Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 17

    "నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ ఆస్తి విషయమే  తీసుకో. మా నాన్నగారి చుట్టూ కొందరు బంధువులుచేరి స్త్రోత్ర పాఠాలలో ముంచెత్తుతూండేవారు. వారందరకీ తన డబ్బుమీద ఆశ అని నాన్నగార్కి తెల్సు . ఐనా సరే, వారిలో కొందరిని కొంత డబ్బు ముట్టజెప్పారు. న్యాయానికి హక్కు నాకేఉన్నా ఈ విధంగా  నా ఆస్తిలో కొంత భాగమైనా కొందరు భట్రాజు బంధువులను వెళ్ళింది. అలాగే నేనూ నా స్థానం సంపాదిస్తే అది తప్పు కాదని నీవు చెప్పిన ఉదాహరణనుబట్టే అనుకోవచ్చు" అన్నాడు మోహన్.   
    మిత్రుడి తెలివితేటలను అచ్చెరువంచాడు రామారావు. ఇంత తెలివైన వాడు ఏమయినా సాధించగలడని  మనసులో  అనుకున్నాడు. పైకి మాత్రం, "అలా అందరిచుట్టూ తిరిగే బదులు హాయిగా పెళ్ళి చేసుకోరాడూ?" అన్నాడు.   
    "కొంతమందికి అడ్వెంచర్స్ అంటే ఇష్టం. లక్షలకు మూల్గుతున్న ఫారినర్స్ కొందరు నానా యాతనలూపడి ఎవరేన్ని ఎక్కడం లేదూ?"  ఎందుకూ అంటే ఏం చెబుతాం? జీవితమంటే కడుపులో చల్లకదలకుండా కూర్చోడం కాదు. అడ్వెంచర్స్ చేయాలి నా అడ్వెంచర్స్ ఇవి" అన్నాడు మోహన్.   
    రామారావు మాట్లాడలేదు. మోహన కి ఎలా నచ్చజెప్పాలో అతనికి తెలియలేదు. ఇంకా చెప్పాలంటే పురాణాలూ, వేదాలు గురుంచి మాట్లాడాలి. వాటిగురించి తనకే తెలిసినదెంత్తైనా వాటిలో చెప్పబడిన చాలా విషయాలు తనకే నచ్చవు. వాటిలో చాలావరకు ఒక తెగకూ, ఒక కాలానికీ, పురుషులకూ అనుకూలంగా చెప్పుబడి ఉన్నాయి. అది రామారావుకు నచ్చదు.   
    ఒక స్రీ పురుషుడు శారీరకంగా కలిసినంత మాత్రాన వారు జీవితాంతం కట్టుబడి ఉండాలనీ, ఆ స్రీ శరీరం మలినపడినట్టు లేక్కేనని రామారావు విశ్వసించడం లేదు. కానీ మోహన్ విషయం వేరు. మూఢచారాల నిరసన వంకపేట్టి అతను స్వసుఖాలు చూసుకుంటున్నాడు. సమాజాన్ని సంస్కరించడం అతని అభిమతంకాదు. వివాహిత స్రీల శ్రుంగార స్వేచ్చను ప్రోత్సహించడం ద్వారా సమాజానికి జరుగుబోయే మేలు ఏమీ ఉండదు. పైగా కీడు ఉండ వచ్చును. దంపతులను పరమనుష్య సంపర్కం పెట్టుకోవడాన్ని నిషేధించిన కారణంగా సమాజంలో ఎవ్వరూ కష్టపాడడంలేదు. అన్యాయానికి గురికావడంలేదు.   
    మోహన్ సంఘసంస్కర్త కాడు. స్వార్ధపరుడు. అతనికి తర్కంతో నిమిత్తం లేదు. సమాజ శ్రేయస్సుటో నిమిత్తం లేదు. అతివంతి వాడితో వాదించి ప్రయోజనంలేదు.   
    "బొగ్గును వజ్రంగా మార్చడం కష్టం, వజ్రాన్ని బొగ్గుగా మార్చడం సులభం. రెండింట్లోని ధాతుపదార్దన్ని చూస్తున్నావు. నేను వజ్రాన్నీ, బొగ్గునూ విడివిడిగా చూడగల్గుతున్నాను. నీది నువ్వు అడ్వెంచర్ అనుకుంటే, అనుకో. నా ఇంట్లో మాత్రం అడ్వెంచర్స్ చేయకు" అన్నాడు రామారావు.   
    మోహన్ ఏదో మాట్లాడబోగా మసాలా ఉప్మా వచ్చింది ఉల్లి చట్నీతో సహా.   
    "అదృష్టం __ మీ చేతివంట" అన్నాడు మోహన్.   
    లత నవ్వి, "ఇది నా చేతి వంటకాడు. హొటల్ టిఫిను" అంది.   
    "ఉల్లీచట్నీ అంటే మాకొడ్ అదే" అన్నాడు రామారావు.   
    "నీకు తనచేతి వంట రుచి చూపడం ఇష్టంలేని లత చెప్పింది. అందుకే హొటల్ నుంచి తెప్పించుమన్నాను" అన్నాడు రామారావు మళ్ళీ.   
    మోహన్ మాట్లాడకుండా టిఫిను తిన్నాడు. ఈ భార్యాభర్తలు తనను బాగా ఏడిపిస్తున్నారని అతనికి అనిపించింది. ఇంతవరకూ ఒకరి కారణంగా తను బాధపడదామెగానీ, తననే ఓంకావుకరు ఏడ్పించడం జరగలేదు. ఈ అనుభవం అతనికి కొత్తగా వుంది.   
    "హొటల్లో టిఫినైనా మీ చేతితో ఇవ్వడంవల్ల చాలా బాగుంది" అన్నాడు మోహన్.   
    "థాంక్స్ !" అంది లత. "అప్పుడప్పుడు మీరూ మర్యాదగానే మాట్లాడాగలరు."   
    ఆమె ఖాళీ ప్లేట్లను తీసుకుని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.     
    "ఏదో కథ చెబుతానని నన్ను మళ్ళీ లోపలకు తీసుకొచ్చావు" అన్నాడు మోహన్.   
    "అవును __ గుర్తుంది. కానీ ఇప్పుడు నేను నీకేమీ కధలు చెప్పదలచుకోలేదు. ఆడవాళ్ళని కేవలం విలాస వస్తువులుగా చూసే నీలాంటి మగవాళ్ళున్న ఈ ప్రపంచంలో కొందరు అసాధారణ పురుషులు కూడా ఉన్నారు, నేనో చిరునామా ఇస్తాను. అతన్ని కలుసుకుని మాట్లాడేకనే మళ్ళీ నా ఇంటికిరా" అంటూ రామారావు మోహన్ కి దామోదరం అడ్రసు ఇచ్చాడు.   
                                   8   
    ఆమెను చాలా మందిని కరాటే కమల అంటారు కానీ, ఆమె పేరు శశికళ .   
    శశికళ చాలా మంది కరాటే కమల అంటారు కానీ, ఆమె పేరు శశికళ.
     శశికళ చాలా అందంగా ఉండడం వల్లనే, ఆమె చాలా మందిని ఆకర్షించింది.   
    శశికళలో ఆధునికత కొట్టోచ్చినట్లు కనబడుతుంది. శరీరంలో వంపు సొంపులు వీలైనంతా ప్రదర్శించబడే విధంగా ఆమె వస్రదారణ చేస్తుంది. ఆమె చూపులు కవ్విస్తూ ఉంటాయి. మాటలు చిలిపిగా ఉంటాయి.   
    శశికళ రామారావు పని చేసే ఆఫీసులో స్టెనో, గ్రాఫర్ గా ఉంటో౦ది. ఎప్పుడో కానీ చీర కట్టదు. ఎవరైనా అడిగితె పైట వేసుకోవడం బోర్ అంటుంది.   
    శశికళ వేష ధారణనూ, ప్రవర్తననూ చూపి చాలా మండి మగవాళ్ళు అపార్ధం చేసుకున్నారు. ఒకరిద్దరు ప్రవరాఖ్యలు కూడా ఆమె అంటే ఆశపడ్డారు. ఆఫీసులో చాలామంది  ఆమెతో ఎక్కువగా మాట్లాడ్డానికి, వీలైతే ఏకాంతం సంపాదించడానికి ప్రయత్నించేవారు.
    శశికళ ఒకసారి ఇరుకు సందులో నడుస్తుండగా ఓ రోజు ఆమె వెంటబడి అల్లరి చేయబోయాడు. ఆమె వాడికి చేత్తో సమాధాన మిచ్చింది.       

 Previous Page Next Page