"అది కాదండీ _ శుచీ , శుభ్రతా గురించి ...."
భద్రం నవ్వి __ "మీరు చాలాకాలం పట్నంలో ఉండి వచ్చిన మూలాన ఏదయినా తేడాగా వుందేమో కానీ _ పల్లెటూళ్ళలో ఇంతకుమించిన శుభ్రత కష్టం __" అన్నాడు.
అప్పుడు రాజారావు తనూ నవ్వి __ "మాట్లాడ్డంలో కూడా డొంకతిరుగుడు , పట్నం పధ్ధతి వదిలి __ సూటిగా అడిగేస్తారు. _ మనూళ్ళో అన్ని వీధుల్లోనూ కంకర రోడ్డువేయిస్తే ఎలాగంటుందంటారు?' అన్నాడు.
ఏదో వినరానిది విన్నట్టు భద్రం కంగారుపడ్డాడు. రాజారావునించి ఇటువంటి మాట నతడూహించలేదు . సాలోచనగా తల పకించి _ "ఆలోచించవలసిన విషయమే!" అన్నాడు.
"ఇది ఆలోచించాల్సిన విషయం కాదు, ఆచరించాల్సిన విషయం __" అన్నాడు రాజారావు గంభీరంగా.
భద్రం మళ్ళీ కాసేపాలోచించి __ "మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ __ దీనికి ప్రెసిడెంటుగార్ని సంప్రదించాలి _" అన్నాడు.
"నేను కాదనడంలేదు. మీ అభిప్రాయం అడుగుతున్నాను. మనూరికి రోడ్లవసరమా, కాదా?"
"కాదని ఎలాగంటాను, అవసరమే!"
"ఒప్పుకున్నారు గదా __ చాలు!"
"మరి రమాకాంతంగారిని....."
"ఆయన్ను కలవడమయింది. మనూరికి రోడ్లవసరమా, కాదా అన్నది. ప్రజలే చెప్పాలని ఆయనన్నారు. ప్రజలచేత ఆ ముక్క చెప్పించాలంటే బహిరంగ సభ కావాలి ఈ సాయంత్రమే అది ఏర్పాటు చేయిద్దాం, ముందుగా ఊరిపెద్దల అభిప్రాయం తెలుస్కోవాలని బయల్దేరి, యువతరం ప్రతినిధి గదా అని మిమ్మల్ని ముందు కలిశాను. ఇంకా చాలామందిని కలవాలి ....." అంటూ రాజారావు లేచాడు.
భద్రం ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోకుండానే రాజారాక్కణ్నించి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత రాజారావు కరణం కనకరాజుగారిని కలిశాడు. ఆయనచేత కూడా ఔననిపించుకోవడమే కాక __ సాయంత్రపు బహిరంగ సభ గురించిచాటింపు వేయించడానికి ఒప్పించాడు. అటుపైన ఊళ్ళో ముఖ్యులయినవారి మరికొందర్ని కలిశాడు. అందరికీ అతడంటే గౌరవభావముంది. ఎవరిమటుక్కు వాళ్ళతడి నాభినందించి _ అతడికి తను సహకార ముంటుందని మాటిచ్చారు.
ఆ విధంగా ఊరంతా తిరిగి రాజారావిల్లు చేరుకునే సరికి పన్నెండయింది.
అతడి కోసం అత్రుతుగా ఎదురుచూస్తున్న వసంత _ "ఇంతసేపెం చేస్తున్నారండీ ?" అంది.
"ఇంక కొత్త రోడ్డు వచ్చేస్తుందిగా. అందుకని ఓసారి పాతరోడ్డంతా తనివితీరా ఆఖరుసారిగా నడిచివచ్చాను...." అన్నాడు రాజారావు.
వసంత మౌనంగా వింది.
రాజరావే మళ్ళీ __ "రోడ్డు వేయించడం రమాకాంతాని కిష్టంలేదు. అందుచేత ఆయనకు జనవాడిని వినిపించబోతున్నాను. సాయంత్రం వూళ్ళో మీటింగు . అందులో నా ఉపన్యాసం _" అన్నాడు.
వసంత ఆశ్చర్యంగా _ "ఏమండీ _ ఎన్నడూ మీరితరుల విషయంలో జోక్యం చేసుకోవడం నేనెరగను. అటువంటి దీమధ్య ప్రజోపయోగకర కార్యక్రమాల కోసం మీరెందుకింత శ్రమపద్ఫుతున్నారో నాకర్థం కావడంలేదు.__" అంది.
"నా కార్యక్రమాలు ప్రజోపయోగకరమయినా _ వాటి వెనుక దాగి ఉన్న ఆశయం స్వార్ధమని నీకు తెలియదా?" స్వార్ధం మనిషిచేత ఎంత పనయినా చేయిస్తుంది....."
"కానీ మీస్వార్ధ౦తో పదవీ వ్యామోహం లేదు."
రాజారావు నవ్వి __ "పదవీ వ్యామోహం లేకున్నా, ప్రతీకార భావముందిగా _" అని సంబాషణ మార్చడం కోసం "పాపేదీ?' అన్నాడు.
"ఆడుకుందుకు _ అలా వెళ్ళింది ...." కదా అన్నది . ప్రజలే చెప్పాలని ఆయనన్నారు. ప్రజలచేత ఆ ముక్క చెప్పించాలంటే బహిరంగ సభ కావాలి ఈ సాయంత్రమే అది ఏర్పాటు చేయిద్దాం. ముందుగా ఊరిపెద్దల అభిప్రాయం తెలుసకోవాలి. బయల్దేరి, యువతరం ప్రతినిధి గదా అని మిమ్మల్ని ముందు కలిశాను. ఇంకా చాలామందిని కలవాలి ....." అంటూ రాజారావు లేచాడు.
భద్రం ఇంకా ఆశ్చర్య౦లోంచి తెరుకోకుండానే రాజారావక్కణ్నించి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత రాజారావు కరణం కనకరాజుగారిని కలిశాడు. ఆయనచేత కూడా ఔననిపించుకోవడమే కాక _ సాయంత్రపు బహిరంగ సభ గురించి చాటింపు వేయించడానికి ఒప్పించాడు. అటుపైన ఊళ్ళో ముఖ్యలయినవారిని మరికొందర్ని కలిశాడు. అందరికీ అతడంటే గౌరవభావముంది. ఎవరి మటుక్కు వాళ్ళతడి సభినందించి _ అతడికి తమ సహకార ముంటుందని మాటిచ్చారు.
ఆ విధంగా ఊరంతా తిరిగి ఎదురుచూస్తున్న వసంత _ '"ఇంతసేపెం చేస్తున్నారండీ ?" అంది.
"ఇంక కొత్త రోడ్డు వచ్చేస్తుందిగా . అందుకని ఓసారి పాతరోడ్డంతా తనివితీరా ఆఖరుసారిగా నడిచివచ్చాను ....." అన్నాడు రాజారావు.
వసంత మౌనంగా వింది.
రాజరావే మళ్ళీ _ "రోడ్డ్లు వేయించడం రమాకాంతాని కిష్టంలేదు. అందుచేత ఆయనకు జనవాణిని వినిపించబోతున్నాను. సాయంత్రం వూళ్ళో మీటింగు. అందులో నా ఉపన్యాసం __" అన్నాడు.
వసంత ఆశ్చర్యంగా _ "ఏమండీ _ ఎన్నడూ మీరితరుల విషయంలో జోక్యం చేసుకోవడం నేనెరగను. అటువంటి దీమధ్య ప్రజోపయోగాకర కార్యక్రామాల కోసం మీరెందుకింత శ్రమపడుతున్నారో నాకర్ధం కావడంలేదు __" అంది.
"నా కార్యక్రామాలు ప్రజోపయోగాకరమయినా _ వాటి వెనుక దాగిఉన్న ఆశయం స్వార్ధమని నీకు తెలియదా?" స్వార్ధం మనిషిచేత ఎంత పనయినా చేయిస్తుంది....."
"కానీ మీ స్వార్ధంలో పదవీ వ్యామోహం లేదు."
రాజారావు నవ్వి _ "పదవీ వ్యామోహం లేకున్నా, ప్రతీకార భావముందిగా _ " అని సంబాషణ మార్చడం కోసం "పాపేదీ?" అన్నాడు.
"ఆడుకుందుకు _ అలా వెళ్ళింది ....."
రాజారావు బట్టలు మార్చుకున్నాడు. తర్వాత అతడు, వసంత కలసి భోంచేశారు.
"మిత్రులారా! నేనేక్కువుగా మాట్లాడదల్చుకోలేదు. చెప్పేదేదో సూటిగా రెండు ముక్కల్లో చెబుతాను. చెప్పబోయేముందు మీకో విషయం మనవి చేసుకుంటాను. నేనీ గ్రామానికి కొత్త కావచ్చు. నాకీ గ్రామంలో పూర్వ పరిచయం లేకపోవచ్చు. కానీ, నా గ్రామం యిదే. నేనీ గ్రామ పౌరుణ్ణే. ఇది గురించుకుని నేను చెప్పే నాలుగు ముక్కలూ సావధానంగా వినండి ..... ప్రపంచమంతా మారిపోతోంది. నాగరకత విపరీతమయిన వేగంతో వృద్ధిచెందుతోంది. మనూరు మాత్రం సంవత్సరాల తరబడి మారడంలేదు. ఇది మన కవమానం. మనమూ మన గ్రామాన్ని ఆధునికంగా తయారు చేయాలి, అందుకు మొదటి మెట్టు మంచి బాట. సక్రమ బాటలో నడిచే అదృష్టం మనందరికీ ఉండాలి. వాస పడితే మన రోడ్డ్లు బాడీ, బందతో అసహ్యంగా అయిపోతున్నాయి. వీధిలోంచి యింట్లోకెళ్ళాంలంటే బాల్చీలకొద్దీ నీళ్ళు కాళ్ళ మీద దిమ్మరించుకోవాలి. ఎడ్లబళ్ళకు చక్రాలు కదలవు. పోనీ _ వెసవికాలంలో సుఖముందా అంటే, మనవి గతుకుల రోడ్లు సామాన్య మానవుడి అత్యంత ప్రియవాహనం సైకిలు . అది తొక్కాలంటే మన రోడ్లమీద నానా అవస్థా పడాలి.ఈ రోడ్డ్లు చూసి _ ఇతర గ్రామస్థులు మన్ని చూసి నవ్వుతున్నారు. వీటివల్ల ఊరి అందం పాడైపోయింది. ఆ విషయం నేను _ యిప్పుడు నా ప్రక్కన కూర్చున్న మానూరి ప్రెసిడెంటు రమాకాంతంగారితో మాట్లాడేను, మంచి రోడ్డ్లు వేయించడం ఆయనకూ ఇష్టమే! కానీ, పంచాయితీ ఆదాయం తక్కువ ఉన్న కాస్త అదాయాన్నీ రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తే మీరంతా ఏమనుకుంటానని అయన భయపడుతున్నారు. అయన ప్రజా నాయకుడు . మనం గ్రామం కలకాలం మూడు బాటలూ, ఆరు తోటలూగా వర్ధిల్లాలి _ జైహింద్ !"
రాజారావు తన ఉపన్యాసం ముగించి కూర్చోగానే కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. అతడి పక్క కుర్చీలో కూర్చున్న ధ్వనులు మిన్నుముట్టాయి. అతడి పక్క కుర్చీలో కూర్చున్న రమాకాంతానికి చెప్పుకోలేని కసి, ఉక్రోషం కలిగాయి. ఇలా పెద్దల్ని కలిపి సభ ఏర్పాటుచేసి, సంతకాలు సేకరించే ఉద్దేశ్యం రాజారావుకుందని అయన ఊహించలేదు. ఊహించి వుంటే జాగ్రత్తపడి వుండేవాడు. కానీ చాటింపు అయన చెవులపడేసరికే సమయం మించిపోయింది. "చేసే దేముంది. ఈ రాజారావు ఆసాధ్యుడు _ " అనుకున్నా డాయన మనసులో.