Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 7

    పోస్టు అయ్యుంటుందనుకుంటూ లత వెళ్ళి తలుపు తీసి ఆశ్చర్య పోయింది.   
    అక్కడ మోహన్ నవ్వుతూ నిలబడి వున్నాడు.   
    అప్రయత్నంగా ఆమె పైట సవరించుకుని, "మీరు నిన్న రాత్రి వూరుకెళ్ళలేదా?" అనడిగింది. ఆ సమయంలో అతను వస్తాడని వూహించని కారణంగా ఆమెకు చాలా చిరాగ్గా వుంది.   
    "లేదు. అందుక్కారణం తర్వాత చెబుతాను. రామారావింకా ఇంటికి రాలేదా?"   
    "ఈ రోజు ఆఫీసుగదా __ ఆయనింటికి వచ్చేసరికి సాయంత్రం ఐదవుతుంది."  
    "ఆ సంగంతి నాకు తెలుసు " అన్నాడు మోహన్.  
    'తెలిసికూడా ఎందుకు వచ్చింట్టు?' అనుకుంది లత. అతను వెళ్ళిపోతాడేమమోనన్న ఉద్దేశ్యంతో ఇబ్బందిగా అక్కడే నిలబడింది.   
    "నేను మీ ఇంటికి వస్తున్నట్లు ఓ గంట క్రితం రామారావుకి ఫో చేసి చెప్పను. వెంటనే బయల్దేరివస్తునన్నాడు. ఈ పాటికి వచ్చి వుంటాడనే అనుకున్నాను" అన్నాడు మోహన్.   
    అతన్ని లోపలకు ఆహ్వానించక తప్పదని గ్రహించి, "రండి, లోపలకు. ఆయనింకా రాలేదు." అంది లత.   
    మోహన్  వెంటనే లోపలకు వచ్చి డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించి కూర్చున్నాడు. లతను చూసి, "మీరేదో హడావిడిలో వుండగా నేనేదైనా పుస్తకం చూస్తూంటాను. " అన్నాడు.   
     అలా చేయడం మర్యాదుగా ఉండడనిపించింది లతకు. భర్త వచ్చేదాకా తనే అక్కడ కూర్చుని కబుర్లు చెప్పాలనుకొంది. ఆమె కూర్చుంటున్నందుకు మోహన్ మనసులో ఆనందిస్తూ పైకి మాత్రం, "మీరు వెళ్ళండి _ ఫర్వాలేదు . మనలో మనకి మర్యాదులేమిటి?" అన్నాడు.   
    "ఇందులో మర్యాదేముందండీ? ఇక్కడ కూర్చోవడంవల్ల నాకు మంచి కాలక్షేపం. మీరు కబుర్లు బాగా చెబుతారు" అంది లత మొహమాటానికి.   
    అందమైన ఆడవాళ్ళు నోటి వెంటనుంచి అటువంటి పొగడ్తలు వినడం మోహన్ కి సరదా. అందుకే తన వాక్చాతుర్యంతో వాళ్ళను అటువంటి సంభాషణలు చెప్పేలా చేస్తాడు  
    మోహన్  ఇప్పుడు పెద్ద ప్లాన్ మీదనే వచ్చాడు.  అనికోని వేళలో కాలింగ్ మ్రాగితే ఆడవాళ్ళు  హడావుడిగా తలుపు తీస్తారు వాళ్ళని అలా చూడడం అతనికిష్టం. అతని కోరిక కొంతవరకు తీరింది.   
    లత  ముగురులు బాగా చెదిరి వున్నాయి. చీర ఆమె శరీరం మీద వుండడంవల్ల అందంగా ఉన్నా, అది అట్టే మంచిది. కాదు. పైట సరిగా వేసుకోలేదు. తనను చూసి సవరించుకుంది. చేతులు తడిగా వున్నాయి. ఒంటినిండా నీటి బోట్లున్నాయి. బహుశా బట్టబలుకుతూ వుంది వుంటుంది అనుకున్నాడు.
    'ఒకో పనిలో ఒకో అందం, అనుకొన్నాడు మోహన్ అతను సంబాషణ ఇంకా ఆరంభించలేదు. మరీ సూటిగా కాకపోయినా ఆమెనే పరీక్షిస్తున్నాడు ఆమె పైకీ క్రిందకీ చూస్తోంది గానీ, అతన్ని చూడడంలేదు.
    "మీరు వెళ్ళి పని చూసుకోండి." ఆన్నాడు మోహన్.
    "పనేముంది లేండి __ ఎప్పుడూ వుండేది!" అంది లత.
    "పొద్దున్న పదినుంచి సాయంత్రం ఐదుదాకా ఒక్కరే వుంటారు గదా __ ఎం చేస్తారండీ ? బోరుకొట్టదూ? అన్నాడు మోహన్
    "ఆ సమయంలో నాకు ఏకాంతమే బాగుంటుంది. నేను బాగా పుస్తకాలు చదువుతుంటాను" అంది లత.
    "చక్కటి అభిరుచి మీది" అన్నాడు మోహన్. "సాధారణంగా  చాల మంది ఆడవాళ్ళు ఊసుపోక కబుర్లతో సమయాన్ని వృధా చేస్తారు."
    లత బుగ్గలు ఎరుపెక్కాయి. "ఆడవాళ్ళంతా  పుస్తకాలు చదువుతారు. అందుకేగదా ఇటీవల నవలలకు గిరాకీ బాగా పెరిగింది అంది.   
    కాసేపు ఇప్పటి సాహిత్యం మీద సంబాషణ నడిచింది మోహన్ తనాట్టే మాట్లాడకుండా ఎక్కువుగా ఆమెనే చెప్పనిచ్చి ఆమె అభిప్రాయాలను మెచ్చుకోవడం కోసమే తనునోరు విప్పాడు.   
    "ఆయనింకా రాలేదు" అంది లత.   
    "అందుకే __ మీరు వెళ్ళి  పని చూసుకోండి " అన్నాడు మోహన్.
    "అందు గురించి కాదు. సాధారణంగా అయన అన్నట్లే టైముకి వచ్చేస్తారు" అంది లత.   
     "అది మీ విషయంలో నిజామాయ్యుండవచ్చు. నా విషయంలో కాదు" అన్నాడు మోహన్.  
    లత సిగ్గుపడింది. "అలాంటిదేమీ లేదు. అయన మాట ఖచ్చితం మనిషి."   
    ఏమో మరి! ఇంతవరకూ రాలేదు" అన్నాడు మోహన్ పరిసరాలను గమనిస్తూ.   
    ఇల్లు చక్కగా సర్దబడి ఉంది. ఇంటివారి అభిరుచులు ఎంతో ఉన్నతమైనవి ఆ గదిని చూస్తూనే చెప్పవచ్చును.          
    మోహన్ కాసేపు ఆ గదిని మెచ్చుకున్నాడు. ఆమె అభిరుచులను మెచ్చుకున్నాడు  పొగడ్తలతో ఆమెను ముంచేశాడు. ఒక అపరిచితుడు తన నంతగా పొగుడుతూంటే ఆమెకు సంతోషం కలిగింది. అతడి పట్ల కొంత అభిమానం కోద్క కలిగింది.   
    లత కళాకారిణి కాదు గానీ పెయింటింగ్ పట్ల అభిరుచిఉంది. అతనంటగా పొగుడుతూంటే తను ప్రయత్నించిన కొన్ని పెయింటుగులు అతనికి చూపించాలనుకుంది.   
    లత తీసుకు వచ్చిన పెయింటింగ్ చాలా ఓపికగా చూశాడు. మేహన్. నిజానికతనికి వాటిపట్ల ఆసక్తి ని నటించాడు ఒక్కో పెయింటింగ్ గురించి వివరాలడిగి అదే పనిగా మెచ్చుకున్నాడు.   
    ఆమె చూపించిన పెయింటింగ్సన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవే! మనుషులుగానీ, శృంగారంగానీ, ఆమె పెయింటింగ్స్ లో అతనికి కనబడలేదు. చిత్రకారుడుకీ, శిల్పికీ, కవికీ __ చిత్రీకరణలో  గానీ, వర్ణనలో గానీ శృంగార దృష్టి ఉండదు. తమ మనుసుకు హత్తుకున్న రూపాలలో కళను వారు నింపుతారు. ఆ కళను వారు నింపుతారు అ కళను  కళగా చూడగలిగిన వారు రసజ్ఞలు. దానిని కేవలం శృంగార పరంగా తిలకించేవారు కాముకులు. ఆ శిల్పం భగవంతుడే సృష్టించబడినా, ఆ చిత్రం మనిషికారణంగా  రూపొందింప బడినా _ అందులోని భౌతిక విలువలను మాత్రమే గుర్తించగలవాడు మోహన్.

 Previous Page Next Page