అలా వున్నారే? వంట్లో బాగోలేదా?" సరిత భర్త నుదుటిన చేయివేస్తూ అడిగింది.
"అబ్బే బాగానే వుంది అదృష్టవంతురాలిని నువ్వు, నీకు ఏ టేక్షన్స్ వుండవు. హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు" విక్రం భార్యను కౌగిలికి తీసుకుంటూ అన్నాడు.
"లక్క పెడిత అంత ఏరియా మీద గట్టిగా తిరిగితే ఓ గంట పడుతుందేమో మీ ఏరియా సర్వ్ చేయడానికి. మూడు జిల్లాలు చూసుకోవాల్సిన నాకు టే౦క్షన్స్ లేవు అంటారా! ఖాళీగా కూర్చుని గోళ్ళు గిల్లుకునే పోస్టు అనుకున్నారా నాది!" నిష్టూరంగా అంది సరిత.
"సారీ మేడమ్ జీ..... మీరు రేంజ్ డి.ఐ.జి. అన్న సంగతి పొరపాటున మరచిపోయి అన్నాను. అయినా ఈ భక్తుడుని అప్పుడప్పుడు కనిపిస్తున్నందుకు థాంక్సు" విక్రం లైట్ అర్పాడు.
"డాడీ...." పదేళ్ళ కవిత బావురుమంది.
సరిత లైటువేసి కిలకిల నవ్వింది. కూతురు తన బెడ్ దిగి సరాసరి తండ్రి బెడ్ మీద కొచ్చి పడుకుంది.
"గుడ్ గర్ల్ ..... మీ దాడికి ఇలా బుద్ధిచెప్పు తల్లీ! ఎంత పెద్ద పోలీసు ఆఫీసర్ అయితే మాత్రం పది గంటలకే పడుకోవాలంటే కుదరిని చెప్పుతల్లీ!" కూతుర్ని జో కొడుతూ భర్తని చూసి ఉడికిస్తూ అంది.
ఫోను రింగయింది. విక్రమ్ ఫోను తీశాడు. రెండు క్షణాలు మాట్లాడి "ఫోను ఫార్ యూ కాల్ ఫ్రమ్ ఏలూరు."
అంటూ రిసీవర్ సరిత చేతికిచ్చాడు.
ఓ రెండు నిముషాలు ఫోనులో విషయం తెలుసుకున్న సరితకు ముచ్చేమటలు పోశాయి. ముఖం వాలిపోయింది
"వాట్.... వాట్ హేపెండ్ సరిత" విక్రమ్ ఆదుర్దాగా అడిగాడు "లాండ్ మెయిన్ క్లాస్ అయి డిసిపితో సహా తొమ్మిదిమంది ఆఫీసర్లు చనిపోయారు." తోటి పోలీసు ఆఫీసర్లు చనిపోవడం ఆమెను కలచివేసింది.
"సారీ విక్రమ్..... ఐయాం లీవీంగ్ టు స్పాటు......"
"ఇంత రాత్రా...."
"వెళ్ళాలి.... వెళ్ళితీరాలి...."
సరిత లేచి యూనిఫాం వేసుకుంది.
"ప్చ్ ...."విక్రమ్ నిట్టూర్చాడు.
కవిత ఆదమరచి నిద్రపోతుంది.
"పాపని జాగ్రత్తగా చూడండి. రేపు ఆదివారమే గనుక ఇక్కడ ఉంచేయండి. నేను రాగలిగితే వచ్చి సోమవారం సరాసరి ఏలూరు పంపండి. తోడుగా ఎవరైనా కానిస్టేబుల్ ని పంపండి....."
"ఒకే ...ఓ.... కే..... జాగ్రత్తలన్నీ నువ్వు నాకు మరల మరలా గుర్తుచేయాలా....? ఇదంతా షరా మామూలే ఐటేక్ కేర్ ఆఫ్ ఎవ్వరి థింక్, నువ్వు జాగ్రత్త ఎక్సైట్ అవ్వక. తొందరపడి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదన్నా ఇంపార్టెంట్ మేటర్ ఉంటే నాతో మాట్లాడు ఓ.కే."
"ఓ.కే .... గుడ్ డే....."
సరిత వెళ్ళిపోయింది.
విక్రమ్ బయటకు వచ్చి చూశారు అక్కడ టెలిఫోను దగ్గర లేడీ కానిస్టేబుల్ సీత కునికుపాట్లు పడుతుంది.
కమీషనర్ రావడంతోనే కంగారుగా లేచి నుంచుంది. ఆమెకు నిద్రమత్తు వదిలింది.
"సీతా యుకేన్ గో నౌ...... మెడమ్ ఏలూరు వెళ్ళారు. రేపు ఉదయం వచ్చి పాపకి స్నానం వగైరా అన్నీ నువ్వే దగ్గరుండి చూడాలి."
"అలాగేసార్ ......." సెల్యూట్ పేట్టి పక్క బట్టలు తీసుకుని సీత వెళ్ళిపోయింది.
7
"మీరు ఏం చేస్తారో. ఎలా చేస్తారో నా కానవసరం. కానీ కొత్తగా వచ్చిన పోలీసు కమిషనర్ తృప్తిపర్తచడం నావల్ల కావడంలేదు. ఆ సిపి బట్టి పని రాక్షసుడిలా వున్నాడు. ఎప్పుడూ డ్యూటీ. డ్యూటీ. డ్యూటీ ఇక భార్యా పిల్లలు సుఖం సంతోషం ఏమీ అక్కర్లేదన్నట్టుంది ఆయనగారి వాలకం చూస్తుంటే...." యాంటీ గూండా ఎకరుపు పెట్టాడు.
అంతా అతనివైపు జాలిగా చూశారు. ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు నాలుగు సానుభూతి మాటలు చెప్పాలనుకున్నారు.
కానీ అంతలోనే ఫోను రింగయింది.
"అదిగో ఫోను రింగయితే నా ఫల్స్ కొట్టుకోవడానికే భయపడుతున్నట్టు క్షణం ఆగి మరలా కొట్టుకుంటుంది......" ఫోను రేండోసారి రింగయింది.
ఇన్స్ స్పెక్టర్ ఈమాటలు ఆపి ఓసారి తృప్తిగా గాలి పీల్చుకున్నారు. ఎదురుగా ఉన్న గ్లాసుడు నీళ్ళు గడగడ త్రాగేశారు .
"నోడౌట్ ఆ ఫోను అక్కడనుంచే "ఆయాసంగా రిసీవర్ ఎత్తాడు.
అవతల వైపు నుండి విషయం తెలుసుగోకానే ఇన్స్ స్పెక్టర్ హరిశ్చంద్ర కుర్చీలో కుప్పకూలిపోయాడు. ఫోను రిసీవర్ ఏకంగా జారి నేలమీద పోయింది.
స్టాఫ్ హడావిడిగా ఇన్ స్పెక్టర్ ముఖంమీద నీళ్ళు జల్లారు.
సబ్ ఇన్స్ స్పెక్టర్ క్రిందపడిన రిసీవర్ తీసి పట్టుపగలు వేటకోడవళ్ళతో ఇద్దరు వ్యక్తులను దారుణంగా నరికేశారు.
ఇన్స్ స్పెక్టర్ స్పృహా వచ్చింది.
"గోవిందా! గోవిందా! అయిపోయింది ఈ దెబ్బతో నాకు సస్పెన్స్ ఖాయం...." ఇన్స్ స్పెక్టర్ తడబడుతూ అన్నాడు,.
"ఏంటీ సార్, మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి టెన్షన్ పెంచుకుంటున్నారు. ఇంత మహనగరంలో నేరాలు జరగకుండా ఎలా ఉంటాయి. అసలు నేరాలు జరగకపోతే ఇంత పోలీసు ఫోర్స్ ఎందుకుంది. అయినా మనం మర్డర్లు జరగాలని కోరుకున్నామా! లేక మర్డర్లు చేయించామా? పదండి సార్ తరువాత కార్యక్రమం చూద్దాం, ఏం జరుగుతుందో అదే జరుగుతుంది" అందరిలోకి వయసుల పెద్ద, జుత్తు నెరసిన హెడ్ కానిస్టేబుల్ పాపారావు ఇన్స్ స్పెక్టర్ కి ధైర్యం చెప్పాడు.
పదండిసార్ ..... ఇబ్బంది అంతా కోరస్ గా అనడంతో ఏనుగంత బలం వచ్చినట్టు ఇన్స్ స్పెక్టర్ జీపు ఎక్కాడు. సిబ్బంది ఎక్కగానే జీపు మర్డర్ స్పాట్ కు తీసుకువెళ్ళాడు డ్రైవర్.