"మీకోసం ఎవరో వచ్చారు సార్. చుట్టాలులా వున్నారు __" అని చెప్పాడు లోపలకెళ్ళి.
గౌతమ్ గదిలోంచి బయటకు వచ్చాడు.
అతనిలోంచి అనురాగం పెల్లుబిక్కినట్లయింది "అమ్మా!" అన్నాడు, ఆర్ద్రతస్వరంతో.
ఈశ్వరమ్మ ఎంత ఆపుకుందామన్నా కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకునిచూసిన ఉద్వేగంతో కళ్ళనీళ్ళు ఉబికినాయి.
దగ్గరకొచ్చి తలమీద చెయ్యివేసి నిమురుతూ "గౌతమ్ ఎన్నాళ్ళు అయిందిరా నిన్నుచూసి" అంది దుఃఖంతో చలించే కంఠంతో
ఈ అగ్నిపుష్పంలాంటి వంటరి తనంలో చల్లదానంతో కూడిన స్పర్శలో ఎంత మాధుర్యం!
ఒక్క నిముషం ఆ మాదుర్యాన్నుభవిస్తూ తన్మయంగా నిలబడి, తర్వాత ప్రక్కన భయంగా నిలబడివున్న అమ్మాయి వంకచూస్తూ "అమ్మా! అరుణ ఎంత పెద్దదైపోయింది" అన్నాడు.
ఆరోగ్యంగా, నిండుగా వున్న శరీరం సౌష్టవం, గుండ్రటి ముఖము, విశాలమైన కళ్ళు, వాటిల్లో తోణికే అమాయకత్వం , అరుణ అతనివంక చూసి అనురాగంగా నవ్వింది.
గౌతమ్ తనగదిలో టేబుల్ దగ్గర కూర్చుని రాసుకుంటూ౦టే "అన్నయ్యా! కాఫీ" అన్న మృదువైన గొంతువిని తల ఎత్తి చూశాడు.
చేతిలో కాఫీగ్లాసులో అరుణ.
గౌతమ్ అందుకున్నాడు. కాఫీయిచ్చి అరుణ వెళ్ళిపోతుందేమో ననుకున్నాడు.
కానీ ఆమె అక్కడ్నుంచి కదలక పోయేసరికి కాఫీ కొంచం త్రాగాసాగాడు.
ఎంత అద్భుతంగా వుంది. బాలు తెచ్చిన కాఫీ ప్లాష్కులో వుంచుకుని, అంతకు ముందు సంవత్సరాల తరపడి హొటలు కాఫీ త్రాగి విసిగిపోయి వున్న అతనికి ఆమె యిచ్చిన కాఫీ అపూర్వాను భూతినికలిగించింది.
"కాఫీ ఎవరు కాచారు అరుణా?" అనడిగాడు.
"నేనే" అన్నది అరుణ తలవంచుకుని.
"చాలా"గొప్పగా వుంది."
అరుణ సిగ్గుపడుతున్నట్లుగా నవ్వింది. "అరుణా! నివ్వేప్పుడు యిక్కడే వుండిపో కూడదూ?"
అరుణ తల ఎత్తి అతని కళ్ళలోకి ఎందుకు అన్నట్లు చూసింది.
"కాఫీ యివ్వటానికి మాత్రం కాదు."
"నేనూ అలా అనుకోలేదు."
"ఇన్నేళ్ళ వంటరి తనం తర్వాత నా వాళ్ళమధ్య నాకు వుండాలని వుంది."
"అన్నయ్యా! వంటరి తనాన్ని వెదుక్కొంటూ ఎందుకలా వెళ్ళి పోయావు?"
ఆమెకు అన్నగారికి సాహిత్యప్రపంచంలో ఎంత పేరు ప్రఖ్యాతు లున్నచో ఎంతమంది అతన్ని లైక్ చేస్త్రారో తెలుసు.
ఆమె స్నేహితురాళ్ళు కొంతమంది గౌతమ్ నవలలు చదువుతూ, ఉప్పొంగి పోతూ వాటిని గురించి చర్చించుకు౦టు౦టే, అతను మా అన్నయ్య అని గర్వంగా చెప్పుకునేది.
"గౌతమ్ మీ అన్నయ్యా!" అని ఆమె వంక ఆశ్చర్యంగా, అభినమ్దనగా చూసేవాళ్ళు.
"పొనీ! ఆ ఆధ్యాయం అయిపోయాకైనా వంటరి తనం పోగొట్టుకావువచ్చుగా!" అన్నది అరుణ.
" వొంటరి తనమా? ఎలా పోతుంది?"
"తోడు దొరికితే?"
"తోడేలా దొరుకుతుంది?"
"పెళ్ళిచేసుకుంటే ?"
"పెళ్ళి" _ అతని ముఖం నల్లబడి పోయింది.
"ఏమిటన్నయ్యా! అల అయిపోయావు. నువ్వు చేసుకోవాలేగాని ఆడవాళ్ళు ఎగిరి గంతేసి వొస్తారు. నీలాంటి వ్యక్తిని భర్తగా పొందాలంటే ఆ స్త్రీ ఎంత తపస్సు చేసుకుని వుండాలో తెలుసా?"
గౌతమ్ జవాబువ్వలేదు. నెల్ల తరబడి సంవత్సరాల తరబడి కూడగట్టుకుంటున్న ధైర్యం , నిగ్రహం ఒక్కసారి బీటలువారి పొయ నట్లయినాయి.
17
విరాజి గదిలో ఒక్కతే కూర్చుని కొద్ది రోజుల్లో యివ్వవలసిన నూతన నృత్య ప్రదర్శన గురించి స్కీమ్ తయారుచేసుకుంటో౦ది
రవీంద్రభారతిలో తన మొదటి ప్రదర్శన ఇచ్చాక ఆమె మీద ప్రసంశల వర్షం కురిశాయి.
ఒక్కసారిగా ప్రపంచం ఆమెను గుర్తించినట్లయింది.
రకరకాల వ్యక్తులు , కాంట్రాక్టర్లు ఆమెను కలసుకున్నారు. ఎన్నో ప్రలోభాలకు గురి చెయ్యటానికి ప్రయత్నించారు. విరాజి చెక్కుచెదరలేదు. "నాకోదారి వుంది. నేనెలా ప్రయాణం చెయ్యాలో నిర్ణయించుకున్నాను. దయవుంచి నా దారికి అడ్డురాకండి" అన్నది.
ఇద్దరు ముగ్గురు సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఆమెను కాల్సుకున్నారు.
ఆమె సుముఖత చూపించలేదు.
"సినిమాల్లో నటించటానికి మీ కేమన్నా అభ్యంతరమా? అనడిగాడు ఓ ప్రొడ్యూసర్.
విరాజి నవ్వింది. "అభ్యంతరమేమీ లేదు. అందులోని యితివృత్తం నేను ధరించబోయే పాత్ర అభూత కల్పనలా వుండకూడదు. జీవితాన్ని జీవితంలోని సంఘర్షణను ప్రతిబింభించే పాత్ర లభించినప్పుడు నటిస్తాను" అన్నది.
వాళ్ళు కొన్ని యితివృత్తాలు చెప్పారు. ఆమెకు నచ్చలేదు.
నృత్య ప్రదర్శనలు మాత్రం ఒకదాని వెనుక ఒకటి యిస్తూనే వుంది.
వ్యాపార ధోరణీలో రాజీపడి ఆమె శైలీ , విలక్షణమైన వినూత్న పందాతో కూడిన ఆమె నృత్యాలు కళారంగంలో ఓ సంచలనాన్ని సృష్టించినాయి.
రోటీస్ నుంచి భిన్నత్వం, జలపాతం విరుచుకు పడుతూన్నట్లు గుండెల్ని స్పరించే ఆమె వొరవడి నాట్యరంగంలో ఓ నూతన శతాన్ని పారంభించాయి.
ఈ రోజు విరాజి క్షణం తీరకలేని ఆర్టిస్టు . ఇతర కళాకారులు అసూయపడే స్తాయిలోకే ఎదిగిన ఆమెకి ఆర్టిస్టు ప్రపంచం బ్రహ్మరధం పడుతోంది.
ఆమె కార్యదర్శి శ్రావణకుమార్ లోపలకు వచ్చాడు. "మేడమ్" అన్నాడు.
ఆలోచనలో నిమగ్నమై వున్న విరాజి తలెత్తి చూసింది.
"మద్రాసులో మనం యివ్వవలసిన పోగ్రాం గురించి ఏర్పాట్లలన్నీ పూర్తీచేశా. టికెట్స్ కూడా బుక్ చేశాను."
"టి.వి లో ప్రదర్శనకు ఆర్టిస్టులందర్నీ రామ్మన్నారా?"
"వస్తున్నారు, మేడమ్ టి.వి. స్టేషన్ డైరెక్టరుగారు కూడా దీమ్ విని చాలాప్లీజ్ అయ్యారు. ఆయ నిది చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నాడు.