Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 7

   

   "మంచి అవసరంలో యిస్తున్నారు. ఎంత వడ్డీ అయినా యిచ్చుకుకుంటాను ....." అన్నాడు లింగరాజు . అయితే అతడి కింకా రాజారావు మాటల్లో నమ్మకం కుదిరినట్లు లేదు.

    "వడ్డీ అడగడానికి నాదేమన్నా వడ్డీ వ్యాపారమా? ఏదో అవసరంలో ఉన్నారుగదా అని ఇస్తానన్నానంతే!"

    ఇంకేమీ మాట్లాడలేదు లింగరాజు జేబులో సిద్దంగా వున్న ప్రామిసరీ నోటుతీసి _ "కనకరాజు గారింటికెళ్ళి రాయించు కోస్తా." అంటూ లేవబోయాడు.

    "ఎందుకండీ వృధా శ్రమ! రెవిన్యూ స్టాంపు అంటించి సంతకం చేసి నా దగ్గర రెండువేలు తీసుకున్నట్లో రసీదివ్వ౦డి చాలు. మీరు డబ్బివ్వగానే మీ రసీదు మీకేకిచ్చేస్తాను. నాకు వడ్డీ అక్కర్లేదు కానీ వీలైనంత తొందరగా తిరిగచ్చేయండి." అన్నాడు రాజారావు.

    "ఈ వేళేవారి ముఖం చూసోచ్చావో గానీ _ నక్కను తోక్కోచ్చవయ్యా లిమ్గారాజూ _ నీ పని చాలా సులభంగా అయిపోయింది ....." అని "ఇంతకూ మీరిక్కడికెందుకొచ్చారో _" అంటూ ప్రశ్నించాడు రమాకాంతం రాజారావుని.

    "మీరేమీ అనుకోనంటే అది చాల చిన్న విషయమే!"

    "చెప్పండి __ అనుమనిస్తారేం?"

    "ఏమీ లేదు . ఈ ఊళ్ళోమాకేమీ తోచడంలేదు . కాలక్షేపం కోసం __ ఊళ్ళో నిరక్షరసులైన పెద్దలందరికీ విద్యాదానం చేయాలనుంది ......."

    రామాకాంతం అదోలా రాజారావువంక చూసి, "మీ కెందుకండీ అనవసర శ్రమ. ఈ ఊళ్ళో ఎవరికీ చదువంటే కుతూహలం లేదు. మీ ఆశయం మంచిదే కానీ ఆచరణకీ ఊరట్టే తగినది కాదు" అన్నాడు.

    "అదంతా నే చూసుకుంటాను . ఇందుకు మీకేమీ అభ్యంతరం లేదని చెబితే చాలు, ఆహా __ మీ కభ్యంతరం ముంటుందని కాదు. కానీ ఈ ఊరి ప్రెసిడెంట్ మీరు ..... అందుకని గ్రామ సంక్షేమ కార్యక్రామాలేవి ప్రారంభించినా.....

    "అర్ధమయిందిలేండి. ఇటువంటి విషయాల్లో నా అభ్యంతర మెప్పుడూ ఉండదు. ఇందులో నేను చెయ్యగలిగిసాయమేదైనా ఉంటే ....."

    అంతమాటన్నారు అదే చాలు . ఇలా నేను చదువుచెప్పదలచుకున విషయం నలుగురికీ తెలిసే ఏర్పాటు చేస్తే చాలు మీరు. మీ ఉపకారం మరచిపోను ....."

    "ఊరికి ఉపకారం చేస్తూ __ నా ఉపకారాన్ని పొగుడుతారేంటండీ మీరు __ భలే వారే!" అన్నాడు రామాకాంతం.

    "మరి ఉంటానండీ _" అంటూ లేచాడు రాజారావు అతడితోపాటే తనూ లేచాడు లింగరాజు.

    "ఉండండి __ కాఫీపుచ్చుకుని విడుదురుగాని" అన్నాడు రమాకాంతం.

    "కాఫీ కేముందీ __ మరోసారోచ్చినప్పుడు పుచ్చుకుంటాను. ఈసారికి బలవంత పెట్టొద్దు." అని __"రండి లింగరాజు గారూ!" అంటూ గుమ్మంవైపు నడిచాడు రాజారావు.

    రాజారావు, లిమ్గారాజూ వెళ్ళిపోయారు. రమాకాంతం దొడ్లో పని చేస్తున్న పాలేర్ని పిలిచి _ "అర్జంటుగా ఓసారి కరణంగారిని పీల్చుకునిరారా!" అన్నాడు.

    కనకరాజోచ్చేదాకా రమాకాంతం తీవ్రలోచనలో వున్నాడు . ఆయన్ను చూడగానే రమాకాంతం ముఖం వికసిమ్చాగా రండి _ రండి _ పంతులుగారూ!" అన్నాడు.

    "ఏం జరిగిందీ _ అర్జంటుగా రమ్మన్నారుట...... కుర్చీలో కూర్చుంటూ అడిగాడు కనకరాజు

    "ఆ చలమయింట్లో దిగాడు ఆ రాజారావు సంగతేదో నాకు చాలా అనుమానంగా ఉందండీ _" అన్నాడు రమాకాంతం.

    "ఆ రోజు మనల్నందరినీ ఆహ్వానించినప్పుట్నుంఛీ నాకూ అనుమానంగానే ఉంది కానీ _ మీ అనుమానానికి సరైన కారణవేదో ఉన్నట్లుంది."

    "అవుఅనండీ _ ఇందాక లింగరాజొచ్చి ఓ రెండు వేలప్పడిగాడు. ఆ దగ్గరంత డబ్బు లేదన్నారు. అప్పుడు రాజారావిక్కడికొచ్చాడు. విషయం విని ఆ రెండువేలూ తనిస్తానన్నాడు . నావుతక్కార్లేదట. రెవిన్యూ స్తాంపంటించిన కాగితం మీద రసీదిస్తే చాలుట. వడ్డీ కూడా అక్కర్లేదన్నాడు."

    "చాలా విచిత్రంగా ఉందే _ తనకట్టే స్తోమతు లేడన మనిషి ఉన్నపళంగా రెండువేలు __ కేవలం సహాయంగా _ ముక్కు మొగం ఎరగని మనిషికిస్తున్నాడంటే ....."

    "అదేనండీ నాకూ చిత్రంగా ఉంది. దీన్నిబట్టి డబ్బంటే అతడికి చాలా నిర్లక్ష్యం అని తెలుస్తోంది. అంత నిర్లక్ష్యాన్నికి కారణమేమిటంటారు __ బాగా ఉన్నవాడటారా!"

    కాదనడం కష్టమే కానీ నామటుకు నాకతను బాగా ఉన్నవాడంటే నమ్మకం కుదరడంలేదు __" అన్నాడు కనకరాజు సాలోచనగా .

    "ఏమో! అసలాతడీ ఊరేందుకొచ్చాడో _ ఉద్దేశ్యం మేమిటో కూడా నాకేమీ అంతుపట్టడంలేదు. కానీ ఏదో ప్రత్యేకమైన కారణం వల్లనే ఈ ఊరోచ్చాడని మాత్రం చెప్పగలను నేను. ఇందాకా ఏమన్నాడో తెలుసా! ఒల్లోచదువురాని వాళ్ళందరికీ చదువులు చెబుతాట్ట..... అందుకునాపర్మిషన్ అడిగాడు. చాలా బాగా మాట్లాడేడనుకోండి......"

    "ఊళ్ళోవాళ్ళందరికీ చదువుచెప్పడమెందుకుట?"

    "కాలక్షేపం కోసంట _ ఎలావుంది సమాధానం?"

    కనకరాజు నవ్వి __ "ఈ అబ్బాయేదో దాస్తున్నాడండీ _ అయినా ఏ రహస్యం మాత్రం ఎన్నాళ్ళు దాగుతుంది? ఏదో రోజున అసలు సంగతి మనకూ తెలియక పోదు ....." అన్నాడు .

    "అవునుకోండి. ఆ రోజు తొందరగా వస్తే బాగుండునని పిస్తోంది. ఏమయినా కుర్రాడు అసాధ్యుడు .... అన్నాడు రమాకాంతం.

    ఆ తర్వాత కనకరాజు రామాకంతం దగ్గర సెలవు తీసుకున్నాడు.

                                                5

    "మేము కేవలం మీ క్షేమం కోరే చదువు చెబుతున్నామనుకోండిఇందులో మా స్వార్ధం కూడా ఉంది. మాకిక్కడ కాలక్షేపం కావడం కష్టంగా ఉంది. మీబోటి పెద్దలతో పరిచయమూ అవుతుంది. అటు మాకు కాలక్షేపం ఇటు మీకు విద్యాలాభ _ రెండూ కలిసొస్తాయని ఈ ఏర్పాటు చేశాను. చదువుకోవాలనే కుతూహలంలో మీరంతా ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది __" అన్నాడు రాజారావు.

    అక్కడకు చేరిన పదిమందీ ఏం మాట్లాడాలో తెలియక ఒకరిముఖాలోకరు చూసుకున్నారు.

    రాజరావే మళ్ళీ మాట్లాడాడు. "చదువువల్ల ఉపయోగాలేమిటో మీకు నేను చెబుతాను కాలక్షేపం కానప్పుడు కధయి చదువుకోవచ్చు. ప్రపంచమని విశేషాలు వార్తా పత్రికలు చదివి తెలుసుకోవచ్చు, చేతనైతే కవిత్వం రాయవచ్చు. అన్నింటికంటె ముఖ్యమైనది __ దేవుడిచ్చిన కళ్ళను సక్రమంగా వినియోగించుకోవచ్చు. దేవుడు మనిషికి కళ్ళు చదవడానికే యిచ్చాడు. కేవలం చూడడానికే అయితే జంతువులకీ కళ్ళున్నాయి. చూడడం తప్ప మరేదీ చేతకానప్పుడు మనం జంతువులకంటే  ఎక్కువేలాగౌతాము? నేనిలా గన్నానని మీకిప్పుడు కోపం రావచ్చు. కానీ ఓ నేలరోజులు నా దగ్గర చదువుకున్నాక నేను చెప్పినదానిలో నిజం మీరే గ్రహిస్తారు......."

 Previous Page Next Page