అని నేను అనడంలేదు. ఈ కమిషనరేట్ లో పనిచేస్తున్న మీరందరూ పనికిమాలిన లుచ్చాలు. లంచగొండులు అని ప్రజలంతా ముక్తకంఠంతో మొత్తుకుంటున్నారు!
ఇది వాస్తవం కాదు, నిరాధారమైన ఆభూత కల్పనలు, అన్యాయపు అభియోగాలు అని మీ అంతరాత్మ మీద ప్రయణం వేసి మీలో ఎవరయినా నాతో చాలెంజ్ చేయగలరా?"
అంటూ ఆగదు ఆ రోజే కొత్తగా చార్జి తీసుకున్న సిటీ కమిషనర్ విక్రమ్. ఇప్పుడతని ముఖం కందగడ్డలా ఉంది. అప్పటివరకు శాసను కూడా పీల్చడం మరచిపోయినట్లు సిబ్బందిని ఉద్దేశించి అనర్గళంగా మాట్లాడిన కమీషనర్ జవాబు కోసం క్షణం ఆగి ఎవ్వరూ నోరు మెడపకపోయే సరికి తృప్తిగా సంతృప్తిగా శ్వాసతీశాడు.
అన్ని ర్యాంకులతో కలపి సుమారు వేయిమంది దాకా పోలీసు సిబ్బంది వున్న అ హాలులో సూది మోపితే వినబడే అంత నిశ్శబ్దం ఆవరించుకుంది.
అన్ని జన్మలలోకి ఉత్తమోత్తమ జన్మ మనవ జన్మ. ఆ మానవ జన్మకి పరాకాష్ట పోలీసు ఉద్యోగం అన్నట్టు వున్నాయి. ఆ అభియోగాలు. కొత్తగా పోలీసు ఉద్యోగంలో చేరాలనుకునే వాళ్ళకి ఒక్కసారి ఆ అభియోగాలన్నీ రికార్డు చేసి వినిపిస్తే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి బదులు కారణం రాయకుండా ఉరివేసుకు చావడానికి వేనుకడరేమో! ఎవరన్నా పెళ్ళికాని వాళ్ళు గనుక పోలీసు ఉద్యోగంలో ఉంటే వాళ్ళకి పిల్లని గాని, పిల్లాడి గాని యివ్వడానికి ఏ కన్నతల్లిదండ్రులు సాహసించరుగాక సాహసించరు.
అన్నిమాటలు అనిపించుకున్నాక కూడా యింకా మీరెందుకు బ్రతికి వున్నారని ఎవరయినా నిలదీస్తే! పోనీ మీలో చీము, నెత్తురు, పౌరుష, ప్రతాపాగ్నులు లేవని ఎద్దేవాచేస్తే కసుక్కున కత్తులు తీస్తారో! హేండ్స్ ఆఫ్ అంటూ తుపాకులు గురిపెడతారో! సమాధానం చెప్పడం కష్టమే!
సూక్ష్మంగా ఆలోచిస్తే సమాధానం మనకి వాళ్ళవాళ్ళా ప్రవర్తనలోనే గోచరిస్తుంది.
"ఎటంక్షన్ __ సావధాన్ __ ఎలో మత్ __ డోంట్ మూవ్ __ నోటాకింగ్ !" అన్న పదాలన్నీ ఇంగ్లీషు నిఘంటువులతో వున్నాయో లేవో ఖచ్చితంగా చెప్పడం కష్టమే _ కాని పోలీసు నిఘంటువులో మాత్రం షరా మామూలే!
అసలు POLICE అన్న పదానికి అర్ధం ఎమిటనుకున్నారు .
P_ అంటే నమ్రత
O _ అంటే విధేయత
L _అంటే విశ్వాసం
I _అంటే నిజాయితీ
C _ అంటే ధైర్యసాహాసాలు
E _ అంటే నైపుణ్యత
అని చెప్పుకోవాలి . అంటే అధికారులపట్ల సబార్టినెట్స్ నమ్రత, విధేయతలతో మెలగాలి, వారిపట్ల విశ్వాసం ప్రకటించాలి. వాళ్ళు తిట్టే తిట్లను, ఇచ్చే మెమోలను . చార్జీలను, పనిష్ మెంట్లను అందుకోవడానికి గుండెదిటవు చేసుకుని ధైర్యం పెంచుకోవాలి.
అంటే థికిస్కిస్టుగా (తోలు మందంగా __ దున్నపోతు మీద రాళ్ళ వర్షం కురిసిన చందాన) మారాలి. ఇక నైపుణ్యత అంటారా షరా మామూలే. ప్రతి ప్రశ్నకు జవాబుగా "ఎస్ సార్....!" అంటుండాలి.
బహుశ అందుకేనేమో ఎవ్వరిలో వీసమేత్తిన కూడా రియాక్షన్ కనిపించక పోవడానికి కారణం.
"సో..... అంతా వళ్ళు దగ్గర పెట్టుకుని, నీతిగా నీజాయితీగా డ్యూటీ చేయండి. ఎవరన్నా అవినీతిపరుడని తెలుస్తే ముక్కుకోస్తాను. తాగుడు, పేక, ముండలు లాంటి వ్యసనాల జోలికి వేళితే ఇంటిక్కాదు సరాసరి జైలుకు పంపుతాను __ జాగ్రత్త బీకేర్!"
కొత్త కమీషనర్ అందరికీ ఓ వార్నింగ్ డోస్ ఇచ్చి వెళ్ళిపోయారు . గుసగుసలు మొదలుపెట్టారు. అందరో ముఖాలలో కత్తిగాటుకి నెత్తుటి చుక్క లేనట్లుయింది.
కొందరు ఆత్మాభిమానంతో కుతకుత లాడిపోయారు.
"ఏమిటీ విపరీత ధోరణీ. కొత్త సి.పి. ఎంత నిజాయితీపరుడైతే మాత్రం కమీషనరేట్ లో పనిచేస్తున్న యావత్ పోలీసుశాఖను అసభ్యంగా చిత్రించి మాట్లాడడం ఎంతవరకు సహించాలి? అసలు ఆ అభియోగాలు ప్రజలు మోపినట్లా! లేక ప్రజలు అన్నట్లు సి.పి. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లా! లేక ప్రజలు అన్నట్లు సి.పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లా! ఈ విషయం ఇంతటిటో వదిలేస్తే బాగోదు. తాడోపేడో తేలాల్సిందే! అంటే యూనియన్ దృష్టికి తీసుకువెళితే! " ఆలోచిస్తున్నారు కొందరు.
మరికొందరు నిజంగా వ్యసనానికి బానిసలైన వారు సి.పి వాళ్ళని నిజంగానే జైలుకు పంపుతాడేమోనన్న భయంతో బిక్కు బిక్కుమంటున్నారు.
మరికొందరు మధ్యేవాదులు కొత్తగా ఇవన్నీ మామూలే! కొన్ని రోజులుపొతే షరా మామూలేలోయ్! ఈ విషయం ఇంతటితో వదిలేస్తే ఇంటికి మంచిది పంటికి మంచిదనుకున్నారు. మొత్తంమీద అందరూ తలో ఒకటి నిర్ధారించుకుని ఎవరి స్టేషన్లకు వాళ్ళు బయలుదేరారు.
కాని అక్కడే చతికిల బడ్డాడో వ్యక్తి అతని పేరు అధికారి. సాధారణ కానిస్టేబుల్ అతని ఆలోచన అంతా సి.పి అన్నమాటల చుట్టూ తిరుగుతుంది. ఆ మాటల్లోని వ్యగ్యంర్ధాన్ని గ్రహించగలిగాడు. నిజానికి ప్రజలు పోలీసులను అంత విశేషణాలతో తిడుతుంటే అంతకు ముందు ఉన్నతాధికారులు కళ్ళు మూసుకునట్లా . లేక ఇప్పటివరకు పోలీసు యంత్రాగం పక్షపాతం వచిన్నట్టు కాళ్ళు చేతులు పడిపోయి పనిచేయడం మానివేసినట్లా! కొత్త సి.పి. ప్రజలకు అడ్డం పెట్టుకుని తన సబార్డిసెట్స్ నీ చులకన చేసి తిట్టినట్టేనని నిర్దారించుకున్నాడు.