Previous Page Next Page 
అధికారి పేజి 4

    అంటే కొత్త సి.పి ఈ కమిషనరేట్ లో పనిచేస్తున్న సిబ్బంది అంతా లంచగోండులని నిర్దారించినట్లే! తను అంటే సి.ఎ  ఒక్కడే నిజాయితే పరుడని దప్పుకొట్టుకున్నాట్టా? ఆడిటోరియం తలుపులు మూస్తున్నారు. అధికారి లేచాడు. బయటకు వచ్చి స్టాండులోంచి తన సైకిల్ తీశాడు. వెనుక టైరు పంక్చర్ అయింది. తను వెంటనే ఎనిమిదో టౌను పోలీసు స్టేషను కు డ్యూటీకి వెళ్ళాలి. తన పాతసైకిల్ సైకిల్ షాపులో ఇచ్చి సిటీ బస్ ఎక్కాడు.

   
    అధికారి సిటీ బస్ ఎక్కడం మొదటిసారి కాదు. కాని అతను వీలైన్నంతవరకు సైకిల్ మీదే వెళతాడు. సిటీబస్సు  ఎక్కడంలో తను ఎన్నోసార్లు ఇబ్బందులను ఎదిర్కోవలసి వచ్చింది.   కారణం అతని సహజసిద్దమైనా  ప్రవర్తనే. నిజాయితీ తన ఊపిరి! న్యాయం ధర్మం తన పర్స్!
   
    కండక్టర్ రావడంతోనే జేబులోంచి ఐదురూపాయలనోటు తీసి సెంటర్ చెప్పి టికెట్ కొట్టమన్నాడు.
   
    "ఆ...." అంటూ కండక్టర్ ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే.....
   
    "కొత్త కమిషనర్ వచ్చాడు కదా నిజాయితీకి మేంమారు పేరు అన్నట్టు ఇది ఓ స్టంట్ ...." వినీ వినిపించనట్లు ముందుసీట్లో కూర్చున్న నడివయసులో వున్న ఓ ఇద్దరు ప్యాసింజర్లు తమలో తామే గుసగుసగా చర్చించుకున్నారు.
   
    "కండక్టర్ గారు మీరు దయచేసి టికెట్టు ఇస్తే వాళ్ళు తను అభియోగాన్ని వాపసు తీసుకుంటారు" కానిస్టేబుల్ అధికారి కంఠం  ఖంగుమంది.
   
    అంతే కండక్టర్ చింపి అతని చేతిలోపెట్టారు. ఓ స్టేజీ రావడంతో కొందరు ప్యాసింజర్లు దిగారు. మరికొందరు బస్సు ఎక్కారు. వాళ్ళా చేతుల్లో పుస్తకాలూ టిఫిన్ బాక్స్ ఉండడాన్ని సీట్లు ఖాళీ లేక అలా నుంచునే మరో చేత్తో బస్ కస్టడీని పట్టుకుని నానా అగచాట్లు పడుతున్నారు బస్సుకు బ్రేక్ పడినప్పుడల్లా.
   
    అధికారి వాళ్ళ అవస్థను గమనించాడు అప్పటికీ స్రీలకని కేటాయించిన సీటల్లో ఆడవాళ్ళు ఇరుక్కుని మరీ కూర్చునారు. ఇక ఒక్కటే మార్గం అని గ్రహించి చటుక్కున లేచి వాళ్ళకి తన సీటు ఆఫర్ చేశాడు.
   
    "మీలో ఎవరైనా నా సీటులో కూర్చుని మిగిలిన వాళ్ళా పుస్తకాలు టిఫిన్ బాక్సులు ప్రక్కన పెట్టుకుంటే మీరు ప్రయాణం కష్టంగా వుండడు.
   
    అంతే వాళ్ళలో అందరికన్నా పొట్టిగా వున్న అమ్మాయి సీటీ బస్సు రద్దీ అందక నానా తిప్పలు పడి వెంటనే అతని సీట్లో కూర్చుంది. మిగిలిన వాళ్ళు వాళ్ళ చేతుల్లోని పుస్తకాలు, టిఫిన్ బాక్సులు ఆమె వొళ్ళోపెట్టారు.
   
    వాళ్ళంతా ఆ కానిస్టేబుల్ కేసి కృతజ్ఞతగా చూసి థాంక్స్ చెప్పారు.
   
    అది మింగుడు పడని రోమియోలు కొందరు తమ సీట్లలోంచి లేచి మిగతా వారికి వాళ్ళప్రక్కన సీటు ఆఫర్ చేశారు.
   
    విద్యార్దినులు పరిస్థితి అర్ధం చేసుకుని మౌనంగా ఉండిపోయారు.
   
    "ఫర్వాలేదు మా ప్రక్కన కూర్చుంటే మీ పరువేమీపోదు" అంటూ విద్యార్ధుల చేతులు పుచ్చుకులాగారు. వాళ్ళు ఏం జరుగుతుందోన్న భయంతో బిక్కుబిక్కుమంటూకూర్చున్నారు. బస్సు వెళుతున్నంతసేపు  ఆ పోకిరి వెధవలు ఆడపిల్లలను  నానా హింసలు పెడుతున్నారు.
   
    అధికారి సరాసరి డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు అంతే సిటీ బస్ నాన్ స్టాఫ్ సర్వీసులా దూసుకుపోతోంది ఏ స్టేజీ దగ్గర ఆగకుండా సరాసరి ఎనిమిదో టౌన్ పోలీసు స్టేషన్ ముందు ఆగింది.
   
    ఇప్పటికి ఆ పోకీరిలను విషయం బోధపడింది. అధికారి బస్సుదిగి సరాసరి స్టేషను ఏస్. ఐ. కి జరిగింది ఫిర్యాదు చేశాడు.
   
    "నాన్సెన్స్..... అసలు నువ్వెందుకు డ్యూటీకి ఆలస్యంగా వచ్చావు. డ్యూటీకి సక్రమంగా రావడం తెలియని వాడివి నువ్వు. నాకు ఈవ్ టీజింగ్  గురించి గుర్తు చేయనక్కర్లేదు. నాకు తెలుసు నేనేం చేయాలో ఎస్.ఐ.పెద్ద గొంతులో రంకెలు వేస్తున్నాడు.
   
    అప్పటికే అందరికి ఆలస్యం అవ్వడం మూలానా, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు. కాలేజీలకు వెళ్ళేవాళ్ళు అసహనంతో వున్నారు. ఇదే అదనుగా తీసుకుని ఆకతాయిలు చెలరేగిపోయారు.   
   
    "ఈ రోజు మాకు క్లాసులు పోయాయి. దీనికి మీ పోలీసు కానిస్టేబుల్ కారణం. పోలీసు జులుం నశించాలి. కానిస్టేబుల్ డౌన్ డౌన్!" అంటూ కోరస్ గా నినాదాలిచ్చారు.
   
    "చూడు.... బాగా చూడు నువ్వు క్రియేట్ చేసిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ .... వెళ్ళుముందు వాళ్ళకు సారీ చెప్పి వాళ్ళని పంపించిన తరువాతే డ్యూటికీ రా...." ఏస్.ఐ. ఆసహనంగా అన్నాడు.
   
    అధికారి ముఖంలో రంగులు మారాయి.
   
    "ఏం ఉద్యోగంలో ఉండాలని లేదా! వెళ్ళు వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పిరా"
   
    "నో.... నేను సారీ చెప్పను"
   
     "మీకు నేను సంజాయిషీని ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు జరిగింది రిపోర్టు చేశాను అంతవరకే నా డ్యూటీ."
   
    అంటే నా మాటకే ఎదురు చెబుతున్నారా అర్దరీ రూమ్ కి మావ్చేచేస్తాను జాగ్రత్త.
   
    "ఐ యాం రెడీ సార్ మార్చ్ చేయండి" అధికారి స్థిరంగా అన్నాడు.
   
    కొత్తగా ఉద్యోగంలో చేరాడు కదా ఉడుకు రక్తం మీరు అతని మీద రోపోర్టు రాసివ్వండి సి.ఏ గారి ముందు పెడతాను. అనకవారే డిసిప్లేరీయాక్షన్ తీసుకుంటారు తిక్క కుదురుతుంది.
   
    "రిపోర్టు మీకివ్వడం ఎందుకు.... సరాసరి మేమే సి.ఐ. గారి దగ్గరకు వెళతా౦. మా బలం ఏమిటో చూపిస్తాం " ఆవేశంగా అంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కమీషనర్ అఫీసువేపు బయలుదేరారు ఆకతాయిలు.

    నీ ఖర్మ చెపితే విన్బప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను కొత్త కమిషనర్ మొదట వడ్డన నీతోనే ప్రారంభం అవుతుంది రెడీగా వుండు. ఇక ఈ రోజుకు నీ డ్యూటీ ఇక్కడే. సి.పి. నుండి కబురు వస్తే అప్పుదు వెంటనే వెళ్ళడానికి సిద్దంగా వుండు"ఎస్.ఐ. జరగబోయేది చెబుతూ జాలిపడుతున్నట్లు ఫేస్ ఫీలింగ్స్ మర్చుకున్నాడు.

 Previous Page Next Page