Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 19

   

  "ఇప్పుడు మన ప్రెసిడెంటు రమాకాంటంగారు నాలుగు ముక్కలు చెబుతారు _" అన్నాడు రాజారావు మళ్ళీ లేచి నిలబడి. రమాకాంతం లేవగానే అతడు కూర్చున్నాడు.

    రమాకాంతం గొంతు సవరించుకుని _ "చెప్పవలసిందంతా రాజారావుగారు చెప్పారు. ఇంతకాలం మనూరి రోడ్లగురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. కానీ అయన చెప్పినట్లు కాలం మారుతోంది. మీరంతా ఎలాగంటే నేనూ అలాగే! ఏ పనికయినా ఈ విషయం గుర్తుంచుకోమని మనవి __" అని కూర్చున్నాడు.

    మళ్ళీ కరతాళ ధ్వనులు మ్రోగాయి.

    రాజారావు చేతిలోని కాగితం చేతులు మారుతోంది. జనం ఉత్సాహంగా దానిమీద సంతకాలు పెడుతున్నారు. కొంతమంది వెలిముద్రలు వేస్తున్నారు.

    అ జనవాహిని వంక అబ్బురంగా చూస్తున్నాడు రాజారావు. అందరి ముఖాలల్లోనూ అనందం. ఎందుకా ఆనందం _ రోడ్లు వస్తాయనేనా? అయినప్పటికీ, కానప్పటికీ _ ఇలా జనవాహిని కెదురుగా నిలబడి తనూ ఓ రాజకీయ నాయుకుడిలా ఉపన్యాస మిస్తామని అతడేన్నడూ అనుకోలేదు. కానీ యీ రోజది జరిగింది.

    "స్వార్ధం ఎంత పనయినా చేయిస్తుంది _" అనుకున్నాడతడు.

                                               14

    ఉన్నట్లుండి గ్రామం నిద్రలేచిందా అన్నట్టు __ అ గ్రామంలో సందండి ప్రారంభింమయింది. రోడ్ల నిర్మాణ కార్యక్రమం హడావుడిగా ప్రారంభమై _ గ్రామస్థుల శ్రమదానం కారణంగా _ తొందరగానే కాక, చౌకగా కూడా పూర్తయింది.

    కొత్త రోడ్డ్లు ఊరికి కొత్త అందాన్ని తెచ్చాయి ఆ కళ రాజారావు కొత్తపేరు తెచ్చింది. రోడ్లతడి కారణంగానే వచ్చాయని అంతా అనుకోసాగారు వయోజన విద్యా కార్యక్రమం కూడా ఇప్పుడతడి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. గ్రామాణ యువకుల్లో రాజరావుపై గౌరవభావం నానాటికీ ద్విగుణీకృత మవుతోంది. అందుకు సూచనగా _ ఊళ్ళోని కొందరు యువకులతడి గురించి ఒక చిన్న అభినందన సభ ఏర్పాటు చేశారు. సభకు ఊరి ప్రముఖలందర్నీ ఆహ్వానించారు.

    రాజారావీ సభ గురించి ఊహించలేదు. కానీ ఇది పాతికమందీ , యువకులో యాభైమందీ గ్రామ చావిడిలో పోగయ్యారు. వాళ్ళలో చదువుకున్న వారూ, చదువుకోనివారూ, కూడా ఉన్నారు.

    ఆ రోజు సాయంత్రం నాలుగింటికి _ ఊరి పెద్దలో పాతికమందీ,యువకుల్లో యాభైమందీ గ్రామా చావడిలో పోగయ్యారు. వాళ్ళలో చదువుకున్న వారూ, చదువుకొనివారూ కూడా ఉన్నారు.

    ఒక బల్ల, బల్లమీద అందమయిన వూవులల్లిన టేబుల్ క్లాట్, దానిమీద ఒక ప్లవర్ వాజ్, బల్లవెనుక మూడు కుర్చీలు .... బాలలకు ముందుగా నేలమీద పరచిన జమోఅకానా _ దానిమీద వచ్చిన జనం, కుర్చీల్లో నరహరి, రమాకాంతం, రాజారావు.

    ముందుగా నరహరి తరుపున ఒక అభినందన పత్రాన్ని రాజారావుకి అందజేశాడు. రాజరావా పట్రాన్నందుకుని  చదువుకున్నాడు. అది చదువుకోగానే ఎందుకో అతడి మనసులో కలుక్కుమంది _ "మీ వంటి విజ్ఞులు, లోకజ్ఞులు మా గ్రామసేవకు జీవితాన్నంకితం చేయడం నిజంగా మా అదృష్టం _" అన్న వాక్యం అతడిని బాధించింది. నిజ్మగా ఈ గ్రామసేవే తన ఆశయమా?

    రాజారావుని అభినందిస్తూ క్లుప్తంగా ప్రసంగించాడు నరహరి. ప్రసంగం పూర్తయ్యాక రమాకాంతం కూడా రాజరావుని ప్రశ్నిస్తూ నాలుగు ముక్కలు చెప్పాడు. కానీ ఆయనకు మనసులో అతడంటే గుర్రుగా వుంది.

    పంచాయితీ ఎన్నికలింక నేలల్లోకి వచ్చేశాయి. ఇటువంటి సమయంలో గ్రామంలో రోడ్డ్లు వేయించడం తన పరపతని బాగా పెంచి ఉండేది. కానీ యిప్పుడు పంచాయితీ డబ్బుతోనే రోడ్డ్లు వేయించడం జరిగినా _ తన పరపతి పెరగలేదు. అంతా రాజారావుకి దక్కే సింది. ఇలా జరుగుతుందని తనకు తెలియదు. అప్పటికీ రాజారావు తనకో అవకాశమిస్తే తనుపయోగించుకోలేదు. రాజారావు పలుకుబడి పెరగడం తనకు మంచిదికాదు. కానీ తనే ఇప్పుతడ్ని పొగడాల్సి వస్తోంది. ఆయనలో మిగిలిందల్లా ఒక్కటే ఆశ __ ..... రాజారావు నక్సలైటు రుజువుయినవాడు.......

    రాజారావు లేచి నిలబడి గొంతు సవరించుకున్నాడు.

    "మీ అభింధన పత్రం ఒక రకంగా నన్ను సంతోషపెట్టింది. రెండు రకాలుగా బాధపెట్టింది. సంతోషానికి కారణం మీ ప్రేమానురాగాలని వేరే చెప్పనక్కర్లేదు బాధకు మొదటి కారణం __ మీ గ్రామానికి నేను సేవ చేస్తున్నానని పోగాద్దంలో మీరు నన్ను మీ గ్రామ పౌరుడిగా గుర్తించడం లేదు. నేనూ ఈ గ్రామ పౌరుడ్ని . గ్రామ సేవ నా కర్తవ్యం. నా కర్తవ్యం నేను నిర్వహిస్తే నాకీ పొగడ్తలెందుక? అదలా గుంచండి. నా బాధకు రెండోకారణం _ ఈ బృహత్తర కార్యక్రమానికి సారధిని నేనని మీరంతా ..... భావించవచ్చు కానీ, అసలు వ్యక్తి వేరే ఉన్నాడు. వేరేవరికావు చెందవలసిన గౌరవం నాకు లభించడం బాధగానే ఉంటుంది మరి ....." అటడోకసారి ఆగి ఊపిరి పీల్చుకున్నాడు.

    శ్రోతల్లో నిశ్శబ్దం. రాజరావేదో కొత్త విషయం చెప్పబోతున్నట్లు అంతా పసిగట్టారు.

    రాజారావు కొనసాగించాడు. __ "ప్రజాసేవ చేయాలని అందరికీ ఉంటుంది. వారిలో కొందరికి కీర్తి దాహమున్నట్ట్లే, మరి కొందరికి కీర్తిభవనం ఉంటుంది. నలుగురిలోనూ గుర్తింపు రాకూడదనుకునేవారు __ తమ ఆశయాల ఆచరణకై నావంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయనకూ చాలా ఆశయాలున్నాయి. గ్రామం బాగుపడాలనే తప్ప, పేరురావడం ఇష్టంలేని ఆయనకు తెరమరుగునే వుండాలనుంది __" అతడు మళ్ళీ ఆగాడు.

    శ్రోతల్లో ఉత్కంఠ రేగింది. మనూళ్ళో అలాంటి మనిషివరబ్బా అన్నది ప్రతి ఒక్కరి ఆలోచనల్లోనూ ఉన్న ప్రశ్న.

    రాజరావు తిరిగి ప్రారంభించాడు _ " ఉదాహరణకు నా సంగతి తీసుకొండి. నాకు కాలక్షేపం కావాలని చదువుచెప్పాలనుకున్నాడు. త్వరలో కారు కొనబోతున్నాను గదా అని ఊపిరి రోడ్లగురించి ఆలోచించారు. స్వార్ధానికి సంబంధించిన నా సూక్ష్మభావాల్ని __ విశాల దృక్పథంగా మార్చి __ నన్నీవిధంగా ప్రోత్సహించిన మహనీయుడికే ఈ గౌరవమంతా దక్కాలి. అయన పేరు నేను మీకీ క్షణంలో చెప్పగలను. నిజాని కిప్పుడాయన యిక్కడే, మన మధ్యనే ఉన్నాడు. కానీ అయన పేరు పైకి చెప్పి, ఆయన్ను బాధపెట్టలేను. ఈ గౌరవానికి నేను తగనని మాత్రం మనవి చేసుకుంటున్నాను __" అని కూర్చోన్నాడతను.

    అక్కడున్న ప్రతి ఒక్కడూ ఉలిక్కిపడి, ఒకరి వంశ ఒకరు చిత్రంగా చూసుకున్నారు.

    తమలోనే ఒక మహానుభావు. కీర్తి కాంక్షలేకుండా, ఉన్నతాశయాలున్న ఆ వ్యక్తి ఎవరు ?

    సభంతా గుసగుసలు.

 Previous Page Next Page