Previous Page Next Page 
విరాజి పేజి 35

   

   గౌతమ్ యింకా దీర్ఘంగా ఆలోచిస్తూనే వున్నాడు.

    డైరెక్టర్ మళ్ళీ అన్నాడు.  "ఇవి వెనకటిరోజులుకాదు గౌతమ్ గారూ! ఓ ఆర్టిస్టు ఒకే శాఖకు పరిమితమై వుండగా __ యితర శాఖల్లోకి చొచ్చుకు వచ్చి విజవంతం కావటం మనం చూస్తున్నాం. ఉత్తరాదిన నటుడిగా జీవితం ప్రారంభించి , ఎన్నో సినిమాల్లో హీరోగా వేషం వేసి తర్వాత నంబర్ వన్ ప్లేబాక్ గాయనీ గాయకులూ ఉత్తమమైన నటీ నటులుగా రూపోందించబడటం మనకు తెలుసు. అలాగే చాలా కాలం రచయితలుగా, డైరెక్టరు గా వుండి వున్నట్లుండి యాక్టర్లుగామారి విజయ ఢంకా మ్రోగించిన వారి ఉదంతాలు తమిళంలో తెలుగులో కూడా ఎన్నో వున్నాయి.

    అంటూ ఒక్కొక్కరి పేరు చొప్పునా చెప్పుకొచ్చాడు.

    "రేపు చెబుతాను" అన్నాడు గౌతమ్ .

    ఆ రాత్రి నిద్రపట్టక చాలా బాధపడ్డాడు. పన్నెండు గంటలవేళ యింట్లో ఉండలేక కారేసుకుని బయటకు వెళ్ళాడు.

    వరదరాజు టీకొట్టు మూసేయ్యలేదు. ఒకరిద్దరు కస్టమర్స్ బయట నిలబడి టీ త్రాగుతున్నారు.

    కారు రోడ్డుకు అటువైపు నిలిపి, దిగి షాపుదగ్గరకు వచ్చాడు.

    గౌతమ్ నెలకో రెండు నెలలకో ఓసారి వరదరాజుని కలుస్తూనే ఉన్నాడు.

    "బావున్నారా బాబుగారూ! అని పలకరించి వరదరాజు టీ కలిపి ఇచ్చాడు.

    రచయితగా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎంత క్రేజ్ వచ్చినా __ వరదరాజు నోటివెంట ఒక్క పొగడ్తకూడా ఎప్పుడూ రాకపోవటం అతనికి విస్మయం కలిగిస్తూఉండేది.

    "వరదరాజూ! నా కొత్త నవల రిలీజయింది. చదివివా?" అని అడిగే పిల్లా కథ ఉందే నాకు ఎప్పుడూ అదే గుర్తొస్తుంది" అంటూ ఆ కథ అప్పటికప్పుడు చదివినట్లు సంఘటనలతో సహా చెప్పెసేవాడు.

    ప్రపంచమంతా  తనకు నీరాజనాలర్పిస్తొన్నా వరదరాజు తనని గుర్తించినందుకు అతనికి ఆశ్చర్యంగా ఉండేది. బాధ మాత్రం కలిగేది కాదు.

    ఎందుకు గుర్తించటం లేదు అన్న అశాంతి.

    గౌతమ్ తన కొత్తనవల ఊసు ఎత్తినప్పుడల్లా వరదరాజు అతని పాతరచన ఒకటి గుర్తు చేసుకుని తన్మయత్వం పొందుతూ ఉండేవాడు.

    అయినా వరదరాజును అప్పుడప్పుడూ కలుసుకొకపొతే అతనికి వేల్తిగా ఉండేది.

    ఆరోజు అక్కడకు రావటం తన జీవితంలో రాబోతున్న కొత్త మలుపును గురించి సలహా అడుగుదామని వచ్చాడు. కని ఏదో సంకోచం .

    అతను అడ్డుపుల్ల వేస్తాదన్న అనుమానం కాదు. వరదరాజులో ఓ విశేషముంది. తనకిష్టమున్నా లేకపోయినా విముఖత్వాన్ని ప్రదర్శించడు, నిరుత్సాహా పర్చడు.

    గౌతమ్ కి అతను ఏకైక స్నేహితుడు . గౌతమ్ జీవితంలో ఎదిగిన కొద్దీ పరిచయాలయితే అపారంగా ఏర్పడ్డాయిగానీ, స్నేహితులు దొరకలేదు.
                     
    "ఏమిటి బాబుగారూ ఆలోచిస్తున్నారు?"

    "ఊం"

    "చెప్పండి బాబుగారూ."

    గౌతమ్ చెప్పకుండా ఉండలేకపోయాడు. మెల్లగా తాన మనసులోని సంఘర్షణను వెళ్ళగ్రక్కాడు.

    వరదరాజు నవ్వాడు.

    "మీది కాని జీవితం మీరు జీవించటం మొదలుపేట్టి మీకూ, యితరులకూ అంతుపట్టని వేగంతో ముందుకెళ్ళిపోతున్నారు. ఈ త్రోవలో ఊహించని మలుపులు రావడం ఆశ్చర్యమేమీ కాదు. వెనక్కీరావడంకూడా కష్టం. కానివ్వండి అన్నాడు.

                                *    *    *    *   

    మరునాడు తన అంగీకారాన్ని తెలియజేశాడు.

    పత్రికల్లో సంచలనం కలిగిస్తూ ఈ వార్త ప్రముఖంగా ప్రచురించబడింది.

    గౌతమ్ అభిమానుల దగ్గర్నుంచి వందలకొద్దీ ఉత్తరాలు,ఫోన్ లు .

    అంతకంటే చాలామంది అమ్మాయిలకు ప్రిచ్చి క్రేజ్. అతని పేరు వెంటనే వాళ్ళకి వళ్ళు పులకరిస్తున్నది. అతన్ని వెర్రిగా ఆరాధిస్తూ తమ సర్వస్వం అర్పించటానికి సిద్ధపడినవాళ్ళున్నారు.

    కొంతమంది అతన్ని అభినందించారు.

    కొంతమంది "మీరు కలిగించే అద్భుత ర్సానుభూతులతో అనందాబ్దిలో ఓలాలడుతున్న మాకు __ సాహిత్య లోకంనుంచి మమ్మల్ని దూరం చేసుకుని శూన్యం అవరిస్తో౦దేమోనని భయంగా వుంది." అన్న భావాలతో రాశారు.

    మొత్తంమీద గౌతమ్ తుది నిర్ణయం తీసేసుకున్నాడు.

                                  *    *    *    *   

    సెట్ లో ముహూర్తం షాట్ రోజున గుండె గుబగుబ కొట్టుకుంది.

    అతని ప్రక్కన హీరోయిన్ గా నటిస్తోన్న అమ్మాయి అప్పటికి పదిపదిహేను సినిమాల్లో నటించింది. యువ తారగా మంచి పేరుకూడ తెచ్చుకుంది.

    ఆమెకు రచయితలూ వాళ్ళ వ్యక్తిగతమైన పేరు ప్రఖ్యాతలు అట్టే తెలియవు గౌతమ్ గురించి ఆమెకు అట్టే తెలియదు.

    "నా అంతటి స్టార్ ప్రక్కన యితనేవరో కొత్తవాడు నటిస్తున్నాడేమిటి అని నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా ఒకచూపు చూసింది.

    కెమెరా ముందు నిలబడి డైలాగ్ చెప్పబోతున్న గౌత౦ కు ఆ చూపు గుండెలో ములుకులా గుచ్చుకుంది.

    మొదట యితనా ప్రక్కనా నేనునటించేది ? అన్న నటీమణి వారం పదిరోజులు గడిచేసరికి గౌతంలోని సహజమైన నటనా శక్తికి ఆ ప్రతిభురాలయి పోయింది.

    తన కృత్రిమమైన నటన అవసరమున్నా లేకపోయినా కళ్ళు అర్పి తెరుస్తూ మాట్లాడటం, అతని అద్భుతమైన డైలాగు డెలివరీ, కంఠంలో మాడ్యులేషన్, అత్యంత సహజమైన నటనా ప్రాభవం ఆమెకు అతనంటే ఎనలేని గౌరవం కలిగించాయి.

    ప్రస్తుతం ఫీల్టులో ఉన్న హీరోలంతా. డ్యూయేట్స్ ఫైట్స్ వీటిల్లో మునిగి తెలుకున్నారు గౌతమ్ నటన అయినంతవరకూ ప్రాజక్షన్ చూసిన వారు చాలా రిలీఫ్ ఫీలయ్యారు.

                                                                   *    *    *    *   

    సినిమా ఘాటి౦గ్స్ లో బిజీగా వుండటం రచనా వ్యాసంగానికి తీవ్రమైన అంతరాయం కలిగించింది. అతను  ప్రస్తుతం తెలుగుదేశంలో నవలా రంగంలో నంబర్ వన్ స్థానంలో  వున్నాడు. అతని తర్వాత నంబర్ టూ,  త్రీ అని చెప్పుకునెందుకు కూడా ఎవరూ లేరు, కొన్ని పత్రికలు కేవలము అతని సీరియల్స్ మీద ఆధారపడి నడుస్తున్నాయి. కథ క్లయిమాక్స్ కు వ్రాస్తున్నపుడు మేటర్ తగ్గించి ప్రసరించి, లేకపోతె ఏదోరకంగా అతనితో పొడిగింపజేసి రాయించి జాగ్రత్త పడుతున్నారు. పాత సీరియల్ అయిపోతూ వుండగానే కొత్త సీరియల్ గురించి అనౌన్స్ మెంట్ యిచ్చుకుంటూ పోతున్నారు. ఇతర పత్రికలవారు అతన్ని లాగేస్తారని ఎప్పటికప్పుడు రాయల్టీ పెంచుకుంటూ పోతున్నారు. పభ్లిషర్స్ అతన్నేక్కడ ట్రాఫ్ చేస్తారోనని అతన్ని పోగొట్టుకోకుండా వుండటానికి ఎప్పటికప్పుడు పర్సంటేజ్ పెంచేస్తున్నారు. బహుశా ఒక దశలో గౌతమ్ మొత్తంమీద ( కేవలం తెలుగులోనే కాదు) ఎవరూ పుచ్చుకొనంతటి పారితోషకం తీసుకునే దశకు ఎదిగి పోయాడు.

    ఘాంటి౦గ్ వ్యవహారాలవల్ల అతను ఊహించనంత బిజీ అయిపోవడం పత్రికలవాళ్ళకు చాలా యిబ్బంది కలిగించింది. ఒక్కొక్క యిన్ స్టాల్ మెంట్ మేటర్ సేకరించటానికి వాళ్ళు ఎంతో ప్రయసకూ, టెన్షన్ కూ గురుకావాల్సి వస్తోంది. అతను అవుట్ డోర్ ఘాంటి౦గ్ వెళ్ళినప్పుడు అక్కడికి మనుషుల్ని పంపి మేటర్ సంపాదించవలసి వస్తోంది.

    గౌతమ్ కు యిదంతా తెలుసు. అతను కఠినుడెం కాదు కాని ఎంత ప్రయత్నించినా అతనికి టైం లొంగటం లేదు.

    పత్రికలవాళ్ళంతా పిక్చర్ రిలీజ్ కాకముందే రోజు రోజుకూ పెరుగుతున్న అతని యిమేజ్ చూసి ముందుముందు రాయటం మానేస్తాడేమోనని భయపడ్డేస్థితికి వొచ్చారు. కాని గౌతమ్ కు రాయటం మానేసే ఉద్దేశ మెప్పుడూ లేదు. కొత్త సీరియల్స్ ఒప్పుకోవడం మానేసి ప్రస్తుతం రాస్తొన్న నాలుగు సీరియల్స్ కూ సాధ్యమైనంత న్యాయం చెయ్యటానికి ప్రతనిమ్చసాగాడు.

                              *    *    *

 Previous Page Next Page