Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 5

   

      "అ పసిదానికున్న జూలైనాలేదు _ మీకు నా మీద" వసంత గునిపింది.

    "ఎలాగైనా ఇద్దరికీ అడజాతే కదా __" అంటూనే నీల నేత్తుకున్నాడు రాజారావు కానీ వాళ్ళింకా ఆగలేదు. అలా ముందుకు నడుస్తూనే ఉన్నారు.

    "చాలా దూరమొచ్చాం. ఒక నిముషం కూర్చుందామా __" అంది వసంత.

    "ఒక నిముషం కాదు కాసేపు కూర్చుందాం__" అన్నాడు రాజారావు.

    ముగ్గురూ కూర్చున్నారు. కొద్ది క్షణాల్లోనే నీల పిచ్చుకగూళ్ళు కట్టడంలో నిమగ్నరాలైపోయింది రాజారావూ! వసంతా పిచ్చాపాటీ మొదలెట్టారు.

    ఉన్నట్లుండి "ఏమండీ అటు చూడండి!" అంది వసంత. ఆమె కళ్ళలోని భయ చిహ్నాలు చూసి రాజరావటువైపు చూశాడు.

    నలుగురు మనుషులు తూలుకుంటూ గట్టుడిగి తమ వైపే వస్తున్నారు. వాటం చూస్తె బాగా తాగినవాళ్ళులాగుతున్నారు. అంతా ఇరవయ్యా పాతికలోపు కుర్రాళ్ళే వాళ్ళు తమను సమీపించగానే రాజారావు వాళ్ళలో ఒకడిని గుర్తుపట్టాడు. అతడు చలమయ్య కొడుకు గురవయ్య.

    "ఆడపిల్లరోయ్_" అన్నాడొకడు .

    "బాగుంది కూడా __" అన్నాడింకొకడు.

    "మామోలుగా తాగితే ఏముందిరా ఇలాంటిదాని చేత్తో ఇచ్చింది తాగితే ....." ఆ తర్వాత మాటలు మరిరాలేదు గురవయ్యకి.

    వసంత ఇబ్బందిగా భార్తవంక చూసింది.

    "వీళ్ళు బాగా తాగారు. తాగిన వాళ్ళు మనుషుల్లో జమ కాదు. వీళ్ళ మాటలు మనం లెక్కచేయనక్కరలేదు. పద పోదాం ......." అంటూ లేచాడతడు. ఇటువంటి సంఘటనెదురురౌతు౦దని ఊహించలేదతడు. నీల భయంగా పిచ్చుక గూడువదిలి పరుగున వచ్చి తండ్రిచేయి గట్టిగా పట్టుకుంది. రాజారావు కూతుర్ని ఎత్తుకున్నాడు. ముగ్గురూ గబగబా పూర్తిగా ఆవరించినట్లు వసంతకు అడుగులు తడబడుతున్నాయి.

    "పిల్ల పారిపోతోందిరోయ్ ...." అంటూ గురవయ్య నాలుగే అంగాలలో వసంతను సమీపించి ఆమె చేయి పట్టుకున్నాడు.

    రాజారావు తీవ్రంగా గవరయ్య కళ్ళలోకి చూసి, "ఏయ్ _ కళ్ళు కనిపించడంలేదూ __ నువ్వు మీ అక్కయ్య చేయి పట్టుకున్నావు ....." అన్నాడు.

    అతడి చూపుల తీవ్రతకు గవరయ్య భయపడ్డాడు అతడు వసంత చేయి వదిలి "-- ఒరేయ్ మా అక్కరా తప్పుకదూ __ రండి, పోదాం! అన్నాడు ముద్దగా. అక్కడికి తమకూ అర్ధమైనట్లు ఆ తాగుబోతులు    నలుగురూ వెనక్కుపోయారు.

    కళ్ళనీళ్ళ పర్యంతమైనా వసంత భుజం తట్టి _ "వాళ్ళు మస్తుగా తాగి వున్నారు. గట్టిగా తంతే పడిపోతారు. అలాంటి వాళ్ళమీద చేయిచేసుకోవడం నాకిష్టంలేదు. అయినా మనిషి నీటికి ఎంత భయపడతాడో చూడు. అంత తగిన మట్టులోనూ _ అక్కయ్య అనగానే ఆ గవరయ్యగాడు నీ చెయ్యి వదిలేశాడు __" అన్నాడు.

    వసంత ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆమె మాట్లాడకపోవడగమనించి "భయపడడం వసూ! ఏ మనిశీ పూర్తిగా చెడ్డవాడు కాదని నా నమ్మకం . సరైనమార్గ దర్శకుడు లేక నే చాలామంది చేదిబోతుండగా వారించి __ " మీరు చెప్పాబోయేది నేనూహించుకోగాలను మనమింకెప్పుడూ షికారుకని ఇంత దూరం రావద్దు __" అంది వసంత.

    రాజారావు తెల్లబోయి __ "సారీ  వసూ! ఈ సంఘటన నీకెంత బాధ కలిగించిందో అర్ధం చేసుకోకుండా నాదోరణీలో నేనున్నాను _ నన్ను క్షమించవూ!" అన్నాడు.

    "చాల్లెండి , ఊరుకోండి _" అంటూ నవ్వేసింది వసంత.

    "అమ్మయ్య __ మామూలు మనిషివయ్యావన్నమాట. నువ్వెంత బాగా నవ్వుతావు వసూ!" అన్నాడు రాజారావు. వసంత ముఖంలో సిగ్గు తొంగి చూసింది.

    "ఎంత అందంగా సిగ్గుపడతావు వసూ!"

    ఈసారి వసంత కోపన్నభినయించింది.

    "అసలు నీ అందమంతా కోపంలోనే ఉందనుకుంటాను ....."

    ఈసారి వసంత సిగ్గుపడలేదు. "ఎంత అందంగా, తియ్యగా మాట్లాడతారండీ మీరు." అంది నవ్వుతూ .అంతే రాజారావు నోటికి తాళం పడింది చీకటి పడుతుండగా ముగ్గురూ ఇల్లు చేరుకున్నారు.

    "జరిగిన విషయమేవరికీ తెలియకూడదు సుమా!" అంటూ అతడామెను హెచ్చరించాడు __ అ ఇంట్లో అడుగు పెట్టగానే.

    "నలుగురికీ చెప్పుకునే సంగతండీ యిది!" అంది వసంత.

    ఆ రాత్రి వసంతకు సరిగా నిద్రపట్టలేదు ఇలాంటి అనుభవమామెకుకొత్త. పట్నంలో అనేకపర్యాయాలు బస్సు లెక్కినపుడూ, రాద్దేగా ఉండే ప్రాంతంల్లో తిరిగినప్పుడూ మగాళ్ళు తనని తాకడానికి ప్రయత్నించడం ఆమెకు కొత్త కాదు. అయితే వారది రహస్యంగా చేయాలనుకునేవారు కానీ ఈరోజు గర్వయ్య అనే ఇరవై ఏళ్ళ కుర్రవాడు _ భర్త తన పక్కనుండగా దురుద్దేశ్యంతో నిర్భయంగా తన చేయిపట్టుకున్నాడు. ఇటువంటి దురదృష్ట ఆడదానికి అరుదు. అది తలచుకున్నప్పుడల్లా ఆమెకు వళ్ళంతా తేళ్ళూ, జేర్రెలూ పాకుతున్నట్లనిపిస్తోంది. ఆ రాత్రి కలత నిద్రలో ఆమె ఆ విషయం మీదనే కాలుకంది.

    నిజానికీ సంఘటన వసంతను మించి రాజారావును కలవర పేడుతోంది; అతడికి తాగుబోతులతో పరిచయం లేదు. వారి ప్రవర్తనేలాగుంటు౦దో అనుభవంలోకి రాలేదు. గరవయ్య అంత ధైర్యం చేయగలడని అతడానుకోలేదు కానీ ఆ తాగుడు మైకంలో కూడా అక్కయ్య అన్న పదం గురవయ్యపై ప్రభావం చూపడం _ రాజారావుకి ఆశ్చర్యంగా ఉంది. రకరకాల ఆలోచనలతో అతడికీ నిద్రపట్టలేదు.

    మర్నాడుదయం నిద్ర లేచేసరికి భార్యా భర్తలిద్దరికళ్ళూ ఎర్రగా ఉన్నాయి. నీల మాత్రం హాయిగా పడుకుని వాళ్ళు లేచిన మరో అరగంట దాకా లేవలేదు.

    ముఖాలు కడుక్కుని కాఫీలు తాగేక __ "ఓసారి చలమయ్యను పలకరించి వస్తానుండు __" అని భార్యతో చెప్పి బయల్దేరాడు రాజారావు.

    అతడు వెళ్ళేసరికి చలమయ్య కుర్చీలో కూర్చుని చుట్టకాల్చుకుంటున్నాడు. రాజరావుని చూడగానే చటుక్కున లేచి __ "ఏమండోయ్ _ పొద్దున్నే ఇలా వచ్చారు ....." అన్నాడు.

    "ఆ ఏమీ లేదండీ _ మీ అబ్బాయున్నాడేమోనని!"

    "ఎవరూ _ గరవయ్యేనా _లేకేం __ ఈరోజు పెందరాళే కూడా లేచి కూర్చున్నాడు __" అన్ ఒరే అబ్బాయీ ...." అని కేకేశాడాయన.

    రెండు నిముషాల్లో గరవయ్య అక్కడకొచ్చాడు, అతడు రాజరావును చూసి తడబడ్డాడు . రాజరావతదివంక తీక్షణంగా చూశాడు. గరవయ్య అతడితో చూపులు కలపలేక కళ్ళు వాల్చేశాడు . అంతలోనే రాజారావు ముఖం ప్రసన్నంగా మారిపోయింది. 

 Previous Page Next Page