డిటెక్ట్ వ్ గా బాగా అబుభావం వున్న వ్యక్తి! కాబట్టి ఆయనకి ఈ విషయం అప్పజెప్పాలనుకుంతున్నాను."

    "అతనేం చేయగలదు?" సత్యానంద్ అడిగాడు.

    "ఏం చేయలేడు . కాని చాలా తెలుసుకుంటాడు. అసలు రణధీర్ తో లాలూఛీపడిన వ్యక్తులెవరో, అతని చర్య వెనుక ఎలాంటి ప్రముఖలున్నారో గుర్తిస్తాడు" ఓ క్షణం సాలోచనగా చూసింది అందరివైపూ .

    "నా అంచనా తప్పు కాకపోతే ఈరోజు హానితగా ఫోన్స్ రావటం దీర్ ద్వారా చాలా విషయాలు బయటికిలాగి ఇంకా ఓ నాటకమే. రేపే రణధీర్ ద్వారా చాలా విషయాలు బయటికి లాగి ఇంకా మిగిలిన అజ్ఞాత శత్రువుల్ని ఏరిపారేయడం తో బాటు, ఇప్పుడు జరిగిననాటకానికి ముఖ్యపాత్రధారిని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది వెల్!" ఆమె లేచింది చర్చను త్రుంచేస్తూ.

    అక్కడున్న వాళ్ళలో ఒక వ్యక్తి నిశ్సబ్దంగా అనుకుంటున్నాడు __ ఇప్పుడు హానితకన్నా ప్రమాదకరమైన వ్యక్తి రణధీర్ అని.

                                                                    *    *    *    *   

    రాత్రి పదిన్నర కావస్తోంది.

    వాల్తేరు కి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలోని గోపాలపట్నంలో రోడ్డ్లు నిర్మాన్యుష్యంగా ఉన్నాయి.

    వెలుగుని గర్భంలో దాచుకున్న చీకటి నెత్తుటిలో దోగాడుతున్న చరిత్ర శిశువులా వుంది. కోడిగట్టిన ప్రాణదీపంలా వెన్నెల వెలవెల బోతోంది. ఆకాశంలోని నక్షత్రాలు విరహొత్కంఠితలా నిట్టూర్పుల గుండె బరువుతో నీరసించిపోయాయి. నాలుగు రోడ్ల కూడలిలో ఓ క్షణం కారు ఆపిన సురేష్ ఫిన్ లో విన్న సూచనలన్నీ ఓ మారు మననం చేసుకుని సింహచలనం మార్గంకేసి చూస్తూ నెమ్మదిగా మూడో భవంతి పోర్టికోలోకి పోనిచ్చాడు.

    అంతా నిశబ్దం ....

    కారు బయటకు వచ్చిన సురేష్ కొద్దిగా తూలబోయాడు. అప్పటికే బాగా తాగి ఉన్నట్లుగా, శరీరం కోర్కెల దాహంతో ఉడికేత్తుకు పోతూంది. పోర్టికో చీకటిలోంచి నడుస్తూ ద్వారాన్ని చేరుకొని ఓ అరక్షణంపాటు స్తబ్దుగా నిలబడ్డాడు.

    కాలింగ్ బెల్ తో అవసరం లేదు సురేష్ ద్వారం నెట్టుకుని సరాసరి లోపలి వచ్చేయమంది హనిత.

    ద్వారాన్ని దాటి హాల్లోకి వచ్చాడు. అలికిడి లేదు.  కుడివేపున వున్న గదికేసి చూశాడు అదే .... తన మగసిరిని నిరూపించాల్సిన బెడ్ రూమ్. యిక జాప్యం చేయలేదు. దూకుడుగా లోపలి అడుగు పెట్టిన సురేష్ వెనుక ద్వారం మూసుకుపోవటాన్ని గమనించలేదు.

    "హనీ!" నెమ్మదిగా పిలిచాడు.

    మరుక్షణం ఓ లాఠీ అతని నెత్తిమీద పడింది.

    ఏం జరుగుతున్నదీ తెలుసుకునే లోగానే మరో దెబ్బ!

    సన్నని మూలుగుతో చేతులడ్డం పెట్టాడు.

    బాస్టర్డ్ !" ఓ పోలీసాఫీసర్ సురేష్ మెడ పట్టుకుని ముందుకు తోశాడు.

    నిస్రాణగా నేలపై బోర్లా పడిన సురేష్ కి తెలీదు _ అది ఓ మినిష్టర్ గారి బావమరిది ఇల్లని! ఇదంతా ఏమిటో బోధపడని సురేష్ శరీరం లాఠీలతో తూట్లుపడింది స్పృహా తప్పిపోయిన సురేష్ ని మరో పదినిముషాలలో బయటకీడ్చి రోడ్డువారగా పారేశారు.

    సరిగ్గా ఇదే సమయంలో ప్రభంజనరావు ఇంట్లో ఫోన్ రింగయింది.

    "హాలో!" రిసీవర్ అందుకున్నాడు ప్రభంజనరావు.

    హానిత ఫోన్ చేసి ఉండకపోతే ఇందాక ఎవరితోనో మాట్లాడిన ఒక్కగా నొక్క బిడ్డ ఏ ఆపదలో చిక్కుకున్నాడో అని చాల సేపటి నుంచి హడావుడిగా ఎదురు చూస్తున్నాడు.

    "ఎవరూ?"

    "నేనే.... హనితని!"

    "షటప్ ! నీ గొంతు హనితదికాదని తెలుసుకోగలను."

    "గుడ్! ఇప్పటికి మేధావినిపించుకున్నావు ...." అవహేళనంగా నవ్వు వినిపించింది "పాపం!" మీ అబ్బాయి కూడా యిందాక నేను హానితలా పిలిచినందుకు ఎంత పులకించిపోయాడని?"

    "అసలు ఎవర్నువ్వు?" ప్రభంజనరావు గొంతు కర్కశంగా పలికింది. "ఎవరితో మాట్లాడుటున్నావో తెలుసా?"

    "తెలియకేం?  సాకేత అండ్ కంపెనీ డైరెక్టర్ తో? అవునా?" అపహాస్యం ధ్వనించిందామె కంఠంలో. "వెల్ .... అసలు పాయింటికి వద్దాం. నా కోపం నీమీద కాదు మీ అందరిమీదా, మీ సామ్రాజ్యం మొత్తం మీద."

    "ఏం?" ఎందుకని?"

    "నేను ఒక మోసపోయిన ఆడదానికి పాతికేళ్ళ క్రితం పుట్టిన ఆడపిల్లను కాబట్టి. దానికి బదులుగా ఇప్పుడు మీ సామ్రాజ్యాన్ని కూల్చడం నా ధ్యేయం కాబట్టి."

 Previous Page Next Page