Previous Page Next Page 
విరాజి పేజి 34

 

      రెండు మహా సముద్రాలు పోటీ పడి ప్రవహిస్తున్నట్లు, రెండు కదిలే మేఘాలు ఢీ కొంటున్నట్లు ఇద్దరూ ముందు కెళ్ళిపోతున్నారు.

    ఇక్కడ గెలుపు _  ఓటమిల పోరాటంకన్న అంతరంగం మధనాల ఆరాటానికి అదికృత ఎక్కువ.

                                                          *    *    *   

    టీ.వి.లో విరాజీ డ్వాన్స్ పోగ్రాం వొస్తున్నది. అంతకు ముందు నాలుగయిదు రోజులు నుంచి యీ పోగ్రాం గురించి విశేషమైన పబ్లిసిటీ యివ్వబడింది.

    గౌతమ్ సోఫాలో కూర్చుని చూస్తున్నాడు. అతని ప్రక్కనే అరుణ కూర్చుని వుంది.

    పోగ్రాం చూస్తున్నంతసేపూ గౌతమ్ ఓ అద్భుతానుభూతిలో మునిగి వున్నాడు.

    సాహిత్యం గురించీ, కళోపాసన గురించి ఆమెకూ తనకూ మధ్య రోజుల తరబడి జరిగిన చర్చలు అతనికి గుర్తుకొచ్చాయి. ఒక రకంగా ఆమె తనకి గురువు. ప్రధమంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలియజేసింది. తనని ఓ ఉత్తమ సాహిత్యకారునిగా తీర్చిదిద్దతానికి ప్రయత్నించింది.

    కాని ....

    ఓ నృత్యాన్ని ఆమె అర్ధం చేసుకోలేక పోతోంది.

    నృత్యం , సంగీతాల విషయం అలావుంచి సాహిత్యంలో ఊహించరాణి మార్పులు వొచ్చాయి. మడిగట్టుకు కూర్చున్న వారు _ ఒకప్పుడు ఎంత హేమాహేమీలై వున్నాసరే తెరమరుగైపోయారు. పరిస్థితిలో రాజీపడలేక.  రాజీ పడినా యీ ఆధునాతనమైన పద్దతులు అవగాహన చేసుకోలేక వేడుతావున్న యుగం. ఆం రైలుర్స్ కూడా రైలుర్స్ గా చాలామణి అవటమేగాక పరిపాలిస్తున్న యుగం. ఈ విషయ సమయంలో  వున్న టాలెంట్ ను చంపేసు కోవటమా? టాలెంట్ ను పరిస్థితుల కనుగుణ్యంగా చాకచక్యంగా మలుచుకోవటమా?

    డ్వాన్స్ పోగ్రాం చూస్తూ అరుణ మధ్య మధ్య అతన్ని గమనిస్తున్నది.

    కనిపించీ కనిపించినట్లు అతని కన్నులలో కదలాడే కన్నీరు.

    పోగ్రాం  అయిపోయాక అతను చాలా సేపు నిశ్సబ్దంగా కూర్చుండి పోయాడు. అతని ఏకాంతానికీ భంగం కలిగించటమిష్టంలేక టి.వి. ఆఫ్ చేసి ఆమె గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది.

                                                                                 18

    పది రోజులున్నాక ఈశ్వరమ్మగారు అరుణ వెళ్ళిపోయారు.

    సంవత్సరాల తరబడి అనుభవిస్తోన్న ఓంతరితనంలోని విసుగుకు కొంచం విరామం కలిగి మళ్ళీ నిర్దాక్షిణ్యంగా ఆవరించట్టయింది.

    "అరుణకు మంచి పెళ్ళి సంభంధం చూడమ్మా. ఖర్చెంతయినా సరే నేను భరిస్తాను " అన్నాడు గౌతమ్.

    "నాకు మొదట వొదిన వస్తేనే నేను పెళ్ళాడేది." అంది అరుణ .

    "వొదిన రూపంలో వుంది?"

    "విరాజీ ఎక్కడ వుంది" అంది అరుణ చాలా చిన్నగా అతనికి మాత్రమే వినిపించేటట్టు.

    గౌతమ్ ఉలికిపడి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళు విశదంగా కందినట్లయి ప్రక్కకి తీరిగాయి.

                       *    *    *    *      

    మరో కొద్ది రోజుల్లో అతని జీవితం మరో మలుపు తిరిగింది.

    ఈ మధ్య అతని నవలలు కొన్ని సినిమాలుగా వొచ్చాయి. అవి అఖండ విజయం కూడా సాధించాయి.

    కొంతమంది నిర్మాతలు అతని నవలల కోసం ఎగబడటమేగాక అతన్తో కథలు రాయించటానికి కూడా వోప్పందాలు కుదుర్చుకున్నారు.

    అలాంటి వారిలో విక్రమ్ కూడా ఒకడు.

    ఒకప్పుడు గౌతమ్ విక్రమ్ తీస్తోన్న సినిమా కోసం రచయితగా ఆహ్వనించ౦డి సినిమా పరిజ్ఞానం లేదని డైరెక్టర్ చేత తీర్మానించబడి . తిరస్కరించి బడ్డాడు. విక్రమ్ తనకోసం వోచ్చినప్పుడు ఆ విషయాలేమీ గుర్తు చెయ్యలేదు.

    గౌతమ్ ఒక విలక్షణమైన ప్రవర్తన నేర్చుకున్నాడు . ఎవరినీ మాటలతో నొప్పించడు. మృదువుగా సంభాషిస్తూనే తనతో పని వుండి వచ్చిన వారిని షరతులకి లొంగిపోయేలా చేస్తాడు.

    విక్రమ్ కూడా వయసులో చిన్నవాడయినా పెద్ద నిర్మాతల్లో ఒకడయాడు. అతని చిత్రాలు రెండు మూడు విజయ డంఖా మ్రోగించటంతో డ్యాషి౦గ్ గా తయారయాడు.

    గౌతమ్, విక్రమ్ కలసి అవకాశమున్నప్పుడల్లా కలుసుకుని కధనం గురించి చర్చిస్తూ వుండేవారు. ఆ చర్చల్లో డైరెక్టరు యువకుడు ఉత్సాహవంతుడు. కొత్తదనం మీద తపన వున్నవాడు. చాలా తెలివైనవాడు కూడా.

    విక్రమ్ సంష్టలలోనే అసోసియేట్ గా చేస్తూంవుండగా విక్రమ్ అతన్లోని స్పార్క్ ని గుర్తించి డైరెక్టర్ని చేశాడు.

    చర్చలు జరుగుతూన్నంతసేపూ విక్రమ్. డైరెక్టర్ విస్కీ తీసుకుంటూ వుండేవారు.

    "గౌతమ్! మీరు కూడా తీసుకొండి" అని విక్రమ్ మొదట్లో బలవంతం చేశాడు.

    "గౌతమ్ నవ్వి "అలవాటు లేదు" అన్నాడు.

    "చాలా ఆశ్చర్యంగా వుందే. డ్రింక్స్ అలవాటు లేదు. ఎప్పుడూ స్మోక్ చెయ్యగా చూడలేదు.

    గౌతమ్ నవ్వి వూరుకున్నాడు.

    పది పదిహేను రోజులు చర్చలు జరిగాయి కథ తయారయింది. చాలా వైవిధ్య౦తో కూడిన కథ.

    డైరెక్టర్ చాలా తృప్తిగా వుంది. ఇందులో హిందీలో హీరో పాత్ర కూడా చాలా విచిత్రమైనది. సైలెంట్  గా వున్నట్లు కనబడే అతనిలో విరుద్దమైన ప్రవృత్తులుంటాయి. ఆ విరుద్దమైన ప్రవ్రుత్తులే అతన్ని సమాజంలో ఓ ఆకర్షణీయమైన వ్యక్తిగా రూపొందింస్తాయి. ఆ ఆకర్షణను ఎరగా ఉపయోగించి కథను వివిధ ప్రక్రియలతో విజయం సాధిస్తూ వుంటాడు.

    ఈ పాత్రకి ఎవర్ని ఎన్నుకోవాలి అన్న మీమాంస వొచ్చింది. కథ పూర్తిగా తయరయాక.

    విక్రమ్ డైరెక్టరూ కలసి రకరకాల హీరోలని గురించి అనుకున్నారు.

    కానీ వాళ్ళంతా ఇమేజ్ వున్నవారు. ఎంత రూపురేఖల్ని దిద్ధినా యీ పాత్ర ప్రత్యెకకతకు ఈ ఇమేజ్ అడ్డు వొస్తు వుంటుంది.

    ఎవర్నో ఒకరిని పేట్టి ఆ పాత్రను శాక్రీఫైజ్ చెయ్యటమిష్టం లేదు డైరెక్టరు కు.

    గౌతమ్ మాట్లాడుతున్నంతసేపూ అతని ముఖంలోకి పరిశీలిస్తున్నట్ట్లుగా చూస్తూ వుండే వాడు డైరెక్టరు.

    గౌతమ్ నవలనుకానీ , అతను రాసినకథలుగానీ. యిదివరలో సినిమాలుగా తీసేటప్పుడు అతను సెట్స్ లోకిగాని, ఘంటి౦గ్ స్పాట్ లోకిగాని ఎప్పుడో గాని వెళ్ళేవాడు కాదు. సినిమా నటీనటులు , వాళ్ళ గ్లామర్ , ప్రక్కన వున్నవారు. ఎంత ప్రముఖ వ్యక్తులయినా __ వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా చూడబడటం అతనికిబ్బంది కలిగిస్తూ వుండేది.

    అతను అనుభవం మీద ఒక విషయం నేర్చుకున్నాడు తనకి గుర్తింపులేని చోటుకు చాకచాక్యంగా వెళ్ళటం మానెయ్యాలి. కాని వెళ్ళి నిస్సహాయ స్థితిలో యిరుక్కోకూడదు.

    అలా అతని ముఖంలోకి అయిదారు రోజులపాటు నిశితంగా పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చి "గౌతమ్ గారూ! ఈ పాత్రని మీరే ఎందుకు వెయ్యకూడదు?" అనడిగాడు హఠాత్తుగా .

    "నేనా? అన్నాడు గౌతమ్ విస్తుపోతున్నట్లుగా .

    "మనం రూపురేఖలు దిద్దుకున్న పాత్రకి మీ పర్సనాలిటీ , గేశ్చర్" కారెక్టర్ గా సరిపోతాయి.

    విక్రమ్ కూడా యీ కొత్త ఆలోచనకు విభ్రాంతుడై గౌతమ్ వంక పరిశీలనగా చూడసాగాడు.

    గౌతమ్ సహజంగా అందమైనవాడు. అతని కళ్ళకి, చూపుల్లో ముఖ కవళికల్లో ఓ చిత్రమైన ఆకర్షణ వుంది.

    అతన్ని చూస్తోంటే _ తలుచుకుంటే ఏమన్నా సాధించగలడు __కాని సాధారణంగా తలుచుకోడు, అన్నట్లు గోచరిస్తాడు.

    "నేనా? అన్నాడు గౌతమ్ మళ్ళీ."

    "అవును"

    "నాకేమి నటనలో అనుభవంలేదు. "

    "అవసరం లేదు ."

    గౌతమ్ చాలాసేపు ఆలోచించాడు. ఈ సమాజంలో రచయితగా ప్రఖ్యాత రచయితగా తనకో యిమేజ్ వుంది. తనలోని రచయిత ప్రభావం వల్లే ఒక విశిష్టమైన వ్యక్తిగా కూడా గుర్తించబడుతున్నాడు. ఉన్నట్లుండి యిప్పుడు నటుడిగా మారితే తనలోని రచయిత చచ్చిపోవచ్చు. అంతేకాదు. నటుడిగా ప్లాష్ అయితే రచయితగా తనకున్న యిమేజ్ కూడా నిర్ధక్షిణ్యంగా చెరిగిపోవచ్చు.

    "ఏమిటాలోచిస్తున్నారు?"

    గౌతమ్ తన సందేహాలన్నీ బయట పెట్టాడు.  డైరెక్టర్ నవ్వాడు. గౌతమ్ వంటి ప్రఖ్యాత రచయిత, గ్లామర్ వున్న రచయిత నటుడిగా రంగ ప్రవేశం చేస్తోంటే  __ అది సన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఆ ఊపుతో మనసంతా ఉత్సాహంతో పనిచేస్తే మన స్పీకర్ కూడా సేన్శేషనల్ హిట్ అవుతుంది.

 Previous Page Next Page