Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 10

    "అది కాదు లతా! దాంపత్యానికి సంభందించిన వరకూ మనిద్దరినీ ఒకే వ్యక్తిత్వం. ఒక వ్యక్తి నిన్ను శారీరకంగా బాధిస్తూ న్నాదనుకో _ అప్పుడు నేనూ. నా శరీర బలం నీకు ఆసరాగా వుంటాం. కానీ ఒక వ్యక్తి మానసికంగా నిన్ను బాధిస్తూన్నాడనుకో _ దాన్నేదుర్కోనే మనోనిబ్బరం నీకుండాలి. నేను చేయగలిగిందల్లా నీకు అండగా నిలవదమూ, ధైర్యాన్ని ప్రసాదించడంమూ " అన్నాడు రామారావు.    
    "మీ మాటలు నాకు సరిగా అర్ధంకాలేదు......" అంది లత.   
    "ఉదాహరణకు నా ఆఫీసులో పెద్ద గోడవై౦ధనుకో, నేను చిక్కుల్లో పడ్డాననుకో __ నీకై నువ్వు నాకు సాయమేమీ చేయలేవు. ఆ సందర్భాన్ని నేను ఒక్కణ్ణి ఎదుర్కోవాలి. ఇంటి దగ్గర్నుంచి నే నాశించేది నాలుగు ఓదార్పు మాటలు, ధైర్యవచనాలు. అంతే గదా! అలాగే నీ విషయంలో కూడా" అన్నాడు రామారావు.   
     "అయితే మే మిత్రుడు నా చేయి పట్టుకుంటే మీరు కలగజేసుకోరా?" అంది లత రోషంగా, భర్త  ఆలోచనల తీరుతెన్నులు ఆమెకు అర్ధంకావడంలేదుగానీ, ఏదో గడబిడ జరుగుతోందన్న అనుమానం ఆమె మనసులో ప్రవేశించింది.   
    "అటువంటి పరిస్థితి  వస్తే నేను తప్పక కలగజేసుకుంటాను. కానీ మోహన్ పన్నుతిన్ను వల నీ మనసుకోసం. నీ మనసును వశుపర్చుకోకుండా నీ శరీరం జోలికి రాడతను. మోహన్ ని దూరంగా పంపేయడం అరక్షణం పని. అయితే అలా చేయడం నీకూ నాకూ అవమానమే" అన్నాడు రామారావు.     
    "చూస్తూ చూస్తూ ఓ రావణాసురుణ్ణి మన ప్రాంతాల మసాల నివ్వడం నాకిష్టం లేదు."   
    రామారావు ఉలిక్కిపడి, "ఏమన్నావూ?" అన్నాడు.   
    లత మాట్లాడలేదు. కానీ ఆమె మాటలు అతని చెవుల్లో మళ్ళీ ప్రతిధ్వనించాయి. అనుకోకుండానే అతని ముఖంలో మందహసం వెలిసింది. "నువ్వు నిజంగానే అసాధారణ స్రీని లతా! పిట్టల జంట వేలువండింది. వాల్మీకి నోటివెంట. నీ కోపంలో నువ్వు మోహన్ ని రావణాసురుడితో పోల్చావు. అది అక్షరాల నిజం! రవాణాసిరుడిలా అతడికి బోలెడు డబ్బుంది. రవాణాసురుడిలాగే అతడింట్లో అతనికి ఎదుర్లేదు. రవాణాసురుడిలాగే అతడికీ స్రీ వ్యామోహాముంది. రావణాసురుడిలాగే అతడూ ఏ స్రీనీ బలవంతంగా అనుభవించలేడు. అతగాడికి స్రీత్వంపై చులకన. ఏ స్రీనైనా తన పాదాక్రాంతురాలీని చేసుకోగలనన్న నమ్మకం అతడి నరనరాలూ వ్యాపించి ఉండడంవల్ల ఉచ్చవీచాలేరుగక ప్రవర్తిస్తున్నాడు. అతడి నమ్మకాన్ని నువ్వేవమ్ముచేయాలి" అన్నాడు.   
    "అందువల్ల ప్రయోజనం?" అంది లత.   
    "మన వ్యాక్తిత్వాలపై మన నమ్మకం పెరుగుతుంది. "   
    లత మౌనంగా ఉండిపోయింది. రామారావు నెమ్మదిగా ఆమెను సమీపించి, "లతా! నువ్వునా దానివి. దాపరికం లేని ప్రేమ మనది. అటువంటి నిన్ను శకించి, నీ మానసిక బలహీనతను తప్పు అంచనా, వేసి, మోహన్ కళ్ళబడితేనే నువ్వు నా క్కాకుండా పోతావేమోనని భయపడుతూ, అతగాణ్ణి దూరంగా ఉండమని శాసించాలంటే నా కెంతో అవమానంగా ఉంది. న బాధను అర్ధం చేసుకోలేవా?" అన్నాడు.   
    లతకు కొంచెం కొంచెంగా రామారావు బాధ అర్ధమవుతోంది. 'రామారావు తనను ప్రేమిస్తున్నాడు.  తనూ ప్రేమించబడ్డనని విశ్వపిస్తున్నాడు. ఈప్రేమ ఎటువంటి అవరోదానికైనా తట్టుకుని  నిలబడగలగాలాని  అతని ఆశ. మోహన్ అతన్ని సవాలు చేశాడు. ఆ సవాలును రామారావు చాలా సీరియస్ గా తీసుకున్నాడు. తన భార్యకు పురుషుదుని గాలి సోకనీకుండా కట్టు  దిట్టాలు చేసే పూర్వపుటాచారం పురుషుల వ్యక్తిత్వాన్నికే అవమానంగా  అతను గ్రహించాడు. అయినా తను మోహన్ గురించి ఎందుకు భయపడుతోంది? తన భర్తకు లేచి భయం తన కెందుకు?"   
    లత దృష్టిలో తన పరుచస్థులు చాలామంది మేదుల్తున్నారు. 'ఒకాయన తన భార్యకు సంగీతం నేర్పించాలనుకుని అడ గురువు దొరక్క మానేశాడు. ఒకాయన తఃన భార్యకు పురుషుల మధ్యకు రానివ్వడ. అతిధులు వస్తే వంటింట్లోకి వెళ్ళి భార్యచేసిన కాఫీ  పట్టుకొచ్చి ఇస్తాడు. ఇంకొకాయన పుస్తకాల పిచ్చి. ఇంటి కేవరయినా  రచయితలూ వస్తే భార్యకు వాళ్ళతో మాట్లాడే అవకాశమివ్వాడు ఇలా చాలామంది, ఆడవాళ్ళను చేజారిపోకుండా రక్ష్మించుకుంటుంటారు. ఇలాంటి పురుషుల మధ్య తన భర్త ఒక అపూర్వ ప్రయోగాన్ని తలపెట్టాడు. స్రీ వ్యామోహంలో రవాణాసురుడుకి తీసిపోని వ్యక్తిని దూరంగా ఉంచగలిగే ఉంచడం లేదు.   
    "మిమ్మల్ని  నేను అర్ధం చేసుకున్నాను. కానీ మీరు మన సమాజాన్ని కూడా అర్ధం చేసుకోవాలి. అతను ఇంకా ఇంకా మనింటికి వస్తూ నాతో చనువుగా వుండడానికి ప్రయత్నిస్తూంటే లోకులు పలురకాలుగా అనుకుంటారు. ఆ అనుకోవటం అతనికి మరింతగా సహకరిస్తుంది." అంది లత.   
    "అతను మళ్ళీ మళ్ళీ వస్తాడనీ, మరీ చనువు తీసుకుంటాడనీ నేను అనుకోవడం లేదు. కానీ సమాజం గురించి నువ్వు బాధపడకు. భర్తకు దగ్గరనుంచి పూర్తీ సహకారం లభించే ఏ భార్యనూ సమాజం ఏమీ చేయలేదు" అన్నాడు రామారావు.   
    "మీ ఇంటి భర్త లభించడం నిజంగా నా అదృష్టం " అంది లత.   
    "అయితే ఇప్పుడు చెప్పు ___ ఆ మోహన్ ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ నేనింటికి వచ్చేసరికి నువ్వంత దిగులుగా ఏమ్డుకున్నావు?" అనడిగాడు రామారావు.   
    "ఆ ప్రశ్న ఇప్పుడా అడిగేది?" అంది లత.   
    "నన్ను నీ అదృష్టంగా భావిమ్చావు కాబట్టి ఈ ప్రశ్న అడగగాలిగాను. లేకపోతె నీ దుగులుకు ఏవేవో కారణాలు నాపాదిస్తున్నావాణి అపోహపడతానని భయం...." అన్నాడు రామారావు.    
    "ఇలా ప్రతిదానికీ భయపడుతూంటే మనది ఆదర్శ దాంపత్య మేలాగావుతుందీ?" అంది లత. "మోహన్ ప్రవర్తనకు నేను చాలా బాధపడ్డాను. అతను నా దగ్గర అంత చనువు ఎలా తీసుకున్నాడు?" నా ప్రవర్తనలో ఏదయినా లోపముందా? నా కళ్ళలో  నాకు తెలియని ఆహ్వానం స్ప్రురించిందా? న మాటల్లో చనువు ద్వనించిమ్డా? నే నతనికి ఆ పెయిటింగ్ చూపడం తప్పయిందా? ఇలా రకరకాల భావాలు కమ్ముకోగా కాసేపు నేనంటే నాకే అసహ్యం  వేసింది. మీరు నా అందాన్ని ఎంతో పవిత్రంగా ఆరాధిస్తున్నారు. ఎన్నో విధాలుగా నన్ను పొగుడుతూంటారు. ఇవన్నీ నాకు తెలియకుండానే నాలో అహంకారాన్ని నింపుతున్నాయి. ఆ అహాన్ని మీ మిత్రుడు దెబ్బ తీశాడు. నా అందం అంత చులకన అయిపోయిందా! నేను బజారు మనిషిలా కనబడురున్నానా? ఇలాంటి అనుమానాలు ఎన్నో నన్ను వేధించి నాకు నీరసాన్నీ పుట్టించాయి.  మీరు మోహన్ గురించి వివరాలు చెప్పాక నాకు మనసు తేలికపడింది."  

 Previous Page Next Page