"నువ్వెవరనుకుంటే వాళ్ళే!" అంది ఉదయ.
వసంతలక్ష్మి కొంత ఊహించుకోకలిగింది. ఉదయకూడా తనతో పోటీపడుతున్నది. ప్రసాదు కోసం. ప్రసాదు ఈమెతోకూడా అతిగా ప్రవర్తించాడా? ఉదయకు అతడిపై కోపంవచ్చిందా? కోపంవస్తే ఆమె ఆతడినివదులుకుంటుందా?
ఉదయ ప్రసాదు ను వదులుకుంటే తనకు పోటీ తొలగినట్లే....
కానీ....
ప్రసాదు తనతో అతిగా ప్రవర్తించాడు. తను అతడికి దూరంగా వుండాలనుకుంటున్నది కానీ అతడిమీద కోపగించుకోలేదు. అతడిని వివాహం చేసుకోవాలన్న కోరికకూడా అలగేవుంది. అలాంటప్పుడు ఉఅదయకుమాత్రమూ అతడిమీద కోపం ఎందుకు వస్తుంది!
అదీకకా అత్తమీద కోపం దుత్తమీద మళ్ళిస్తున్నది ఉదయ. అంటే ప్రసాదు పై కోపగించుకునే ఉద్దేశ్యమామేకులేదు.
నాకు తెలిసిందిలే అత్తా ఎవరో!" అంది వసంతలక్ష్మి.
"ఎవరో చెప్పు"
"నేను చెప్పను" అంది వసంతలక్ష్మి
ఒక్కక్షణం ఇద్దరూ కలసి ప్రసాదు గురించి మాట్లాడుకోవడం మంచిదని ఇద్దరికీ కూడా అనిపించింది.
ప్రసాదు ఎలాంటివాడు? అతడేలా మాట్లాడతాడు? అతడి ప్రవర్తన ఏ విధంగా వుంటున్నది....? .. అన్న విషయాలు వారి వారి అనుభవాలనుబట్టి చర్చించుకుమ్తే ఎంతో బాగుండును!
కానీ ఒకరితో ఒకరు పోటీపడుతున్న ఆ అమ్మయిల్నే విషయంలో మానసువిప్పి ఎలా మాట్లాడుకోగలరు?
ఉదయ వససంతలక్ష్మీ నింకేమీఅడుగలేదు. అత్తఎవరో వసంతలక్ష్మి కి తెలిసిందా? తెలిస్తే ఎలా ఊహించింది? తనకూ ప్రసాదుకీ మధ్య జరిగిన ఆ సంఘటన తెలిస్తే తప్ప తనకు ప్రాసాదుపై కోపం వచ్చే అవకాశమున్నదని వసంతలక్ష్మి ఊహించలేదు వసంతలక్ష్మి కీ ప్రసాదుకీమధ్య కూడా అటువంటి సంఘటన జరిగితేతప్ప సంఘటన వసంతలక్ష్మి ఊహలోకి రాదు.
అంటే ప్రసాదు వసంతలక్ష్మినికూడా లోబర్చుకోవాలని చూశాడా చూస్తె అప్పుడు వసంతలక్ష్మి ఏంచేసింది?
ఉదయ సూటిగా వసంతలక్ష్మి కళ్ళలోకి సూటిగా చూసింది.
ఇద్దరూ ఒకరి కలల్లోకి ఒకరు సూటిగా చూసుకున్నారు. వారికి కనబడిందల్ల __ఒకరి కలల్లో ఒకరి ప్రతిబి౦బం మాత్రమే!
10
ఉదయ, వసంతలక్ష్మి ఆరోజు తనతో మాట్లాడిన తీరుకు నిరంజనరావు బాగా దెబ్బతిన్నాడు. వారిద్దరిలో ఎవరినీ వివాహం చేసుకోవాలని అతడనుకోలేదు వారిని తన జీవితంలో కలిపి అతడు లోతుగా అలోచించలేదు. తాత్కాలికంగా వారిలో తనపట్ల ఆశలు కలిగించి వారు తననారాధిస్తూంటే ఆ మధుర భావనతో మానసిక పొందాలనుకున్నాడు. కానీ వాళ్ళు తాననుకున్నంత తెలివితక్కువవాళ్ళు కాదు. ఈరోజు తనను సూటిగా దెబ్బతీశారు.
తను తప్పుచేస్తున్నాడనీ అందుకు శిక్ష అనుభవించాడనీ అతడంనుకోలేదు. ఉదయ అతడినే ఉద్దేశించి మగవెధవ అన్నది. తనుమగవేదకాడని నిరూపించుకునే అవకాశమున్నదనివసంతలక్ష్మి అన్నది ఈరెండు విషయాలుకూడా నిరంజనరావు పట్టించుకోలేదు. వాళ్ళలా అనడానికి మూలకారణం గురించి అన్వేషిస్తున్నాడతను, అ మూలకారణం ఊహించడానికితడికెంతో వ్యవదీ అవసరం లేకపోయింది.
నిరంజనరావు నిరుద్యోగి తనకున్న వ్యవధిని అతడు చక్కగా ఉపగ్యోగించుకుని శీనయ్యతో స్నేహం సంపాదించాడు. శీనయ్యకు త్వరలో అతడిపట్ల సదభిప్రాయం కలిగింది. శీనయ్యద్వారా అతడు మొత్తం ప్రసాదు గురించిన వివరాలన్నీ రాబట్టగలిగాడు. ఉఅదయ వసంతలక్ష్మి మధ్య జరుగుతున్న పోటీ గురించి కూడా అతడికి చూచాయగా అర్దమైంది.
ప్రసాదుకీ మళ్ళీ వివాహం చేసుకునే ఉద్దేశ్యముంది ఉదయ, వసంతలక్ష్మి అతడి గురించి పోటీపడుతున్నారు. ఈపోటీలో బలబాలాతేల్చుగల కీలకపాత్ర వహిస్తున్నది. అయిదేళ్ళ బాబు!
నిరంజనరావు బాబుతో స్నేహం ప్రారంభించి వాడిని సిలభంగా ఆకర్షించాడు. అతడు వాడిని షికార్లకు తిప్పేవాడు కథలు చెప్పేవాడు.
బాబు నిరంజనరావు ఆకర్షణలోపడ్డాడు. అతడిని బాబయ్యఅని పిలిచేవాడు.
నిరంజనరావు బాబుకు ఉదయపైనా వసంతలక్ష్మి పైనా చాలానేరాలు చెప్పాడు. వాళ్ళు మంచివాళ్ళు కాదన్నాడు.
"కానీ నాతో మంచిగానే వుంటారు!" అన్నాడు బాబు.
"బూచాళ్ళు పిల్లన్ల్నేత్తుకుపోవడానికి మిఠాయితెచ్చి ఇస్తారు. వాళ్ళు నీ మీద చూపించే ప్రేమకూడా అలాంటిదే!"
"అంటే వాళ్ళు నన్నేట్టుకుపోతారా?"
"ఎత్తుకుపోరు నువ్వు మీ అమ్మను మరచిపోయేలా చేస్తారు!"
"అందువల్ల వాళ్ళకేం లాభం!"
"నువ్వు మీ అమ్మను మరచిపొతే __ అప్పుడు మీ నాన్న మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడు. కొత్తఅమ్మవస్తుంది. కొత్తఅమ్మ అంటే సవతిల్లిఅన్నమాట !"
సవతి తల్లి అనగానే బాబు కలల్లో భయం అనిపించింది. శీనయ్యతో చూసిన రాజకుమారుడి కథ వాడికి గుర్తోచింది. దానికితోడుగా నిరంజనరావు వాడికి సవతి తల్లి గురించిన మరికొన్ని కథలు చెప్పేవాడు.
మొత్తంమీద తానెంతో కస్టపడి నిరంజనరావు బాబు మనసులోనాటిన భావాలవి: ప్రసాడుకి మళ్ళీ పెళ్ళిచేసుకోవాలనివుంది. మళ్ళీ పెళ్ళి చేసుకోవాలంటే బాబు తల్లినిమరిచిపోవాలి. అందుకతడుఇద్దరమ్మాయిల సాయంతీసుకుంటున్నాడు. వాళ్ళ పథకం ఫలిస్తే బాబుకు సవతితల్లివస్తుంది. సవతితల్లి ప్రసాదు ను వలలో వేసుకుని బాబును అష్టకష్టాలు పెడుతుంది. అప్పుడు బాబు చదువుకోదానికి వుండడు. ఇంట్లో అమ్తుగిన్నెలు తోమాలి. మాసినబట్టలుఉతకాలి. తడిగుడ్డతో ఇళ్ళు తుడవాలి.న్ సవతితల్లికి కాళ్ళు పిసకాలి.
ఈ పనులన్నీ ప్రసాదు లేనప్పుడే చేయాలి. ఇవన్నీ తనే చేస్తున్నట్టు ప్రసాదుకు తెలియకూడదు . బాబు కానుక తండ్రికివన్నీ చెప్పుకున్నడంటే తండ్రి లేనప్పుడు సవతి తల్లి వాడిని చితకబాదుతుంది.
మా నాన్నకు నన్నెవరైనా కొట్టినట్లు తెలిసిందంటే వాళ్ళను చితకబాదేస్తాడు __ తెలుసా?" అన్నాడు బాబు. వాడికళ్ళలో తండ్రి అసలుకొడుకుతో మాట్లాడాడు. ఎప్పుడూ సవతితల్లితోనే కబుర్లు. మధ్యలో కొడుకువెళ్ళినా విసుక్కుంటాడు. తండ్రి ఎదుటఉండగా సవతి తల్లి కొడుకుమీద ఎక్కడలేని ప్రేమవలకబోస్తుంది అన్నీ అబద్దాలే చెబుతుంది." అంటూ సవతితల్లులు చేసిన ఘోరాలు చరిత్రలన్నీ బాబుకు చెప్పి హడలగొట్టేశాడు.
బాబు నిజంగానే బెదిరిపోయి __"నాన్న నామాట వింటాడా? నాన్న పెళ్ళిచేసుకుంటే ఏంచేయాలి?" అన్నాడు.
"నువ్వు అమ్మను మరచిపోకూడదు ఉదయ, వసంతలక్ష్మి లతో స్నేహం చేయకూడదు వల్లమాటలు నమ్మకూడదు. నేకిప్పుడే అనుమానంవచ్చినాన్నన్నేఅడిగి తెలుసుకోవాలి. తెలిసిందా?" అన్నాడు నిరంజనరావు.
నాన్న నిజంగామళ్ళీ పెళ్ళి చేసుకొడుకదూ" అన్నాడుబాబు.భయంతో .
"నువ్వు ఒప్పుకోణంతకాలం మళ్ళీపెళ్ళిచేసుకోడు. పెళ్ళిచేసుకోణంత కాలమే నీమాట వింటాడు. చేసుకున్నాక నీమాట వినడు __" అన్నాడు నిరంజనరావు.
నిజం చెప్పాలంటే నిరంజనరావు బాబు భవిష్యత్తు గురించిన బెంగలేదు. బాబుజీవితం గురించిన ఆసక్తిలేదు అతడు చూసుకుంటున్నదల్లా వర్తమానం అదీతనకు సంబందిచ్మ్హిన వర్తమానం.
ఉదయ వసంతలక్ష్మి ఎబాబుకు దగ్గర కావాలనుకుమ్తున్నారావు బాబును వాళ్ళకు దూరంచేయాలి. ఏ ప్రసాదును వారు కోరుతున్నారో ప్రసాదుకు మళ్ళీ పెళ్ళి అన్న ఆకాశమేలేకుండాచేయాలి.
అందువల్ల తనకు ప్రయోజనం మేమిటో నిరంజనరావుకు తెలియలేదు. తాత్కలికంగా ఉదయనూ, వసంతలక్ష్మి నీ ప్రసాదుకు దూరంగా ఉంచడం వర్తమానమైతే భవిష్యత్తులో తనకుధ్యోగంరాగానే ఆ ఆడపిల్లలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కూడా అతడానుకుంటున్నాడు.
అడపిల్లలకు మంచిమనసుతో పనిలేదు. వారికి హొదాకావలి. హొదాలభించేమాటైతే వారికి భర్త కుంటి, గుడ్డి, మూగవాడైనా ఆఖరికి రేండోపెళ్ళి వాడైనా ఫరవాలేదు. వాళ్ళకు హొదాగురించి అంత తాపత్రయముండబట్టే మగాళ్ళు కట్నాలంటూ చెట్టేక్కుతున్నారు.
"చేసుకున్నవారికీ చేసుకున్నంత మహాదేవ!" అనే అభిప్రాయాని కొచ్చాడు నిరంజనరావు.
11
ప్రసాదు కొద్దిరోజులుగా తన ప్రవర్తన గురించి సింహవాలోకనంచేసుకుంటున్నాడు. అతడిప్పుడు ఉదయను గానీ వసంతలక్ష్మి గాని కలుసుకుని మాట్లాడడంలేదు. తను తప్పుచేశాడనీ, ఆ తప్పు చేయడంలోనూ తొందరపడ్డాడనీ అతడు గ్రహించాడు.
వివాహానికి ముందు అతడేన్నడూ ఇలాంటి తప్పుచేయలేదు. వివాహమైనాక మరో స్త్రీ గురించి అలోచించేలేదు. భార్య, పోయినాకకూడా పునర్వివాహం వలదనే అతడానుకున్నాడు. కానీ ఈ ఇద్దరమ్మయిలా కావాలని అతడి వెంటబడ్డారు. అదతడూహించలేదు. వాళ్ళు తనవెంటబడుతున్నారని తెలిశాక అతడి మనసు చెదిరింది. అంతవరకూ లేని స్త్రీ వాంఛ అతడిలో ఒక్కసారిగా చెలరేగింది.
వాళ్ళను పరీక్షించాలనుకున్నాడో, వెంటబడుతున్నారని అలసుచేశాడో వచ్చిన అవకాశన్నుపయోగించుకోవాలకున్నడో అతడికే తెలియదు. కానీ అతడివల్ల తప్పు జరిగింది. అందుకతడు సిగ్గుపడుతున్నాడు.
అతడి తప్పుకు వారు సహకరించివుంటే బహుశా అతడిదే తప్పును మల్లె మళ్ళీ చేసువుండేవాడు. అది తప్పుకదన్న భ్రమకూడా లోనై వుండేవాడు. అలాంటి తప్పుకు దోహదంచేసే పరిస్థితులను తనే కల్పించుకుని అందుకు సహకరించే మరికొందరు యువతులకోసం అన్వేషించేవాడు.
ఆ అమ్మాయిలతడికి సహకరించకపోవడంతో అతడికి వారిపట్లనేగా మొత్తం స్త్రీజాతిమీదనే గౌరవం పెరిగింది.
అందుకే తనతప్పును సరిదిద్దుకోవాలని అతడానుకున్నాడు.
అంటే త్వరగా తను పెళ్ళిచేసుకోవాలి!
ఎవరిని?