రెండు వారాల్లో ఆ ప్రొపెసర్ దగ్గర్నుంచీ ఉత్తరం వచ్చింది. వెంకట్ యూనివర్సీటీ వదిలిపెట్టి కాలిఫోర్నీయోలో ఏదో కంపెనీలో ఉద్యోగంలో చేరాడుట. ఆ చిరునామాను తెలియబరుస్తూ అక్కడికి ఉత్తరం రాయమని అయన సలహా ఇచ్చాడు.
ఈ ఉద్యోగపు హడావిడిలో వెంకట్ ఉత్తరం వ్రాయలేక పోయుంటాడని మాధవి తండ్రి ఊహించాడు. అయన తమ అడుర్డాను వ్యక్తపరుస్తూ వెంకట్ కు ఉత్తరం చాలా క్లుప్తంగా ఉంది. తనకిప్పుడు తలకుమించిన పని ఉండనీ, కొంత కాలంపాటు ఉత్తరాలు తాయలేననీ, ఏమీ అనుకావువద్దనీ రాస్తూ వీలుపడగానే పెద్ద ఉత్తరం రాస్తానని రాశాడు. ఉత్తరంలో మాధవి ప్రసక్తిలేదు. అందుకు మాధవి ఎంతగానో నొచ్చుకున్నా, భర్త తనకు వేరే పెద్ద ఉత్తరం రాస్తాడని ఆశించింది కానీ, ఆ ఆశ నిరాశే అయింది.
ఆఖరికి మాధవి తన భర్తకు పెద్ద ఉత్తరం రాసింది. తనకు భర్త తప్ప వేరే లోకం లేడనీ, రతన్ ఇంతవరకూ తండ్రిని చూడలేకపోయినందుకు తనకు చాలా బాధగా ఉండనీ, అతనికోసం తను తపించి పోతున్నాననీ ఆమె వ్రాసింది.
ఉత్తరానికి జవాబు చాలా క్లుప్తంగా వచ్చింది. ఇప్పట్లో తను ఇండియాకు రాలేనని, మాధవికీ బాబుకూ ముద్దులనీ రాశాడతను. ఈ ఉత్తరానికి మాధవి వెంటనే జవాబు రాస్తూ _ అతనిండియాకు రాలేకపొతే తనే అమెరికా వచ్చేస్తాని రాసింది. అది సాధ్యం కాదని జావబిచ్చాడు. వెంకట్. ఆ తర్వాత అతన్నించి మళ్ళీ ఉత్తరా లాగి పోయాయి.
ఈ వ్యవహారం మాధవి తండ్రికి గాభరా పిట్టిమ్చిమ్ది. అయన మందివర్గామంతా గాలించి _ అమెరికాలో ఉన్న ఒకరిద్దరు దూరపు బందువుల చిరునామాలు సంపాదించి, వాళ్ళకుత్తరాలు రాసి తన పరిస్థితి నంతా వివరించాడు. వాళ్ళల్లో ఒకాయన కాలిఫోర్నియాలో నే ఉంటున్నాడు. అయన కాస్త శ్రద్ద తీసుకుని ఒపికిగా వెంకట్ ను కలుసుకుని అతని వివరాలన్నీ సేకరించాడు. ఆ వివరాలు మాధవి తండ్రికి తెలియపరచగా ఇమ్తిల్లీపాదీ షాక్ తిన్నారు.
యూనివర్సీటీలో స్కాలర్ షిఫ్ ఎంతోరాదు. అదే ఉద్యోగమైతే అంతకు అయిదారు రెట్లు డబ్బు సంపాదించవచ్చు. వెంకట్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళాడు. తప్పితే పైచదువు కోసం కాదు. అవకాశం రాగానే అతను యూనివర్సీటీ వదిలిపెట్టాడు. ఈ ఉద్యోగం రావడానికి అతనికో అమెరికన్ యువతి సాయపడింది. అతనామేను వివాహం చేసుకున్నాడు. వెంకట్ కు ఇండియా వచ్చే ఉద్దేశ్యం లేదు. మాధవిని భార్యగా ఎలుకునే ఉద్దేశ్యం లేదు. ఆమె వేరే వివాహం చేసుకోవాలనుకుంటే అతనికేవిధమైన అభ్యంతరమూ లేదు.
మాధవి చాలా పెద్ద షాక్ తింది. ఒక నేల రోజుల పాటు ఆమె ఎవరితో మాట్లాడకుండా ఎంతో దిగులుగా గడిపింది.
ఈ లిగా మాధవి తండ్రి దీనికి ప్రతిక్రియ గురించి ఆలోచించాడు. భారతదేశంలో వివాహం చేసుకుని __ విదేశాలలో ఇంకో వివాహం చేసుకోవడం చట్టరిత్యా నేరం. ఈ విషయం అమెరికాలోని భారతరాయబారి కార్యాలయానికి తెలియబరిస్తే, వాళ్ళు, వెంకట్ పై చర్య తీసుకుంటారు. అదే చేయాలని మాధవి తండ్రి అనుకున్నాడు. కానీ మాధవి అంగీకరించలేదు.
"అందువల్ల ఉపయోగమేమిటి?" అంది మాదివి. "అయన అక్కడ ఉద్యోగం పోవచ్చు. తిరిగి ఇండియాకు రావచ్చు. కానీ ఆ కారణంగా ఆయనకు నా పైన ద్వేషం తప్పితే ఇంకేమీ ఉండదు. ప్రస్తుతం తప్పంటూ ఉంటే ఆయనలో ఉంది. అదినా మీదకు మార్చుకోవడం నాకే మాత్రమూ ఇష్టం లేదు. నేను దురదృష్టవంతురాల్ని _ నా బ్రతుకిలాగే వెళ్ళిపోనివ్వండి."
"అది కాదమ్మా! వాడికీవిధంగా బుద్ధీ చెబితే వాళ్ళైనా ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు" అన్నాడు మాధవి తండ్రి,.
"లేదు నాన్నా! ఏ నేరమైనా కోర్టు కేక్కితే ఫరవాలేదు కానీ. భార్యాభర్తల అనుభంధానికి సంభంధించినవి మాత్రం కోర్టు పరిష్కరించుకోకూడదు" అంది మాధవి.
లత కూడా అక్కకు నచ్చజెప్పతానికి ప్రయత్నించింది. మాధవి వినలేదు.
"చూడు చెల్లాయ్! నువ్వు నాకంటే రెండేళ్ళు చిన్నదానివి. అందువల్ల నీకంటే మరీ ఎక్కువ తెలుసునని నేననుకోవడం లేదు. నా సంగాతి చూడు! ఆర్నెల్లు అతనతో కాపురం చేశాను. ఆ అర్నేల్లూ అయన నాతో ఎంతో అభిమానంగా ఉన్నారు. మీ బావగారిని ఎంతో మంచివారని మీరూ అనుకునేవారు గదా! అమెరికా వెళ్ళాక క్రమంగా ఆయనలో ఏదో మార్పు వచ్చింది. అయన మంచితనంలో మార్పు రాలేదు. నేనింకో వివాహం చేసుకోవచ్చునని అయన చెప్పారు. కానీ ఆ విషయం స్వయంగా రాయడానికి ధైర్యం చాలలేదు. అంటే తప్పు చేసిన అనుభూతి ఆయనకుందన్నమాట! అయితే అక్కడ ఆయనకు తటస్థ పడ్డా అమెరికా అమ్మాయి ణ కంటె బలంగా అయన్నలర్చించుకోగాలిగినది. అందువల్ల అయన నన్నూ. తన కొడుకూ ను కూడా మరచిపోవాలనుకున్నారు. అంటే అయన మనసు బలహీనమైనడన్న మాట! అటువంటి బలహీనమనస్కడు ఇక్కడుంటే మాత్రం ఇంకో అమ్మాయి ఆకర్షణలో పడదని నమ్మకమేమిటి! దూరంగా ఉండడంవల్ల కనీసం ఈవిషయం మన కళ్ళ ముందు జరగడం లేదు. అలాంటి మనిషి మీద పగ తీర్చుకుని మనం సాధించేదేముంది? పగ ద్వేషాన్ని పెంచుతుంది. తప్పితే చంపాడు ?" అంది లతతో.
వీలుంటే కూతురికి రేండో పెళ్ళి చేయాలనుకున్నాడు. మాధవి తండ్రి. ఈ మర్యయం ఆయనకు కులం పట్టింపు అడ్డురాలేదు. ఇప్పటికీ మాధవిని ఆరాధిస్తూ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న దామావుదరంతావు ఆయనకు దేవుడు కనిపించాడు. ఈ పెళ్ళి లత పెళ్ళికి అడ్డు వస్తుందన్న శంక ఆయనకు కలుగలేదు.
"వెంకట్ టో పెళ్ళికి ముందు మీకు దామొదరంతో దేవుడు కనిపించి ఉంటే బాగుండేది. ఇప్పుడు సమయం మించిపోయింది నాన్నా!" అంది మాధవి.