తను అదనపు బలగాలను తీసుకుని అబలల మధ్య చిక్కుకున్న ఓ అబలను రక్షించడానికి హుటాహుటిన ఉమెన్స్ కాలేజీకి బయలుదేరాడు.
ఆ కాలేజీ వాటర్ టాంక్ లో వంటిమీద బట్టలు చెదరి సగం నీటిలో మునిగి తేలుతున్న కుమారి ఊర్మిళ మృతదేహం టౌన్ లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడానికి విచ్చిన్నకర శక్తుల విజ్రుంభణకు కేంద్రబిందువు.
కుమారి ఊర్మిళది హత్య! ఆత్మహత్యా ? హత్యా అయితే ఎవరు చేసినట్టు? ఎందుకు చేసినట్టు ? ఆమె మాన భంగానికి గురి అయిందా?
ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందా? ఆత్మహత్య చేసుకోవడానికి నడుము లోతు నీళ్ళైనా లేని ఆ వాటర్ టాంక్ నే ఆమె ఎందుకు ఎన్నుకుంది? అసలు అది ఆత్మాచారమో, హత్యో, ఆత్మహత్యో ఎప్పుడు జరిగినట్టు? ప్రస్తుతం ఈ ప్రశ్నల గురించి ఎవ్వరూ అలోచించడం లేదు. అది పభ్లిక్ కి అనవసరం. ఓ ఆబల, ఆడపిల్ల జీవితం అర్దాంతరంగా ముగిసిపోయింది. అన్యాయం జరిగిపోయింది అంతే ప్రజలకు కావాల్సింది.
యక్ష ప్రశ్నలు పభ్లిక్ కు అనవసరం, ఎలా, ఎందుకు, ఎప్పుడు ఎప్పుడు , ఎక్కడ, ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులది.
ఒకవేపు విద్యార్ధి సంఘాలు, మరోవైపు ప్రజాసంఘాలు, మరోవైపు ప్రెస్ సిటీ పోలీసు యంత్రంగంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నగర కమిషనర్ అందరి వాదనను నర్మగర్భంగా వింటున్నాడు. మధ్య మధ్యన ఆఫీసర్లును పిలిచి సూచనలిస్తున్నాడు. అందరకి ఒప్పిగ్గా సమాదానం చెబుతున్నాడు. మరోవైపు సీనియర్ పోలీసు అధికారులు కేసుదర్యాప్తులో నిమగ్నమయ్యారు.
పట్టణంలో 114 సెక్షన్ అమలులో వుంది. కొన్నిచోట్ల లాఠీచార్జీలు, మరికొన్నిచోట్ల బాష్పవాయువు ప్రయోగం మరికొన్ని చోట్ల గాలిలోకి కాల్పులు జరపడంతో పరిస్థితి చేజారిపోలేదు. సాయంత్రం 6 గంటల ప్రాంతానికి నగరంలో తిరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. నగర పోలీసులు కుమారి ఊర్మిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హస్పటల్ కి బారీ బందోబస్తు నడుమ తరలించారు.
ఇంటర్ నేషనల్ డేకేడ్ ది ఉమెన్' సందర్భంగా ఫంక్షన్ ను కనువిందుగా జరుపుకుంటున్న రోజునే ఓ కన్నె జీవితం బలైపోవడం నగర వాసులేవ్వరికి మ్రింగుడు పడడంలేదు.
ఒక్కోక్కళ్ళు వచ్చిన వేశావిశేషం గురించి చిలవలు పలువలుగా చెప్పుకోవడం సహజమే! కొత్త కమిషనర్ వచ్చి నాలుగురోజులన్నా కాలేదు ఆడపిల్ల అన్యాయంగా బలిపోయింది ఇది ప్రజల అనుమానం. ఇవి అన్నీ షరా మామూలే. రావడంతో ఎ.సి.పి కి మంచి గిరాకీ తగిలింది ఈ కేసు మిష్టరీ! చేధించటంలో కొత్తగా చార్జీ తీసుకున్న పోలీసు కమిషనరు మంచిపేరు వస్తాదని మరికొన్ని వర్గాల ఉవాచ. దర్యాప్తు పూర్తీఅయి శవాన్ని ప్రభుత్వ హాస్పిటల్ కి చేర్చగానే కమిషనర్ సీనియర్ పోలీసు అఫీసర్లని, ఇన్స్ స్పెక్టర్లనీ అందరిని తన ఛాంబర్ కి అర్జెంటుగా రావలసిందిగా తెలియజేశాడు.
* * * *
కృష్ణా పుష్కరాలు......
నేల ఈనినట్టు, కృష్ణా నదీతీరం జనసందోహంతో నిండిపోయివుంది. పిల్లలతోపాటు, పెద్దలు సయితం కేరి౦తాలు కొడుతూ, నదీ జలాలలో మునిగి తేలుతున్నారు.
జంటలుగా వచ్చినవాళ్ళు, గ్రూపులుగా వచ్చినవాళ్ళు, వేరు వేరుగా వచ్చిన యువతీ యువకులు సర్వం మరచి మొలలోతు నీళ్ళల్లో జలకాలాడుతున్నారు.
తడిచిన చీరెలు, పరికిణీలు, లంగాలు, గౌనులలోంచి అందచందాలు వీక్షించదడానికే మేం వచ్చినట్టు కొందరు కర్రకారు ఒడ్డున కూర్చుని స్నానాలు చేస్తున్నా వారివైపు దృష్టి మరల్చకుండా చూస్తూ,
నీళ్ళల్లో మునిగి తేలుతున్న యువతులు అందాలు, తడిచిన బట్టలు, ఒంటికి అంటుకుపోయి వొంపుసొంపులన్నీ ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు చేతులు పైకెత్తినప్పుడల్లా పైట స్థానభ్రంశం చెంది క్షీరరఖండాల మధ్యకు చేరి వుండడంతో వాటి లావణ్యాన్ని వాళ్ళకి కనువిందు చేస్తున్నాయి.
ఆ క్షణం గడిచిపొతే మళ్ళీ తిరిగి రాదేమోనని రెప్ప వెయ్యడం కూడా మరచిపోయి చూస్తున్న యువకుల గుంపులో కొందరు, ఇంకొంచెం ధైర్యంచేసి అడుగు ముందుకివేశారు., తాము, కూడా నదిలో స్నానం చేయడానికి దిగినట్టు నీటిలో దిగి ఆ యువతుల అందాలను మరింత దగ్గరగా చూడవోచ్చన్న ఆశతో కదిలారు.
వాళ్ళ రాకను గమనించిన యువతులు సిగ్గుతో బిక్కచచ్చి పైటలు సరిచేసుకుని మెడలోతు వరకు నీళ్ళలోకి దిగారు.
అక్కడ స్నానఘాటి వద్ద బందోబస్తుతో వున్న పోలీసుల కళ్ళకి ఇదేమీ కనపడలేదనుకుంటే పొరపాటు గత పడిరోజులుగా రాత్రనక పగలనక డ్యూటీచేస్తున్న వాళ్ళకి అక్కడ జరుగుతున్న సంఘటనల్నీ రొటీన్ గానే కనిపిస్తున్నాయి. అలసి కొందరు. విసిగిపోయి మరికొందరు, మన కెందుకులేని ఇంకొందరు సరిపెట్టుకున్నారు. కాని అప్పుడే డ్యూటీ ఎక్కినా అధికారి దృష్టిలో ఆ సీన్ పడనేపడింది.
అతను నాలుగు అంగల్లో ఆ అకతాయిలను సమీపించాడు.
అతన్ని చూస్తూనే ఆకతాయిలు తలోవేపు పరుగు లఘించారు. అమ్మాయిలు. బ్రతుకుజీపుడాని గుట్టకు చేరారు.
సరిగ్గా అదే సమయానికి ఏ.సి.పి. సుధాకర్ ఇన్ స్పెక్టర్ తిలక్ తో అక్కడకు వచ్చాడు.
"ఇడియట్ , ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే ఇక్కడేం పని నీకు?" కానిస్టేబుల్ అధికారిని ఆడవాళ్ళ దగ్గర చూసి ఆవేశపడిపోయాడు ఎ.సి.పి.
"ప్లీజ్ డొంట్ లూజ్ యూవార్ టంగ్. యూ బెటర్ మైండ్ యువర్ టంగ్. యూ బెటర్ మైండ్ యువర్ బిజినెస్ ఆప్టర్ అల్ ఐయాం డూయింగ్ మై డ్యూటీ" ఆవేశంతో నోటిదాక వచ్చిన మాటలకు అధికారి బ్రేకువేశాడు.