Previous Page Next Page 
విరాజి పేజి 31

   

   కథను నడపడంలో అతనావలంభించే టెక్నిక్ సభవిష్యతి అనట్ట్లుగా వుండేది.

    అందులో యితి వృత్తాన్ని ఎన్నుకోవటంలో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకునేవాడు. ఒక కథకూ మరో కథకూ సంబంధం లేకుండా ఒకటి ప్రేమకథ అయితే యింకొకటి సస్పెన్స్ . థ్రిల్లర్స్ మరొకటి సైంటిఫిక్ ఫిక్షన్ తర్వాతది విపరీత మనస్తత్వ చిత్రణ ..... ఏది తీసుకున్న ఆ రంగంలో ఎంతో కృషిచేసిన ఆయా ప్రత్యెక అంశాలమీద ఎంతో పరిశోధన చేసినట్లు ఆ సబ్జెక్ట్ మీద తాను అథారిటీ అయినట్లు పాఠకుల్ని భ్రమింప చేసేవాడు.

    తెలుగులో ఏ రచయితకు లేనంత క్రేజ్ అతనంటే పెరిగింది. పాఠకులు అతనంటే ఎగబడేవారు.

    అతని ప్యాన్ మెయిల్ విపరీతంగా వుండేది. అతనికి ఉత్తరాలు రాసే వారిలో ఎక్కువగా అమ్మయిలి వుండేవారు. కాలేజీ అమ్మాయిలి, గృహణిలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల కూమార్తెలు, గొప్ప గొప్ప ఆఫీసర్ల భార్యలు అతనంటే విపరీతంగా మోజు ప్రదర్శించేవారు అతనికి ఉత్తరాలు రాయటంతో సంతృప్తిపడక అతన్ని ప్రత్యక్షంగా చూడటానికి వోచ్చేవారు.

    తెలుగులో ఒకప్పుడు రెండేరెండు వారపత్రికలు వుండేవి. తర్వాత తర్వాత వాటి సంఖ్య పెరిగి ఎడేనిమిది వారపత్రికలదాకా పెరిగాయి . మాసపత్రికలూ గణనీయంగా పెరిగాయి. ప్రతి మూడు నాలుగు నేలలకూ ఎక్కువై కొన్ని లక్షల కొద్దీ ప్రతులు అమ్మడయిపోతున్నాయి. పాఠకులు విపరీతంగా పెరిగిపోయారు. పత్రికలూ ఒకదానితో ఒకటి అనారోగ్యకరమైన ధోరణిలో , ఒక్కోసారి ప్రమాదకరమైన ధోరణిలో పోటీపడుతున్నాయి.

    ఈ నాటి పాఠకుడు సహజమైన , సజీవమైన యితి వృత్తాలు యిష్ట పడటం లేదు. సంసారికమైన కథలూ సామాజిక సమస్యలు చిత్రించే యితివృత్తాలూ, సహజజీవన చిత్రణాలూ పాఠకులు బోర్ గా ఫీలవుతున్నారు. వాళ్ళకేదో థ్రిల్ కావాలి. ప్రేమ కథల్లోగాని మనస్తత్వ చిత్రీకరణతో గాని యీ థ్రిల్ యిముడుస్తూ వుండాలి. భిఈభత్సరసానికి ప్రాధాన్యత వున్న కథలు వాళ్ళేక్కువ యిష్టపడుతున్నారు.    

    ఇంగ్లీషులో యీ మాదిరి సాహిత్యం విపరీతమైన వృత్తిలోకి వొచ్చేసింది.

    ఒక పత్రిక సర్క్యులేషన్స్  పెంచటానికి సంపాదుకుడు విచిత్రమైన భయానకమైన ప్రయోగాలు చేస్తూ వుంటాడు అదో గొప్ప నవల.

    లేకపోతే ఎక్కడో మంచు లోయల్లో ఓ విమానం కూలిపోతుంది. అందులో యిద్దరూ ఓ స్త్రీ పురుషుడు . కాని ఆ యిద్దరు ఏ ఎడారి ప్రాంతాల్లోంచి బయటపడాలి. కొన్ని నెలలపాటు జీవన్మరణ పోరాటం.

    అలాగే ఓ ఓడ ప్రమాదంలో చిన్నారి బాలిక బాలుడు యిద్దరే బ్రతికి సముద్ర తీరానికి చేరుకుంటాడు. అదో అడవి. బయటి ప్రపంచంలో సంబంధం లేని ఆ అడవిలో చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. యవ్వనమంటే ఏమిటో చెప్పటానికి ఎవరూలేని విచిత్ర పరిస్థితుల్లో వారిద్దరిలో యవ్వనం అంకురిస్తుంది. క్రమంగా లైంగిక పక్రియ తెలుసుకుంటారు. ఆ పరిస్థితుల్లోనే ఆ స్త్రీ గర్భవతి అవుతుంది. పిల్లవాడ్ని కూడా కంటుంది. అన్నీ సమస్యలే. పాలివ్వడం తెలీదు ఎలా పెంచాలో తెలీదు. తిరిగి మానవ ప్రపంచంలోకి అడుగుపెట్టె వరకూ యిలా చిత్రాతి చిత్రమైన సమస్యలు .

    ఓ మహా భవనం అంటే నూటనలభై అంతస్థుల మేడలో నూట యిరవయ్యో అంతస్థులో ఆ పైనో అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. పైభాగాల్లో వున్న పది పదిహేను అంతస్థుల వాళ్ళు ప్రమాదంలో చిక్కుపడి బయట పడలేక తల్లడిల్లిపోతూ వుంటారు. లిఫ్టులు చెడిపోతాయి. మిగతా మార్గాలన్నీ బందయిపోతాయి. అక్కడ్నుంచి వాళ్ళని రక్షించటానికి పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రమాదంలో చిక్కుపడ్డ వారిని రక్షించడానికి ప్రయత్నిస్తూ వుండటం ఆ ప్రయత్నంలో కొంతమంది చనిపోతూ వుండటం యిలా సస్పెన్స్ తో కథ నడిచిపోతూ వుంటుంది.

    అలాగే ..... సముద్రంలో ప్రయాణం చేస్తోన్న ఓ ఓడ తుఫాన్ లో చిక్కుకుని ఓ భీకరమైన మహకెరటం తాకిడికి గురయి పల్టీకొట్టి సరిగ్గా తల్ల క్రిందులుగా నిలబడుతుంది. ఆ ప్రమాదంలో చావగా మిగిలిన బ్రతికిన వాళ్ళు .... చావు తప్పించుకోవడం కోసం ఒక్కొక్క అంచే .... పైకి .... అంటే క్రిందికి ... అట్టడుగు  భాగానికి వెడుతూ వుంటారు. ఆ ప్రయత్నములో రకరకాల ప్రమాదాలు , సప్సేన్స్ .

    అలాగే పెద్ద పోలీస్ సొరచేప సముద్రగర్భంలో నుండి తీరం చేరువకువచ్చి స్విమ్మింగ్  కు వెళ్ళిన వార్ని ఒకరినోకరినీ చంపి తినేస్తూ వుంటుంది. దాన్ని చంపటానికి కథానాయుకుడు బయల్దేరుతాడు. బయల్దేరే ముందు సొరచేపల గురించి పరిశోధనలు చేసిన వారితో చర్చలు జరిపి అతని సాయం, సముద్రయానంలో సోరచేపల్ని చంపటంలో అనుభవమున్న యింకో వ్యక్తి సహాయం తీసుకుంటారు. ఈ ముగ్గురూ కలసి షార్క్ ని చంపటానికి చేసిన సాహస క్రుత్యాలే యితివృత్తం .

    ఇహా ...... సైంటిఫిక్ ఫిక్షన్ పేరుతో రకరకాల యితివృత్తాలు.... వందేళ్ళ తర్వాత ప్రపంచమేలా వుంటుంది?

    వెయ్యేళ్ళ తర్వాత ఎలా వుంటుంది. లక్షేళ్ళ తర్వాత ఎలా వుంటుంది? లేకపోతే ఒక ప్రహవాసులు యింకో గ్రహంలో అడుగుపెడితే ఎలా వుంటుంది?

    లేకపోతే భూగర్భ౦ మధ్యలోకి దారి కనిపెట్టి అక్కడుకు ప్రయాణం చేస్తే ఎలా వుంటుంది?

    ఇదంతా సైంటిఫిక్ ఫిక్షన్ లేకపోతే..... ఓ మనిషిని నిస్సహాయ స్థితిలో పడవేసి ఆ స్థితినుంచి అతను బయటపడే విచిత్రమైన ప్రయత్నాలు.

    ఇహా .... అతీతశక్తులు .... ఎన్ని రకాలుగానైనా రాయవచ్చు.

    గౌతమ్ యీ దొరణులన్నీ క్షుణ్ణంగా పరిశీలించాడు. వాటి నుంచి తనదైన ఓదారి ఓ సముద్ర సంపాదించాడు. జైత్రయాత్ర మొదలు పెట్టాడు.

    తాను రెండు మూడేళ్ళుగా వున్న, తనకు దీనస్థితిలో వున్నప్పుడు ఆశ్రయం యిచ్చిన గది ఎప్పుడో వదిలిపెట్టాడు. వెళ్ళేటప్పుడు జ్యోతికి, బంగారయ్య: యింట్లోని మిగతావారికి బట్టలు కొనిపెట్టాడు.

    "ఆడపిల్లల పెళ్ళి చెయ్యండి. నేను సహాయం చేస్తాను" అన్నాడు

    ఇంకా పెద్ద బంగళాలాంటి యిల్లు అద్దెకు తీసుకున్నాడు కారుకొన్నాడు.

    రోజూ ఉదయం అయిదుగంటకల్లా నిద్రలేచేవాడు. అప్పటికి పనికుర్రాడు  రాడు. అందుకని తానె కాఫీకలుపుకుని త్రాగేవాడు.

    కాసేపు గదుల్లో అటూ ఇటూ పచార్లు చేసి ఓ నవల్లో రెండు పేజీలు పూర్తీ చేసేవాడు. మొదట్లో మూడ్ కోసం చాలా ప్రయాసపడేవాడు. తర్వాత తర్వాత సాధనవల్ల అంత ప్రైస లేకపోయేది. చాలా తేలిగ్గా తాను నిర్దేశించుకున్న రెండు పేజీలూ రాసేసేవాడు.

    తర్వాత స్నానంచేసి పనికుర్రాడు బాలూ తీసుకొచ్చిన టిఫిన్ తిని, రెండో నవల తీసుకునేవాడు. అదో రెండు పేజీలు ఉద్యోగంలా రాసేసేవాడు.

    పదయేసరికి అలాగడిపి పదినుంచి పన్నెండు గంటలవరకూ తనను కలుసుకోవటంకోసం వచ్చిన పాఠకులతో, పత్రికల ఎడిటర్లతో గడిపేవాడు. అవకాశముంటే తనకు వచ్చిన ఉత్తరాలలో జవాబు యివ్వడానికి యోగ్యమని భావించిన రాసేసేవాడు.

    తర్వాత బాలూ తెచ్చిన భోజనం.

    ఓ గంటసేపు నిద్ర. నిద్రారానిస్థితిలో పడుకుని, వంటరి తనము లోని విషాదం, దుఃఖం మధ్య మధ్య వెన్నుతట్టి లేపుతుండగా ఉలికిపడుతూ చివరకు పూర్తిగా మెలకువ తెచ్చుకుని లేచి కూర్చునేవాడు.

    తర్వాత అయిదు గంటలదాకా తనకునచ్చిన పుస్తకాలు చదువుకునే వాడు. మధ్యలో బాలు తెచ్చిన టీ.

    ఆ తర్వాత ఓ గంటసేపు మూడో నవల రాసుకునేవాడు.

    అరూ __ అరునర్రకల్లా కారేసుక్ని బయటకు వెళ్ళిపోయేవాడు. సాఘికంగా అతనికి పరపతి పెరిగాగ చాలామంది స్నేహితులు ఏర్పడ్డారు. ఏ స్నేహుతుని యింటికో, క్లబ్బుకో, సభలకో, సమావేశలకోవెళ్ళి గడిపేవాడు. ఎంత నిరాకారించుదామని అనుకున్నా ఎప్పుడూ ఏదో సభకువక్తడన్నా ఎక్కడికివెళ్ళే అవకాశం లేకపోయినా సాయంత్రాలు మాత్రం యింట్లో వుండలేకపోయేవాడు. వంటరిగా కారేసుకుని ముప్పయి నలభయి మైళ్ళదాకా డ్రయివ్ చేసి పదిగంటల కల్లా తిరిగి వొచ్చేవాడు.

    బయట డిన్నర్లూ అవీలేకపొతే బాలూ తెచ్చి టేబుల్ మీద పెట్టిన క్యారియర్ .

    తర్వాత అవసరాన్నిబట్టి నాలుగో నవల్లో రెండు పేజీలు.

    అలా రాయటమతనికి కలవాటయి పోయింది. ఓ నవల్లోని పాత్రలు సంఘటనలు యింకో నవలలోని వోవర్ ల్యాఫింగ్ గాని, పాత్రల పేర్ల గుర్తించి కన్ ప్యూజ్ అవటంగాని తడబాటుగాని వుండేదికాదు. చాలా సునాయాసంగా అ ఒక నవలే రాస్తున్నంత ఏకాగ్రతతో రాసేవాడు.

    ఒకరోజు ఉదయం పదిగంటలవేళ గౌతమ్ యింటిముందు ఆటోఆగింది, అందులోంచి ఓ నలభయిఅయిదేళ్ళు స్త్రీ , యిరవై ఏళ్ళ అమ్మాయి దిగారు.

    బాలూ బయట నిలబడి వున్నాడు.

    "ఇది గౌతంగారి యిల్లేనా బాబూ?" అనడిగిందావిడ.

    ప్రతిరోజూ యిలా ఎందరో కొందరు వస్తూవుండటం అలవాటే కాబట్టి బాలూ ఆశ్చర్యపడలేదు. కాకపోతే వాళ్ళు సూట్ కేస్ తో దిగటం కొంత విడ్డూరమనిపించింది అయ్యగారింటికి చుట్టాలు రావడం యిదే మొదటిసారి అతను చూడటం.

    "ఉన్నారు లోపలకు రండి" అని తీసుకువెళ్ళాడు.

 Previous Page Next Page