లోపల ఆమె అడుగుపెట్టగానే ప్రసాదు తలుపును వదిలి తనూ ఆమె ననుసరించాడు తలుపు దానంటదే మూసుకున్నది.
గదిలో ఒకేఒక్క దీపం వెలుగుతున్నది.
పెద్ద టేబుల్!
టేబుల్ కు ముందుగా నాలుగుకుర్చీలు వెనుకగా ఓపెద్ద వీల్ద్ చెయిర్
ప్రసాదు ఉదయను దాటుకునివెళ్ళి టేబుల్ వెనుకనున్న వీల్ద్ చెయ్యిర్లో కూర్చున్నాడు.
ఉదయ చటుక్కున ఆగి అతడివంకే చూసింది.
ఆ సైటుకి అతడెంత నిండుతనాన్నిచ్చాడు!
"ప్లీజ్ కం __ అండ్ సీట్!" అన్నాడు ప్రసాదు.
ఉదయ నెమ్మదిగా ముందుకెళ్ళి అతడికి ఎదురుగా కూర్చుంది. అతడామెవంకనే రెప్పవేయకుండా చూస్తూ __"మిస్ ఉదయా? యూ ఆర్ రియల్లీ బ్యూటీపుల్ " అన్నాడు.
ఉదయ సిగ్గుపడుతూ నవ్వింది.
"ఈ ఎయిర్ కండిషన్లు గదిలో మనం ఒకరినొకరు దగ్గరగా కూర్చుని అర్ధంచేసుకుంటే బాగుంటుందికదూ" అన్నాడతడు మళ్ళీ.
"అంటే?" అంది ఉదయ కంగారుగా.
ప్రసాదు తన సీట్లోంచి లేచి టేబుల్ చుట్టూ తిరిగి ఆమెను సమీపించి భుజం మీద చేయివేసి __"హొటల్లో చెప్పాలా?" అన్నాడు.
ఆమె చటుక్కున అతడి చేతిని తన భుజమ్మీద తొలగించి __మీరలా ఎదురుగా కూర్చుని మాట్లాడితేనే నాకు ఫ్రీగా వుంటుంది"అంది.
"నేను మిమ్మల్ని పెళ్ళిచేసుకుంటాను. కానీ అందుకు నాకు వ్యవధి కావాలి. నామీద మీకు నమ్మకముంటే మనం పెళ్ళయ్యేవరకూ రోజూఇక్కడ ఇలా కలుసుకోవచ్చు" అన్నాడు ప్రసాదు.
"మీమీద నాకు నమ్మకముంది. కానీ పెళ్ళికాకుండా ఇలా కలుసుకోవడంమీద నమ్మకంలేదు" అంది ఉదయ.
ప్రసాదు మళ్ళీ ఆమె భుజమ్మీద చేయివేసి __ "మీకు నామీద ఎంతనమ్మకముందో తెలుసుకునేందుకు ఇక్కడకు తీసుకుని వచ్చాను. మీరుకాదంటే నా మనసుగాయపడుతుంది" అంటూ నెమ్మదిగా ఆమెనుదగ్గరగా తీసుకున్నాడు.
ఉదయకు అతడి స్పర్శ బాగున్నది. అతడు తనను దగ్గరకు తీసుకొనడం బాగున్నది. ఆ గదిలోని వాతావరణం బాగున్నది. అతడి తర్కమూ బాగున్నది.
అమెశరీరం గాలిలో తెలిపోతున్నది మనసు ప్రసాదు ను నమ్మమంటున్నది. కానీ వివేకం ఆమెను హెచ్చరిస్తూనే వున్నది. అందువల్ల కొద్దిక్షణాల ప్రసాదు కౌగిలిలో పరవశించినా ఆమె ఉన్నట్లుండి అతడిని విడిపించుకుని "మన పెళ్ళి జరిగేవరకూ మీరు నన్ను తాకవద్దు" అంది.
ప్రసాదు నిరుత్సాహపడ్డాడు. "ఇటువంటి షరతులు పెడితే మన పెళ్ళి జరుగాదేమో!" అన్నాడతను హెచ్చరికగా.
"అదంతా నా అదృష్టంమీద ఆధారపడి వుంటుంది. దయచేసి నన్ను వెళ్ళిపోనివ్వండి" అంది ఉదయ.
"కంగారుపడకండి. ఒక్క నిముషం స్థిమితంగా కూర్చునిఆలోచించి అప్పుడు మీ నిర్ణయం చెప్పండి" అన్నాడు ప్రసాదు.
"ఈ విషయంలో నేను అలోచించాల్సి నాదేమీలేదు"
"అయితే మీరు నన్ను నమ్మడంలేదు" అన్నాడు ప్రసాదు.
"మీమీద నమ్మకం లేకపోతె నేనిలా మీ ఆఫీసు గాడికి వచ్చి ఉండేదాన్ని కాదు" అంది ఉదయ.
"నమ్మకమంటే అది కాదు. ప్రేమించిన మగవాణ్ణి గుడ్డిగా నమ్మాలి ఆడది. మోసపోతానేమోనన్న భయం ఆడదానిలో ఉన్నదంటే ఆమెలో ప్రేమలేదనే అర్ధం " అన్నాడు ప్రసాదు.
"మిస్టర్ ప్రసాదు!" అన్నది ఉదయ "నేను మిమ్మల్ని ప్రేమించానని అనలేదు మీబాబు అంటే ఇష్టపడి వాడికి తల్లి కావాలనుకున్నాను. అందుకోసం మీ ఇంటికి రావాలనుకున్నను....."
"అదంతా స్వార్దం! నా ఉద్యోగం న డబ్బు చూసి నేనంటే మోజుపడుతున్నారు. లేకపోతె మన చుట్టుపక్కల తల్లిలేనిపిల్లలెందరులేరు?"
ఉదయ నవ్వి __ "మీరెలాగైనా అనుకోకండి. చనిపోయిన మీ భార్యను ప్రాణపదంగా ప్రేమిస్తున్నారు. ఈరోజు నావంటిమీద చేయివేస్తున్నారు. అంటే మీకు ఆమెపై ప్రేమలేదని అర్దమా?" అంది.
"అంటే?" అన్నాడు ప్రసాదు.
"భార్యపోయిన కొన్నిమాసాలకు మీ మనసు మరో యువతిని కోరితే అది కాగలది సంభందించిన విషమవుతుంది. తప్పితే మీకు మీ భార్యమీద ప్రేమలేదనికాదు. పెళ్ళికాకుండా మనం దగ్గరకూడదని నేనంటే అది మన సంప్రదాయమవుతుందితప్పితే మీమీదనాకునమ్మకంలేదనికాదు" అంది. ఉదయ.
ప్రసాదుకు చెళ్ళున చారిచినట్లయింది.
"అయాం సారీ !" అన్నాడతను.
"మీరలాగంటారని నాకు తెలుసు. మీ సంస్కారంమీద నాకు నమ్మకముంది" అంది ఉదయ.
8
ఉదయతో వ్యవహారం బెడిసికొత్తగానే ప్రసాదులో ఒకరకమైన కసిఏర్పడింది. అతడు మళ్ళీ ఉదయ తనను కలుసుకునే అవకాశమివ్వలేదు. వసంతలక్ష్మి విషయం చూడాలని అతడునుకున్నాడు. అందుకు సరైన అవకాశంకోసం అతడేదురుచూస్తున్నాడు. ఎదురుచూస్తే అవకాశాలూరాకేం చేస్తాయి.
ఆరోజు ప్రసాదు ఆఫీసుకు సెలవుపెట్టి ఇంట్లోనే వుండిపోయాడు. శీనయ్య బాబుని తీసుకుని నూన షోకి ఏదో జానపద చిత్రానికి వెళ్ళాడు. టైము ఒంటిగంట కావస్తుండగా వసంతలక్ష్మి ప్రసాదు ఇంటికి వెళ్ళింది. ప్రసాదు స్వయంగా తలుపులు తీశాడు.
వసంతలక్ష్మి అతడిని చూసి తడబడింది.
"లోపలకురండి !" అన్నాడు ప్రసాదు.
వసంతలక్ష్మి సంకోచిస్తూ "బాబుకోసం వచ్చాను" అంది.
"అలాగే __ లోపలకు రండి" అన్నాడు ప్రసాదు.
సంకోచిస్తూనే లోపలకు అడుగుపెట్టింది వసంతలక్ష్మి. ఆమె కాస్త లోపలకు వచ్చేక "కూర్చోండి" అన్నాడు ప్రసాదు.
వసంతలక్ష్మి బెరుకుబెరుకుగా సోఫాలో కూర్చుంది. ప్రసాదు ఆమెకు ఎదురుగా కూర్చుని __"బాబు సినిమాకు వెళ్ళాడు . ఇంట్లో నేనుతప్ప ఎవ్వరూలేరు అని ఆమె లేచి పోబోతూంటే __"అలా లేచిపోకండి. మీతో నేను నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్య విశేషం మాట్లాడబోతున్నాను" అన్నాడు.
వసంతలక్ష్మికి వళ్ళు జలదరించింది. అతడిప్పుడు తనతో పెళ్ళిగురించి మాట్లాడతాడా? మాట్లాడితే తనేం చెప్పాలి?
ప్రసాదు మళ్ళీ అన్నాడు "వయసులో నువ్వు నాకంటే చిన్నదానిని నేను నిన్ను నువ్వనే అంటాను. తప్పుగా భావించవుకదా?"
ఆప్రయత్నంగా తల అడ్డంగా ఊపింది వసంతలక్ష్మి
"థాంక్స్ " అన్నాడు ప్రసాదు. "ఇప్పుడు విషయానికి వస్తాను నీకు నామీద నమ్మకమంటే ముందు ఆ వీధి తలుపు గెడవేసిరా"
వసంతలక్ష్మి చటుక్కున లేచింది. ఆమె మనసులో రకరకాల ఆలోచనలు ఒక్కసారిగా ఉత్పన్నమయ్యాయి.
అతడు తలుపువేయమని ఎందుకడుగుతున్నాడు? తలుపు వేస్తె ఏం చేస్తాడు? పోనీ తనే వెళ్ళి తలుపువేసి రావచ్చుగా __ తననే ఎందుకు వెయమంటున్నాడు?
వసంతలక్ష్మి నెమ్మదిగా వీధిగుమ్మదాకా వెళ్ళింది.
ప్రసాదు ఆమెను రెప్పలార్చకుండా చూస్తున్నాడు.
ఆమె ఏంచేస్తుంది?"
అక్కణ్ణుంచి అలాగే వెళ్ళిపోతుందా లేక వీధితలుపు వేసి వస్తుందా ఆమె వీధితలుపు వేసివస్తే __ ఇంక తనకెదురుముంటుంది?
వసంతలక్ష్మి గుమ్మందగ్గర కొద్దిక్షణాలగితలుపులు దగ్గరగా మూసి గెదవేసివచ్చి మళ్ళీ సోఫాలో కూర్చుంది.
"థాంక్స్" అన్నాడు ప్రసాదు.
ఆమె తలవంచుకుని కూర్చుంది.
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను నేనంటే నీకిష్టమేనా?" అనడిగాడు ప్రసాదు.
వసంతలక్ష్మి సిగ్గుపడుతూనే అంగీకార సూచకంగా తలఊపింది.
"ఆ రోజు సుభద్ర డ్రస్సులో నిన్నుచూసినప్పట్నింఛీ నీరూపం నాలో తిష్టవేసుకుంది. బాగా ఆలోచించి నీ విషయంలో ఈ నిర్ణయానికి వచ్చాను. కానీ...."అని ఆగాడు ప్రసాదు.
వసంతలక్ష్మి చటుక్కున తలెత్తి అత్రుతుగా అతడికళ్ళలోకిచూసింది.
"బాబు మనసులో కొత్తమ్మ అంటే ఇంకా సద్బావం ఏర్పడలేదు. ఇప్పుడే మనపెళ్ళి జరిగితే వాడు నిన్ను ద్వేషించడం తథ్యం అందుగురించి మనం కొంతకాలం ఆగాలి"
వసంతలక్ష్మి ఏమీ మాట్లాడలేదు.
"కానీ నీ రూపం నన్ను ప్రలోభాపేడుతోంది. వివాహామయ్యేవరకూ నేనాగలేను. నామీద నమ్మకముంచి నువ్వు నన్ను కరుణించాలి. నేను నిన్ను మోసంచేయను.
ప్రశ్నార్దకంగా చూసింది వసంతలక్ష్మి అతడివంక.
ప్రసాదు ఆమెను సమీపించి దగ్గరగా నిలబడి __"నీ చేతుల్తో నీవు వీధి తలుపులు వేసివచ్చావు. అలాగే నీ చేతుల్తో నీవు నన్నాధరిస్తే ఎంతో సంతోషిస్తాను" అన్నాడు. అతడి గొంతులో వేడ్కోలు ఉంది.
వసంతలక్ష్మి ఆలోచిస్తున్నది.
ప్రసాదు వివాహివంతుడు. స్త్రీకి ఎటువంటి మంచిమాటలు చెప్పి వశపర్చు కోవాలో అతడికి బాగా తెలుసు. వసంతలక్ష్మి అవివాహిత. మగవాళ్ళు చెప్పే మాటలు వశపర్చుకునేందుకో, నిజాలో అంచనా వేయగలశక్తి ఆమెకు లేదు.
ప్రసాదు తనఅవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. ఉదయతోలభించిన ఏకాంతాన్ని అనవసరంగా పాడుచేసుకున్నాడు. ఆమె కాళ్ళు పట్టుకునైనాసరే ఆమెను సాధించాలని అతడు సంకల్పించాడు.
ప్రసాదు మాటల్లో వసంతలక్ష్మిని ఆకాశానికైత్తైస్తున్నాడు. తన దురదృష్టాన్ని పదేపదే నిందించుకుంటున్నాడు.