"నువ్వు లోపలి అమ్మ దగ్గరకు వెళ్ళు" అంది లత.
బాబుకు వెళ్ళాలని లేదుగానీ .... వెళ్ళిపోయాడు.
లత ఉద్దేశ్యం వేరు. చిన్న పిల్లలకు ఆసక్తి ఎక్కువ. ప్రతి విషయాన్నీ కుతూహాలంగా పరిశీలిస్తారు. మోహన్ రవంతైనా అసభ్యంగా ప్రవర్తిస్తే అది వాడి పసి హృదయం మీద శాశ్వత ముద్ర వేసుకుంటుంది. మోహన్ మాటలు వాడు వినడం కూడా ఆమెకు ఇష్టంలేదు.
"చాలా థాంక్సు!" అన్నాడు మోహన్.
"ఎందుకు?" అంది లత ఆశ్చర్యంగా.
"మన మధ్యనుంచి బాబును పంపేసినందుకు" అన్నాడు మోహన్.
"మిస్టర్ మోహన్! అమర్యాదగా మాట్లాడడం నా కిష్టం ముండదు. మీరు నాకాగతి కల్పించేలా వున్నారు" అంది కోపంగా లత.
"నేనున్న మాటల్లో తప్పేమైనా ఉంటే క్షమించండి! నేను మీ అందానికి దాసుణ్ణియిపోయాను. మీరు కరునించకపోతే నేను బ్రతకలేను. మీ శ్రీవారు మంచివారు. అయన కభ్యంతరం లేదని తెలిసి కూడా మీరు నన్ను దూరంగా వుంచుతున్నారు. సమాజం సృష్టించిన నైతిక విలువలు అన్నపదం అర్డంలేనిది. మన మనసుకు తోచినట్లు మనం మాసాలుకోవడంలో తప్పులేదు. మీరే కాదంటే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను" అన్నాడు మోహన్. తన మాటలను మధ్యలోనే ఆమె ఎక్కడ త్రుంచి వేయగలదోనన్న భయంతో అతను చాలా తొందరగా మాట్లాడాడు.
లత అతనివంక విచిత్రంగా చూసింది.
'ఏమిటీ మనిషి ధైర్యం? తన గురించి అతనేమనుకుంటున్నాడు? ఇలా ప్రాధేయపడితే తను లొంగిపోతుందనా అతని ఆశ? ఎంత అసభ్యమైన కోరిక __ ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు?
ఇందులో తప్పు ఎవరిదీ? తన అమ్దానిడా, తన ప్రవర్తనడా, లేక భర్త మంచితానానిదా?
ఇంక అతన్ని ఉపేక్ష్మించడం న్యాయమవుతుందా?
పరిస్థితి ప్రమాదానికి దారితీయకుండా ఉంటుందా?
నానాటికీ అతని చనువు, ధైర్యం పెరుగుతున్నాయి. ఎందుకు బహుశా తనూ, తన భర్తా దోహదమవుతున్నారేమో!'
"మిస్టర్ మోహన్! నేను మీ ధైర్యాన్నీ అభినందిస్తున్నాను. చాటుమాటు లేని మీ నిష్కాల్మష స్వభావం మెచ్చుకొదగ్గది. అయితే మీ ఆలోచనలు పూర్తిగా తప్పు మార్గాన ఉన్నాయి. భర్త ఉండగా అతని భార్యగురించి ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవడం క్షమించరాని నేరం, మీ మనస్తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, నేను మిమ్మల్ని క్షమించగల్గుతున్నాను. పొరపాటున కూడా ఇలాంటి మాటలు నా దగ్గర అనకండి. మీరు మాటిమాటికీ నా పెయింటింగ్ గురించి నేను చెప్పిన వ్యాఖ్యానం మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు. ఈ ప్రపంచంలో ప్రేమకు మారు రూపం స్రీ. స్రీని ప్రేమనూ వేరు చేసి చూడడం కష్టం అటువంటి స్రీమూర్తి ఒక ప్రవాహం వంటిది. ఆ ప్రవాహంలో దప్పిక తీర్చుకోవడమంటే కామ సంబంధమైనది కాదు. బిడ్డలను లాలించగల శక్తి తల్లికి మాత్రమె ఉంటుంది. కష్టాలలో ఉన్నవారిని, ఆపదలలో చిక్కుకున్నవారిని తదితరులను_ ఎందరినో చేరదీసి, తన ఒడిలో ఆశ్రయమిచ్చి, వారిని లాలించి వారి బాధలను మరిపించడమే నా అభిప్రాయంలో దప్పిక తీర్చడం. ఈ ప్రవాహం చివరకు ఒక మహానదిలోనో, సాగరంలోనో కలుస్తుంది. అది భార్యభర్తల సంబంధం నా అనుభవ రాహిత్యం కారణంగా ఈ విషయాన్నీ మీకు స్పష్టంగా చెప్పలేక పోతున్నాను. స్రీకి ఎందరైనా బిద్దలుండవచ్చు. పాటి ఒక్కడే !" అంది లత.
"మీరు లక్ష చెప్పండి. నేను నా వ్యామోహాన్ని చంపుకోలేను. ఒక్కసారి......"
"ప్లీజ్! మీరిక్కణ్ణించి వెళ్లిపోండి!" ఆవేశంతో అరిచింది లత.
"మీరు కరుణించకపొతే చచ్చిపోతాను" అన్నాడు మోహన్.
"సరే! అలాగే చచ్చిపొండి. ప్రస్తుతానికి ఇక్కణ్నుంచి వెళ్ళిపొండి" అంది లత.
మోహన్ మాట్లాడకుండా లేచి నిలబడి నెమ్మదిగా అక్కణ్ణుంచి కదిలి __ గుమ్మందాకా వెళ్ళి అక్కడ ఆగిపోయాడు.
అక్కడ రామారావు నిలబడి ఉన్నాడు. అతన్ని చిఊసి. "ఎంతసేపయింది?" అనడిగాడు.
మోహన్ తడబడుతూ __ "చాలా సేపయింది. నువ్వొచ్చి ఎంత సేపయింది?" అన్నాడు.
"చాలా సేపే అయింది నువ్వు రాగానే లత నాకు ఫోన్ చేసింది. వెంటనే బయల్దేరి వచ్చాను. నేను లోపలి వచ్చి నాటకం రసభాస చేయదమెందుకని సరదాగా చూశాను. ఆరోగ్యవంతుడైన యువకుడి క్కూడా రక్తపు పోతూ తెప్పిమ్చాగల మాటలు నువ్వు పలకమని అర్దమయింది నువ్వు అప్పుడే వెళ్ళడానికి వీల్లేదు. నీకో కధ చెప్పాలి. రా _ వచ్చి కూర్చో " అన్నాడు రామారావు.
మోహన్ కీ వెళ్ళాలని లేదు. రామారావు మనస్తత్వం అతనికి వంట బట్టడం లేదు. ఇంతవరకూ ఇలాంటి మనిషిని తను ఎదుర్కోన లేదు. అతను వచ్చి కూర్చున్నాడు.
లతా! మసాలా ఉప్మా చేయి _ ఉల్లి చట్నీ .... తెలిసిందా?" అన్నాడు రామారావు.
లత తలూపి లోపలుకు వెళ్ళిపోయింది.
రామారావు మోహన్ కెదురుగా కూర్చుని _ " నువ్వింత మొండిగా ఎలా తయారయ్యావో నా కర్ధం కావడం లేదు" అన్నాడు.
మోహన్ మాట్లాడకుండా నుదుటి మీద చేత్తో రాసుకున్నాడు.
"మన స్నేహాన్ని నిలుపుకోవాలన్నది నా ప్రయత్నం. నే నేనన్ని అవకాశాలిస్తే అన్నీ దుర్వినియోగం చేసుకుంటూన్నావు. గౌరవనీయులైన స్రీల వద్ద ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా ఉంది నేకుఇ డబ్బు తీసుకుని లాడ్జికి వెళ్ళావంటే అప్సరసలను తలదన్నే స్రీలు నువ్వు కోరిన విధంగా నిన్ను రంజింపచేస్తారు. నువ్విలా సంసార స్రీల వెంటపడడం ఏమీ బాగా లేదు" అన్నాడు రాక్యమారావు.
"నేనేం చేస్తున్నాను? ఎవర్నీ బలవంతం చేయడం లేదే?" అన్నాడు మోహన్
"కానీ, నువ్వునే మాటలు భిన్న ఏ ఆడదైనా కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ బాధ నీ కర్ధం కాదు. పరాయి పురుషుడు స్రీని కామా సంభంధమైన కోరిక కోరితే ఆమె సంతోషించదు_ కుమిలిపోతుంది. సంసారం చేసుకునే స్రీ ఎన్ని సుఖాలున్నా లేకపోయినా ఒకే ఒక్క ఊహలో సంతోషంగా జీవించాగలుగుతుంది. అదే పవిత్రత! పవిత్రతను శీలంతో ముడి పెట్టుకుని, ఆ ముడి విడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ అంతులేని ఆనందాన్ననుభావిమ్చే ఆ స్రీ మనసును గట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నావు నువ్వు" అన్నాడు రామారావు.
"నువ్వు శీలాన్ని, పవిత్రతనూ నమ్ముతున్నావా?"
"సమాజ న్యాయాలు ఒక రోజులో వచ్చినవి కాదు. ఎందరో అనుభాజ్ఞులు మానవ మనస్తత్వాన్ని కాచి వడపోసి క్రమంగా ధర్మసుత్రాలు నిర్ణయించారు. విచిత్రమేమిటంటే ఈ సూత్రాలేక్కడా రాసి ఉండవు. ఒక సంప్రదాయం అలా నడిచిపోతూంటుంది. ఎదురు తిరిగితే కాదనేవారు లేరు. కానీ ఎదురు తిరిగేవారుతక్కువ. కారణం అసమర్ధత కాదు. సంప్రదాయం పాటించడంలో ఎన్నో సుఖాలుంటాయి. ఆ సుఖాలుముందు చిన్న చిన్న కష్టాల్లో లెక్కలోవికావు. స్రీగానీ, పురుషుడుగానీ జీవితకాలం క్రమశిక్షణ పాటించాలంటే శీలం, పవిత్రత కూడా ముఖ్యమైనవి. అయితే అవి ప్రాణా౦తకం కాకూడదు. ఏ స్రీ జీవితమూ వీటి పేరు చెప్పి బలిపోకూడదు. కానీ జీవితానికి కొంత క్రమశిక్షణ అవసరం ఆ క్రమశిక్షణ విమ్డడం వల్లనే నీ తండ్రి యావాదాష్టీ నీకు దక్కింది. లేకపోతే రోడ్డుమీద బిచ్చగాళ్ళందారుండగా అంత ఆస్తీ నీకెందుకు రావాలి? ఆ ఆస్తితో నువ్వు కలుసుకున్నావు. నీ తండ్రి ఆస్తి నీ స్వతం అనుకున్నట్లే, మనిషి ప్రస్తక్తిని వారు సహించరు. సహించలేరు...." న్నాడు.