Previous Page Next Page 
అధికారి పేజి 9

 

    వరుణ్ కి తన ప్రెండ్ అనంత్ బిహేవీయర్ నచ్చలేదు. అతని ప్రవర్తనకు కంపరం కలుగుతుంది.
   
    తన డ్రీమ్  గరల్ వేపు చూశాడు వరుణ్.
   
    నీటి తుంపరులు ముఖంపై పడినప్పుడల్లా ఆమె కిలకిల నవ్వుతుంది. నింగినుండి తెల్లని మల్లెలు వర్షంలా కురుస్తున్నట్టు అలాగే మైమరచిచూస్తూ ఉండిపోయాడు వరుణ్.
   
    తన కలల సుందరిపై అనంత్ గాడి దృష్టి పడకూదదనీ, ఎలాగైనా ఆమెను వాడి బారినుండి రక్షించుకోవాలనే ఆదుర్దాలో వాళ్ళవేపు  పరుగుపెట్టాడు వరుణ్.
   
    అవకాశం దొరకకపోతుందా? అని అడవాళ్ళ గుంపులో జొరపడి ఆమె దృష్టిని ఆకర్షించడానికి అన్నట్టు ఆమెమీద నీళ్ళు జల్లుతూ ఆమెను ఉక్కిరి బిక్కరి చేశాడు అనంత్.
   
    అనంత్ చేస్తున్నా అల్లరి వడ్డున వున్న అందరికి స్పష్టంగా కానిపిస్తోంది. "ఛీ! ఈ మగపిల్లకు బుద్ధిలేదు. ఆడవాళ్ళు స్నానంచేసే చోటికివచ్చి దొంగలు కార్చుకుంటూకళ్ళు అప్పగించి చూడడమే కాకుండా సిగ్గు లేకుండా ఆడవాళ్ళు మధ్యన చొరబడీ, అసభ్యంగా ఆడపిల్లలను తాకి ఆనందించడం పశుత్వం కాక మరేమిటి?" చీదరించుకుందామో, అప్పుడే అటుగా వచ్చిన అధికారికంట ఆ సీన్ పడనే పడింది.
   
    అధికారి హడావిడిగా ఆడవాళ్ళు దగ్గరకు పరిగెత్తాడు.
   
    "చూడండి సార్..... ఈ రోమియోలు మా అమ్మాయిని టీజ్ చేస్తున్నారు." ఆమె అనంత్ వైపు చేయి చూపుతూ పిర్యాదు చేసింది.
   
    "ఓరి నాయనో. ఆ ముసలది మన కొంప ముంచిందిరోయ్ " గగ్గోలు పెడుతూ అనంత్ పరిగెత్తబోయాడు.
   
    అధికారి ఒక్క ఉదుటున ముందుకు దూకి అనంత్ కాలర్ పట్టుకున్నాడు.
   
    "నో నో...... నే నొక్కడినే కాదు ఇంతమంది కుర్రాళ్ళు ఉండగా   నన్నొక్కడనే పట్టుకోవడం అన్యాయం." అనంత్ ఉక్రోషంతో అన్నాడు.
   
    "నీతోపాటు ఇంకెవరున్నారు? కనిపించిన కుర్రకారు అందరివైపు వ్రేలు  పేట్టి చూపిస్తూ అన్నాడు అనంత్.
   
    "పెద్దమ్మగారు మీరు చెప్పండి ఎవరు, ఎవరు ఆడపిల్లల్ని గోడవచేసింది?" అధికారి! ఆమె సమాధానంకోసం క్షణం ఆగాడు.
   
    ఆమె వరుణ్ వైపు చేయిపేట్టి చూపించింది.
   
    కూతురు అతని కేసి జాలిగా చూసింది.
   
    అధికారి అతని కాలర్ కూడా పట్టుకున్నాడు.
   
    "అమ్మా_ పాపం అతనిమీద ఎందుకు చెప్పవే..... అతనేం చేయలేదుగా."
   
    "వెర్రిదానా నీకేం తెలియదు. ఈ మగవాళ్ళంత అంతే వాళ్ళకి బుద్ధి రావద్దూ!"
   
    "అలా అని తప్పుచేయని వాళ్ళని దోషులు చేయడం పాపం కదూ!
   
    "నీకు పాపాపుణ్యలగురించి ఏం తెలుసుకునే! నువ్వింకా చిన్నపిల్లవు నోరుముసుకు ఉండు. రిపోర్టు ఇవ్వడమే మనవంతు తరువాత పోలీసు వాళ్ళా ఎముకుల్లో సున్నం లేకుండా తంతారు."
   
    "రాస్కెల్స్ కదలండిరా ...... మీ పని ఇక్కడ కాదు స్టేషనులో తేలుస్తాను" అధికారి ఇద్దరి కాలర్స్ పట్టుకుని ఈడ్చుకుంటూ ఓ.పి. పోలీసు  స్టేషను కు తీసుకెళ్ళాడు.
   
    "సార్ నాకేం తెలియదు. అసలు అమ్మాయిలంటేనే నేను ఆమడదూరంలో వుంటాను. కావాలంటే చూడండి. అసలు నేను నీళ్ళల్లో దిగలేదు" వరుణ్ కళ్ళనీళ్ళ పర్యంత ప్రాధేయపడ్డాడు.
   
    "సార్ వాడు చెబుతుంది నిజమే సార్. గొడవ చేసింది నేనే వాడూ ఆమాయుకుడు వాడిని దయచేసి వదిలేయండి సార్."  అనంత్ నిజాయితీగా తన తప్పు ఒప్పుకుని వరుణ్ ని వదిలేయమని ప్రాధేయపడ్డాడు.
   
    "సారీ తమ్ముళ్ళు పోలీసు డిపార్ట్మెంటులో చివరి ఉద్యోగి నుంచి ఉద్యోగిని నేను కేసులు పట్టుకుని పై ఆఫీసర్ కి అప్పజెప్పటమే నా విధి. జరిగింది నిజాయితీగా నాపై అధికారికి చెప్పుకోండి. మీకు న్యాయం జరుగుతుంది." అధికారి అసహాయతను తెలియచేస్తూ వాళ్లిద్దర్నీ ఇన్ స్పెక్తర్స్ తిలక్ ముందు హాజరు పెట్టాడు.
   
    "డోస్ బాగా పనిచేసిందన్నమాట..... మిమ్మల్ని నుంచోకుండా వెంటబడి తరమాలి. తిట్టాలన్నమాట. అప్పుడే డ్యూటీ సక్రమంగా చేస్తారు ఇడియట్స్ .... ఊ.... వీళ్ళకీ కూడా గుండు గీయించు....." ఎ.సి.పి. సుధాకర్ స్టాఫ్ కి కర్తవ్యం గుర్తు చేశాడు.
   
    "సారీ సార్ ..... అది నా పనికాదు  ...... అయినా వాళ్ళద్దరిలో అతను నిర్దోషి అని చెబుతున్నాడు మీరు విచారించి అతనికి న్యాయంచేస్తే బావుంటుంది" అధికారి వినమ్రంగా అన్నాడు.
   
    "షటఫ్. మధ్యలో నీ రికమండేషను..... వాడితో ఎంతకీ బేరంకుదర్చుకున్నావేంటీ? పో! పో! వెళ్ళి నీ పనిచూసుక!" ఎసిపి చిరాకు పడ్డాడు.
   
    అధికారి వరుణ్ వైపు జాలిగా చూసి వెళ్ళిపోయాడు.
   
    ఓ గంట గడపగానే అధికారి పరుగుపరుగున ఓ.పి. పోలీస్ స్టేషన్ కి వచ్చాడు.
   
    "ఏమిటి విషయం? మీకు ఇచ్చిన డ్యూటీ ఏమిటి ఆ చక్కరేమిటి? ఇన్ స్పెక్తర్స్ తిలక్ అధికారి మీద విరుచుకుపడ్డాడు.
   
    "సార్ ఘోరం జారిపోయింది."
   
    ఇన్ స్పెక్తర్స్ తోపాటు ఏ.సి.పి.  కూడా పిడిగుపడ్డట్టు ఉలిక్కిపడ్డారు.
   
    "అధికారి ఏం జరిగింది?" ఇన్ స్పెక్టర్ ముందుగా తేరుకుని అడిగాడు.
   
    "సార్ మీరు గుండు చేయించిన కుర్రాళ్ళంతా కృష్ణలోదూకి  ఆత్మహత్య చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు. జాలర్లు ఈతగాళ్ళు వచ్చారు. అక్కడ అంతా గొడవగా ఉంది" వగరుస్తూ చెప్పాడు.
   
    "ఆ.... " ఆఫీసర్లు ఇద్దరూ షాకైపోయారు.
   
                                             *    *    *    *    *  

 Previous Page Next Page