ఫోన్ రింగయ్యింది ఎస్.ఐ. కంగారుగా రిసీవరేత్తాడు. అవతల విషయం తెలిసి పళ్ళు పటపట నూరాడు. అవతల అమ్మగారు ఫోను పెట్టేసింది.
ఎస్.ఐ. అంతే ఆవేశంగా నాల్గవ టౌన్ ఎస్.ఐ.కి. ఫోన్ చేశాడు. అవతల ఎస్.ఐ. ఫోన్ ఎత్తగానే ఇక అందుకున్నాడు.
"గోపాల్ మీ సిబ్బంది డ్యూటీ సరిగ్గా చేస్తున్నట్టు లేదు."
అదేంటి బాసు ఆ డౌట్ నీ కెందుకొచ్చింది?"
"డౌటుకాదు మిత్రమా నీకు తెలుసుగా మా పెద్దమ్మాయి మాంటిసోరీ హైస్కూలులో పదవ తరగతి చదువుతుంది. ఈ రోజు ఎవరో జులాయి వెధవలు స్కూలుకు వెళ్తుండగా అమ్మాయిని నానా రభసా చేశారట పుస్తకాలు, టిఫిన్ బాక్స్ రోడ్డుమీద పడిపోయాయట ఏడ్చుకుంటూ వచ్చింది ఇక తను చదువు మానేస్తావని ఇంట్లో ఒకటే గోలా.... నువ్వుంఏం చేస్తావో నాకు తెలియదు ఆ జులాయి నా కోడుకులకి కాళ్ళు చేతులు ఉండకూడదు...... ఏ మాట్దాడవే!"
"సారీ బాస్ నీ కూతురుకి జరిగితే నా కూతురికి జరిగినట్టే ఇక చూస్కో రేపీపాటికి వాళ్ళకి నేనిచ్చే ట్రీట్ మెంట్ పేపర్లో చూద్దువుగాని "
"థాంక్సు బ్రదర్ ఇక ఉంటాను."
"ఎ టూ నాట వన్ బుర్ర వేడెక్కింది టీ పట్రావోయ్" ఇప్పుడు ఎస్.ఐ. కుర్చీలో రీలక్సు అయ్యాడు.
అధికారి భృకుటి సాలోచనగా ముడిపడింది. "తన దాకా వస్తే గాని అన్నట్టు" నిజంగా ఈ వ్యవస్థ 'సి.పి' గారన్నట్టు పాడైపోయిందా!
"ప్చ్"
* * * *
పోలీసు కమిషనర్ చాంబర్స్ సిటీ. యాంటీ గూండా ఇన్స్ స్పెక్టర్ అతని సిబ్బంది అంతా అటే౦క్షన్ లో వున్నారు.
కమిషనర్ వాళ్ళందరిని ఓసారి నఖశిఖ పర్యంతం చూశాడు.
"నువ్వు ఇన్స్ స్పెక్టర్ వా?"
"ఎస్. సార్."
"జోకర్ లాగుంటేను. జోకర్ వేమోనని అనుమానపడ్డాను."
"సారీ సార్ యూనిఫాం వేసుకురమ్మంటారా?"
"సఫారీలోనే ఇంత స్మార్ట్ గా వుంటే ఇక యూనిఫారంలో అయితే చేప్పనక్కర్లేదు. బైదిబై. ఎన్ని సంవత్సరాలనుండి ఎ.జి.ఏస్. లో వున్నావు? ఏమన్నా సంపాదించావా?"
"సర్ నేను వచ్చి నెలలే అయింది సార్."
"ఐసీ.... వాళ్ళంతా ఎవరు?"
"వాళ్ళిద్దరూ ఎస్.ఐ .లు. మిగిలిన ఆ పదిమంది హెడ్ కానిస్టేబుల్స్ సార్."
"అరె నా కళ్ళకి వాళ్ళు ప్రెగ్నెంట్ డేక్స్ లా (కడుపుతోవున్న బాతుల్లా) కనిపిస్తున్నారే. ఏమోయ్ మీరంతా సుమో వస్తాదులా? రోజుకి ఎన్నిపూటల తింటున్నారు?"
అందరి ముఖాలు మాడిపోయాయి. తేలుకుట్టిన దొంగల్లా అంతా పోట్టల్ని లోపలి బిగపెట్టే ప్రయత్నం చేశారు.
"లాభంలేదు. అలా కొవ్వు కరగదు కాళ్ళకి పని చెప్పాలి. తిండి తగ్గించాలి. నెలరోజులు టైం ఇస్తున్నాను. ఒక్కొక్కరు కనీసం పదికేజీలు తగ్గాలి, అంటే తిని కూర్చోకుండా డ్యూటీ సక్రమంగా చేయాలి అండర్ స్టాండ్ .
"ఎస్. సార్ ."
"ఇన్స్ స్పెక్టర్ నీ సిబ్బందిని వేళ్ళమను. నీ పేరేమిటి అన్నావు.
"హరిశ్చంద్రుడు సార్."
"ఆ..... ఈ రోజునుంచి సత్యహరిశ్చంద్రుడిలా డ్యూటీ చేయి. యూ మస్ట్ బ్రేక్ జోన్స్ . రౌడీ అనే వాడెవ్వడూ నా కమిషనరేట్ లో వుండడానికి వీల్లేదు. ఏం చేస్తావు ?"
"సర్ ఐవిల్ బ్రేక్ బోన్స్"
"ఎవరివి?"
"రౌడీలవి సార్."
"దట్స్ గుడ్ నీ ప్రోగ్రెస్ నేను గమనిస్తూ వుంటాను. ముఖ్యంగా ఆ బెనర్జీ ముఠామీద ఓ కన్నువేసి వుంచు . ఎప్పటికప్పుడు వాళ్ళ కదలికలను గమనించి నాకు తెలియ జేస్తుండు."
"అలాగే సార్"
"ఓ.కే. యూకేన్ గో నౌ " ఇన్స్ స్పెక్టర్ వెళ్ళిపోయాడు.
బజర్ మ్రోగడంతో రిసీవరేత్తాడు కమిషనర్.
"సర్ హొమ్ మినిస్టర్ గారు లైనులోకి వస్తున్నారు సార్" అంటూ సి.పి. చెప్పి ఫోన్ పెట్టేశాడు.
"గుడ్ మార్నింగ్ సార్. విక్రం హియర్ సార్."
"ఎవ్విరిథింక్ ఓ.కే. ఇప్పుడిప్పుడే ప్రక్షాళన చేస్తున్నాను సార్."
"సార్ బెనర్జీ.... బెనర్జీమీద నిఘా పెట్టానుసార్ తొందరలోనే ఫినిష్ చేస్తాను సార్..... గుడ్. డేసర్ "రిసీవర్ పెట్టేశాడు.
ముఖాన పట్టిన చిరుచేమటలను కర్చీఫ్ తో తుడుచుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి గన్ మెన్ స్ప్రింగు డోరు తెరచి "సార్ తమరితో మాట్లాడడానికి బేనర్జీగారు వచ్చారు" అని క్షణం ఆగాడు.
కమిషనరు భృకుటి ముడిపడింది . ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకున్నాడు.
"ఓ.కే. లోపలకు రాగానే గన్ మెన్ స్ప్రింగుడోరు మూశాడు. ఇప్పుడా గదిలో కమిషనర్ బెనర్జీ ఎదురెదురుగా వున్నారు. వాళ్ళిద్దరూ ఎదురు పడడం అదే మొదటిసారి ఒక్కసారిగా బయట ఉరుములు మెరుపులతో గాలివాన మొదలయింది.
* * * *
"ఎక్కడ స్రీలు గౌరవవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు." స్రీ తల్లిగా, అక్కగా, భార్యగా , స్నేహితురాలిగా ఇంటిపనులు చేసే సేవకురాలిగా ఈ సమాజంలో గుర్తింపబడుతుంది. అటువంటి స్రీ యీ రోజున మానవ సమాజంలో వివక్షతకు గురి అవ్వడం సోచీనీయా౦శం. నేడు స్రీలపై అత్యాచారాలు, అరాచాకాలు పెచ్చు పెరిగి పోతున్నాయి. అసలు స్రీకి శత్రువులు ఆమె పుట్టకముందే ఈ సమాజంలో పుడుతున్నారంటే అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. పుట్టబోయేది ఆడపిల్ల, మగపిల్లాడో నిర్దారించగల నైపుణ్యం నేటి మానవుడికి విజ్ఞాన శాస్రం ప్రసాదించిన వరం అయితే అదే కడుపులోనే ఆడపిల్లలను అంతం చేయగల పాశుపదాస్త్రం అయింది. ఇప్పుడు మనం మన విజ్ఞానం పెంపొందిందని గర్వపడాలా? ఆడపిల్లలకి ప్రాణాంతకంగా వున్న ఈ విజ్ఞాన శాస్రాన్ని దుయ్యబట్టాలా? పురిటి నొప్పులను, బాలరిష్టాలకు తట్టుకుని బ్రతికి బట్టకట్టిన ఆడపిల్లలకి ఈ సమాజంలో మాన ప్రాణాలకు రక్షణ వుందంటారా?" మహిళా మండలి ప్రెసిడెంటు శ్రీమతి వర్దనమ్మ గాలి పీల్చుకోవడానికన్నట్టు క్షణం ఆగింది.