Previous Page Next Page 
అధికారి పేజి 8

 

    "సార్.... అసలు ఏం జరిగిందంటే...."
   
    అతన్ని విషయం చెప్పనీయకుండానే ఇన్ స్పెక్టర్ తిలక్ కల్పించుకుని
   
    "ఔట్ పోస్టులో ఈవ్ టీజర్స్  ని పెట్టాం నువ్వు వెళ్ళిముందు వాళ్ళకి గుండుకొట్టించు" ఆర్డర్ జారీచేసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
   
    అధికారికి విషయం పూర్తిగా అర్ధంగాక  ఔట్ పోస్టుకు  బయలుదేరాడు.
   
    అక్కడ ఓ ఐదుగురు కుర్రాళ్ళు వున్నారు. వాళ్ళంతా పదిహేను పదహారు సంవత్సరాలలోపు  వాళ్ళే. వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళు అడపిల్లల్ల్ని ఏడిపించారనుకోవడం కష్టమే. ఒక విధంగా  చూస్తే ఆడపిల్లలే అమాయకంగా కనిపిస్తున్న ఆ మగపిల్లల్ని ఏడిపించి ఉండోచ్చని నిర్దారణకు రావచ్చు.
   
    "నీకే చెప్పేది వెళ్ళి మంగలివాడిని తీసుకువచ్చి వాళ్ళకి గుండుగీయించు" ఇనే స్పెక్టర్  తిలక్ అక్కడికి చేరడంతోనే  అన్నాడు.   
   
     అధికారి తల పైకెత్తాడు. ఇన్స్ పెక్టర్ ప్రక్కనే ఎ.సి.పి. కూడా వున్నాడు.
   
    తల దించి మౌనం వహించాడు.
   
    ఈసారి ఎసిపి కల్పించుకున్నాడు.
   
    "ఏయ్ మిస్టర్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్ స్పెక్టర్ అర్ధం కాలేదా?" అవునూ కాదు అన్నట్టు అధికారి తల అడ్డంగా తిప్పాడు.
   
    "వాట్..... ఏమిటా హెడ్ లాంగ్ బిహేవర్"
   
    "సారీసార్ అది నా డ్యూటీ కాదు" అధికారి స్థిరంగా అన్నాడు.
   
    "సారీ సార్ అది నా డ్యూటీ కాదు" అధికారి  స్థిరంగా అన్నాడు.
   
    "ఐసీ.... అంటే నీ కిచ్చిన డ్యూటీ నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నానంటావు.ఇన్నిరోజుల. బందోబస్తులో నువ్వు ఒక్క నేరస్తుడినన్నా పట్టుకున్నవా?  కనీసం ఈవ్ టీజర్నీ అన్నా అరెస్టు చేయగలిగావా?"
   
    "నా కళ్ళు ఎదట ఏ అరాజకం జరగకుండా ఆపగలిగాను సార్, ఏ నేరం జరగకుండా చూడగలిగాను సార్."
   
    "షటప్ యూ బగ్గర్.... ఐ విల్ సాక్ యూ" 
   
    "ఐ విల్ స్మాష్ యు ..... ఇన్స్ స్పెక్టర్ నోట్ హీజ్ నెంబర్ అండ్ ఆదర్ పర్టిక్యులర్స్ యూ బెగ్గర్ గెటౌట్" ఆవేశంగా  అరిచాడు ఎ.సి.పి.
   
    "సార్ కూల్ డ్రింక్ తీసుకొండి."
   
    ఇన్స్ స్పెక్టర్ ఎ.సి.పి. ని కూల్ చేయడానికి ప్రయత్నించాడు.
   
    "మిస్టర్ ఇన్స్ స్పెక్టర్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏమంత బాగో లేదు. ఈవ్ టీజింగ్ గురించి చాలా రిపోర్టులు వస్తున్నాయి.
   
    "సార్ మంగలివాడ్ని పిలిపించాను. వాళ్ళా ఐదుగురికి గుండు గీయించమంటారా?"
   
    "వాట్ మెన్...... ఎన్నిసార్లు చెప్పాలి. డూ ఇట్, వెంటనే చేయించండి."
   
    ఐదుగురు కుర్రాళ్ళకి ఓ అరగంటలో నున్నగా గుండు గీసాడు మంగలి.
   
    "పొండిరా పొండి, ఇప్పుడు ఏడిపించండి ఆడపిల్లల్ని" ఏ.సి.పి. వాళ్ళు ఐదుగురినీ వీపులమీద చరుస్తూ అన్నాడు.
   
    అప్పటిదాకా కృష్ణలో స్నానాలాడి ఒడ్డుకు చేరుకున్నారు యిద్దరు వ్యక్తులు. ఒకరు అనంత్ మరో వ్యక్తి వరుణ్. ఆ యిద్దరు పద్దేనిదేళ్ళ ప్రాయంలో వున్నారు.
   
    బట్టలు మార్చుకుని ఇద్దరూ బయలుదేరారు .
   
    హాల్లో......" అన్నాడు ముందుగా అనంత్ ఎదురుగా వస్తున్న పదహారేళ్ళ కన్నెపిల్లల్ని గమనించి.
   
    ఆమె తలతిప్పి చూసిందతనివేపు.
   
    అనంత్ చటుక్కున కన్నుగీటాడు.
   
    ఆమె ముఖంలో రంగులు మారాయి.
   
    "రాస్కెల్" అంటూ చరచరా వెళ్ళిపొయిందామె. వరుణ్ అదంతా గమనిస్తూనే వున్నాడు.
   
    ఆమె తిట్టింది తనని కాదన్నట్టు స్టయిల్ గా భుజాలెగరేసి మరోవేపుకు వెళ్ళిపోయాడు అనంత్.
   
    "ఛీ! ఛీ! వీడు ఎప్పుడూ యింతే, ఎప్పటికప్పుడు ఎవరో ఒక అమ్మాయిని ఏడిపించడానికి ప్రయత్నిస్తు౦టాడు.అసలు కొందరు అడపిల్లలు వెకిలిగా ప్రవర్తించడం, మారి, అలుసుగా తీసుకుని అందరు అడపిల్లలు అంతే అనుకుంటాడీ అనంత్ గాడు, ఎవరో ఒకరు చెంపపెట్టున వాడికి బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరం లేదు సుమా!" వరుణ్ అనంత్ గురించి, అతని అసహ్య ప్రవర్తన గురించి రకరకాలుగా ఆలోచిస్తూన్నాడు.
   
    ఉన్నట్టుండి వరుణ్ దృష్టి అటు మరలింది. ఇద్దరు ఆడవాళ్ళు బహుశ తల్లీకూతుళ్ళయి వుండాలి.  తన వైపే నడచి వస్తున్నారు.
   
    అతని మనసు ఊహల్లోకి తేలిపోతుంది. కళ్ళముందు హాఠాత్తుగా సప్తవర్ణాల ఇంద్రధనస్సు సాక్షాత్కారించినట్టు. తెలియని విద్యుత్ యెదో శరీరం అంతా ప్రాకి కంపనకు గురిచేస్తున్నట్టు.... కనురేప్పల్లోకి వ్రాలిన మైమరపు తలుపులు... తను స్వప్నసుందరిని తొలిసారిగా చూసిన షాక్. ఆ షాక్ లో తడబాటు, తన్మయత్వం.......
   
    ఆమె దగ్గరవుతున్నకొలదీ ఎగసి పడుతున్న అతని మనసు ఒక్కసారిగా మూగపోయింది. హృదయాంతరాళ్ళల్లో తొలి ప్రేమ ఘోష మొదలయింది.
   
    తల్లీకూతుళ్ళు యిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఒంట్లో ఉన్న ధైర్యం అంతా ప్రోగుచేసుకుని చిరునవ్వు నవ్వాడు. వరుణ్. అయినా ఆమె పట్టించుకోలేదు.
   
    తల్లీకూతుళ్ళు ముందుకు వెళ్ళిపోయారు.
   
    నిరాశా నిసృహాలకు లోనయినా పట్టువదలక వాళ్ళనే అనుసరించాడు  వరుణ్.
   
    అప్పటికే అనంత్ చూపులు ఆ అమ్మయిమీద పడ్డాయి.
   
    "వ్వా.... చిలకకొట్టని జాంపండు " అంటూ కామెంట్ చేశాడు.
   
    తల్లీకూతుళ్ళు ఇద్దరూ స్నానఘట్టంలో మగవాళ్ళకి దూరంగా స్నానంచేస్తున్నా ఆడవాళ్ళతో కలసి నీటిలోకి దిగారు.
   
    లంగా, జాకెట్టుతో అసలు సిసలయిన పదహారణాల పల్లెపడుచు ఇలాగే వుంటుందిగాబోలు అన్నంత అందంగా వుందామె. అనంత్ తో పాటు అక్కడ వున్న మగ మహారాయుళ్ళు కళ్ళాన్నీ ఆమెమీద పడ్డాయి.     

 Previous Page Next Page