Previous Page Next Page 
అసురవేదం పేజి 6

  

  "హనీ! ఇక చర్చ అనవసరం ... చెప్పు ...."

    "నీ పక్కన ఎవరన్నా ఉన్నారా?"

    "దూరంగా ఉన్నారు డాడీ వాళ్ళు."

    "వెల్!" చెప్పింది ఎక్కడకు రావాల్సిందీ. "నువ్వు వెంటనే బయలుదేరిరా. ఒక్కమాట _ ఫోన్ మీ డాడీ కివ్వు."

    రిసీవర్ టేబుల్ మీద పెట్టేసి తండ్రివైపు ఓ మారు చూశాడు అది మీకే అన్నట్టుగా .

    ప్రభంజనరావు, రమాదేవి ఇంకా తేరుకోలేదు. సురేష్ అప్పటికే హడావుడిగా వెళ్ళిపోయాడు.

    అప్పటిదాకా తానెక్కడ లేనట్టు కొద్దిగా జాప్యం చేసిన ప్రభంజన రావుయ్ ఫోన్ అందుకున్నాడు నెమ్మదిగా . 'హాల్లో....."

    "బాగున్నావా, అంకుల్! హనితని?"

    "హాల్లో బేబీ!" గొంతులో వీలైనంత ఆనందాన్ని ధ్వనింపజేస్తూ అన్నాడు. "డాడీ వచ్చేశారా?"

    "వచ్చి గంటయింది."

    "ఒంట్లో ఎలా ఉంది?"

    "నీరసంగా ఉందని పడుకున్నారు. పది నిముశాలింది." "ఓ క్షణం నిశ్శబ్దం తర్వాత అడిగింది. "సురేష్ బయలుదేరాడా?"

    "బయలుదేరాడు ." టక్కున అనేసి "ఎక్కడికో ?" అనడగబోతూ అగోపోయాడు. సురేష్ హానితతో మాట్లాడిన తీరుని అంతదాకా పరిశీలించిన ప్రభంజనరావు. సమస్యేదో చాలా వేగంగా వారం రోజుల్లో కాక గంటలోనే పరిష్కారమైపోతున్నట్లు గ్రహించేయడంతో ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నాడు.

    "అంకుల్!"

    "చెప్పు బేబీ"

    "ఇవాళ బోర్డు మీటింగు లో మీరు నన్ను హార్ట్ చేశారు."

    ప్రభంజనరావు కట్రాడలా అయిపోయాడు హఠాత్తుగా ఆ ప్రసక్తి రావడంతో.

    "అందుకే నేను నీతో పోట్లాడదలుచుకున్నాను."

    "ఓస్ .... అంతేగా? పోట్లాడేయ్ !" హనిత ఇలా జోనియల్ గా మాట్లాడగలదని ప్రభంజనరావుకి అంతకాలమూ తెలీదు.

    "వెల్ .... మీతో పోట్లాడానే అనుకో. నాకు జరిగేదేదో చెబుటారా?" ఠకాలున నవ్వు వినిపించి౦ది. "మిస్టర్ ఓల్డ్ మెన్! సమస్యని ఏ మూలనుంచి తాకిల్ చేయాలో నాకు బాగా తెలుసు."

    ప్రభంజనరావు పిడికిలి బిగుసుకుంది.

    "న సంష్టకి మీరంతా పేరసైట్స్ అన్నది నాకు తెలసిపోయింది. అందుకే ఒక్కో కుమ్మరి పురుగునీ ఏరేసే ప్రయత్నం యింత వేగంగా ప్రారంభించింది."

    ఆమె కంఠం ఇప్పుడు కర్కశంగా వుంది. "మీ చరిత్రలన్నీ సేకరిస్తున్నాను. సాధ్యమైనంత త్వరగా మీ రంగులు బయటపేట్టి కూలిపోవడానికి సిద్దంగా వున్న ఈ భవంతిని 'రినసేట్' చేయబోతున్నాను. ఆ తర్వాత మీ వృద్ధులు అక్కర్లేదు. మా యువతరం ఈ రాజ్యాన్ని శాసిస్తుంది."

    ప్రభంజనరావు రోషంతో కంపించిపోతూన్నాడు.

    "మరోసారి స్పష్టంగా విను మిస్టర్ ప్రభంజనరావు! మీ తరంతో నాకు పనిలేదు. మా సంస్థలో కొత్త రకం ప్రవేశిస్తుంది. ఇక్కడ నువ్వు చేసుకున్న అదృష్టం నీకు వయస్సులో వున్న ఓ కొడుకుండటము. అతన్ని నేను యిష్టపడడం నా అట ప్రారంభిస్తున్నది సురేష్ తో. మరేం లేదు. చిన్న పరీక్ష పెట్టాను.అందులో గెలిచాడా నా సర్వస్వం  అతని సొత్తుగా మారుస్తాను. లేదా నీలాగే బహిష్కరిస్తాను.

    "ఫోను క్రేడిల్ చేసిన చప్పుడు.

    అప్పటికే పూర్తిగా చెమటతో తడిసిపోయిన భర్తని చేరుకున్న రమాదేవి __ "ఏమైంది? ఏమంటున్నది?" అడిగింది ఉద్విగ్నంగా.

    చెప్పలేదు ప్రభంజనరావు. ఆవేశంతో కదం తోక్కేవాడేకాని చివరగా ఆమె అన్న వాక్యం కాస్త ఉపశమనంగా వుంది. సురేష్ ని హనిత యిష్టపడుతూంది. అది అంతకాలమూ తను కేవరికీ తెలీని విషయము . ఎప్పటికైనా తనకు వారసుడు సురేష్ . పరీక్ష ఏమన్నాగాని వాడ్ని తను కోరుకూంటూ౦ది. అది చాలు తను తక్కిన కథ నడిపించడానికి.

    ప్రభంజనరావిప్పుడు రోషంగా చూడడంలేదు. ఒక అతి ముఖ్యమైన ప్రశ్నకు జవాబు దొరికినట్టు మృదువుగా నవ్వుతున్నాడు. ఆ నవ్వులో కర్కశత్వం లేదు. బలవంతుడనుకున్న ప్రత్యుఅర్ది ఒక పక్క తన బలంచూపిస్తూనే సంధికోసం బేరం పెడితే కలిగే విజయగర్వం.

    సరిగ్గా అదే సమయంలో ఆ హాల్లోకి వచ్చాడు. సత్యానంద్ _ మరో బోర్డు మెంబరు.

    "ప్రభంజరావు! ఏమిటిది?" రొప్పుతున్నట్ట్లుగా అడిగాడు "అక్కడికి రణధీర్ మీద నాకేదో సానుభూతి ఉన్నట్టు హనిత నన్ను దుయ్యబడుతూందెం?"

    బోధపడిపోయింది హనిత సత్యానంద్ కి ఇలాగే ఫోను చేసి౦దని.

    "నేను బోర్డు మీటింగ్ లో నిశ్సబ్దంగా వున్నానట. అంటే రణధీర్ నిర్వాకంలో నాకూ భాగస్వమ్యమయముందట!"

    "ఇంకా ఏమంది?" తననేమన్నదీ చెప్పకుండానే వివరాలు తెలుసు కోవాలనుకుంటున్నాడు హలోచనగా చూస్తూ.

    "మన తరం అయిపోయిందట. ఇక రాబోయేది యువతరమట."

    "ఇంకా ఏముంది?'

    "నాకేదో ఘోరమయిన చరిత్రంటూ వుంటే అది కాస్తా బయట పెడుతుందట. సాధ్యమయినంత త్వరలో నా పొజిషన్ కి తిలోదకాలు తీసుకోస్తుందట."

    "చిన్నపిల్ల" సానుభూతిని ప్రభంజనరావు.

    ఇప్పుడింత హడావుడి పడుతున్న సత్యానంద్ సిటీలో వున్న ఓ స్టార్ హొటలు యజమాని కూడా. ఇద్దరూ కూతుళ్ళు తప్ప హనితకి ఈడయ్యే ఒక్క కొడుకూ సత్యానంద్ కి లేకపోవడం ప్రభంజనరావుకి చాలా సంతృప్తినిస్తుంది.

    "అయినా అమ్మాయిది ఉడుకురక్తం ఇదంతా ఎందుకు పట్టించుకుంటున్నావావు అర్ధం కావడం లేదు."

    "ప్రభంజనరావు?" సత్యానంద్  కంఠం రోషంగా పలికింది. "హనిత ఎప్పటికన్నా నీ కోడ్లయ్యేదే కాబట్టి సమర్ధిస్తున్నావనుకుంటాను."

    "అబ్బే" ఈ అభియోగం కూడా ఆహ్లాదకరంగా అనిపించిన ప్రభ౦జనరావు __ "అదేం లేదు. హనిత రేపు నాక్కబోయే కోడలే కావచ్చు. అలా అని నిన్ను నేను వదులుకుంటానా. నేను నచ్చచేబుతాగా" హామీ ఇచ్చి నట్లుగా అన్నాడు.

    అంతవరకూ హనిత తన కోడలయిపోయినట్లే భ్రాంతిలో సంతోషపడుతున్న ప్రభంజనరావు అప్పుడు హఠాత్తుగా గుర్తుకొచ్చాడు హనితకి ఈడు మాత్రమె కాదు, మేనబావ కూడ అయిన శివరావు.

                                            *    *    *    *

    "శివ  శివా !" లయబద్దకంగా మూలుగుతూంది ఎలిజిబెత్. మంద్రంగా వెలుగుతున్న బెడ్ లైట్ కాంతిలో అధునాతనంగా అలంకరించిన ఆ గదిలో వేడి నిట్టూర్పులు నేపథ్యంగా వినిపిస్తున్న 'బీటిల్స్' సంగీతంలో కలసి చిత్రమయిన వాతావరణాన్ని సృష్టింస్తున్నాయి.

    మెత్తగా కింద నలిగిపోతూనే శివరావు చెంపల్ని ముద్దులతో ముంచేస్తూంది.

    "ఇన్ క్రేడిబుల్!" గుసగుసగా వినిపిస్తూంది .... ఆమె ఊపిరి చెవిలో సుడులు తిరుగుతూంటే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న నేషనల్ చాంఫియన్ లా కదిలిన శివరావు అయిదు నిముషాల తర్వాత లేచి కిటికీ దగ్గరగా నడిచాడు.

    బయట గార్డెన్ లో వేలుగుతున్న లైట్ల వెలుతురూ తెరచి వున్న కిటికీలోంచి అతని గుండెపై పది పరివర్తనం చెందుతూంది.

    ఫ్రిజ్ తెరచి ఓ బీరు టిన్ తీసుకుని సగం తాగి మంచంవైపు చూశాడు.

    మసక వెలుతురులో వెల్లకిలా పడుకుని ఉన్న ఎలిజిబెత్ శిధిలమైన ఖజురహో శిల్పంలా వుంది. ఆమె పెదవులు ఏ స్వచ్చ లోకంలోనో విహరిస్తున్నట్లు సన్నగా వణుకుతున్నాయి.

    "శివా మైస్వీట్....." ఆమె నేత్రాలు అరమావుద్పులవుతుమ్తే నెమ్మదిగా అంది. "చచ్చిపోవానుకుంది ఇలాగే"

    "ఇలాగేపోతే ... నేను లోపలి పోతాను."

    "ఏం?" విస్పారిత నయనాలతో చూస్తూ నవ్వింది నీరసంగా.

    "పోరేన్సిక్ ఎక్స్ ఫర్ట్స్ నువ్వు ఇలా చావటానికి నేను కారణమని సులభంగా కనిపెట్టేయగలరు కాబట్టి." శివరావు గొంతులో విజయగర్వం.

    తనకంటే అయిదేళ్ళు పెద్దదైన ఎలిజిబెత్ నిలా సాధించడంలో అపారమైన ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. ప్రతీ రాత్రి తొలిసారిలా అనిపిస్తూంది. ప్రతి కలయికా ఆమెను దారుణంగా ఉద్రేక పరుస్తూంది.

    "బెట్టీ" సమీపంలో కూచున్నాడు.

    జవాబుగా అతన్ని దగ్గరికి లాక్కుంది.

    "ఎన్నాళ్ళిలా?" మత్తుగా అడిగింది.

    "నువ్వు సరేనన్నాళ్ళు."

    "ఎల్లకాలం 'డివిడెండే' నా?'

    "మరేం కావాలి?"

    "మొత్తం షేర్స్!" అతనితో శాశ్వతమైన బంధం కావాలన్న భావం ధ్వనింపచేస్తూ అంది. "ఎస్ శివా! నేను వచ్చిన ప్రతి ఆఫర్ నీ కాదన్నది నీకోసం."

    ఒక పెద్ద జ్యూవలరీ శాఫ్ కి అధికారినీ అయిన ఎలిజిబెత్ ఒక నాడు భక్తితో దుబాయ్ లో వుండేది. నాలుగేళ్ళక్రితం అతను చనిపోయాక సంపాదించిన డబ్బుతో శివరావు ద్వారా బోర్డు డైరెక్టరు కావడమే కాకుండా ఇప్పుడు శివరావుకి భార్య కావాలనుకొంటూంది.

 Previous Page Next Page