Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 14

    మాధవి తండ్రి విసుకున్నాడు.   
    "అమెరికా వెళ్ళి ఇంకో పెళ్ళి చేసుకున్నాడని ఆయనన్ను మనమంతా తిడుతున్నాం. నిజానికి అక్కడి వాతావరణానికి ఇదంతా పెద్దతప్పు కాదు. ఇండియాలో ఉంది నేను ఇంకో పెళ్ళి చేసుకుంటే ఆయనకూ నాకూ తేడా ఏముంటుంది?" అంది మాధవి.   
    "అతనికంటే  ఉన్నంటంగా ఉండడం కాదమ్మా _ నీ జీవితం సుఖంగా ఉండడం ముఖ్యం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు"   అన్నాడు తండ్రి.   
    "లేదు నాన్నా! నా మనసు వెంకట్ మనుషులా బలహీన మైనది కాదు. నేను మళ్ళీ పెళ్ళి చేసుకోను" అంది మాధవి.   
     అప్పుడు దామోదరం స్వయంగా మాధవిని కలుసుకున్నాడు.
    "దామోదరం ఒక స్రీ తనను తను పురుషుడుకి ఆత్మార్పణ కానించుకుంటే అదే ప్రేమ అవుతుంది. ఏ రోజైతే నా వివాహం వెంకట్ టో జరిగి ఒకే రాత్రి ఇద్దరం ఒకే గదిలో గడిపామో _ ఆ తర్వాత నుంచి వెంకట్ స్థానంలో మరొకర్ని ఊహించుకోలేకపోతున్నాను నేను వివాహానికి ణ అమన్సులో పవిత్ర స్థానం ఉంది. ఎవరో ఏదో తప్పు చేశారనీ, నాకు అన్యాయం జరిగిందనీ నేను ఆ నమ్మకాన్ని సడలించకోలేను" అంది మాధవి.   
    "మాధవీ! రోజులు మారుతున్నాయి. నువ్వు భ్రమతో ఉన్నావు. కొందరు స్వార్ధపరులైన పురుషులు, స్రీలను కలకాలం తమకు బానిసలుగా ఉంచుకోవడం కోసం ఏనాడో రాసిన ధర్మసాశ్రాలు నీ బుర్రను పాడు చేయడం వల్ల నువ్విలా మాట్లాడుతున్నావు. కానీ ఆలోచించి చూడు! వివాహం స్రీ పురుషులకు శారీరకవసారం. నేను నిన్ను జాలితో కాక మనస్పూర్తిగా ప్రేమిస్తున్న కారణంగా నా భార్యగా చేసుకోవాలనుకుంతున్నాను. ఒకప్పుడు లభించని పెద్దల అంగీకారం మన కిప్పుడు లభించింది." అన్నాడు దామోదరం.
    "నువ్వు చెప్పింది నిజం నిన్ను వివాహం చేసుకుంటే నేను కేవల శారీరకవసరాల కోసమే ఆ పని చేసినట్లవుటుంది. కానీ నా దృష్టిలో వివాహ భాధం వులువలేదు. ఈ జన్మకు నేనింకో వివాహం చేసుకోలేను. శారీరకావసరాలంటావా __ వాటిని జయించడానికి ప్రయత్నించడంలో ణ అమిగాతా జీవితాన్ని గడిపేస్తాను" అంది మాధవి.   
    దామోదరం ఎంత ప్రాధేయపడ్డా మాధవి వినలేదు. ఆమె అవివాహితగానే ఉందిపోయింది.   
    మాధవి కోరికపై ఆమెను యూనివర్సీతీలో జేర్పిమ్చాడు తండ్రి. ఆమె ఎమ్మే ఎకనామిక్స్ చదివి ఇప్పుడు ఒక సంవత్సరాలుగా  రీచేర్చి చేస్తోంది. ఆమె కొడుక్కి నాలుగేళ్ళు నిండి అయిదో సంవత్సరం నడుస్తోంది. ఆమె అప్పుడప్పుడు వచ్చి లత సంసారాన్ని చూసి పెడుతూంటుంది.   
    ఇప్పుడు కూడా అలాగే వచ్చింది.   
    మాధవి ఎప్పుడొచ్చినా ఆమెను ప్రత్యేకంగా ఒక దేవతలా చూస్తూమ్తరు లత, రామారావులు. వాళ్ళు చూసే ఈ ప్రత్యేకాభీమనం మాధవికి ఇబ్బందిని కలిగిస్తూంటుంది. కానీ రతన్ కి మాత్రం పిన్ని బాబాయిలంటే చాలా ఇష్టం.   
    "విశేషాలేం లేవా?" అన్నది సాధారాణంగా మాధవి అడిగే ప్రశ్న. లత వివాహమైన తర్వాత ఇప్పటికి ఆరు సార్లైనా మాధవి వాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటుంది. ఆరుసార్లూ ఆమె ఈ ప్రశ్న అడగడమూ, లేనని లత జవాబు చెప్పడమూ జరిగింది. ఇప్పుడూ అదే జరిగింది.
    "లేవంటే  ఎలాగే? రతన్ తనకో తమ్ముడో,  చెల్లయో కావాలని చంపేస్తున్నాడు" అంది మాధవి  నవ్వుతూ.   
    "నిజం పిన్నీ!  నాకో చెల్లాయి కావాలి" అన్నాడు రతన్ ముద్దుగా.   
    లత వాడిని చటుక్కున ఎత్తుకుని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ, "చెల్లాయికోసం నువ్వు నన్ను పాదేయపడాల్సోచ్చింది. కదురా!" అంది.  
    మాధవి అక్కణ్ణుంచి అయిష్టంగా కదిలి వెళ్ళిపోయింది.
                               7
    కాలింగ్ బెల్ మ్రోగించి  అత్రుతుగా ఎదురు చూస్తూ నిలబడ్డాడు.            
    మోహన్.   
    కొద్ది క్షణాల్లో తలుపు తెరుచుకుంది   
    మోహన్ తెల్లబోయి  ఆమెవంక  చూసి, "ఇది రామారావు గారిల్లేకదూ?"  అన్నాడు.   
    "అవును రామారావు ఇంట్లో లేడు" అందామె.   
    "శ్రీమతి రామారావుగారు కూడా లేరా?" అన్నాడు మోహన్.   
    "ఉన్నారు. లోపలకు రండి" అందామె.   
    మోహన్ ఆమె అందాన్ని మనసులో లెక్కవేస్తూ, 'రామారావు చాలా అదృష్టవంతుడు. అతని పరిచయస్థల౦తా  అందగాళ్ళే'  అనుకున్నాడు. ఆమె లోపలకు వెళ్ళింది   
    కొద్ది క్షణాల్లో లత వచ్చి మోహన్ వంక చూసి. "మీరా!" అంది ఆశ్చర్యంగా. అతను మళ్ళీ వస్తాడని ఆమె అనుకోలేద   
    "మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేశాను" అన్నాడు మోహన్.   
    ఆ సమాధానం లతకు నచ్చలేదు. కానీ ఏమీ అనకుండా ఊరుకుంది.   
    "చూడాలనిపించినప్పుడల్లా రావడంలో తప్పులేదుకదండీ" అన్నాడు మోహన్ మళ్ళీ.   
    "మీరీ ఊర్నుంచి వెళ్ళారా?" అంది లత.   
     "వెళ్ళలేననుకుంటాను. బయల్దేరి బస్ స్టాండ్ దాకా వెళ్ళడం. ఎవరో తాడుకట్టి లాక్కెళ్ళినట్టు  రూమ్ కి  వెళ్ళిపోవడం _ ఇలా చాల కాలంగా జరుగుతోంది. ఇక లాభం లేదని కొంతకాలం పాటు ఊళ్ళోనే ఉందిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పట్నుంచీ బస్ స్టాండ్ కు వెళ్ళడం మానేశాను...." అన్నాడు మోహన్.   
    "నాకు లోపల పనుంది. మీరేమైనా పుస్తకాలు చదువు కుంటూ కూర్చోండి." అంది లత. 

 Previous Page Next Page