Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 15

    "ఒక్కమాట! ఇందాక తలుపులు తీసింది మీరు కాదు...."   
    "ఆవిడ  మా అక్క...... మాధవి...." అని లోపలకు వెళ్ళి పోయింది లత.   
    మోహన్ ఆలోచిస్తూ అక్కడే   కూర్చున్నాడు. 'ఇఅత ఇంక తనతో అట్టే మాట్లాడలేదు. తన దగ్గరగా రాకుండా  కూడా జాగ్రత్త పడుతుంది. కానీ తను తన  మనసుకు  నిగ్రాహించు కోలేకపోతున్నాడు.  తన చాకచక్యమంతా ఉపయోగించి ఎలాగో అలా మనసుకు  నిగ్రహించుకో లేకపోతున్నాడు. ఇప్పుడీ ఇంట్లో ఇంకో మనిషి కనబడుతోంది. ఆమెకూడా జాగ్రత్త తన చాకచాక్యమంతా ఉపయోగించి ఎలాగో అలా ఆమెను సాధించాలి. అందంగా ఉంది. ఇంకో మనిషి కనబడుతోంది.  ఆమెకూడా చాలా అందంగా ఉంది. ఆమె ఎలాంటిదో? కూడా భర్త వచ్చాడా..... అసలు పెళ్ళయిందా?   
    లతకు పేళ్ళైనప్పుడు ఆమె అక్కకు పేళ్ళవకుమ్డా ఉంటుందా?   
    పెళ్ళైతే అంత అందంగా ఉందేమిటి? చూడ్డానికే చాలా చిన్న పిల్లలా ఉంటారు.
    అసలు అందమైన ఆడవాళ్ళంతా అందం పోనంతవరకు చిన్న పిల్లలాగే వుంటారు. తను ఈ రామారావు ఇంటిని వదిలి పెట్టకూడదు. ఎందుకంటే అతను తనను ఛీత్కరించడంలేదు. తనకు మర్యాద ఇస్తున్నాడు. ఇంట్లో అందమైన ఆడవాళ్ళున్నారు.   
    మోహన్ ఎదురుగా  కనబడ్డ పుస్తకం తిరగేస్తూండగా  అక్కడికి  రతన్ వచ్చాడు. మోహన్ వాణ్ణి చూశాడు. వాడు మోహన్ వంక బెదురు బెదురుగా చూశాడు.   
    "ఇలారా!" మోహన్ వాణ్ణి పిలిచాడు.   
    వాడికి రావాలనే ఉన్నట్లుంది. కానీ అయిష్టాన్నీ సూచిస్తూ మోహన్ ని సమీపించాడు.   
     గారాబంగా పెరిగే చిన్న పిల్లలకు కొంత అహంకారము వుంటుంది. తామెంతో ముచ్చట పడుతూంటారనీ,  నీళ్ళు అనుకుంటూ౦టారు. అందుకే కొత్త వాళ్ళేవారైనా  వచ్చినప్పుడు  తమ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించడం కోసం వాళ్ళ కళ్ళ ముందే నిలబడి వాళ్ళను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూంటారు. వాళ్ళు పిలిస్తే కాసేపు బెట్టు చేసి నెమ్మదిగా దగ్గరకు వెడతారు. ఒకసారి కబుర్లలో పడ్డారా _ ఆ తర్వాత తామేం మాట్లాడు తున్నారో వాళ్ళకే తెలియదు. మొదటి మాటకు ఎంతో బెట్టు చేస్తారు. గానీ చివరకు వద్దన్నా వాగడం మానరు.   
    రతన్  మోహన్ ని సమీపించాడు .
    "నీ పేరు !" అడిగాడు మోహన్.   
     "రతన్ !" చెప్పాడు బాబు. ""కానీ నన్ను అమ్మ బాబూ అని పిలుస్తుంది."   
    "అలాగా! మరి మీ అమ్మ పేరేంటి ?" అన్నాడు మోహన్.   
    "అమ్మ పేరు మాధవి. " అన్నాడు రతన్.   
    "ఉహూ" అన్నాడు మోహన్ 'ఈ కుర్రాడు మాధవి కుడుకన్నమాట. ఆమెను చూస్తుంటే ఈ మాత్రం వయసు కుర్రాడికి తల్లి అని స్పురించదు.'   
    "నాన్న పేరు వెంకట్ " అన్నాడు రతన్ ప్రశ్న అడక్కుండానే.   
    "ఓహొ!  అడగడమే మర్చిపోయాను " అని మోహన్ నవ్వి. "మరి మీతో నాన్న కూడా వచ్చాడా?" అన్నాడు. సమాచారం రాబట్టడానికి ఈ కుర్రాడు  కూడా అతనికి బాగానే ఉపయోగపడుతున్నాడు.
    "నాన్న అమెరికాలో ఉన్నాడు కదా __ రాడు" అన్నాడు బాబు.   
    మోహన్ కళ్ళు మెరిశాయి. 'మాధవి భర్త స్పర్శ ఎరుగాదన్న మాట!" అంటే చాలాకాలంగా ఆమె భర్త ఇండియాలో లేడన్నమాట! ముద్దులు మూటగట్టే పసివాడి మధురవాక్యంలో అతను తన కామత్రుష్ణకు సమాధానాలు వెతుక్కుంటున్నాడు.   
    'మాధవి చాలా అందంగా వుంది. భర్త అమెరికాలో వున్నాడు. ఈమె కొంతకాలంగా ఒంటరిగా వుంటోంది. ప్రస్తుతం దంపతుల మధ్యకు వచ్చింది. ఇది తనకు చాలా మంచి అవకాశం. కానీ ఎలా?"   
    "పిన్ని పేరు చెప్పనా?" అన్నాడు రతన్.   
    "ముందు కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టు" అన్నాడు మోహన్. రతన్ లోపలకు పరుగెత్తాడు.      
    మోహన్ బుర్ర వేగంగా పని చేస్తోంది. 'మాధవిని తను లోమ్గాడీసుకోవచ్చు. తనకు కొత్త అనుభవం దొరుకుతుంది. అది సామాన్యమైనది కాదు.   
    అయితే అందుకు ఏంచేయాలి?   
     ఈ మాత్రం స్పురించినప్పుడు తన అనుభవమెందుకు వృధా కాక?'   
    మోహన్ ఆలోచిస్తున్నాడు . బుర్ర వేడెక్కిపోయింది.   
    "మంచినీళ్ళు!" అన్నాడు రతన్.   
    "చాలా థాంక్స్ !"  అని గ్లాసు అందుకుని నీళ్ళు త్రాగాడు మోహన్.   
    "ఇంకా కావాలా? అన్నాడు రతన్.      
    చాలు _ దాహం తీరిపోయింది.   
    అమ్మయ్య! అయితే నేను వచ్చి మీతో మాట్లాడోచ్చు ." అంటూ లత వచ్చి అతనికి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది   
     మోహన్ దెబ్బతిని, "ఎమిటన్నారూ?" అన్నాడు.   
    ఏముంది? మా ఇంటికి మీరు దాహంతో వస్తారని తెలుసు. అందుకే మీతో మాట్లాడలేదు. మీ దాహం తీరిందని ఇప్పుడే అన్నారు. అమ్మయ్య అనుకుని వచ్చాను" అంది లత .   
    "ఐతే నాతో మాట్లాడ్డం మీకు సరదా అన్నమాట" అన్నాడు మోహన్.   
    "అవును , మీకు దాహం లేనప్పుడు."   
    ఏదో అనబోయి ఊరుకున్నాడు మోహన్. ఆడదానికి ఎంత అహంకారమన్నా భరించవచ్చునుగానీ  తెలివితేటలుంటే భరించడం కష్టం. ఆమె తలమీద జోక్స్ వేస్తోందని గ్రహించాడు. మోహన్. అతనికి నచ్చలేదు. కానీ భరించాలానే అనుకున్నాడు.   
    "మీ అక్కయ్యగారు వచ్చి ఎన్నాళ్ళయింది?"   
    "రెండ్రోజులు ...."   
    "బాబు బాగున్నాడు, ముద్దోస్తున్నాడు...." అన్నాడు మోహన్.   
    ఆ ముక్క లననేంత యధాలాపంగా అన్నాడో గ్రహించి వుంటే, బాబు గర్వంగా పిన్నివంక చూసి వుండేవాడు కాదు. వాడు చటుక్కున "పిన్ని పేరు చెప్పలేదు కదూ? పిన్ని పేరు లత" అన్నాడు మాటలు సాగదీస్తూ.  

 Previous Page Next Page