"మీ పెయిటింగ్స్ లో చెట్లకూ, పక్షులకే గానీ మనుషులకు స్థానం లేదా?' అన్నాడతను.
లత నవ్వి, "పక్షులకూ, జంతువులకూ కొన్ని నిర్వచనాలున్నాయి, స్వభావాలున్నాయి. వాటిని కూడా కొన్ని నిర్వచానాలుంటాయి. ఆ నిర్వచనాలు తృప్తి పరచలేనివాడు మనిషి జంతువే అవుతాడు ప్రత్యేకంగా ఫలానా మనిషి పెయింటింగ్ వేయాలనుకుంటే అది వేరు. అల కాకా పకృతి ద్రుశ్యంలోకి మనిషిని తీసుకురావలంటే ఆ మనిషేలా ఉంటాడో నాకు తెలియడం లేదు. పక్షిని తీసుకురావాలంటే అ మనిషేలా ఉంటాడో నాకు తెలియడం లేదు. పక్షిని చూసి దాని స్వభావాన్ని నిర్ణయించగలం. కానీ మనిషిని చూసి స్వభావాన్ని నిర్ణయించలేంగదా?" అంది.
ఆమె మాటలు మోహన్ సరిగ్గా వినలేదు. అందువల్ల జవాబెం చెప్పాలో తెలియక నవ్వుఇ ఊరుకున్నాడు. అతడి మెదడు అసహనంగా ఏమేటో ఆలోచిస్తోంది.
లత నెమ్మదిగా __ "మీకు ఆసక్తి ఉంటే ఒక పెయింటింగ్ చూపిస్తాను. ఇంతవరకూ నేను మీకు చూపినవి ఇమిటేషన్ పెయింటింగ్స్ . ఇప్పుడు చూపాలనుకుంటున్నది. నా స్వంత ఐడియా . దానిపేరు స్రీత్వం" అంది.
మోహన్ ఉలిక్కిపడి, " ఏమిటన్నారూ?" అన్నాడు. స్రీతత్త్వం అన్నమాట చెవుల్లో గింగురుమంటోంది. అతని ఊహలో కళ్ళముందు ఒక స్రీ మూర్తి ఆకారం నగ్నంగా మాసాలుతోంది. ముఖంస్పష్టంగా ఉంది. ఆ ముఖానికి లత పోలికలు రప్పించాలని అతను ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడడం లేదు. ఆ ముఖం అస్పష్టంగా ఉండిపోయింది.
"స్రీత్వం నా పెయింటింగ్ పేరు" అంది లత.
"తప్పకుండా చూస్తాను తీసుకురండి " అన్నాడు మోహన్ అత్రుతుగా. లత ఎటువంటి పెయింటింగ్ చూపించబోతుందో ఊహించుకుంటూ అతను పరవశిస్తున్నాడు.
రెండు నిముషాల్లో లత అతనిముందు ఒక పెయింటింగ్ ఉంచింది. ఆ పెయింటింగ్ మహన ఊహించినట్లు లేదు.
అదొక ప్రవాహం, ప్రవాహానికి అటూ ఇటూ చెట్లు, ముళ్ళమొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. ప్రవాహంలో రకరకాల వస్తువులు కొట్టుకుపోతున్నాయి. ప్రవాహపుటలలు ఒడ్డున ఉన్న బండరాళ్ళను, గులకరాళ్ళను ఇసుకను తాకుతున్నట్లుగా ఉంది.
"ఇదా స్రీత్వం?" అన్నాడు నిరుత్సాహంగా .
"అర్ధం కాలేదా?" అంది లత. ఆమె అతని సమీపానికి వచ్చింది. తన పెయింటింగ్ వివరించాలన్న ద్యాస ఆమెది. కానీ ఆమె సమీపంలో ఉన్నదన్న అనుభూతి మోహన్ పొందుతూనే ఉన్నాడు.
"స్రీ ఈ ప్రవాహం లాంటింది. ఎవరూ అనలేని నాదే ప్రవాహం స్రీ. ఆమె కారణంగా ఎన్నో భూములు సారవంతమవుతాయి. పూలు వికసిస్తాయి. బండరాళ్ళను తాకి గులకరాళ్ళుగా గులకరాళ్ళను మెత్తని ఇసుకుగా మార్చగలదు స్రీ. ఈ ప్రవాహంలో ఎందరు దప్పిక తీర్చుకున్నా అపవిత్రత ఉండదు. నాకు చేతనైనంతలో ఊహించి, వచ్చినంతలో ఈ పెయింటింగ్ తాయారుచేశాము. అయన ఇంకా భావపరిపక్వత లేదని అన్నారు. దీన్నింకా ఇంప్రూవ్ చెయ్యాలని నా భిమతం ..." అంటూ ఆమె ఆగిపోయింది.
ఆమె మోహన్ దగ్గరగా వచ్చింది. మోహన్ కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. అతను హఠాత్తుగా ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె నిశ్చేష్టురాలైపోయింది. అతనామేను చటుక్కున కౌగలించుకున్నాడు. ఆమె దెబ్బతిన్నట్లు అతన్ని తోసేవేయడానికి ప్రయత్నించింది. అతనామే చేతిని బలంగా పట్టుకునే మొదలు నరికిన చెట్టులా నేల కూలడు. ఆమె అతనిమీద పడింది.
ఆమె తమాయించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ అతని పట్టు వదిలించుకోవడం కష్టంగా ఉంది. అతని కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ ఉన్నాయి. గొంతులోంచి అదొక రకమైన ద్వనివస్తోంది. నేలమీద వెల్లకిలా పడి కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటున్నాడు. ఏమయిందో తెలియదు కనీ, ఆమె పదేపదే అతనిమీద పడుతోంది. ఆలోచించడానికి కూడా వ్యవధి ఉండడంలేదు.
సుమారు అయిదారు నిముషాలకు అతని చేతి పట్టు విడి౦ది. వెంటనే ఆమె చేయి విడిపించుకుంది. అతానమే వంకనే వెర్రి చూపులు చూస్తునాడు. ఆమె తనవంక చూసుకుంది. త్వరత్వరగా బట్టలు సవరించుకుంది. అతను చూపులు మారలేదు. అలాగే ఆమె వంకనే చూస్తున్నాడు.
"మిస్టర్ మోహన్! మీకే మైంది?" అంది లత.
మోహన్ మాట్లాడలేదు అలాగనే అమెవంకనే చూస్తున్నాడు లతకు ఏం చేయాలో అరధం కాకా, నిస్సహాయంగా అతనివంకనే చూస్తూ ఉండిపోయింది.
మోహన్ క్రమంగా కనులు మూసి తల పక్కకు వల్చేశారు
"మిస్టర్ మోహన్ ! మీ కేమైంది?" అంటూ అతన్ని కుదిపిందామే.
మోహన్ లో వెంటనే చలనం రాలేదు. అలా ఆమె రెండు సార్లు కుడిపేక అతను నెమ్మదిగా కదిలాడు. ఆ తర్వాత లేచి కళ్ళు నులుముకుని _ " ఏమైంది ?" అన్నాడు నెమ్మదిగా.
"ఉన్న పళంగా విరిచుకు పడిపోయారు " అంది లత ఇంకా కంగారు పడుతూనే.
అతను ఒక్క క్షణం నుదురు కొట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా { "నేనేమీ అసభ్యంగా ప్రవర్తంచలేదు. గదా?" అన్నాడు.
"లేదు" అంది లత వెంటనే.
అతను స్వరం బాగా తగ్గించి _ మీ సమక్షంలో ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. ణ బలహీనత మీకు తెలిసిపోయింది?" అన్నాడు. అతని కంఠం తడిగా మారింది _ "నా దురదృష్టం. ఒక రకం హిస్టీరియా నన్ను పీడిస్తోంది. విపరీతమైన సంతోషం కలిగినపుడు ఎదుటి మనిషిని గట్టిగా పట్టుకుంటాను. అ తర్వాత నాకు స్పృహా ఉండదు. మీ పెయింటింగ్ నాకు అలౌకి కానందాన్ని కలిగించింది."