రామారావు అక్కణ్ణుంచి బయల్దేరాడు. లత వెంటనే బట్టలు వేసుకోలేదు. ,అ వచ్చిన దేవరావు కొన్ని క్షణాలు మాత్రమే బయటి నుంచి మాట్లాడి వెళ్ళిపొతే ?.... అయన వెంటనే వచ్చేస్తాడు.
లత ఆలోచిస్తోంది.
'తను నిజంగానే అందంగా ఉంటుంది. అది తన అదృష్టం రామారావు చిత్రకారుడు కాడు, శిల్పికాడు. కానీ అతనిలో కలాహృదయం ఉంది. తనను ఇలా చూసి కవిత్వం చెప్పి ఆనందించడం అతని అల్కవాటు. మొదట్లో అందుకు తాను ఇలా అభ్యంతరం చెప్పింది.'
"చూడు లతా! వికసించిన పుష్పంలో అందమయింది. ఆ అందం వర్ణనల కందేది కాదు. ఆ అందాన్ని చూసిన అనుభూతి కేవలం అనుభవైక వేద్యం. వాడిపోయిన వూపులో అండముండదు. వూపుకు వికాసం శాశ్వతం కాదు. ఇప్పటి నీ అందం యవ్వనం కారణంగా వచ్చింది. ఈ అందం నాడి కావడం నా అదృష్టం. యవ్వనం నీకూ నాకూ శాశ్వతం కాదు. అందుకే నా ఈ ఆరాటం నన్ను కాదనకు" అన్నాడు రామారావు.
లత బాగా చదువుకుంది. శృంగార భరితమైన సంస్కృతి నాటకాల అంద్రీకరణ రచనలు చదివి వాటిలోని సృమ్గారానికి ఆశ్చర్యపడింది. "రామారావు తనతో ఏకాంతంలో సాగిస్తున్న శృంగరాన్నొక అపూర్వ విశేషంగా వారు వర్ణించారు. అందుకు కారణం పురుషుడుకి స్రీ పట్ల గల అమితమైన ఆకర్షణే కావచ్చు. కానే భావుకత ఉంది. తనే లోకంగా జీవిస్తున్న అతని లోకంలో తనకు దాపరిక మేమిటి?
తమది దాపరికం లేని ప్రేమ అని అతనంటాడు. అతని వెర్రిగానీ ఏ దంపతుల మధ్య ప్రేమకు దాపరికం ఉంటుంది?"
"లతా ! త్వరగా రా! నా కాలేజీ స్నేహితుడు మోహన్ వచహ్డు" అంటూ రామారావు కేక డ్రాయింగ్ రూం నుంచి వినబడింది.
లత త్వరగా బట్టలు వేసుకుని, చెరిగిన ముంగురులు సవరించుకుని అక్కణ్ణుంచి డ్రాయింగ్ రూంలోకి వెళ్ళింది.
అక్కడ మోహన్, రామారావుతో మాట్లాడుతూ గుమ్మంలో దేవకన్యలా ప్రత్యక్షమైన లతను చూసి అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు.
రామారావు తనను అన్నీ విన్నాక కూడా ఇంటికి ఆహ్వానించడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. మోహన్ కి. బహుశా రామారావు భార్య కురూపి అయ్యుంటు౦దని అతనుహించాడు. కానీ ఇలా కళ్ళు చెదిరే అందం చెదిరే తన కళ్ళబడుతుందని అతను కలలో కోద్క ఊహించలేదు.
"వాటే స్టన్నింగ్ బ్యూటీ!" అన్నాడతను ఆప్రయత్నంగా.
"నా భార్య లత" అన్నాడు రామారావు. అతని కంఠంలో గర్వం ధ్వనిస్తోంది.
లత ముఖం చిట్లించి ముందుకు వచ్చింది. ఒక అపరిచితుడు తనను చూపిన వెంటనే 'స్టన్నింగ్ బ్యూటీ అనడం ఆమెకు నచ్చలేదు. భర్త నోట తప్ప తన అందాన్ని పొగిడించుకోవడం ఆమె కిష్టముండదు. అలాగని గతంలో ఆమె అందానికి పొగడ్తలు లభించలేదని కాదు,
"అదృష్టవంతుడుని బ్రదర్ _ అందమైన భార్యను సంపాదించావ్!"
"మీకేమండీ _ ఈ చీరైనా నప్పుతుంది."
"మీకు వంతరాకపోయినా ఫరవాలేదు _ మిమ్మల్ని చూస్తుంటే మా వాడికి రుచులు తెలియవు ."
ఇలాంటి చలోక్తులు చాలా విన్నాదామే. అవన్నీ తన అందాన్ని సాఫీగా పొగడడానికో, తన అందాన్ని భర్త స్వటంగా ఎంచడంవల్లన్నో వచ్చినవి. ఇప్పుడు విన్న పొగడ్త అలా లేదు బట్టల దుకాణంలో అద్భుతమైన చీర కనబడితే _ "ఎంత బాగుందో!" అన్నమాట ఎలా ద్వనిస్తోందో అలా ద్వనించింది. డబ్బుంటే కొనుక్కోవడం కోసమే ఆ చీర అందాన్ని మెచ్చుకోవడం జరుగుతుంది.
"నాపేరు మోహన్! మీకు ణ గురించి రామారావు చెప్పే ఉంటాడు" అన్నాడు మోహన్. ఆమె తనను చూడగానే ముఖం చిట్లించడంలో అతనికా అనుమానం వచ్చింది.
లత ప్రశ్నర్ధకంగా భర్త వంక చూసింది.
రామారావు నవ్వేసి _ "నేను నా భార్య దగ్గర ఇతరుల విషయాలు మాట్లాడను. అందుకు నాకు టైముండదు. ఇతరుల గురించి ఆమె తనకు తానె తెలుసుకుంటుంది" అన్నాడు.
"వేళ కాని వేళలో వచ్చి మిమ్మల్ని విసిగిస్తున్నానేమో?" అన్నాడు మోహన్.
'తెలిసి కూడా విసిగించడకెందుకో ?" అనుకుంది లత మనసులో
"రాక రాక వచ్చిన స్నేహితుడివి. విసుగ్గరించి మాట్లాడొద్దు " అన్నాడు రామారావు.
"దేని గురించి మాట్లాడను ?" అన్నాడు మోహన్ .
"దేని గురించి మాట్లాడను అని అడిగేవాడివి, నా ఇంటికెందుకొచ్చావ్."
'చాలా బాగా అడిగారు' అని మనసులో అనుకుంది లత.
"చాలా మాట్లాడాలనీ, కబుర్లు చెప్పాలనీ బయల్దేరి వచ్చాను. కానీ మీ ఆవిణ్ణి చూసేక నాకు చాలా భయం వేస్తోంది అలంటి మనిషిని రోజూ చూసే నువ్వు _ నే నేలాంటి కబుర్లు చెప్పినా విని అనందించ లేవానిపిస్తోంది" అన్నాడు మోహన్.
ఈ పొగడ్త లత కు నచ్చింది. అందువల్ల తనూ మాట్లాడాలనుకుంది.
"మీరు మీ స్నేహుతుడ్డ్ని చూడ్డానికి వచ్చారా? స్నేహితుడిభార్యను పోగొట్టడానికి వచ్చారా?" అంది లత. వచ్చీ రాగానే తనతో అట్టే పరిచయం లేకుండానే అతను సౌదర్య ప్రశక్తి చేయడం ఆమెకు నచ్చలేదు.
'వీణ మీటినట్లుంది స్వరం' అనుకున్నాడు మోహన్. పైకి మాత్రం _ " మెదటిది అనుకుని చేశాను. రేండవది అనుకోకుండా జరిగింది" అన్నాడు.
"ఇది నాకూ, లతకూ కొత్తకాదులే" అన్నాడు రామారావు.
ఆ తర్వాత నెమ్మదిగా సంబాషణ ప్రారంభమైంది. మధ్యలో లత వంటింట్లోకి వెళ్ళబోయింది.