"సరేలే __ నెవేళ్ళు...." అంటూ చేయికడుక్కున్నాడు ప్రసాదు.
వసంతలక్ష్మి ఉదయాల గురించి రకరకాల భావాలు అతడిమెదడులో కదిలాయి.
ఆ రాత్రి నిద్రపోయే ముందు ప్రసాదు కోడుని "నీకు వసంతలక్ష్మి. ఉదయల్లో ఎవ్వరంతే ఎక్కువ ఇష్టం?" అనడిగాడు.
"వాళ్ళునాకే మావుతారు నాన్న?" అన్నాడు బాబు.
ప్రసాదు ఉలిక్కిపడి "వాళ్ళేమైతే నీకెందుకు?" అనడిగాడు.
"ఎందుకంటే ఇద్దరూకూడా అస్తమానూ నన్ను అమ్మా అనిపిలవమని బలవంత పేడుతూంటారు. " అన్నాడు బాబు.
ప్రసాదు కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు.
"నాకు తెలియకుండా ఏదో వ్యవహారం నడుస్తున్నది" అనుకున్నాడతను బాబుని "నువ్వు వాళ్ళలో ఎవరినైనా అమ్మా అనిపిలిచేవా?" అనడిగాడు.
"ఎందుకు పిలుస్తాను?" చేతనైతే మ అమ్మను తీసుకురమ్మనమని ఇద్దరికీ చెప్పాను...." అన్నాడు బాబు.
అమ్మని ఇంకెవ్వరూ తీసుకురాలేరు బాబూ! నీకు అమ్మ కావాలంటే అచ్చం అమ్మకులాగే నిన్నుచూసుకునే ఇంకోఅమ్మాయిని తెచ్చుకుని ఇంట్లోఉంచుకోవాలి" అన్నాడు ప్రసాదు.
"వద్దు నాకు అమ్మేకవాలి" అన్నాడు బాబు.
ప్రసాదు నిట్టూర్చాడు.
భార్యపోయిన కొత్తలో ఎక్కడెక్కడివారూ వచ్చి కొన్నాళ్ళు బంధువులమంటూ వచ్చి తిష్టవ్రేశారు. అప్పుడు వాళ్ళు బాబు భావిజీవితం గురించీ కొత్త అమ్మవస్తే వాడుపడనున్నన్ పాట్లగురించీ వాడికళ్ళముందే ఎన్నోచర్చలు చేశారు. తెలిసీ తెలియని వయసులో ఆ చర్చల ఫలితం బాబు మనసు మీదపడింది.
అప్పట్లోవాడు రాత్రిళ్ళు తండ్రిని చేరి "నాన్నా కొత్తఅమ్మను తీసుకుని రావద్దు. నేనింకేవర్నీ అనిపిలవను. నాకు అమ్మేకావాలి!" అని ఏడ్చేవాడు.
భార్యపోయిన విరక్తిలో వున్న ప్రసాదు కొడుకును దగ్గరగా తీసుకుని "కొత్తమ్మనేందుకు తెస్తాను? ఇకనుంచీ నేనేనీకు అమ్మను, నాన్నను" అని గట్టిగా చెప్పేవాడు.
అలా రెండుమూడురోజులుగడిచేక అసలు బాబలా ఎందుకట్టున్నాడూ అని అతడికి అనుమానంవచ్చింది. అప్పుడే అతడికి బంధువుల సంస్కారహీనత తెలిస్వచ్చింది.
కొందరు ప్రేమివిహాల్ని తప్పుపడుతున్నారు. కొందరు బాబు భావిజీవితం గురించి జాలిఅప్డుతున్నారు. కొందరప్పుడేపెళ్ళిసంబంధాల ప్రసక్తి తెస్తున్నారు.
చావు పుట్టుకలు మనిషికి సహజం. అయినప్పటికీ చావుమనిషిని కృంగదీయక మానదు. భార్య పోయినప్పుడు పదిమంది ఇంటచేరితే అది తన దుఃఖం పంచుకోవడానికి మాత్రమె కావాలి. మిగతావిషయాలు తను మామూలుమనషి ఐనాక మాట్లాడాలి.
బంధువులలో అతడు ముఖావంగానూ, ముక్తసరిగానూ వ్యవహరించాడు. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఎవరురాసిన ఉత్తరాలకూ జవాబులివ్వలేదు.
రోజులు గడుస్తున్నకొద్దీ ప్రసాడులో మార్పురాసాగింది.
అతడు సుభద్రను ప్రేమించాడు. ఆమె తన జీవిత సర్వస్వమనుకున్నాడు. ఆమె ఈలోకాన్నివదిలి వెళ్ళిపోయింది.
ప్రసాదు ముందు నూరేళ్ళజీవితమూ అలాగే ఉన్నది. అతడికితోడు అవసరం ఆ విషయం ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు ప్రసాదు.
అతడి మనసులో ఇంకా సుభద్ర తిష్టవేసుకుని ఉన్నమాట నిజం. ఆమె స్మృతులతడి ఆలోచానలనుంచి తొలగిపోనీమాట నిజం.
అయితే ఒకప్పుడతడు సుభద్రలేని ఈజీవితాన్ని నిరాసక్తతతో గడిపి వేయాలనుకున్నాడు. ఇప్పుడు సుభద్ర తిరిగి రావాలని కోరుకుంటున్నాడు.
కానీ బాబు.....
వాడి మనసు విషపూరితం కొత్త అమ్మ అంటే చాలు వాడు మండిపడతాడు. నోరారా అమ్మా అని వాడు పిలిచినా యువతనే అతడు వివాహం చేసుకోగలడు ఎందుకంటే.....
"బాబు జాగ్రత్త!" అన్నది సుభద్ర ఆఖరిమాట.
ప్రాణంపెఎతప్పుడు ఆ కోద్దీక్షణాల్లో ఆమె ఆలోచనంత దూరం వెళ్ళాయో ఏమో__ "బాబు జాగ్రత్త!" అని ఆమె ప్రసాదును హెచ్చరిచింది. ఆ హెచ్చరిక అతని చెవుల్లో గింగురుమంటూంనే ఉంటుంది.
బీచివద్ద ఉదయ దగ్గరగా వచ్చి మాట్లాడినపుడు అతడి మనసురవంతచలించింది. ఇంటివద్ద వసంతలక్ష్మి ని గుర్రపు డ్రస్సులో చూసినప్పుడు__ సుభద్ర స్థానం తీసుకుంటే _- అనిపించింది.
శీనయ్య చెప్పిన ప్రకారం ఆడపిల్లలిద్దరూ బాబుచేత అమ్మా అని పిలిపిమ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు వేరే కారణమేమీ ఉండదు.
శీనయ్య ప్రసాదుజీవితం కొత్తగుళ్ళు తోడగాలని కోరుకుంటున్నాడు. వాడు వీళ్ళకు అసలు విషయం చెప్పేసివుంటాడు.
అంటే వాళ్ళు తనని ప్రేమిస్తున్నారా?....ఎందుకు?
ఇద్దరాడపిల్లలు పోటాపోటీలమీద తనను ప్రేమిస్తున్నారన్న భావం ప్రసాదు శరీరంలో పులకరింతను కలగజేసింది.
"ఇప్పుడు నాకు శ్రమతప్పింది. ఇద్దరిలో ఎవరునెగ్గితే వాళ్ళను పెళ్ళిచేసుకొనవచ్చును" అనుకున్నాడతడు.
వసంతలక్ష్మి, ఉదయ......
ఇద్దరికిద్దరూ అందగత్తెలు. ఇద్దరూ ఎదుటపడి మాలో ఒకరిని ఎన్నుకో __ అంటే ఏ మగవాడికైనా సంకటపరిస్థితే!
ఆ ఎన్నిక ఇప్పుడు బాబు చేస్తాడు.
తండ్రికి తగిన కన్యను తనయుడు ఎన్నికచేస్తే ఆ పద్దతినేమనాలి? అది స్వయంవరం అనిపించుకోదు.
కానీ బాబు వారిలో ఒకరిని ఎన్నికచేస్తాడా అన్నది అసలు సమస్య !
అందుకుని .....
"వచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి! తప్పు జరిగినా నాడి తప్పు అనిపించుకొనివిధంగా ...."
ప్రసాదు ఆలోచనలు పెడదారులు తొక్కుతున్నాయి. స్త్రీ సహాచర్యానికి అలవాడుపడిన అతని శరీరం క్రమంగా అతడి మనసుపై అదుపును సంపాదించగల్గుతోంది.
7
ఆ రోజుకూడా ఉదయ బీచవద్ద ప్రసాదును కలుసుకున్నది. ప్రసాదు అందుకు మనసులో సంతోషించినా పైకి ఆనాసక్తతనూ, గాంభీర్యాన్ని ప్రదర్శించాడు.
"ఈ రోజు మిమ్మల్ని కలిసుకూడదనుకున్నాను. కానీ ఉండలేక పోయాను" అన్నది ఉదయ.
"ఎందుకని?" అన్నాడు ప్రసాదు.
నిన్న మీతో చాలా మాట్లాడాను. వాటిగురించి తప్పక ఎంతో కొంత అలోచించిఉంటారనిపించింది. ఏమాలోచించారో తెలుసుకోవలనిపించింది. ఇలా వచ్చేశాను" అన్నది ఉదయ.
ప్రసాద్ ఆమె ముఖంలోకి చూడాలనుకున్నాడుకానీ చూడలేకపోయాడు. నిన్నటికీ ఈరోజుకీ అతడిలో తేడా వచ్చింది.
"నేను నిజంగానే మీ గురించి ఆలోచించలేదు" అన్నాడు ప్రసాదు ఆకాశంవైపు చూస్తూ.
"ఎందుకని?" అన్నది ఉదయ దెబ్బతిని.
"నిన్నరాత్రి ఇంటివద్ద అనుకొని సంఘటన జరిగింది"
"ఏమిటది?"
"నా భార్య ప్రత్యేకమైన దుస్తులువేసుకుని మా బాబుని గుర్రపు అట ఆడించేది. ఆ దుస్తుల్లో మా బాబును అడిస్తూన్న మరో అమ్మాయిని చూసి __ నేను భార్య మళ్ళీ తిరిగివచ్చిందా అని భ్రమపడ్డాను" అన్నాడు ప్రసాదు.
"అయితే?" అన్నది ఉదయ ఆమె ముఖం పాలిపోయింది.
"రాత్రంతా ఆ సంఘటన గురించే అలోచిస్తూండిపోయాను. మళ్ళీ మీరిప్పుడు కనబదేవరకూ మీ విషయమే గుర్తులేదు"
"వసంతలక్ష్మి __ ఎంత జాణనే నువ్వు "అనుకున్నది ఉదయమనసులో. పైకిమాత్రం "పోనీలెండి __ ఈరోజు ఆలోచించి చెప్పండి" అన్నది.
"నా మనసు స్థిరంగా ఉండడంలేదు. ఇమ్తరిగా ఎ ఆలోచనలూపట్టడంలేదు. ఎవిశాయమూ మనమిద్దరూ కలసి ఆలోచించడం మంచిదని నా అభిప్రాయం" అన్నాడు ప్రసాద్.
"ఎప్పుడు?"
"ఇప్పుడే కానీ ఇక్కడకూడదు...."
"ఎక్కడ?" అన్నది ఉదయ అత్రుతుగా.
"మా ఆఫీసులో"
"ఇప్పుడు మీకు ఆఫీసు ఉంటుందా?" అంది ఉదయ ఆశ్చర్యాన్ని కనులలో ప్రదర్శిస్తూ.
"నేను ఆఫీసర్ని. నా గదితాళం ఎప్పుడూ నావద్దనే ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా నేను వెళ్ళి ఆఫీసుపని చూసుకోవచ్చు."
"రండి __ వెడదాం" అన్నది ఉదయ.
"ఆఫీసులోకూడా పెడింగ్ వరకు ఏదీ ఉంచను. మీ విషయం ఈరోజే తెల్చేస్తాను" అంటూ ప్రసాదు లేచాడు. అతడితోపాటు ఉదయకూడాలేచింది. ఇద్దరూ అక్కణ్ణుంచి సిటీబస్సులో అతడి ఆఫీసుకు వెళ్ళారు.
బస్సు సరిగ్గా అతడి ఆఫీసుముందే ఆగింది.
ఆఫీసు రెండస్థల పెద్దభవనం. భవంతిముందు వాచ్ మెన్ ఒకడున్నాడు. వాడు వినయంగా ప్రసాదుకు వంగి నమస్కరించాడు. ప్రసాదు హుందాగా ముందుకు నడిచాడు.
ప్రసాదు హొదానుతల్చుకుంటూ ఆ హొదాలో తనకూ భాగాన్నూహించుకుంటూ అతడి ననుసరించి౦ది ఉదయ
ప్రసాదు అఫీసుగది రేండో అంతస్థులో ఉన్నది. ఇద్దరూనడిచిమెట్లెక్కిఆఫీసుగది చేరుకున్నాడు.
ప్రసాదు గది తాళం తీసి తలుపు తెరిచాడు. వెంటనే తనకు తానేమూసుకుకునిపోయే ఆ తలుపునతడు ఆమెకోసం తెరచిపట్టుకుని "ప్లీజ్ __ కమీన్!" అన్నాడు.
ఉదయ గదిలో అడుగుపెడుతూ తత్తరపడింది.
చల్లనిగాలి రివ్వున తాకి ఆమెకు గిలిగింతలు పెట్టింది.
అది ఎయిర్ కండిషన్ గది!