"రోజూ మీ ఇంట్లో చూడ్డమే తప్ప __ మీ వాడితో ఇంతవరకూ సరైన పరిచయం చేసుకోలేకపోయాను." అని ఓసారి మా యింటికొస్తావా? అన్నాడు రాజారావు.
గరవయ్య తలెత్తి రాజారావు వంక చూశాడు. అతడి ముఖంలో కోపం కనబడలేదు. ఒక్కనిముషం మాత్రింఅతడు రాజారావు వంక భయం భయంగా చూసి __ అంత లోనే నిర్లక్ష్యంగా ముఖం పేట్టి "సరే పదండి" అన్నాడు.
ఇద్దరూ రాజారావు వాటాలోకి వెళ్ళి కుర్చీల్లో కూర్చున్నాక _ "నీకు తాగే అలవాటుందా?" అన్నాడు రాజారావు.
"ఉంది __"
"నిన్న తాగేవా?"
"నిన్నేం కర్మ _ రోజూ తాగుతారు ఈవేళా తాగుతాను ....."
"రోజూ సంగతి నాకనవసరం. నిన్నటి సంగాతేనాక్కావాలి. ఎందుకో నీకు తెలుసు!"
"నాకు తెలియదు __"
"అయితే నేను చెప్తాను విను..... నిన్న నువ్వు తాగావు. తాగడంలోనూ మస్తుగా తాగేవు. ఆ తాగుడు మైకంలో ఏంచేశావంటే ....."
రాజారావు మాట్లాడుతుండగా వసంత అక్కడకు వచ్చింది. ఆమెను చూస్తూనే గరవయ్య __" ఇక చేపోడ్డు చూచాయిగా గుర్తుంది నాకు ....." అన్నాడు.
తాగినవాడికీ తాగనివాడికీ తేడా వుంది. తగినవాడికక్కర్లేదనీ సిగ్గు, అభిమానం, మర్యాదులు తాగనివాడిక్కావాలి.
"ఆ అబ్బాయినేందుకు పిలిచారు?" వసంత అయిష్టతను సూచించే తీవ్ర కంఠంతో అడిగింది.
రాజారావు నవ్వి __ "అతడు నీ తమ్ముడైతే అబ్బాయంటా మేమిటి? నిన్న నీ చేత్తో యిచ్చినది తాగాలని మనసు పడ్డాడు కదా __ ఇప్పిద్దామని ....." అని గరవయ్యవైపు తిరిగి __ "భయపడకు .ఆమె చేత్తో యిచ్చేదంటే కాఫీయే!" అన్నాడు.
అర్ధం చేసుకుంటున్నట్ట్లుగా వసంత లోపలకు వెళ్ళి పోయింది.
గరవయ్యకిద తా ఇబ్బందిగా ఉంది. రాజారావతడ్ని మళ్ళీ పలకరించి ..... "నువ్వేం చదువుకున్నావు?" అన్నాడు.
"స్కూల్ ఫెయిల్ మూడు సార్లు ఫెయిలయ్యాను....."
"నాలుగోసారింకేమయ్యావు?"
"ఇంక చదవలేదు ....."
"అలాగా" అని నిట్టూర్చాడు రాజారావు . " నిన్న జరిగింది మేమేవ్వరికీ చెప్పం. నువ్వూ మనసులోనే ఉంచుకో నిన్న చూస్తె చాలా మంచి వాడిలా మర్యాదుస్తుడిలాగున్నావు. నువ్వు తాగాలంటే ఆశ్చర్యంగా వుంది."
గరవయ్య మరింత ఇబ్బంది పడ్డాను తను మర్యాదస్తుడిలా కన్పిస్తానడం అతడికి సంతోషం కలిగించింది. నిన్న తాగినందుకూ, ఇప్పుడుతాగు తానని తొందరపడిఒప్పుకున్నందుకూ అతడికి మనసులో రవంత బాధ కూదా కలిగింది.
రాజారావు మళ్ళీ అన్నాడు __ "నువ్వు తాగి ఉండకపొతే అలా ప్రవర్తించి ఉండేవాడివికాదు. ఇంక ఆ విషయం గురించి ఎక్కువగా అని నున్ను బాధ పెట్టనులే. ఏమైనా నీ అక్క చేతి కాఫీ రుచి చూసి వేడుదువు గాని. కోరుకున్నావు కూడా కదా!"
వసంత కాఫీ తెచ్చి టీపాయ్ మీద పేట్టి వెళ్ళిపోయింది. గరవయ్య సిగ్గుపడుతూనే నెమ్మదిగా కాఫీ సిఫ్ చేస్తున్నా అతడ్ని చూసి నవ్వుతూ _ "ఎలాగుంది నీ అక్క చేతి కాఫీ ఊహించినట్లుగానే ఉందా!" అనడిగాడు రాజారావు.
తాగడం ఆపి గరవయ్యోసారి రాజారావు వంక తీక్షణంగా చూసి _" నేను తప్పుచేస్తే చేసి ఉండొచ్చు కానీ _ మీ వేళాకోళం మాత్రం మిటిమీరుతోంది....." అన్నాడు.
రాజారావు ఫక్కున నవ్వి "అయ్యో నిజంగా నా మాటలకు నీకింత కోపమొచ్చిందా? అలాగైతే ఎలా .... నేను నీ బావను గదా _ వేళాకొళమాడితే తప్పేందుకౌతుంది __?" అని మళ్ళీ ఫక్కున నవ్వాడు.
4
"లింగరాజూ! ప్రస్తుతం ఈపని నా వల్ల కాదు." అన్నాడు రమాకాంతం.
"అలాగంటే ఎలాగండీ __ మిమ్మల్నే నమ్ముకుని వ్యాపారంలోకి దిగాను. మధ్యలో ఉన్నాను. నమ్ముకుని కాదంటే అంతా మోసమైపోతుంది. అవతల మర్యాదపోతుంది......."
"నిజమేనయ్యా __ కానీ వీలుంటే చూద్దామన్నాను గానీ ఇస్తానని నేను మాత్రం గ్యారంటీ ఇచ్చానా ఏమిటి? ఒక్క సారి రెండు వేళ రొక్కం ఎక్కడ్నించి తేగలను?"
"పంచాయితీ బోర్డు ప్రెసిడెంటు _ తమరే ఇలాగంటే ......"
"బాగుందయ్యోయ్ ..... ఇలాంటి మాటలంటే జనాలకి విపరీతార్దాలోస్తాయి . నా దగ్గర సోమ్ముంటే అది ప్రజల సొమ్ము అది నీఎక్లా ఇవ్వగలను........?"
"అయ్యో _ నేనేం తప్పుగా అనలేడండీ _ అది ప్రజల సోమ్మయితేనేం వడ్డీకే ఇవ్వండి . ఆ వడ్డీతో ప్రజల సొమ్మును మరింత పెంచండి. ఎలాగూ ఆ సొమ్మును మీరిప్పట్లో కదపరుగదా ......"
రామాకాంతం భ్రుకుటి ముడతలుపడింది. అయన ఏదో అనబోయి గుమ్మం దగ్గర నిలబడ్డ రాజరావుని _ చూసి రాజారావుగారా _ రండిరండి ఇలా కూర్చోండి ......" అంటూ ఆహ్వానించాడు.
"మధ్యలో వచ్చి మీకంతరాయం కలిగించినట్లున్నాను...." అన్నాడు రాజారావు తినో కుర్చీలో కూర్చుంటూ.
"అబ్బే అంతరాయానికేముందీ ఇందులో _ ఇతడు లింగరాజుని మనూరివాడే. నా ప్రోత్సాహంమీద రాజమండ్రలో హోటలు బాగాలాగుతోందని చాలామంది __ ఆధునికంగా మార్చమని సలహా లిస్తున్నారు. ఇతడు నన్ను సలహా అడిగితె కానీవయ్యా , చూద్దాం అన్నాను. ఇతడు కొత్త ఫర్నిచరుకీ, కొన్ని మేషిన్సుకి అర్దరిచ్చాడు ఇప్పుడో రెండువెలు తక్కువయింది. సర్దమంటూ నా దగ్గరకొచ్చాడు. సమయానికి నా దగ్గర డబ్బులేదు. అదే ఆలోచిస్తున్నాం __" అన్నాడు రమాకాంతం
"అలాగా . దాందేముంది _ మీరు హామీ ఉంటే ఆ రెండు వేలూ నేనే యిస్తాను _" అన్నాడు చటుక్కున.
రమాకాంతం, లింగరాజు తెల్లబోయారు. ఇది వాళ్ళూహించినట్లు లేదు.
ఆశ్చర్యం నుంచి తేరుకోగానేలింగరాజు కళ్ళు కృతిజ్ఞాతతో మెరిశాయి __ ''మీరు నిజంగానే అంటున్నారా!" అన్నాడు.
"ఆయనకు నీతో వేళాకోళమడాల్సిన పనేంటయ్యా. ఈ మధ్యనే మనూరోచ్చారు నేల కావొస్తుందేమో __ నేను హామీ ఉంటాను . కానీ ఆయనదగ్గర డబ్బు తీసుకో ....." అన్నాడు రామాకాంతం.