Previous Page Next Page 
అధికారి పేజి 2

    "పది గంటలకు అంటే ఇంకా నాలుగంటలు ఆగాలా! కుదరదు. నేను ఇప్పుడే వారిని కలవాలి, కలసి తీరాలి" అతను చాలా స్థిరంగా అన్నాడు.

   
    "జావో..... జావో.... దస్ బజేకో ఆఫీస్ కో అజానా...."
   
    "లేదు వారిని కలిసే దాకా నేను ఇక్కడే ఈ గేటుముందే కూర్చుంటాను" అని గేటుముందు బైఠాయించాడు.
   
    "కితనే బార్ బోల్నా. రాస్తాసే నికల్. చల్ హట్ అభి మార్ నా పడేగా" (ఎన్నిసార్లు చెప్పాలి. దారికి అడ్డం లే... లేలే... లేవకపోతే కొట్టాల్సి వస్తుంది)
   
    "నేను అన్నీ తెగించే వచ్చాను. నీ ఇష్టం వచ్చింది చేసుకోపో!  పో! ...."
   
    అంతే అతని మాటలకు వాచ్ మెన్ ముఖంలో రంగులు మారాయి. ఒక్క ఉదుటున అతని రెక్కలు పుచ్చుకుని పైకి లేపి బలంగా ముందుకు నెట్టాడు.
   
    అప్పటివరకు మేడమీద వ్యాయామం చేస్తున్నా కపూర్ దృష్టి వాళ్ళ మీద పడింది.
   
    "వాచ్ మెన్..... వాచ్ మెన్ ఉన్ కో అందర్ భేజో! డైరెక్టర్ కంఠం ఖంగుమంది.
   
    "జీసాబ్....."
   
    "ఏ  ఇధరావో, చలో సాభ్ బులాతేహై" అని వాచ్ మెన్ గేటు తెరిచాడు.
   
    అతను లోపలకు వెళ్ళాడు.
   
    డైరెక్టర్ ఎదురువచ్చిఅతన్ని సరాసరి తన ఆఫీస్ రూమ్ లోకి తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరు ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళగానే స్ప్రింగ్ డోర్ మూసుకుంది.
   
    గంటలు గడిచి పోయాయి. అప్పుడప్పుడు టీ బిస్కెట్స్ గదిలోకి తీసుకు వెళుతున్నారు. లంచ్ టైమ్ లో  ఇద్దరికీ లంచ్ తీసుకు వెళ్ళారు సర్వెంట్స్.
   
    వచ్చిన విజిటర్స్ ఎవ్వరికి డైరెక్టర్ ని డిస్టర్బ్ చేసే ధైర్యం లేక చాలాసేపు బయట సోఫాలో కూర్చుని చీకటిపడుతుండగా ఇక ఈ రోజుకు డైరెక్టర్ దర్శనం అయ్యేటట్టు లేదని, మరునాడు కలుసుకోవడమే మేలని తిరుగుముఖం పెట్టారు.
   
    రాత్రి తొమ్మిది గంటలు అవుతుండగా ప్రఖ్యాత నిర్మాత లోహిత్ మిశ్రా ఇంపోర్దేడ్ కారుతో దిగాడు, అతను సరాసరి డైరెక్టర్ వున్న ఆఫీసు రూమ్ కి వెళ్ళబోతూ వాచ్ మెన్ ని చూసి "ముజే సాట్ బులాయే" అన్నాడు.
   
    వాచ్ మెన్ అతనికి సెల్యూట్ కొట్టి డోర్ తెరిచాడు.
   
    "రండి, రండి మిశ్రా సాబ్. ఇదిగో స్టోరీ వీరిపేరు అధికారి వీరే హీరో, మన పిక్చర్ కి  టైటిల్ 'అధికారి' ఎలా వుంది టైటిల్?" డైరెక్టర్ కపూర్ అతని జవాబు కోసం ఆగాడు.
   
    మరోవైపు అధికారి ట్రాన్స్ లో వున్నాడు. తను వింది కలో? నిజమో? నిర్దారించుకోలేకపోతున్నాడు. ఒకవేళ డైరెక్టరు గాని ప్రొడ్యూసర్ తో తన గురించి జోక్ చేస్తున్నట్టా!
   
    "చెప్పండి మిశ్రాజీ __ ఈ టైటిల్ మీకు నచ్చలేదా? ఇదిగో సింగిలైన్ ఆర్డర్. ఈ స్టోరీ చెప్పింది అధికారే. రేపే ఘాంటింగ్ ఏమంటారు?"
   
    మిశ్రా ఆలోచనలో పడ్డాడు.
   
    "సార్. ఇంత పెద్ద ప్రాజెక్టులో యాక్టర్ల విషయం మీరు మరోసారి ఆలోచిస్తే బావుంటుందని నా అభిప్రాయం ."
   
    "మిశ్రాజీ..... కథ వాస్తవానికి దగ్గరలో వుండాలన్నారు. అలాగే కధాపరంగా క్యారెక్టర్స్ , కొత్తవాళ్ళయినా ధైర్యం చేద్దాం అన్నారు. అందుకే నేను బాగా అలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీకు నచ్చకపోతే ఈ ప్రాజెక్టు టేకఫ్ చేయడానికి మరో కొత్త నిర్మాత కూడా రెడీగానే వున్నారు. కాకపొతే ఈ ప్రాజెక్ట్ మీ ప్రేస్టీజియస్ బేనర్ మీద అయితే బావుంటుందని నా ఆశ..."
   
     
        "సారీ సార్..... నేను అనుమానంతో అనలేదు. మీ మీద నాకు సెంట్ పర్సంట్ నమ్మకం వుంది. జస్ట్ నా సందేహం వెలిబుచ్చాను. అంతే. నేను పిక్చర్ తీస్తే డైరెక్షన్ లోనే చేయాలనుకున్నాను. ఐయాం రెడీ సార్! రేపు ఘాంటింగ్ కి అన్నీ ఏర్పాట్లు చేస్తాను" అని సూట్ కేసు తెరచి డైరెక్టర్ ముందు వుంచాడు మిశ్రా.
   
    అధికారిగారు కథ చెప్పినందుకు మూడు లక్షలు, యాక్షన్ ను ఐదు లక్షలు రెండు కలిపి ఎనిమిది లక్షలు, ముందు రెండు లక్షలు అడ్వాన్స్ గా మీ చేతులమీద మీరే ఇవ్వండి మిశ్రాగారు. మీ హేండు చాలా మంచిది కదా!"
   
    ఆ అద్బుతావస్థనుంచి 'అధికారి' యింకా కోలుకోలేదు. అంతడబ్బు తన మేధా సంపత్తికి ఇస్తున్నందుకు కాదు, కేవలం తను కథ చెప్పాడు కాని తననే రచయితను చేయడం, ఆ సినిమాలో తననే హీరోగా పెట్టడం అతనికి మింగుడు పడడం లేదు.
   
    డైరెక్టర్ కపూర్ అధికారి భుజం తట్టాడు. మిశ్రా అతని చేతిలో రెండు లక్షల రూపాయిలు క్యాష్ పెట్టాడు.
   
    కపూర్ సెక్రటరీ ని పిలిచి  సూచనలిచ్చాడు. సెక్రటరీ అధికారిని కారులో తీసుకువెళ్ళి గెస్టు హౌస్ లో దించాడు.
   
    తెల్లవారితే ఘాంటింగ్ , 7 గంటలకల్లా మేకఫ్ లో ఘాంటింగ్  స్పాటు లో వుండాలి. అంటే తను  తెల్లవారుజమున 4.30 కే నిద్ర లేవాలి. ఆలోచనలు. అధికారి మదిలో లెక్కలేనన్ని అలోచనలు.
   
                                                                         2
   
    "యూ ఆర్ అల కరప్ట్ బా....! మీరంతా డింగనాకో......! యూ ఆర్ అల్ క్రిమినల్స్ ఇన్ యూని ....! రౌడీలకు సలాం కొడుతున్నకో...! దొంగలిక్కర్ అమ్ముకుంటున్న బ్రో ....! పోలిటీషియన్స్ కి పక్కలు వేసే డా.....! బ్లాక్ టికెట్లు అమ్ముకునే బజారునా....! సింగిల్ నెంబర్ కాటరీ నిర్వాహికులకు సలాం కొట్టేనా.....!  బళ్ళదగ్గర  జంకాయలు అడుక్కుతినే బే.....! రోడ్డు పక్కన లారీలు ఆపి ఐదు రూపాయలు అడుక్కునేబ్రో.......దసరా వేషాలు వేయకుండానే దసరా మామూలు దండుకునేదగు ....! సంవంత్సరానికోసారి ఇన్ స్పెక్షన్ గోడలకు సున్నం అంటూ మాముళ్ళ పేరుతో జనాన్ని పీల్చి పిప్పి చేసేనా....! తాగుడు, వ్యభిచారం జూదానికి బానిసలైన జులా.....! అసలు మీలో చీము, నెత్తురు మానాభిమానాలు.....ఉన్నాయో!"

 Previous Page Next Page