Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 1

                                 

                    

                      నింగిలోని సిరిమల్లి
                                                                                         __: యమనీ సరస్వతీ

                                                 

    రైల్వే ప్లాట్ ఫాం పై రాబోయే రాలుకోసం అసహనమగా నుంచుంది సుజాత! ఆమె మనస్సు చాలా చికాగ్గా వుంది. ఆ రోజు రైలు రెండున్నర గంటలు లేటు.
    ఇంట్లో బయలు దేరటం మాత్రం హడావిడి అయింది. ఎన్ని రోజులున్నా తల్లిదండ్రుల్నీ వదలి వెళ్ళాలంటే బాదే. అందుకే యింటి నుంచి బండి కదలటం ఆలస్యమైపోయింది. ఆరు నేలలున్నా యిల్లు వాదలాలంటే ఆఖరి నిముషంలో బాధే.
    రైలు ఆ శేత్శానుకి సరిగ్గా రాత్రి పదింటికి వస్తుంది. బండి స్టేషను చేసేసరికి యిక పది నిమిషాలు మాత్రమె టైం వుంది. సూట్ కేస్ చేత బట్టుకుని హడావిడిగా కౌంటర్ వద్దకి వెళ్ళింది. టికెట్ తీసుకుంది గారాబంగా ప్లాట్ ఫాం మీదికి వచ్చింది.
    అప్పుడు తెలిసింది రైలు రాక అరగంట లేటని. కానీ ఆ అరగంటలా గడిచి గడిచి రెండున్నారగంటలైంది. పాలేరు వెంకన్న మళ్ళీ వేకువనే పనికి వెళ్ళాలంటూ సుజాత వద్ద సెలవు తీసుకుని అప్పుడే వెళ్ళిపోయాడు.
    అది చాలా చిన్న స్టేషను! ప్రయాణీకుల రద్దీ ఎప్పుడూ తక్కువగానే వుంటుంది. ఈ రోజు మరీ ప్రయాణీకులు ఎవ్వరూ లేరు. ప్లాట్ ఫాం కంతా సుజాత ఒక్కటే వుంది.
    బెంచీ మీద కూర్చుని విసిగెత్తింది. మేరీ కార్ట్ లేండ్ నవల చదువుతూ కొంతసేపూ, ఆ ఆవారం పత్రిక తిరగేస్తూ కొంతసేపూ గడిపింది. మరీ అర్ధరాత్రి అయ్యేసరికి __ చదువుతూ వుండటం వల్ల కళ్ళకి అలుపు వచ్చేసింది.
    కీచు రాళ్ళ రోద! నిశ్శబ్ద సంగీతం.
    దూరంగా స్తంభాన్ని అనుకుని పోర్టరు ! లోపల గదిలో కునికిపాట్లు పడుతూ స్టేషన్ మాష్టారు! బుకింగ్ ముందు క్లర్కు.
    చిమ్మని చీకటి! మినుకు మినుకు మంటూ నక్షత్రాలు చందమామ వెలుగులు చిమ్మకుండా అపుడపుడూ కమ్మేస్తోన్న మేఘాలు! ఉండి ఉండీ వీస్తోన్న గాలి! గాలికి కదిలే చెట్లు తమాషాగా చేస్తోన్న చిరు సవ్వడి!
    "హమ్మయ్యా! రైలు వస్తోంది!" అనుకుంది సుజాత టైం చూస్తె పన్నెండూ ముప్పయి! "ఉదయం ఎనిమిదింటికి చేరే ట్రెయిన్ ఏ పద కోండిడింటికో చేరుతుంది. కాబోలు!" అనుకుంది.
    ఆరునెలలు తర్వాత సెలవు ముగిశాక మళ్ళీ ఆఫీసుకి వెళుతుంది. మధ్యాహ్నంలోగా ఆఫీసుకి వెళ్ళినా ఫర్వాలేదు. లేదంటే ఆ మరుసటిరోజు వెళ్ళొచ్చు! ఎలాగు శలవు వుంది.
    వెలుగులు చిమ్ముతూ వచ్చేసింది ట్రెయిన్. ఇద్దరు దిగేరు. అంతే! వాళ్ళు తన వూరి వాళ్ళు కారు. రైలు కట్టకి అటువేపున్న వ్వూరి వాళ్ళేమో!
    ట్రెయిన్ లో రద్దీ లేదు. అంతా నిశబ్దం. స్టేషన్ లో రైలాగితే మెలకువ వచ్చి తిరిగి కళ్ళు మూసుకుని పడుకున్నట్ట్లున్న ప్రయాణీకులు ! జీవిత కాలంసాగే ప్రయాణంలో విశ్రాంతి మందిరాళ్ళ స్టేషనుల! ఆగేవాళ్ళూ దిగేవాళ్ళూ ఎవరికెవరు?
    ఆడవాళ్ళ కంపార్టు మెంటులో ఎక్కేసింది సుజాత! అది చిన్నపెట్టె. నాలుగు బెర్ట్ ల్లాంటి సామాన్లుంచే బల్లలున్నాయి. కూర్చునే నాలుగు బల్లలు ఉన్నాయి. ఎవరో ఓ ముసలమ్మా ఓ బెంచీపై పడుకుంది.
    కిటికీ వారగా కూర్చుంది సుజాత.
    ప్రయాణంలో ఒక ఘట్టం ముగిసింది. దాంతోపాటే యిన్నాళ్ళ సెలవుల్లో __ పుట్టింట్లో తండ్రి పాలనలో, సవతి తల్లి,  లాలనలో , చెల్లీ తమ్ముళ్ళ ప్రేమలో గడిపిన జీవితమూ అయిపోయింది. మళ్ళీ రేపటినుంచి యాంత్రిక జీవితం! ఒక రాగం ఒక భావన ఒక స్పందనలేని కేవలం మామూలు జేవితం! యిల్లు __ ఆఫీసు _ వంట _ భోజనం _ విశ్రాంతి. ఒక థ్రిల్ లేదు. ఒక అనుభూతీ లేదు __
    రైలు కూత వేసింది.
    ఆలోచనలకి ఆనకట్ట! మనసూ పొరల్లో ఒక పుట కదిలి మరో పుట తిరిగింది. ఎన్నెన్నో జ్ఞాపకాలకి విరామం.
    సరిగ్గా ట్రెయిన్ కదిలేసమయంలో ఓ యిరవయిఅయిదేళ్ళు దాటిన యువకుడు హడావిడిగా ఎక్కేశాడు మసక వెలుతుర్లోనే అతను ముఖంలో అలసట ప్రస్పుటంగా కనిపిస్తుంది. అతని చేతిలో వున్న సుమారు రెండు నెలలున్న పసిపాపని అతడు తన ఎదురు బెంచీపై కూర్చునే దాకాగమనించలేదు. సుజాత.
    ఎదురుగా కూర్చున్నాడు తను. పొత్తిళ్ళలోని ఆ పసిపాప గాఢంగా నిదుర పోతోంది.
    లయానువిటంగా రైలు చేస్తోన్న శబ్దం మాత్రం వినిపిస్తోంది. ముద్దులు మూటకట్టే అ పసిపాపని పడే పడే చూడాలనిపిస్తోంది.
    "క్షమించండి ! చూడక అడవాలాల్ కంపార్ట్ మెంటులో ఎక్కెను!" అన్నాడు అతను. ఆ మాటల్లో స్పష్టంగా కనిపించే సభ్యత సంస్కారం సుజాతని ఆకర్షించేయి.
    మాట కలపదగిన మనిషిలా అనిపించాడు. "పర్వాలేదు లేండి! ఇక్కడేం రమేష్ వుందని. అభ్యంతర పెట్టేందుకూ ఎవరూలేరు. ఒక్క దాన్ని బిక్కు బిక్కు మంటూ వుండకుండా తోడున్నారు!" నవ్వుతూ అంది సుజాత.
    దానికి అతనేం సమాధానం యివ్వలేదు. చిన్నగా నవ్వినట్లు పెదాలు కదిలాయి. బయటికి చూస్తూ వుండిపోయాడు.
    అతని చేతుల్లో పాపపై వెలుగు పడుతోంది. సన్నగా నిండా రెండు మూడు నెలలుయనా నిండని యీ పసిపాపాని ఎక్కడికి తీసికేళుతున్నాడు? ఆ పసిబిడ్డ తల్లి ఎక్కడ? ఎందుకతని ముఖంలో ఆ విషాదం? చనిపోయిందా? ఆమె.
    ఉలికి పడింది. సుజాత! ఛ ! ఛ! తెలియకుండా ఎంత ఘోరం ఊహిస్తో౦ది తను. ఈ పసిప్రాయంలో తల్లికి కరువు కావటం ఎంతదురదృష్టం! ఊహుంవద్దు! ఈ పాపకి ఆ శాపం వద్దు.
    రైలు వేగం మందగించింది అది పాసింజర్ ట్రెయిన్. అందుకే అన్ని స్టేషను లలోనూ ఆగుతూమెల్లిగా నత్తనడక నడుస్తుంది! మధ్య తరగతి మనుషుల జీవితాల్లో లాగా దానికి కుదుపులు తప్ప వేగం, వుండడు. అడగడుక్కీ ఆటంకాల్లాగా స్టేషనల్లో ఆగుతూ, ఎక్స్ ప్రెస్ ళు దాటిపోతూ వుంటే __ ధనవంతులు మరీ ధనవంతులవుతూ వుంటే చూస్తూ నిట్టూర్చే మామూలు గుమస్తా బ్రతుకులాగా సాగిపోతూ వుంటుంది.

Next Page