Previous Page Next Page 
అసురవేదం పేజి 8

  

   ముందు ఆమె చెబుతున్నదేమిటో అర్ధం కాలేదు. "అసలు .... నీ తల్లి మోసపోవడానికి మా సంస్థని కూల్చడానికి సంబంధంమేమిటి?"

    "ఉంది ప్రభంజనరావ్! చాల ఉంది," ఒక బాధాకరమైన నిట్టూర్పు విడిచింది. "దీనికి మూలం పాతికేళ్ళ నాటి కథ. ఒక వ్యక్తి అనుభవానికి బలైన నాతల్లి నాకు వారసత్వంగా ఇచ్చింది రెండున్నర దశాబ్దాల విషాదం. ఇప్పుడు డానికి బదులు తీర్చుకుంటున్నాను! ఎందుకో తెలుసా? నా తల్లి జీవితం మీ సంస్థ పెరగడానికి ముందు పెట్టుబడి అయింది కాబట్టి."

    "అంటే!" ఓ నిగూఢమయిన విషమెదో వినబావుతున్నట్టు. ప్రభంజనరావు పిడికిళ్ళు బిగిసుకున్నాయి.

    "మా అమ్మను మోసం చేసింది ....."

    "ఎవరు?"

    "సుదర్శనరావు."

    పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు ఆమె చెబుతున్నది హానిత తండ్రి ఎం.డి. సుదర్శనరావు గురించి. ఇప్పుడతని మెదడు చాలా వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది.

    "అసలు మీ అమ్మని సుదర్శనరావు గారు మోసం చేసినట్టు ఆధారం ఏమిటి?"

    "నేనే?'

    వ్యంగ్యంగా నవ్వాడు.

    "నవ్వకు ప్రభంజనరావ్ ....! నన్ను చూస్తె తప్పకుండా అంగీకరిస్తావ్?"

    "ఏం? నీ మోహం పైన అయన పేరు రాసి ఉందా?"

    "హానిత ,అఒహం మీద అయన పేరుందా?" ఓ క్షణం ఆగింది. "లేదు కదూ? లేకపోయినా హనిత సుదర్శరావు కూతురు అయినప్పుడు మూమూర్తులా హనిత పోలిక ఉన్న నేనూ సుదర్శనరావుగారి కూతుర్నే అవుతాను."

    "వ్వాట్!"
   
    "ఎస్ . నేనూ హనితా కావాలా పిల్లల్లా ఉంటాం!"

    "ఎప్పుడు కలుసుకుందాం?" అయన బుర్రలో అప్పుడే ఓ పథకం రూపుద్ధికుంటూ౦ది. "నిన్ను నేను చూడాలి."

    "అవసరం వచ్చినప్పుడు నేనే కలిస్తాను. నీకు మాత్రమే. ఒకే? ఈలోగా పాపం నే ఎకోడుకును రక్షించుకో?"చెప్పింది జరిగినదంతా. అది ఓ మామూలు విషయంగా అనిపించడంతో పట్టించుకోలేదు.

    "సరే చూడు .... నీ పేరేమిటన్నావు?'

    "మీ సంస్థ పేరేమిటి?"

    "సాకేత అండ్ కో?"

    "ఐరనీ చూశావా ...." ఉద్వేగంగా అందామె. "నేను పుట్టగానే నన్నూ, అమ్మనూ కాదన్నాడు . నా పేరే తన సంస్థకి పెట్టాడు."

    "అంటే నీ పేరు ....?"

    "సాకేత !"

    "మిస్ సాకేతా?" ప్రభంజనరావు ఓ క్షణం నిశ్శబ్దం తర్వాత అడిగాడు. "ఇన్నేళ్ళు నిశ్సబ్దంగా ఊరుకున్నా నువ్వు ఈ రోజు హఠాత్తుగా రంగంలోకి ఎందుకొచ్చావ్?"

    "తెలివైన ప్రశ్న వేశావ్ మిస్టర్ ప్రభంజనరావ్! ఇన్నాల్లు ఈ రహస్యం చెప్పని అమ్మ ఈ రోజే నోరు మేదిపింది. నిజం చెప్పింది. ఎందుకో తెలుసా?"

    "చెప్పు."

    "ఇన్నాళ్ళూ సుదర్శనరావు మోసాన్ని నిస్సహాయంగా నయినా సహించింది. కాని ఈ రోజు నాకు జరిగిన అన్యాయానికి కలత చెందింది. కసితో కథంతా వివరించింది."

    "నీకు అన్యాయం జరిగిందా ....?" ప్రభంజనరావు భ్రుకుటి ముడిపడింది.

    "అవును ప్రభంజనరావ్! రేపోమాపో పెళ్ళయి సెటిల్ కావాల్సిన నా దారికి హనిత అడ్డం పడింది."

    "ఎలా?" ఉద్విగ్నంగా అడిగాడు.

    "నాకు భర్త కావాల్సిన మంసిహి బతుకు నాశనం చేసి."

    "వ్వాట్?" ప్రభంజనరావు గొంతులో అనూహ్యమయిన నిశ్శేష్టత. "ఎవరా మనిషి?"

    "రణధీర్!"

    "ఓ మిస్సైల్స్ అతని మెదడు పొరల్లోంచి దూసుకుపోయింది.

    మరేదో అడగబోయాడు. కాని అప్పటికే ఫోన్ క్రేడిల్ చేసిన చప్పుడు.

    ప్రభంజనరావు ఇప్పుడు తోడేలులా నవ్వుకుంటున్నాడు.

                                       *    *    *    *   

    "డాడీ!"

    సరిగ్గా అ సమయంలో లోపలి దూసుకొచ్చాడు సురేష్ ఒంటినిండా గాయాలతో.

    "అదో బిచ్ .... రమ్మన్నట్టు రమ్మని ఆ మంత్రేవడోవాడి బామ్మర్ది కూతురితో లాలూచీ పడింది. నే నేదో అఘాయిత్యం చేయడానికి ఇంట్లో జొరబడినట్టు నిరూపించి ఇలా ...." ముందే సిద్దమైన ఓ పథకంలో హనిత తన నేలా ఇరికించిందీ చెప్పుకుపోతుంటే పెద్దగా రియాక్ట్ కాలేదు ప్రభంజనరావు.

    "నిన్ను పిలిచింది హనిత కాదు" చెప్పాడు సాకేత గురించి వివరంగా ... ఆ విషయం చెబుతూ చాలా థ్రిల్ ఫీలయ్యాడు. సాకేతని చూడకపోయినా ఆమె హనితలాగే వుంటుందన్న ఆలోచన అతని కెంత హాయి నందిస్తూందీ అంటే కొడుకు గాయాల్ని పట్టించుకోవడం లేదు ......

    హనిత ఓ అర్ధంకాని నిశ్శబ్దమరి ....

    సాకేత ఆశనిపాతపై ఉక్కిరిబిక్కిరి చేసే ఓ జలపాతం.

    అదే ఆమె మాటల్లోని వాడినీ, గొంతులో వేడినీ బట్టి అయన అర్ధం చేసుకున్న విషయం ....

    సాఫీగా సాగిపోతున్న బ్రతుకు నాటకంలో హనిత రంగప్రవేశం అనూహ్యమయిన అందోళన కలిగిస్తే, హఠాత్తుగా ఓ పాత్రగా అడుగు పెట్టిన సాకేత అసాధారమయిన ఊరటను కలిగిస్తోంది.           

    అసాధ్యమయిన త్వరలో సాకేతను కలుసుకోవాలి. తామంతా శత్రువులమే అనుకుంటున్న ఆమెకు అందరికన్నా తనే ఓ మంచి మిత్రుడుని హామీ ఇచ్చి తన పీఠాధిపత్యానికి ఓ అంకురం వేయాలి.

    "సురేష్" చీకటిలోకి చూస్తూనే తన ఆలోచనల్ని క్రోడీకరిస్తూ అన్నాడు ప్రభంజనరావు. "నిన్నటి దాకా నిజం వెంటబడి ఓడిన నువ్వు ఇప్పుడు నీదని అనుసరించాబోతున్నావు. అక్కడ గెలిచి ఇప్పుడా నీడ లాగే ఉన్న సాకేతని నిజం స్థానంలో నిలబెట్టబోతున్నావు."   

    ముందు ఉలిక్కిపడి "కానీ  డాడీ ...." అన్న సురేష్ ను చేత్తో వారించిన ప్రభంజనరావు, ఇప్పుడు భావగర్భితంగా  కొడుకు కళ్ళలోకి  చూస్తున్నాడు

    "ఆ స్థానంలో హనితే కొనసాగితే మేమెవరం కూడా మా స్థానంలో కొనసాగుతున్నది మా అందరి అందోళనా. అందుకే ఇప్పుడు సాకేతనైనా నిన్ను సాదించమంటున్నది."

    "కానీ ఆమె రణధీర్ ని పెళ్ళి చేసుకోబోతు౦ది ...." తండ్రి చెప్పిన విషయాన్నే తిరిగి గుర్తుచేశాడు.

    "అతను బ్రతికుంటేగా?"

    "అంటే?" సురేష్ కొద్దిగా కంపించాడు.

    "ఈ ప్రపంచంలో చాలా అద్భురాలు కాకతాళీయంగా జరిగిపోతాయనడానికి నిదర్శనం యిప్పుడు సాకేత మనకి పరిచయం కావడమే. రేపు రణధీర్ నన్ను కలుసుకుంటాడు. అంటే అలాంటి ఏర్పాటు చేస్తానన్నమాట. అతని ద్వారా సాకేత గురించిన పూర్తీ వివరాలు సేకరిస్తాను. ఆమెని అడ్డం పెట్టుకునే ఎం.డి. సుదర్శనరావుని బ్లాక్ మెయిల్ చేసి తిరిగి వుద్యోగం సంపాదించుకుని రెచ్చగోడతాను" ఓ క్షణం ఆగాడు. "ప్రయత్నం మొదలయిన ఇరవై నాలుగు గంటల్లోగా రణధీర్ హతుడవుతాడు. సాకేత పైన కూడా హత్యా ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు నువ్వు సాకేతని రక్షించి ఆమెతో బాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతావు. అంటే సాకేతకి ఊరట నందించగలిగితే ఒకే ఒక్క మగాడిపై పోతావు. ఈలోగా నేను ఎం. డి తో నెగోషియేట్ చేస్తాను. సాకేత పత్రికలదాకా వెళ్ళకముందే కూతురుగా ఆమెను అంగీకరించమంటాను. ఆ విధంగా రణధీర్ హత్య విషయంలోనూ అపార్ధం తొలగిపోయేఅవకాశ ముంటుందని నచ్చచెబుతాను. అప్పుడు సాకేతా, సాకేతతో బాటు నువ్వూ కోటలో పాగా వేస్తారు."

    అవాక్కయి వింటున్నాడు. సురేష్. తండ్రి మేధకి చాలా పులకించి పోయాడు.

    సరిగ్గా ఇదే సమయంలో .....

    హొటల్ అప్సర, రూం నెంబర్ 302 లోకి ఆకారం అడుగు పెట్టింది.

    అప్పటికే బాగా తాగి ఉన్న రణధీర్ ఈ విషయాన్ని గమనించలేదు. గది బాల్కనీలో నిలబడి బయట చీకటిలోకి దృష్టి సారిస్తూ ఆలోచిస్తున్నాడు. ఇంతకాలం చాలా అక్రమాల్ని నిరాఘాటంగా కొనసాగించాడు. ఒంటరిగా కాదు. సంస్థకి మూల స్తంభాల్లో ఒకడైన ప్రముఖుడితో చేతులు కలిపి. నిజానికి తను సంపదిచ్మ్హిన దాంట్లో తన వాటా చాలా స్వల్పం. అయినా ఈ రోజు తను మాత్రమే తప్పించుకున్నాడు. సుమారు పదిసంవత్సరాలుగా ప్యాక్టరీ కి అధిపతిగా వున్న తనను చాలా సునాయాసంగా బయటకి విసిరేసింది హనిత.

    అప్పుడు ఆమె పైన అనూహ్యమైన ఆవేశం, క్రోధం పెల్లుబికినా ఇప్పుడు అలాంటిదెం  లేదు .... రేపే ... తెల్లవారగానే ఆమెకు వాస్తవాన్ని తెలియచేయాలి. తన నిర్వాకంలో ఎవరేరేవరికి భాగస్వామ్యం వుందో చెప్పికొంత సానుభూతినయినా దక్కించుకోవాలి .....

    లోపలి అడుగుపెట్టిన ఆకారం నిశ్సబ్దంగా కొన్ని కాగితాల్ని బెడ్ పైన జారవిడిచింది . అవి ముందు రోజు హనితని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె కారులో వుంచిన వుత్తరాల్లాంటివి

    రణధీర్ వెనక్కీ తిరగబోయాడు ఏదో చప్పుడు కావడంతో. కానీ అప్పటికే ఆలస్యమైంది.

 Previous Page Next Page