ఆమె ఏంచేయాలో తెలియక తడబడుతున్నది.
చివరకు ప్రసాదు తనేతెగించి ఆమెనుదగ్గరగా తీసుకున్నాడు. వసంతలక్ష్మి వారించలేదు కానీ అతడాశ్చర్యపడేవిధంగా భోరున ఏడ్చింది. ఆ ప్రయత్నంగానే ప్రసాదామేను వదిలిపేట్టి __"ఏంజరిగింది.?" అన్నాడు.
"మిమ్మిల్నిచూస్తే నాకు జాలేస్తుంది. కానీ మీకు సహకరించలేనని ఏడుపువస్తోంది" అంది వసంతలక్ష్మి.
ప్రసాదు తెల్లబోయి __"అంటే?" అన్నాడు.
వసంతలక్ష్మి అతడికి దూరంగా జరిగి కళ్ళోత్తుకుని__ "సెలవు" అని వీధిగుమ్మందాకావెళ్ళి తలుపులు తీసుకుని వెళ్ళిపోయింది.
ప్రసాదు అలాగే కూర్చుందిపోయాడు. జరిగిన సంఘటన అతడి వ్యక్తిత్వాన్నీ, శీలాన్ని నిలదీసినట్లయింది.
"ఒరేయ్ ప్రసాదు! నీకేమయింది? కావాలంటే ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకుని సుఖంగా జీవించు. లేదా ఎకాల్ గర్ల్ నో ఏర్పాటుచేసుకో. అతేకాని నీ వాంఛకు అన్నెంపున్నెం ఎరుగని అమాయక యువతలను బైచేయాలనుకోకు. మనదేశపు సాంప్రదాయాలు గొప్పవి. ఆడపిల్లలంత సులభంగా నీకు లొంగరు అలా లోమ్గాదీసుకోవాలనుకోవడం నీరాక్షసత్వాన్ని తెలియజేస్తుంది. అని అంతరాత్మ అతడిని నిందించింది.
ఈ నిండా వాక్యాలను ప్రసాదు అంతగా చలించలేదు.
"నేను దుర్మార్గుడినీకాదు వ్యసనపరుడినికాదు, నాకోసం నావేమ్తబడిఇద్దరాదపిల్లలు శీలాన్ని పరిక్షించానంతే! వాళ్ళు శీలవతులు కావడం నాకెంతో తృప్తిగా వుంది" అని అంతరాత్మకు అతడు బదులిచ్చాడు.
అందులో నిజమున్నదో, అలాగని తన మనసును సరిపెట్టుకుంటున్నాడో ప్రసాదుకు తెలియదు. కానీ తనకో అడతోడు అవసరమున్న విషయాన్నతడు గుర్తించాడు.
ప్రసాదు అందుకు సంబంధించిన ఆలోచనల్లో వుండగానే బాబు, శీనయ్య సినిమానుంచి తిరిగి వచ్చారు. బాబు తండ్రిని చూస్తూనే, "నాన్నా! సినిమా చాలా గొప్పగావుంది. రాజకూమారుడు సవతితల్లి చేతుల్లో చిన్నప్పుడు ఎన్నో కష్టాలుపడి పెద్దకాగానే దానికి బాగా బుద్ధిచెప్పాడు" అన్నాడు.
సవతతల్లి ప్రసక్తివింటూనే ప్రసాదు హతశుడయ్యాడు. అతడి ఆలోచనల్నీ ఒక్కసారిగా దారిమళ్ళాయి.
9
చాలారోజుల తర్వాత నిరంజరావుకు ఉదయ, వసంతలక్ష్మిలతో మాట్లాడే అవకాశలంభించింది. శివరావు ఇంట్లో ప్రయివేటుకాగానే అక్కడకు వసంతలక్ష్మి , ఉదయ కలసివచ్చారు.
వాళ్ళను చూస్తూనే నిరంజనరావు ముఖం చేటంతయింది.
"హలో! చిరకాల దర్శనం " అన్నాడు నిరంజనరావు.
ఆడపిల్లలిద్దరూ స్నేహపూర్వకంగా నవ్వారు.
"మీతో కబుర్లులేక నా బుర్ర పదును తగ్గిపోయింది" అన్నాడు నిరంజనరావు మళ్ళీ.
ఉదయ నవ్వి "ఆడపిల్లలతో కబుర్లుచెబితే బుర్రమొద్దుబారిపోతుందని మా మాష్టారనేవారు" అంది.
"ఆయనో మొద్దయివుంటాడు" అన్నాడు నిరంజనరావు వెంటనే.
అతడి మాటలకు వసంతలక్ష్మి కిస్సుక్కున నవ్వింది.
"ఎందుకండీ నవ్వుతారు?" అన్నాడు నిరంజనరావు.
"మెదడుకు పదునుపెట్టుకోవాలని మీరనుకుంటున్నారు. మెదడు మొద్దుబారిపోతుందని మామేష్టారు భయపడ్డారు. ఇద్దరిలో ఎవరిమెదడు మొద్దుఅయుంటుందనీ అనుమానం వచ్చింది" అని వసంతలక్ష్మి మళ్ళీ నవ్వింది.
ఆమె విసురు నిరంజనరావు అర్దమైంది. ఎంచెప్పాలో తెలియక అతడు మాటమార్చుతూ "ఇన్నాళ్ళూ ఏమోపోయారు.? ఏదైనా ఊరెళ్ళారా?" అన్నాడు.
ఉదయ అతడిని వదలచుకోలేదు. "మా మెదళ్ళకు పదునుపెట్టుకుంటున్నాం" అంది.
"అందుకే మనదీ మంచి స్నేహం. మీరు మెదళ్ళకు ఎలా పదును పోట్టుకుంటున్నారో చెబుతారా?" అన్నాడు నిరంజనరావు.
"మా ప్రయత్నాన్నీ ఫెయిలైపోయాయి. మీసలహాకోసం వచ్చాం" అంది ఉదయ.
నిరంజనరావు గతుక్కుమన్నాడు. అతడా అడపిల్లలిద్దర్నీ ఓకంటకనిపెడుతూనేవున్నాడు. ప్రసాదు కోసం వారిద్దరూ వలలు విసురుతున్నారనీ అతడు గ్రహించాడు. అదితడికి కడుపుమంటగానే వుంది. అందగాడు, అయిదేళ్ళ బాబుకు తండ్రి అయిన విధురుడికోసం తాపత్రయపడుతున్నారు. అదితనకు అవమానం కనీ ఎంచేయగలడు?
ఇప్పుడు వీళ్ళడిగే సలహా దేనికి?
"మాట్లాడరేమండీ __ సలహా ఇవ్వరా?" అంది ఉదయ.
"మీరు చేసిన ప్రయత్నాలేమిటో అవెలా ఫెయిలయ్యయో చెబితే. ఏదైనా సలహా యివ్వడానికి ప్రయత్నిస్తాను." అన్నాడతడు.
"పత్రికలను కధలు రాసి పంపుతున్నాం అవి తిరిగి వస్తున్నాయి రచయిత్రులం కావాలని మా ఇద్దరి తాపాత్రయమూనూ, పత్రికల్లో పడేవిధంగా కధ వ్రాయాలంటే ఏంచేయాలో చెబుతారా?" అంది ఉదయ.
వసంతలక్ష్మి ఆశ్చర్యంగా ఉదయ వంక చూసింది. తామెప్పుడూ రచయిత్రులంకావాలనికోరుకోలేదు. ఆమెఅతడిలో అబద్దమెందుకుచెబుతోంది.
"అడపేరుతోరాస్తేనే కధలు పడిపోతాయంటారు. ఆడపిల్లలు కధలు రాస్తే తిరిగిరావడమా?" అన్నాడు నిరంజనరావు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ.
"అడపేరు కర్మేమిటి? కధతోపాటు ఎందుకైనామంచిదని ఫోటో, జీవితవివరాలు కూడా పంపిచూశాం. అయినా తిరిగి వచ్చేస్తున్నాయి" అందిఉదయ.
"అయినా మీరు కధ వ్రాసి ఏంచేద్దామని!" అన్నాడతడు.
ఎంచేయడమేమిటి?కధవ్రాస్తే పేరోస్తుంది. డబ్బోస్తుంది. మాకథలు సినిమాలుగాకూడా తీయొచ్చు. అప్పుడామాకుకార్లు, బంగళాలు కూడా ఉంటాయి. అప్పుడు పెళ్ళికోసం మగవెధవలే భయమేస్తుంది" అన్నాడు.
దాని గురించి ఏమీ అనకుండా __"ఇప్పుడు వెధవలసంగతి ఎందుకుగానీ __ కథల సంగతి మాట్లాడుకుందాం" అంది ఉదయ.
"కథలు గురించి మీకు సలహా కావాలంటే నేనేం చెప్పగాల్ను? ఎవరినైనా రచయితనో, తచాయిత్రీనో ఆశ్రయించండి" అన్నాడు నిరంజనరావు.
"పుట్టుగానేచేప ఎలా ఈదగల్గుతుంది? అడవిలోని నెమలికి అటఎవరైనా నేర్పారా? అలాగే కొందరికి కొన్ని సహజంగాకానీ కథలు చెప్పడం మాత్రం మగవాళ్ళకు వస్తుంది" అంది ఉదయ.
"అంటే"? అన్నాడు నిరంజనరావు.
"మీరుచెప్పండి. నేను రాసుకుంటాను. అలా నాలుగైదుసార్లుచేస్తే కథవ్రాయడంవచ్చేస్తుంది. అప్పుడు మీరు చెప్పకుండానే రాసుకునిపోతాను"
"కనీ నాకు కథలు చెప్పడం రాదే!" అన్నాడు నిరంజనరావు.
"కధలుచెప్పడంరాని మగాళ్ళు ఈభూప్రపంచంలో ఉండరు" అంది ఉదయ ఖచ్చితంగా.
నిరంజనరావు రావవ్మ్త ఉక్రోషం వచ్చింది ఉదయ ఆడపిల్లనికాని పక్షంలో ఆ ఉక్రోషమే కొ౦డంత వుండేది. అతడు నెమ్మదిగా __"నాగురించి మీకేంతెలుసు? కథలుచెప్పాడంరాని మగాడిని ఈభూప్రపంచంలో నేనున్నాను" అన్నాడు.
"అదేమిటో ఇప్పుడే తెల్చేస్తాను" అంది ఉదయ __"వుడాహరణకు నీకు ఇప్పుడుద్యోగంలేదు. మీరు పెళ్ళివిషయంలో ఎన్నో ఆశయాలు చెప్పారు అవన్నీ ఆశయాల్ని ఇప్పుడానవచ్చు. కానీ మీకుఉధ్యోగం వచ్చేక మీ ఆశయాలు మరచిపోతారు. ఇప్పుడు చెప్పిన ఆశయాలు అప్పుడు కథలవుతాయి. భవిష్యత్తు తెలిసిందాన్ని కాబట్టి మీరు కథలు చెబుతున్నారని ఇప్పుడేచెప్పగలిగాను"
ఒక ఆడపిల్ల ఇంత సూటిగా నిలదీసిమాట్లాడేసరికి నిరంజనరావు కేమనాలో తెలియలేదు __"అసలు మీకేమయి౦ది? మీరెప్పుడూ ఇలామాట్లాడలేదు__ ఎవరినామిమ్మల్ని అనరానిమాటలనీ మనసుగాయపరిచారా?" అన్నాడతను.
"అదేంలేదు __ మగవాళ్ళు గురించి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. వాళ్ళను మగాళ్ళుకాకా మగవెధవలనానిపిస్తోంది" అంది ఉదయ.
మళ్ళీ ఆమె మాటల్లో విపరీతమైన కసీ ద్వనించింది.
నిరంజనరావు గంభీరంగా ముఖంపెట్టి __"రావణుదున్న ప్రపంచంలోనే రాముడూ వుంటాడు. మీరు రావణుడిని చూసి వుంటారు" అన్నాడు.
ఉదయ తమాషాగా నవ్వి __ "రాముడు భార్యను అడవులకు పంపించాడు. రావణుడు అడవిలోని సీతకు రాణివాసం ఇవ్వాలనుకున్నాడు. అడదాన్ని అణచివుండడంకోసం మీ మగాళ్ళు రామున్ని గొప్పచేసి, రావణున్ని హీనపర్చి కథలుచెప్పారు. ముందే చెప్పానుగా __ కథలు చెప్పడం మీమగవాళ్ళకు సహజంగా అబ్బే విద్య అని!" అంది.
నిరంజనరావు కి ఏమానాలో తెలియలేదు. ఈ ఆడపిల్లలు తన వ్యక్తి త్వాన్నిరాదిస్తున్నారని ఇంతకాలమూ భావిస్తున్నడతడు. కానీ వీళ్ళు తన మాటలను విని అందులోని నిజాని జలనన్వేషించి తన వ్యక్తిత్వాన్నే కించపరిస్తారని అతడు భావించలేదు.
ఉదయగారు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు" అన్నాడు నిరంజనరావు వసంతలక్ష్మి వంక చూస్తూ.
వసంతలక్ష్మి నవ్వి __"తనెలా మాట్లాడినా ఉద్యోగం రాగానే కట్నం లేని పెళ్ళి చేసుకుంటానని మీరు గట్టిగా చెప్పకలేకపోతున్నారు. అమాటకొస్తే అసలు మీరుధ్యోగం కోసం ఆగడమెందుకూ? ఇప్పుడు మాత్రం కట్నంలేని పెళ్ళి చేసుకోకూడదూ?" అంది.
నిరంజనరావు అప్పుడే తన నిజాయితీ రుజువుచేసుకోవాలన్నంత ఆవేశంకలిగింది. కానీ అంతలోనే అతడికో అనుమానం వచ్చింది __ ఈ ఆడపిల్లలు తెలివిగా త్రాఫ్ చేయడంలేదుగదా అని!
పరిస్థితి తన కనికూలంగా లేదని నిరంజనరావు వాళ్ళ దగ్గర్నుంచి సెలవుతీసికుని వెళ్ళిపోయాడు.
అతడు వెళ్ళగానే వసంతలక్ష్మి ఉదయతో __"ఏమిటో __ అతడికీరోజు అమ్తాలా ఎతాకిచ్చేశావు!" అంది.
ఉదయ నిట్టూర్చి__ "ఇదేకాబోలు అట్టమీద కోపం దుత్తమీదచూపించడం అంటారు" అంది
"దుత్తఎవరో తెలూస్తూనే వుంది అత్తేఎవరు?" అనడిగింది వసంతలక్ష్మి "నువ్వెవరనుకుంటే వాళ్ళే!" అంది ఉదయ.