Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 9

    లత జాలిగా అతని వంక చూసింది.   
    "మీ పెయింటింగ్ ఇంత బాగుంటుందనీ నాకు తెలియదు. లేకుంటే ఒప్పుకునే వాణ్ణి కాను. ఎక్కువ సంతోషాన్ని భరించే అదృష్టం నాకు లేదు" అన్నాడు మోహన్ మళ్ళీ.   
    "డాక్టర్ కి చూపించుకో లేకపోయారా?" అంది లత జాలిగా.   
    "డాక్టర్ సలహా నాకు నచ్చలేదు" అన్నాడు మోహన్.   
    "ఏమిటది?"   
    "పెళ్ళి చేసుకోమన్నాడు? అన్నాడు మోహన్.   
    "మీ డబ్బుకు ఇంత సింపుల్ గా కనిపించే పరిష్కారం నాకు నచ్చలేదు"  అన్నాడు మోహన్ .
    మీకు సింపుల్ గా కనిపించే పరిష్కారం నాకు నచ్చలేదు" అన్నాడు మోహన్.   
    "ఎందుకని?"   
    "నిలకడ లేని ప్రవాహం లాంటి జీవితమంటే నాకు ఇష్టం" అన్నాడు మోహన్.   
    "ఆ జీవితాన్ని మీకు స్రీ ప్రసాదించగలదు."   
    "వద్దు లేండి" అని మోహన్ తన జేబులోంచి ఒక చిన్న భరిణి తీపి ఆమె ముందు పేట్టి, "ఇది ణ బహుమతి" అన్నాడు.   
    లత ఉలిక్కిపడి ఆ భరిణి అందుకుని_  "ఎందుకు?" అన్నాడు.   
    "మొదటిసారిగా నేను మిమ్మల్ని నిన్నరాత్రి చూశాను. దేవకన్యలేలా  ఉంటారో నాకు తెలియదు కానీ, మిమ్మల్ని మించిన అందం ఉంటుందని అనుకోలేకపోతున్నాను. అందానికి బహుమతి నివ్వడం ణ రివాజు. అందుకే నా ప్రయాణం వాయిదా వేసుకుని ఈ రోజు మీ ఇంటికి వచ్చాను" అన్నాడు మోహన్.   
    లత భరిణిను తెరిచింది. అందులో రెండు దుద్దులున్నాయి. ఖరీదైన రాళ్ళు పోడగపడ్డ ఆ దుద్దుల ధర కనిసం వెయ్యికి తక్కువుండదు. ఆ ప్రయత్నంగా ఆమె భరిణిను మూసింది. 'ఒక పరాయిమగవాడు ఇంత ఖరీదైన వస్తువును తన అందానికి బహుమతిగా ఇచ్చాడు. అంటే అర్ధమేమిటి ?"   
    ఆమె భరిణిను అతనికి తిరిగి ఇచ్చేస్తూ _ "బహుమతులు తీసుకోవడం నాకు అలవాటు లేదు" అంది. మోహన్ దాన్నందుకుని అక్కడున్న టీపాయ్ మీద పేట్టి _ " మన సహజ న్యాయాన్ని బట్టి బహుమతివ్వడానికి నేనూ తటపటాయించాను. కానీ మీ పెయింటింగ్ చూసేక స్రీత్వ్ఫం పైన మీ అభిప్రాయం తెలిపి చాలా సంతోషించి ఈ ధైర్యం చేగాలిగాను" అన్నాడు.   
    "అందానికి బహుమతిలందుకోవడం నాకు సరదా అని చెప్పానా?" అంది లత ఆశ్చర్యంగా.
    "లేదు. కానీ స్రీత్వం పట్ల మీది నాదే ఒకేఅభిప్రాయం " అన్నాడు మోహన్.   
    "ఏమిటది?" అంది లత కంగారుగా.   
    "ఎంత మంది దాహం తీర్చుకున్నా ప్రవాహంలో నీరు కలుషితం కాదు. స్రీ ప్రవాహం లాంటిది" అని మోహన్ అక్కణ్ణించి రెండడుగులు ముందుకు వేసి _ "నేను  మీ ఇంటికి వస్తున్నట్లు రామారావుకి తెలియదు. అలా అని అబద్దం చెప్పను. దయచేసి ఈ రోజు జరిగినదంతా రహస్యంగా ఉంచండి _ బహుమతి కూడా రహస్యమే! నా దాహం సంగతి కాస్త ఆలోచించకండి. మళ్ళీ కలుస్తాను" అని ఆమె వైపు చూడకుండా అక్కణ్ణుంచి చరచరా వెళ్ళి పోయాడు.   
                                                                        4   
    సాయంత్రం రామారావు ఇంటికి వచ్చేసరికి లత గుమ్మంలో ఎదురు కాలేదు . ఈ విధమైనా అనుభవం ఎరుగని రామారావు ఆశ్చర్యపడుతూ  డ్రాయింగ్ అనుభవం ఎరుగని రామారావు ఆశ్చర్యపడుతూ డ్రాయింగ్ రూంలోకి నడిచాడు. అక్కడ సోఫాలో లత దీనంగా కూర్చుని ఉంది. రామారావు రావడాన్ని గమనించి కూడా ఆమె లేవలేదు. అతని వంక చూడలేదు.   
    "లతా! ఏమిటలా ఉన్నావు?" అన్నాడు రామారావు కంగారుగా.   
    లత పెదవి వ్సిప్పలేదు. మౌనంగా టీపాయ్ వైపు చేయి చూపించింది.   
    దానిమీద ఉన్న భరిణిను చేత్తో అందుకుని రామారావు _ తెరచి చూసి ఆశ్చర్యపడ్డాడు.   
    "అవి నా అందానికి బహుమతి అని చెప్పి మీ స్నేహితుడు మోహన్ ఇచ్చాడు" అంది లత.   
    "మోహన్ వచ్చాడా ఇక్కడికి! ఎప్పుడు?" అన్నాడు రామారావు కంగారుగా.
    లత జరిగినదంతా రామారావుకి వివరంగా చెప్పింది.
    "అయితే మోహన్ నిజంగానే ప్రమాదకరమైన మనిషన్నమాట" అన్నాడు రామారావు.
    "నిజంగానే ప్రమాదకరమైన మనిషికంటే _ అతను ప్రమాదకరమైనా మనిషన్న సమాచారం మీకు ముందుగానే తెలుసా?" అంది లత.   
    రామారావు మోహన్ గురించి తనకు తెలిసినవీ, తన గురించి మోహన్ స్వయంగా చేప్పుకున్నవీ_ వివరాలు లతక్కూడా చెప్పాడు.   
    "అలాంటప్పుడు అతన్ని మనింటి కెందు కాహ్వనించారు?" అంది లత కోపంగా.   
    "అతను నన్ను సవాల్ చేశాడు. ఆడవాళ్ళను వశపర్చుకునే విద్య తనవద్ద ఉన్నదన్నాడు. బలవంతంగా ఏ ఆడదాన్నీ అనుభవించనన్నాడు. ఇది నాకు సవాల్ గా తోచింది. అందుకే మనింటికి ఆహ్వానించాను" అన్నాడు రామారావు.   
    "మరి ముందుగా నాకీ వువరాలన్నీ ఎందుకు చెప్పలేదు?" అందిలత.   
    "ఒకరోజు పరోక్షంగా నీకు చెప్పనే చెప్పను. నా సాయం లేకుండా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిరూపించుకోగలవా అని ఒక రోజు రాత్రి నిన్నడగలేదా?"
    "బాగుందండీ! భార్యా భర్తలకు వేర్వేరు వ్యక్తిత్వాలుండవు" అంది లత.

 Previous Page Next Page