Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 2

    పొత్తిళ్ళలోని పాపని బల్లపై పడుకోబెట్టాడతను. ఊయల్లోలలగా రైలు కుదుపులుకి నిద్రపోతోంది పాప! ప్రశాంతంగా, నెమ్మదిగా పడుకుంది.
    అతను లేచి నంచుకున్నాడు. ముఖంలో ఏ భావమూ ప్రకటించకుండా "ఇక్కడ దిగిపోతాను నేను!" అన్నాడు.
    "మరేం ఫరవాలేదు. కూర్చోండి నాకేం అభ్యంతరం లేదు. అంతగా మేరేవరయినా వచ్చి అభ్యంతరం చెబితే వెళ్ళి పోదురుగాని!" అంది సుజాత చదువుకుని, ఉద్యోగం చేస్తూ నవనాగరిక ప్రపంచంలో తిరుగుతో    వుండటం వల్ల __ స్వతహాగా ధైర్యవంతురాలు క్రమశిక్షణలో పెరిగిందీ కావటం వల్లా_ ఆమె నిర్భయంగా అంది.
    అతనేం సమాధానం ఇవ్వలేదు.
    స్టేషను రాగానే ట్రెయిన్ ఆగింది . అతను గుమ్మవైపు నడిచాడు. తనలో తను ఏదో ఆలోచిస్తున్నట్లుగా నిదానంగా నడిచాడు. ట్రెయిన్ దిగాడు. అటు తిరిగి కిటికీ వద్దకి స్టేషను వైపు చూస్తూ నుంచున్నాడు.
    "కాఫీయో టీయో తాగాలని దిగాడు కాబోలు. కొంతమందికి అర్దరాత్రి అపరాత్రి అని లేదు. ఒంటిగంట దాటాక ఇప్పుడేం టీ? అయిన యీ స్టేషన్ ముఖానికి టీ కూడానా? అనుకుందామే.
    ట్రెయిన్ కూతవేసింది. గార్డు పచ్చజెండా చూపెట్టాడెమో మెల్లిగా కదిలింది. అతను ప్రవర్తన ఆమెకి అందోళన కలిగించింది.
    "చూడండి!"
    మీ రేవరో నాకు తెలియదు! మీరేం చేస్తారో నాకు తెలీదు. మీకుపేళ్ళయిందో లేదో కూడా తెలియదు __
    కానీ ఆ పాప యిక మీ పాపే!
    మీరు దాన్ని కన్న తల్లిలాగా పెంచుకుంటారని నమ్ముతున్నాను. అందుకే దాన్ని మీకు వదిలేస్తున్నాను. మీపై భారాన్ని పెడుతున్నాను. నేనంటూ బ్రతికివుంటే ఎప్పటికయినా మిమ్మల్ని కలుసుకుంటాను!"
    అతని మాటలు ఆమెలో అందోళనని సృష్టించాయి.
    చప్పున లేచి నుంచుంది . అతనాగి పోయాడు.
    రైలు వేగం పుంజుకుంది.
    "ఏమండీ! ఏమిటిది? ఎందుకిలా చేస్తున్నారు? మీ పాపని మీరు తీసికెళ్ళ౦డి!" గట్టిగా అరిచింది సుజాత. అయితే అతనామే మాటలని పట్టించుకోకుండా, తర్వాత గట్టిగా కేకేసినా రైలు వేగంలో వినిపించకుండా గబగబా గేటు వైపు వెళ్ళిపోయాడు.
    ఇద్దరి మధ్యా దూరం క్షణక్షణానికి పెరుగుతోంది.
    చప్పున యిటు చూసింది సుజాత!
    ఇల్లంతా నిస్సత్తువ ఆవహించినట్టు నరాలన్నీ  ఎక్కడి కక్కడ నీరసించి పోతోన్నట్టు అనిపించి తలపట్టుకుని  కూర్చుంది. ఆమెకి ఏమీ తోచక అయోమయంగా అయిపోయి కూర్చుండి పోయింది.
    ఆ ఆందోళనలో గాబరాలో గొలుసులాగి ట్రెయిన్ ని ఆపేసి కేకలు వేయచ్చనీ అందోళన చేయెచ్చనీ అతనితో పోట్లాడి పాపని అతనికి తిరిగి అప్పగించే ప్రయత్నం చేయొచ్చునీ అనిపించలేదు.
    అటు చూస్తె పాపాకనిపిస్తుందేమోనని భయపడెటట్లు గా కిటికీ గుండా చూస్తూ వుందిపోయింది. చిమ్మని చీకటి! కీచరాళ్ళ రోదా, వేగానికీ పొలం పుత్రా సమానంగా నల్లగా కనిపిస్తున్నాయి. రైలు వేగానికీ కిటికీ గుండా దూసుకోస్తున్న గాలి ముఖాన్ని యీడ్చి యీడ్చి కొడుతున్నా ఆమె మనస్సు ఆలోచనలకి దూరం కావటం లేదు.
                                                       2
    అనుకున్నట్లుగానే పదకొండున్నరకి ట్రెయిన్ ఆ వూళ్ళో ఆగింది. మూడుగంటల ప్రయాణ భారాన్ని మోసి, మోసి, బలహీనపడినట్లుగా వున్న త్వర త్వరగా గూళ్ళకి చేరుకోవాలనే తాపత్రయంలో అందరూ త్వరత్వరగా దిగేస్తూ న్నారు హడావిడిగా.
    ఎక్కేవాళ్ళతో దిగేవాళ్ళతో ట్రెయిన్, ప్లేట ఫాం అమిత రద్దీగా వుంది. వీడ్కోలు చెప్పెవాళ్ళతో, స్వాగతంపలకేవాళ్ళతో అంతా గోలగోలాగా వుంది. కన్నీళ్ళు, చిరునవ్వులు కలబోసినట్ట్లుగా వుంది ఆ వాతావరణం.
    ఒక చేత్తో సూట్ కేసు మరో చేత్తో కొత్తగా పెరిగిన బాధ్యతాయుతమైన బరువుతో __ ఆ పసిపాపని భుజంపై పడుకొబెట్టుకుని ట్రెయిన్ దిగింది సుజాత.
    టికెట్ గేట్లో టి.సి. చేతికందించింది. గేటు దాటిరాగానే ఆటోలడ్రైవర్లు రిక్షాడ్రైవర్లు బాడుగ బాడుగ మూడు స్టేషన్లు సంగీతం ఒకే స్టేషనులో బ్రాడ్ కాస్ట్ అయినట్లుగా అంతా రణగొణ ధ్వని.
    సుజాత బెరమాడ్డం యిష్టం ఎదురైనా ఆటోలో ఎక్కేసింది డ్రైవర్ స్టార్ట్ చెయ్యగానే "గాంధీబజార" అంటూ అడ్రస్ చెప్పింది. ఆటో కదిలింది.
    ఇళ్ళు సమీపించేకొద్ది అమెగుండె దడహెచ్చ సాగింది. బి.పి. పెరిగిపోతున్నట్లుగా వుంది. తన ప్యూనరల్ కి తనే నడిచి వేలుతున్నట్ట్లుగా అనిపించసాగింది అందోళన ! ఆరాటం.
    "ఎం చెప్పాలి తను?" ఈ ప్రశ్న రక రకాల రూపాలతో ఆమెని పదేపదే వేధంచసాగింది అతనెంత నిస్శూఛీగా, బాధ్యతా రహితంగా ఆ పసిగుడ్డుని వదిలేసి వెళ్ళాడో, తనూ అలాగే ఆ పాపని వదిలేయ్యడానికి ఆమె మనస్సు అంగీకరీంచలేదు. ఎటూ నిర్ణయించుకో లేని మనస్సుతో ఊరు చేరనీ తర్వాత ఆలోచిద్దాం అనుకుంది.
    గేటు ముందు ఆగింది ఆటో! ఆ కుడుపుకి ఆలోచనలు తెగాయి. మనస్సు చేస్తోన్న మౌన వీణానాదం తీగ తెగి తెగి ఆగినట్టు ఠప్పున ఆగిపోయాయి.
    సందుమలుపు తిరుగుతూ వుండగా చెప్పిన గుర్తుతో, ఆటో అపేడతను. డిగి రెండు రూపాయలు చేతిలో పెట్టేసింది చిల్లరకోసం కూడా ఆగకుండా తడబడే అడుగులతో, బెదిరేకళ్ళతో భుజంపై పాపా, చేతిలో సూట్ కేస్ తో నడిచింది.
    తప్పు చెయ్యకున్నా పాపం మోస్తున్నట్లుగా ఫీలింగ్ ఎంత కాదనుకున్నా భయం మనస్సుని వదలటం లేదు.

 Previous Page Next Page