రాజారావు చేయిసాచి __ "వెరీగ్లాడ్ టూ మీట్యూ __" అన్నాడు సాలోచనగా.
"మీటూ __" అంటూ అతడూ చేయి చాపాడు , కరచాలనం చేసి ఇద్దరూ మళ్ళీ కూర్చున్నారు.
రమాకాంతం ప్రారంభించాడు __ "ఈయనది చాలా మంచి స్వాభావమోయ్ రవీ! ఊళ్ళో డిగి మూణ్ణెల్లుకాలేదు. అప్పుడే ఊరందరికీ అప్తులయిపోయారు. ఈ గ్రామాన్నో ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలని ఈయన సంకల్పం అందుగురించి తరుచుగా నా దగ్గరకు వచ్చి మంచి చెడ్డలు చర్చించి వేడుతూంటారు. వీరికి నా మాటంటే ఎంతో గురి. నేను వద్దన్న పని ఎప్పుడూ చేయరు ....."
"ఏదో __ ఈ రోడ్ల విషయంలో తప్ప ...." రాజారావు అందించగానే రమాకాంతం వాగ్ధాటి ఆగి, గంభీరంగా మారిపోయింది.
రవి నవ్వి _ "ఈ ఊళ్ళో అడుగు పెట్టకమునుపు మీరెక్కడు౦డేవారు?" అనడిగాడు.
"ఎక్కడో ఉద్యోగం చేసుకునేవాణ్ణి __" అన్నాడు రాజారావు పెడసరంగా.
"మీకు భూములూ అవీ మరో ఊళ్ళో ఉన్నాయా? ఎవరికయినా ఈ ప్రశ్న తట్టడం సహజం ....."
అతడింకా ఏదో అనబోతూ౦డగా __ " నా కేవూళ్ళోనూ భూములు లేవు. కానీ నా జీవితం సుఖంగా వెళ్ళిపోవడానికి సరిపడ్డ రొక్కం నా దగ్గరుంది. నా పేరు కూడా రాజరావే. అది మారుపేరు కాదు __" అన్నాడు రాజారావు.
రవి నోరు మూతబడింది.
రాజారావు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
అప్పుడు రవి _ " చూశారా __ ఆస్తి గురించి అడగ్గానే ఎంత కోపమొచ్చి౦దో _ అతడు పెట్టె ఖర్చులకు డబ్బెక్కణ్నంచి వస్తోందనుకుంటున్నారు ? నక్సలైటు దోచినసొమ్ము ....."
నక్సలైటు పేరు వినగానే రామకా౦తం ముఖంలో భయం స్పష్టంగా కనబడింది. ఓసారి వీధి గుమ్మంలోకి వెళ్ళి రాజారావువెంత దూరంలో ఉన్నాడోనని చూశాడు.
రాజరావప్పుడే సందు మలుపు తిరుగుతున్నాడు.
12
రాజారావు బుర్రలో రకరకాల ఆలోచనలు .....
ఈ రోజు రమాకాంతానికి తనమీద కోపం వచ్చింది. అనుకున్న ప్రకారం తన కార్యక్రమం కొనసాగిస్తే __ అయన కోపం పెరగనూవచ్చు. ఏది జరిగినా తన కార్యక్రమం ఆగదు.
"రాజారావ్ ! నీ ప్రతీకారానికి తగిన సమయం వచ్చింది ......" అంటో౦ది మనసు.
అప్పుడే రాజారావుకి జగ్గారావు గుర్తుకొచ్చాడు.
జగ్గారావు రవి అనే మారుపేరుతో రమాకాంతం ఇంట్లో వున్నాడు అతడి అసలు పేరు ఏమిటి? అతడెందుకు రమాకాంతం యింట్లో ఉన్నాడు? ఇద్దరూ కలసి ఏదైనా నాటకమాడుతున్నారా? అయితే _ ఎందుకే? కొంపదీసి తనే ప్రతీకారభావంతో ఈ ఊళ్ళో అడుగు పెట్టాడో అది రమాకాంతానికి తెలిసిపోయిందా?
అలా ఎందుకు జరుగుతుంది ? అది అసాధ్యం ......
రాజారావు లోతుగా అలోచించసాగాడు.
గతంలో తనకు చెప్పిందాన్ని బట్టి జగ్గారావుకీ, పరిచయం కూడా లేదు.
ఇద్దరిలో ఒకరో _లేక ఇద్దరూ కలిసో అబద్దమాడుతున్నారు. ఆ విషయం తనకెలా తెలిస్తుంది.?
రాజారావింకా సగం దారిలో ఉండగానే , అతడికి బాగా పక్కగా అడుగుల చప్పుడయింది. ఉలిక్కిపడి చూస్తె జగ్గారావు!
బాటకిరుపక్కలా ఇళ్ళు. ఆ ఇళ్ళ అరుగులమీద కూర్చుని కొందరు రైతులు చుట్టాలు కలచుకుంటున్నారు. కొందరు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. బాట పక్కన కుర్రాళ్ళు గోళీకాయ లాడుకుంటున్నారు. మొట్టానికి వీధులన్నీ సందడిగా ఉన్నాయి. ఆ పరిస్థితిలో తనేమా మాట్లాడేం మంచిదికాదనే కీడుపిస్తున్నప్పటికీ రాజారావు నోరు మెదపలేదు.
జగ్గారావు నెమ్మదిగా చెవిలో అనట్టు __ "దయించి నా గురించి మీకు తెలిసినట్టు రమాకాంతానికి చేపోద్దు . నేనో సీఐడీ ఆఫీసర్ని . రమాకాంతంపై కొన్ని అవినీతి ఆరోపణలు పరిశోధించడానికి వచ్చాను అదాయనకు తెలియదు __" అనేసి వెళ్ళిపోయాడు.
అప్పుడు రాజారావుక్కగలిగినఆశ్చర్య మింతా అంతా కాదు.
జగ్గారావు నిజమే చెబుతున్నాడా?
ఇదివరలో అతడు రమాకాంతాన్ని కలవలేదని తనకు చెప్పాడు. ఆతడు తన ద్వారా రమాకాంతానికో ఉత్తరం అందజేశాడు. అది చదువుకుని ఎలా నమ్మించాడు?
ఒకవేళ రమాకాంతం విషయం తెలుసుకుని, జగ్గారావుని మంచి చేసుకుంటున్నాడా ?
మొత్తం ఈ వ్యవహారంలో _ఏదో తనకు తెలియని మర్మముంది. జగ్గారావునోకంట కనిపెట్టాలని అతడను కున్నాడు.
అయితే ప్రస్తుతం జగ్గారావు విషయం అర్జంటుకాదు.
రాజారావు నాలుగాడుగులు వేసి ఓ యింటిముందు ఆగాడు అది తనకు కావాల్సిన ఇల్లేనని ధృవపరచుకున్నాక, నెమ్మదిగా మెట్లెక్కి తలుపు తట్టాడు.
"ఎవరిది?"
"నేను __ రాజరావుని _ భద్రంగానూ!" అన్నాడు రాజారావు లోపల్నుంచి పలికిన గొంతులు గుర్తుపట్టి.
తలుపు తెరుచుకుంది. మునసబు భద్రం రాజరావును చూసి __ '"ఏమిటలా దయ చేశారు. _ రండి _ కూర్చోండి....."
అంటూ మర్యాద చేశాడు.
"మీతో చిన్న పనుండి వచ్చానండీ __" అన్నాడు రాజారావు.
"చెప్పండి ...."
"ఊరి పెద్దల్లో యువకులు మీరొక్కరే ఈ తరానికి ప్రాతినిధ్యం మీదే. విపరీతమయిన వేగంతో ప్రపంచం మారి పోతోంది. అటువంటప్పుడు మనూరు కూడా మారాలని నేననుకుంటే అది తప్పంటారా?" అన్నాడు రాజారావు.
రాజారావు ధోరణి దేనికి దారి తీస్తోందో అర్ధంకాక __ "కోరుకున్న మార్పు మంచిదయితే _ తప్పేందుక వుతుంది?" ఆనందు భద్రం..
"ఈ ఊళ్ళో పుట్టి పెరిగినవాణ్ణి. నాకిక్కడంతా బాగానే ఉంది....."