Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 6

    నా భోజనం అయిపోయింది. ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను కదా అని టైము దొరక్క ఈ సమయమ్లో వచ్చాను" అన్నాడు మోహన్.   
    లత నవ్వి లోపలికి వెళ్ళిపోయింది.   
    'నువ్వు నా ప్రాణాలు తోడేస్తోంది' అనుకున్నాడు మోహన్.   
    రామారావు స్నేహితుడి భుజం తట్టి "నువ్వేమీ గీల్టిగా ఫీలవనక్కర్లేదు. సాధారణంగా ఆడవాళ్ళసహ్యంచుకునే వివరాలు నీ గురించి చాలా ఉన్నాయి. అవేమీ నా భార్యకు తెలియవు. నేను చెప్పలేదు స్నేహితుడిగా నేను నిన్నభిమానిస్తున్నాను. నీ ప్రవర్తనకూ, దానికీ ఏమీ సంబంధం  లేదు. మన స్నేహం దూరం కావడానికి నువ్వు ప్రయత్నం చకు. వీలున్నప్పుడల్లా వచ్చి వెడుతూ౦డు"   
    మోహన్ నెమ్మదిగా భుజం మీంచి మిత్రుడి చేయి తొలగించి. నీ అభిమానానికీ చాలా థాంక్స్! కానే ఒక్క విషయం  గుర్తుంచుకో ! నీకు సెంటిమెంట్స్  ఎక్కువ. అందుకే నన్ను చేరదీస్తున్నావు. కానీ నాకు సెంటిమెంట్స్ లేవు. ఆ విషయం ముందే చెప్పేస్తున్నాను" అన్నాడు.   
    లత హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది.
    "అర్దరాత్రి పూట మీకు శ్రమ!" అన్నాడు మోహన్.   
    "మీ ఫ్రెండ్ గ్యాస్ స్టవ్ కొని పారేశారు. శ్రమేముంది?" అంది లత.
    "శ్రమ లేదన్నారు . చాలా థాంక్స్!" అన్నాడు మోహన్.   
    కాలేజీ రోజుల్లో తనూ, మోహన్ ఎంత ఇంటిమెంట్ గా ఉండేవారో రామారావు లతకు చెప్పాడు.   
    "అన్నీ అబద్దల్లెండి . అప్పట్లో అతనికి నేను నచ్చే వాణ్ణి కాదు. ఇప్పుడు మొహమాటానికి  అలా అంటున్నాడు" అన్నాడు మోహన్.   
    "నాకు  మోహమాట౦ లేదు. ఆ సంగతి శ్రీమతికి తెలుసు" అన్నాడు రామారావు.
    "నిజం.  అందుకే బంధువుల ఇళ్లకు వెళ్ళడానికి నాకు మోహమాటంగా ఉంటుంది. అంది లత.
    అందరూ హాయిగా నవ్వుకున్నాక మోహన్ __ "ఈ విషయంలో మీరూ, నేనూ ఒకటి. నేనూ బంధువుల ఇళ్లకు వెళ్ళడానికి మోహమాట పడుతూంటాను" అన్నాడు.   
    సంభాషణ కాసేపు రామారావు సంసార జీవితం గురించి నడిచింది. తర్వాత __"మీ గురించి ఏమీ చెప్పలేదు " అంది.   
    మోహన్ నవ్వి __ " నా కింకా పెళ్ళికాలేదు. కానీ పిల్లలు చాలామంది ఉన్నారు " అన్నాడు.   
    ఇలాంటి సమాధానం లత ఎన్నడూ వినలేదు. ఆ ప్రయత్నంగా ఆమెకు నవ్వు వచ్చింది. ఆమె నవ్వుతూంటే చూసీ చూడనట్లు ఆమెనే చూస్తున్నాడు మోహన్. తన జోక్ ఆమెకు నచ్చినందుకు చాల సంతోషం కలిగిమ్డటానికి.   
    "ఈసారి వచ్చినప్పుడు మీ పిల్లల్నీ తీసుకురండి " అంది లత.   
    "కుదరదు. వాళ్ళ తండ్రులు వాళ్ళని నాతో పంపడానికి ఒప్పు కోరు" అన్నాడు మోహన్ __ మళ్ళీ ఆమె నవ్వుతుందని ఆశగాచూస్తూ .
    లత నవ్వలేదు. ఆమెకు ఈ జోక్ బొత్తిగా నచ్చలేదు. ఇప్పటికి ఆమెకు అతని ఇందాకటి జోక్ లోని అంతరార్ధం కూడా గోచరించింది. ఆమె నిద్రను సూచిస్తూ ఆవలించింది.   
    మోహన్ లేచి నిలబడి__ "ఈ రోజు ఎంతో సుదినం. నా స్నేహితుడి అనుకూల దాంపత్యం కళ్లారా చూసి వెళ్ళ గలుగుతున్నాను. ఇంక నాకు టైమయింది ....." అన్నాడు.
    "అప్పుడే వేడతారా?" అంది లత మనసులో బ్రహ్మానందపడుతూ.   
     ఆమె మాటకు మోహన్ చాలా సంతోషించాడు.   
    "ఈ సారేప్పుడైనా మా ఊరువస్తే మా ఇంట్లోనే మకాం. గుర్తుంచుకో!" అన్నాడు రామారావు.   
    "నీకేం? నువ్వేమయినా అంటావు. ఈ ఆహ్వానం లత గారి నుంచి వస్తేనే నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చేది" అన్నాడు మోహన్   
    "సరే  _ నేనే ఆహ్వానిస్తున్నాను. తప్పక వస్తారు కదూ?" అంది లత.   
    "మీరు ఆహ్వానించారు కాబట్టి తప్పకుండా వస్తాను" అన్నాడు మోహన్.   
     మోహన్ గురించి తెలిసిన రామారావుకు రవింత బాధకలిగింది అయితే అతన్ని తప్పు పట్టడానికి లేదు.  తన గురించి అతను అన్నీ ముందే చెప్పాడు.   
    మోహన్ అక్కణ్ణుంచి బయటపడ్డాక ఆలోచనలో పడ్డాడు.   
    అతను ఆడవాళ్ళ మనస్తత్వాలు కాచి వడపోశాననే  అనుకుంటాడు. అందుకు బహుశా అతని అనుభవాలు కొన్ని సహకరించి వుండవచ్చును.
    రామారావు భార్య అందంగా వుంటుందని అతనూ వూహించు లేదు. అయితే వూహకందని అందం ఆమెది.
    రామారావు భార్య అందంగా ఉండి ఉంటే ఏం చేయాలో అతను నిర్ణయించుకునే వునాడు. అందులో మొదటిది _ రాత్రి పదిగంటలవేళ వాళ్ళింటికి వెళ్ళడం. అలంటి సమయంలో ఇంటికి చెడితే ఎవరికయినా చిరాకు కలుగుతుంది. చిరాకు కలిగినా, ఆ మనుషులకు  తను ప్రత్యేకంగా  గుర్తుండిపోతాడు. ఆ తర్వాత భార్య భర్తలిద్దరూ గదిలోకి వెడతారు. ఆ సమయంలో విధిగా తన గురించిన చర్చ కొంతసేపు జరుగుతుంది. తన గురించి మంచి తెలిపినా ఫరవాలేదు భార్యా _ భర్త లేక స్రీ _ పురుషుడు ఏకాంతంలో వున్నప్పుడు మరో పురుషుడి ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె మనసులో చెలరేగే భావాలకూ, మామూలు భావాలకూ తేడా ఉంటుంది. ఇది మోహన్ స్వానుభావం.   
     మోహన్ ఇప్పుడు నేక్టుస్టఫ్ గురించి ఆలోచిస్తున్నాడు.   
                                   3        
    లోలాకులు, దుద్దులు, గొలుసు _ ఈ మూడింటినీ  సబ్బుతో తోముతూ,   
    'బంగారానిక్కూడా మట్టి పడుతుంది....'  అనుకుంది లత సరిగ్గా అదే సమయానికి కాలింగ్ బెల్ మ్రోగింది.             

 Previous Page Next Page