Previous Page Next Page 
విరాజి పేజి 33

 

      విరాజి మాట్లాడలేదు .

    "దీని రెస్పాన్స్ చూసి, సక్సెస్  అయితే యితర ముఖ్యమైన టి. వి. కేంద్రాలకు కూడా రికమెండ్ చెయ్యాలనుకుంటున్నారు.

    విరాజి నవ్వి ఊరుకుంది. సక్సెస్ అనేది మొదట వరించటం వరకే కష్టం. ఒక్కసారి వరిమ్చాక అది మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసే స్థాయిలో విరుచుకు వుంటుందని ఆమె కర్థమయిదది 

    మేడమ్ ! కాస్టూమ్స్ సెలక్ట్ చేసేందుకు వెడదామన్నారు?"

    "వెడదాం " అంటూ లేచి నిలబడింది.

    రెండు నిముషాల్లో యిద్దరూ బయటకు వచ్చారు. విరాజి కారులో బ్యాక్ సీటులో కూర్చుంది. శ్రావణ్ కుమార్ ఫ్రంట్ సీటులో డ్రయివరు ప్రక్కగా కూర్చున్నాడు.

    "మేడమ్!"

    విరాజి పరధ్యాసగా వుండి జవాబివ్వలేదు.

    "మేడమ్" అంటూ మళ్ళీ పిలిచాడు.

    "ఊ!" అంటూ యీ లోకంలోకి వచ్చింది.

    "ఎటుకేసి పోదాం?"

    ఉన్నట్లుండి ఆమెకో ఆలోచన వచ్చింది. డ్రయివర్ కి ఎటుపోవాలో ఎడ్రెస్ చెప్పింది.

    పావుగంట గడిచాక ఆమె వెనకనుంచి చెబుతున్న వివరాల ప్రకారం కారు చిన్న చిన్న సందుల్లోకి మళ్ళీ చివరకు పూరిపాకలు చిన్న చిన్న పెంకిటిల్లు వున్న ప్రదేశంలో ఆగింది.

    విరాజి కారులోంచి దిగింది. ఫ్రంటు డోరు తెరుచుకుని శ్రావణకుమార్ కూడా దిగాడు.

    "ఇక్కడ్నుంచి వందగజాల దాకా నడవాల్సి వుంటుంది" అన్నది విరాజి ముందుకు కదులుతూ.

    శ్రావణ్ కుమార్ ఆమె దగ్గర చేరి అయిదారు నెలలయింది. పాతికేళ్ళు౦టాయి. చాలా నీట్ గా , సభ్యతగా సంస్కారంగా వుంటాడు. గ్రాడ్యుయేషన్ అయినాక రకరకాల ఉద్యోగాలు చేసి అతని అభిరుచులకు నచ్చిన విరాజి దగ్గర కార్యదర్శిగా చేరాడు. చోరవుగా, చనువుగా, ఆమె నాట్య ప్రదర్శన దగ్గర్నుంచి దైనందిన కార్యక్రమాలు _ అన్నీ చూస్తూ వుంటాడు.

    ఇద్దరూ ప్రక్క ప్రక్కన నడుస్తున్నారు.

    "మేడమ్! మీరేమీ అనుకోకపోతే ఓ విషయం అడిగేదా?"  

    "ఏమిటి శ్రావణ్?"

    ఊపిరి ఎరగనంత బిజీగా వుంటూకూడా ఏదో పోగొట్టుకున్నట్లు, యితరులకు కారనరాని జీవిత రహస్యం యెదో దాచుకున్నట్టు కనబడతారు. కారణమేమిటి మేడమ్?"

    విరాజి నవ్వింది. ఆ నవ్వులోని విషాదం , గుండెల లోతుల్నుంచి ప్రవహిస్తున్నట్లు దొర్లిన వ్యధా చిహ్నాలు అతని నిశిత దృష్ట నుంచి తప్పించు కోలేదు.

    "జీవితంలో పొందాలనుకున్నది అందుకున్నాను, కాని అందుకో వలనుకున్నది పొందలేకపోయాను శ్రావణ్"

    అతనికి విషయం అర్ధంకాకపోయినా, విషయం వెనుకవున్న వేదన అర్ధమయింది. ఆమె అంటే అతనికి ఎంతో గౌరవం, భక్తీ వున్నాయి. దాన్ని గురించి ఎక్కువ తరచి అడిగకూడదని అతనిలోని సంస్కారము హెచ్చరించింది.

    ఇద్దరూ ఓ చిన్న యింటి ముందుకువచ్చి ఆగారు.

    బయట తాళం పేట్టి వుంది.

    విరాజి రెండడుగులు ముందుకువేసి ఆ యింటి వంక తన్మయంగా చూస్తూ నిలబడింది.

    ఈ యింట్లో తను .....

    తన జీవితంలోని అమిత హృదయ విదారకమైనా అనుభూతులు ......

    గుండెలు ఆలాపించినట్లు _

    కవిత్వం చిందులు వేసినట్లు ......

    పాదాలు ఫల్లుమని మ్రోగినట్లు ......

    జ్ఞాపకాలు దృశ్యాలుగా మారి కన్నులలో నీరు చిమ్ముతూండగా మూగగా నిలబడి పోయింది.

    ఆమె రావటంచూసి యిరుగు పొరుగు వారు అక్కడ గుమికూడారు. ఆమెని గుర్తుపట్టి ఆశ్చర్యంగా చూస్తున్నారు.

    ఆమె మెలకువ తెచ్చుకుని ఒకర్నికరు పేరు పేరునా పలకరించి౦ది.

    ఒక అరవై అయిదేళ్ళు దాటినా వృద్ధుడు ఆమె దగ్గరకు వచ్చి "బావున్నావా అమ్మా!" ఎంతో అప్యాయంగా పలకరించాడు.

    అతను గోవిందతాత _ ఆ చిన్న యింటి యజమాని . అమేనేంతో అభిమానంగా చూసుకునేవాడు. అతనూ అంతంత మాత్రపు పరిస్థితులో వున్నా ఏనాడూ ఆమెను అద్దేకోసం వొత్తిడి చెయ్యలేదు.

    విరాజి తల ఊపి "తాతా! నీకు ఎవరూ దగ్గరవాళ్ళు లేరుకదా, నా దగ్గరకు వొచ్చి వుండకూడదు?" అనడిగింది.

    "ఇంతపైకి వొచ్చినా నన్ను గుర్తుపెట్టుకున్నావు, అంతే చాలమ్మ. పుట్టినప్పట్నుంఛీ యిక్కడే పెరిగాను. ఈ వాతావరణాని కలవాటు పడిపోయా. మిగతా జీవితం కూడా ఇక్కడే గడిచిపోనీమ్మా."

    "తాతా! ఈ యిల్లు తాళంపెట్టి వుందే౦? ఎవరికీ అద్దేకివ్వలేదా?"

    మళ్ళీ విరాజే "నేను యిక్కడికి ఓ ఉద్దేశంతో వొచ్చాను తాతా? నీకేమీ అభ్యంతరం లేకపోతె నేను కొనుక్కుందామని" అంది.

    గోవింద తాత కొంచెం ఇబ్బందిలో పడినట్లు మొహమాటపడి, "కొన్ని నెల్లక్రిందనే అమ్మేశానమ్మా" అన్నాడు.

    "అమ్మేశావా తాతా! ఎవరికి"

    "గౌతమ్ అని ఓ కుర్రాడు నీకోసం వస్తూవుండేవాడు. అతను కొనుక్కున్నాడు

    గౌతమ్ కొనుక్కున్నాడా?" అన్నది విరాజి నివ్వెరపోయినట్లుగా.

    "అవునమ్మా."

    "ఎప్పుడన్నా వస్తూ వుంటారా యిక్కడికి?"

    "వస్తూ వుంటాడమ్మా, నాలుగయిదు రోజులకోసారి వచ్చి ఓ అర గంట ఒంటరిగా కూర్చుని వెళ్ళిపోతూవుంటారు.

    విరాజి ఓ నిముషం పాటు మాట్లాడలేనట్లు నిశ్సబ్దంగా నిలబడిపోయింది.

    తర్వాత అందరి దగ్గరా సెలవు తీసుకుని "పద శ్రావణ్!" అంటూ అక్కనుంచి కదిలింది.

    కారు పార్కు చేసిన ప్రదేశానికి వచ్చి డోర్ తెరవబోతూ ప్రక్కనే యింకో కారు వచ్చి ఆగడం గమనించి తల త్రిప్పి చూసింది.

    కారులోంచి గౌతమ్ దిగుతూన్నాడు. కూడా ఓ అమ్మాయి వుంది.

    గౌతమ్ కూడా ఆమెకేసి చూశాడు.

    ఇద్దరూ కనార్పకుండా నిశ్చేస్టులైపోయినట్లు నిలబడి పోయారు.

    "విరాజీ?" అనబోయి గౌతమ్ తమాయించుకున్నాడు.

    "గౌతమ్!" విరాజి పెదవులు కదలబోయి ఆగిపోయాయి.

    ఒక్కక్షణం  ___

    ఏదో నిర్మలమైన విభ్రాంతితో, మైకంలో గడిచాయి. అంతలోనే వ్యక్తిత్వాలు అడ్డువొచ్చాయి.

    విరాజి కారులో ఎక్కికూచుంది.

    మరోనిముషం లో కారు కదిలి ముందు కెళ్ళిపోయి కనుమరుగై పోయింది.

    "అన్నయ్యా! అని పిలిచింది అరుణ _ స్థబ్డుడై నిల్చున్న గౌతమ్ ను

    "ఊ?"

    "అలా వుండిపోయావేం?"

    "ఏమీ లేదు రాలోపలకు పోదాం" అంటూ ఆ చిన్న ఇంటి తలుపు తాళం తీసి లోపలకు తీసుకెళ్ళాడు.

    బయటకు ఎంత సామాన్యంగా వుందో లోపల అంత అద్భుతంగా వున్నదాగది గోడలకు నీట్ గా రంగులు వేసి వున్నాయి. విరాజి మొదట ప్రదర్శన యిచ్చిన ఫోటోలు చాలా సైజులో ఎన్ లార్జి చెయ్యబడి గోడలకు అలకరంచబడి వున్నాయి.

    రకరకాల భంగిమలు ఎటు చూస్తె ఆ నర్తకే గోచరిస్తున్నది. ఆ చిన్న కుటీరంలో ఓ నాట్య ప్రదర్శ్యన జరుగుతున్నారా అన్న భ్రమ కలిగిస్తోన్నది.

    ఎవరీ అపూర్వ నాట్య రాణి?

    ఇందాక కారులో వెళ్ళిపోబోతూ తళుక్కుమని మెరిసిన స్రీ ఈమే. కదా!

    ఒకానొక ప్రదేశంలోకి వెళ్ళి ప్రతిరోజూ కొంతసేపు గడిపితే మనశ్శాంతిగా అన్నయ్య చెప్పి యిక్కదుకు తీసుకొచ్చాడు.

    అంటే ....?

    అరుణకు ఓ నూరణ సత్యం అర్ధమైనట్టయింది.

                                                          *    *    *    *   

    రాత్రి చాలా సేపటిదాకా గౌతమ్ కు నిద్ర పట్టలేదు. ఇద్దరూ రెండు ధ్రువాల నుంచి హిమాలయాల్ల ఎదుగుతున్నారని అతనికి తెలుసు. తనని తాను కలుషితం చెసుకుని అనుక్షణం పాఠకులాని మోసం చేస్తూ వాళ్ళ బలహీనతల్ని చేసునితాను ఎదుగుతున్నాడు. ప్రేక్షుకుల్లో ఆరోగ్యకరమైన అభిరుచి పెంపొందించిన జేస్తూ, ముడుచుకుపోయి వున్న వాళ్ళ మనసుల్ని వికసింప జేస్తూ ఆమె ఎదుగుతున్నది.

 Previous Page Next Page