అప్పుడక్కడున్న వాళ్ళందరికీ కాసేపు తమలో తాము మాట్లాడుకునే అవకాశం వచ్చింది.
"కొత్తగా పట్నంనుంచి వచ్చాదుగా _ ఆ వాసనింకా కొన్నాళ్ళ దాకా పోదు __" అన్నాడు రమా కాంతం.
"ఏమైనా మనిషి సంస్కారమున్న వాడిలా కనబడుతున్నాడు . ఎక్కడా అహంకారామన్నది లేదు __" అన్నాడు కనకరాజు .
"గులాభ్ జాం మాత్రం చాలా బాగుంది __" అన్నాడు ముత్యాలయ్య .
"అదృష్టవంతుడు అందమైన భార్య ఉంది __" ఈ మాటలు మనసులో మాత్రమె అనుకున్నాడు భద్రం . చలమయ్య ఏదో అందామనుకునేలోగా రాజారావు, వసంత రెండు ట్రేలతో వచ్చేశారు. ఒక ట్రేలో ఇడ్లీలు సర్దిఉన్నాయి. రెండో ట్రేలో ఓ స్టెయిన్ లెస్ స్టీలుది, మరోపింగాణీది కేటిల్సున్నాయి.
ఇడ్లీ ప్లేట్లు రాజరావందరికీ అందిస్తుండగా వసంతలోపలకు వెళ్ళి గ్లాసులు తెచ్చింది. నీల అట్టపెట్టి చాలా జాగ్రత్తగా తెచ్చింది. అందులో స్టీలు కప్పులున్నాయి.
స్టీలు కేటిల్లోంచి గ్లాసుల్లో మంచినీళ్ళు పోసింది వసంత.
మగవాళ్ళందరితో పాటూ రాజరావూ టిఫిను తీసుకున్నాడు అంతా మంచినీళ్ళు తాగేశ _ అందరికీ వసంత టీ యిచ్చింది.
ప్రెసిడెంటు కరణాలకు ఈ పార్టీలు మరీ కొత్తకాదు. భద్రానికి వింత కాదు. ముత్యాలయ్య, చలమయ్య లకు మాత్రం ఇది అబ్బురంగా ఉంది.
అన్నీ అయిపోయాక రాజారావు నవ్వుతూ _ "ఇప్పు డొక చిన్న వినోద కార్యక్రమం _" అన్నాడు.
నీల, వసంత లోపలకు వెళ్ళిపోయారు.
రాజారావు తన ఒడిలో ఉన్న ట్రాన్సిస్టర్లు లాంటి పరికరం స్విచ్ అన్ చేశాడు;
ముందు "పగలే వెన్నెలా __" అన్న పాట వచ్చింది. అన్య మస్కరంగా అంతా ఆ పాట విన్నారు. అయితే ఆ పాటవగానే "వీరే రామాకాంతం గారు. ఈ ఊరిప్రెసిడెంటు __" అన్న చలమయ్య కంఠం ఖంగుమంది.
అంతా తెల్లబోయారు. తర్వాత ఆ పరికరంలోంఛీ __ "వీరు కారణం కనకరాజు గారు __ వీరు మునసబు భద్రంగారు" అంటూ మాటలు రాసాగాయి.
రాజరావా పరికరం స్విచ్ ఆఫ్ చేసి _ "ఇది టేపు రికార్డర్ . నేనిందాక ఇంట్లోకెళ్ళేదాకా మన మాటలన్నీ సరదాగా రికార్డుచేశారు. ఆఖరున సరదాగా వినవచ్చునని ఒక్కొక్కప్పుడు మనమే మాట్లాడుతుంటామో మనకే తెలియదు. తర్వాత వింటే చాలా ఆశ్చర్యంగా వుంటుంది. మీకు వినలనుంటే సరదాగా అన్ చేస్తాను __" అన్నాడు.
కేవలం కుతుహాలం మాత్రమె కాక_ తామేం తప్పు మాట్లాడేమానాన్న వ్యక్తపరిచారు. పూర్తిగా విన్నాక అందరూ తెలికిగా నిట్టూర్చారు. తమ మాటలు తాము వినడం అండరికీ ఓ తమాషా అనుభవం అప్పటికింకా యింటి౦టా టేపు రికార్డర్లు రాలేదు. పల్లెటూళ్ళలో అయితే మరీ అరుదు.
"మొత్తానికి మా భద్రం అన్నట్టు మీరు చాలా తమాషా మనిషండీ __" _ అన్నాడు రామాకాంతం మీసాల చాట్నుంచి చిన్నగా నవ్వుతూ.
"ఏమైతేనేం ఈరోజు చాలా సరదాగా గడిచి పోయింది. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు చాలా క్రుతజ్ఞాడ్ని __" అన్నాడు రాజారావు.
ఈ మాట తను చాలా సందర్భాలల్లో విన్నట్లు స్పురించింది ప్రెసిడెంట్ రమాకాంతానికి _ " మరి వస్తామండి!" అన్నాడాయన . వెంటనే మిగతావాళ్ళు లేచారు. అందర్నీ గుమ్మం వరకూ సాగనంపి తలుపులు వేసుకున్నాడు రాజారావు.
చలమయ్య దగ్గర వీడ్కోలు తీసుకుంటూ __ "మొత్తానికీ మనిషి అసాధ్యాడయ్యా __" అన్నాడు రమాకాంతం .
ఆ సంగతి వేరే చెప్పాలా?" అన్నాడు కనకరాజు.
"నాకు సరిగ్గా గుర్తుకురావడంలేదు కానీ __ ఈ మనిషిని నేనిదివరలో ఎరుగుదును ....." అని స్పష్టంగా గొణికాడు ముత్యలయ్య. అదే ముక్క తనలో అనుకుంటూ ఆలోచిస్తూన్నాడు చలమయ్య యింట్లో కుర్చీలో కూర్చుని.
3
ఇంక రెండ్రోజుల్లో కాలవలోకి నీళ్ళు వదుల్తారనగా భార్య, కుఉతురితో కలసి షికారుకి బయల్దేరాడు రాజారావు. అప్పటికతడా ఊరువచ్చి పది పన్నెండురోజులవుతుంది.
వేసవిలో గోదావరిలో నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి _ మేనెల ప్రాంతంలో సుమారు నేల రోజులపాటు కాలవ కట్టేస్తారు. ఆ నెలరోజులూ కాలవలో పొడి యిసుక మినహాయించి ఇంకేమీ ఉండదు. పత్నవాసం అలవాటైన వారికి షికారుకాలువ చాలా బాగుంటుంది. రెండువైపులా నించీ వీచే చల్లని గాలి యిచ్చే అనందం అనుభవైకవేద్యం మాత్రమే.
కుటుంబ సమేతంగా బయటకు రావడం అదే మొదటి సారి రాజారావు _- భార్యభర్తలావిధంగా షికారుకి పోవడం ఆ ఊరికి కొత్తకాబోలు __ చాలా ఇళ్ళల్లోంచి తలుపుల చాటునుంచి వీళ్ళవంక విచిత్రంగా చిఇశారు. చక్కని ఆ సాయం సమయంలో వీధిలో ఒక్క జంట కూడా విహారానికి బయల్దేరక పోవడం రాజారావుకీ ఆశ్చర్య౦గానే ఉంది.
వాళ్ళలా కాలవలోకి నడిచారు.
కాలవ హడావుడిగానే ఉంది. అందులో బోరింగులు దింపి నీళ్ళపైపులేర్పాటు చేశారు. ఆ పైపుల చుట్టూ జనం చాలాఅమందున్నారు. నీళ్ళు పట్టుకునే వాళ్ళు పట్టుకుని వేడుతున్నప్పటికీ పైపుచుట్టూ జనంమాత్రం తరగడంలేదు. కొంతమంది అక్కడక్కడా ఇసుకలోని చెలమలుతీసుకుని జాగ్రత్తగా బిందెల్లోకి నీరు చెదుకుంటున్నారు. నీళ్ళు కాక అక్కడక్కడ జనం కూర్చుని కబుర్లు చెప్పుకుంతునా అలాంటి వాళ్ళలో అడివాళ్ళేక్కడా లేరు.
అనేకమంది తమవంక చూస్తున్నట్టు గ్రహించినప్పటికి అది గమనించినట్టే నెమ్మదిగా ముందడుగు వేయసాగారు రాజారావు కుటుంబం అలా కొంతదూరం వెళ్ళేక __ "కాళ్ళు లాగుతున్నాయమ్మా!" అంది నీల.
"నాతో చెబితే ఏం లాభం? మీ నాన్ననడుగు __" అంది వసంత.
పాప తండ్రివంక చూసింది. రాజారావు అనంగీకార సూచనగా తల తిప్పి _"ముందు అమ్మనడిగావుగా __ అమ్మనే ఎత్తుకోమను __" అన్నాడు.
"పాపం __ అమ్మ నన్నేట్టుకోలేదు __" అంది నీల.